నా కొత్త మొబైల్ ఫోన్


చాలా రోజుల నుంచి నా శ్రీమతి పోరగా పోరగా.. ఆఖరున, ఈ మధ్యనే ఒక ఫోన్ కొన్నాను. కొనేటప్పుడు నేను అనుకున్న విషయాలేమిటంటే..

      • కెమెరా ఉండాలి
      • అది కూడా ౩ మెగా పిక్సెల్ సైజుకి తగ్గకూడదు
      • ఫ్లిప్ మోడల్ (శ్రీమతి కోరిక)
      • టచ్ స్ర్కీన్ అయితే బాగుంటుంది

అని మాత్రమే అనుకున్నా.. ఈ ఫీచర్స్ అన్నీ ఉన్న ఫోన్ కోసం దాదాపుగా ఓ రెండు వారాలు దగ్గరలో ఉన్న మొబైల్ షోరూములు అన్నీ తిరిగాను. ప్రతీ షోరూమ్ వాడు వాడి దగ్గర అమ్మకుండా మిగిలి పోయినవి మాత్రమే చూబిస్తున్నాడు గానీ.. నాకు పనికి వచ్చేది మాత్రం చూపించడం లేదు.

ప్రతీ షోరూమ్ లోనూ ఎదో ఒక మోడల్ చూడడం దాని ఖరీదు చూసిన తరువాత వెనక్కి తగ్గడం.. ఇదీ వరస.. ఎందు కంటే.. 3.2MP కెమెరా కలిగిన ఫోన్లు అన్నీ చాలా ఖరీదుగా ఉండడమే కారణం. ఇలా చూస్తుండగా.. సోమాజీగూడ లోని ఒక మొబైల్ షోరూమ్‍లో Fly కంపెనీ వారి E 300 మోడల్ చూడడం జరిగింది. తీరా ఖరీదు చూడబోతే.. దాదాపు పది వేలవుతుందన్నాడు. అంతే గుండే ఆగినంత పనైంది.

ఇక మెల్లిగా ఈ ఫోన్ ఎక్కడేక్కడ అమ్ముతునారో వెతకడం మొదలైంది. తీరా ఆరా తీస్తే.. ఈ ఫోన్‍తో పాటుగా, 128MB memory card మాత్రమే ఇస్తారని తెలిసింది. ఇక దానికి తోడుగా 1GB memory card తీసుకోవాలంటే.. ఇంకొంత ఖర్చవుతుంది.. ఇలా ఆలోచిస్తుండగా.. అమీర్‍పేట సత్యం ధియేటర్ దగ్గర ఒక చిన్న షాప్‍లో కూడా ఈ ఫోన్ మోడల్స్ అమ్ముతున్నారని యాదృస్చికంగా తెలిసింది.

ఏదో ఒకసారి చూసొద్దాం అని వెళ్లి పరికించగా.. ఫరవాలేదని పించే విధంగా ఉందా షాపు.. ఇక వాడితో బేరాలాడి, 8,800/- రూపాయలకి 1GB Memory Cardతో సహా బేరమాడి, కొనేసాను. కొన్న తరువాత తెలిసింది, దీనిలో నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని.

ఇక మెల్లిగా మరొక పుటతో మీముందుంటా.. ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్స్ మరొక సారీ పూర్తిగా వివరించడనికి ప్రయత్నిస్తా..

 
Clicky Web Analytics