బ్లాగు ప్రపంచం లోకి మరో విశిష్ట వ్యక్తి

ఇదిగో ఈ మధ్యనే మరో రాజకీయ నాయకుడు, "ఒక్క రోజైనా ప్రధాన మంత్రి కావాలన్నదే ధ్యేయంగా రాజకీయ్యాని నడుపుతున్నారు.." అని పిలవబడే మరో విశిష్టమైన వ్యక్తి బ్లాగు ప్రపంచం లోకి ప్రవేశించారు.  ఎవ్వరో అనుకుంటున్నారా.. అదేనండీ మన భారతీయ జనతా పార్టీ ప్రముఖులు, గౌరవనీయులైన లాల్ కృష్ణ అద్వాని. ఆయన మొదటి పుటలోని పలుకులు నాకు బాగా నచ్చాయి. మీరందరూ చదవ వలసిన కొన్ని మంచి మాటలు అందులో ఉన్నాయి. అయన ఏది చేసినా నిర్మొహమాటంగా.. నిర్దయగా.. నిస్పక్షపాతంగా.. తనదైన ముద్ర కలిగి ఉండేలా చేస్తారు. నాకు పుట్టి బుద్దెదిగినప్పటి నుంచి ఈయన చేసిన లేదా పాల్గొన్న చాలా కార్యక్రమాలలో స్వలాభం ఏమీ కనబడలేదు. దేశభక్తికి ఉదాహరణ ఎవరు అని అడిగితే, ఓ రకంగా వీరే అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.

 

ఇంతా చెప్పి వీరి బ్లాగు లంకె ఇవ్వలేదను కుంటున్నారా.. ఇదిగో .. http://blog.lkadvani.in/ ఈయన మాటలని కొంచం తర్జుమా చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే, ఎలాగో అక్కడ చదువుతారు కదా అని, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. కాకపోతే, వారి ఇప్పటి వరకూ బ్లాగిన విషయాలను దృష్టిలో ఉంచుకుని స్పందిస్తే, అచ్చంగా నాలుగే నాలుగు పుటలు ప్రచురణకు వచ్చాయి. వాటిల్లో రెండు పుస్తకాల గురించే. కొంతలో కొంత చక్కగా నిజాన్ని ఒప్పుకున్నారు. ఏమిటంటారా.. అదేనండి.. ఎన్నికలు వస్తున్నాయి కదా.. దాని గురించి. నిజమే, జీవితం అంటే ఎన్నికలు మాత్రమే కాదు కదా అంటూ జీవితానికి పరమార్దం spiritual life, (ఆత్మ .. ఏమనాలో పాలు పోలేదు).

 

ఏది ఏమైనా, విఙ్ఞాన విషయానికి వస్తే చాలా విషయాలు తెలిసి అనర్గళంగా చర్చించే చాలా కొద్ది మంది రాజికీయ నాయకులలో వీరు ఒక్కరు. అంతే కాకుండా బ్లాగు పరంగా సాంకేతిక పరిఙ్ఞానాన్ని ఉపయోగించుకున్న మొదటి రాజకీయ నాయకుడని నా అభిప్రాయం. చాలా మంది రాజకీయ నాయకులు కంప్యూటర్‍లను వాడగా చూసాము, కానీ ఇంత బాహాటంగా వ్రాయడం మొదలు పెట్టిన వారు వీరేనని నేననుకోవడం. అమితాబ్ బచ్చన్ గారు కూడ బ్లాగుతున్నారు, కానీ వారి ఎంతైనా ఇప్పుడు వితంతువే కదా.. ఏమిటి!!! అమితాబచ్చన్ వితంతువా అని అనుకుంటున్నారా.. నిజమేనండి.. రాజకీయ్యాలు నాకు పడవు, చేసింది చాలు అని ఉద్వాసన పుచ్చుకున్నారు కదా. నాకు తెలిసి ఆయన తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనుకోను.

 

ఇంతకీ మీరేమంటారు?

 
Clicky Web Analytics