నా కొత్త మొబైల్ ఫోన్


చాలా రోజుల నుంచి నా శ్రీమతి పోరగా పోరగా.. ఆఖరున, ఈ మధ్యనే ఒక ఫోన్ కొన్నాను. కొనేటప్పుడు నేను అనుకున్న విషయాలేమిటంటే..

   • కెమెరా ఉండాలి
   • అది కూడా ౩ మెగా పిక్సెల్ సైజుకి తగ్గకూడదు
   • ఫ్లిప్ మోడల్ (శ్రీమతి కోరిక)
   • టచ్ స్ర్కీన్ అయితే బాగుంటుంది

అని మాత్రమే అనుకున్నా.. ఈ ఫీచర్స్ అన్నీ ఉన్న ఫోన్ కోసం దాదాపుగా ఓ రెండు వారాలు దగ్గరలో ఉన్న మొబైల్ షోరూములు అన్నీ తిరిగాను. ప్రతీ షోరూమ్ వాడు వాడి దగ్గర అమ్మకుండా మిగిలి పోయినవి మాత్రమే చూబిస్తున్నాడు గానీ.. నాకు పనికి వచ్చేది మాత్రం చూపించడం లేదు.

ప్రతీ షోరూమ్ లోనూ ఎదో ఒక మోడల్ చూడడం దాని ఖరీదు చూసిన తరువాత వెనక్కి తగ్గడం.. ఇదీ వరస.. ఎందు కంటే.. 3.2MP కెమెరా కలిగిన ఫోన్లు అన్నీ చాలా ఖరీదుగా ఉండడమే కారణం. ఇలా చూస్తుండగా.. సోమాజీగూడ లోని ఒక మొబైల్ షోరూమ్‍లో Fly కంపెనీ వారి E 300 మోడల్ చూడడం జరిగింది. తీరా ఖరీదు చూడబోతే.. దాదాపు పది వేలవుతుందన్నాడు. అంతే గుండే ఆగినంత పనైంది.

ఇక మెల్లిగా ఈ ఫోన్ ఎక్కడేక్కడ అమ్ముతునారో వెతకడం మొదలైంది. తీరా ఆరా తీస్తే.. ఈ ఫోన్‍తో పాటుగా, 128MB memory card మాత్రమే ఇస్తారని తెలిసింది. ఇక దానికి తోడుగా 1GB memory card తీసుకోవాలంటే.. ఇంకొంత ఖర్చవుతుంది.. ఇలా ఆలోచిస్తుండగా.. అమీర్‍పేట సత్యం ధియేటర్ దగ్గర ఒక చిన్న షాప్‍లో కూడా ఈ ఫోన్ మోడల్స్ అమ్ముతున్నారని యాదృస్చికంగా తెలిసింది.

ఏదో ఒకసారి చూసొద్దాం అని వెళ్లి పరికించగా.. ఫరవాలేదని పించే విధంగా ఉందా షాపు.. ఇక వాడితో బేరాలాడి, 8,800/- రూపాయలకి 1GB Memory Cardతో సహా బేరమాడి, కొనేసాను. కొన్న తరువాత తెలిసింది, దీనిలో నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని.

ఇక మెల్లిగా మరొక పుటతో మీముందుంటా.. ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్స్ మరొక సారీ పూర్తిగా వివరించడనికి ప్రయత్నిస్తా..

6 స్పందనలు:

Anonymous said...

Good Luck, in a weeks time you will end up using only red button and green button.

sujata said...

Very good. Market Research chesaarannamaata. Congratulations to your srimati.. for a satisfying bargain and new fone.

చక్రవర్తి said...

Dear Anonymous,

That's correct, apart of the red and green button .. there is a wheel that will help you to rotate. And this is really awesome for such economic price

సుజాత గారు,
నా శ్రీమతికి ఎందుకండీ congratulations? తిరిగింది నేనా.. బేరమాడింది నేనా.. కొన్నది నేనా.. పైగా.. తరువాత టప చదవండి, ఈ ఫోన్ కొనడం వనుక ఉన్న రహస్యం.. ఏమై ఉంటుందంటారు.. ఊహించండి.. అంత వరకూ..

సెలవు.. happy time ..

Sharma VJ said...

ఆ షాపు అడ్రస్సు చెప్పండి, నాకూ చిన్న పని ఉంది

చక్రవర్తి said...

శర్మగారు,

అమీర్ పేట సత్యం సినిమా హాలు నుంచి బాలా నగర్ వైపు వెళుతూ ఉంటే, మీకు ఎడమ చేతి వైపు రోడ్డు మీద ఒక గుడి కనబడుతుంది. ఆ గుడి దాటగానే, ఎడమ చేతివైపునే ఒక ప్లాస్టిక్ సామానులు అమ్మే దుకాణం కూడా ఉంటుంది. ఈ దుకాణం బయట మీకు అన్నీ ప్లాస్టిక్ కుర్చీలు దండిగా కనబడుతూ ఉంటాయి.. ఈ దుకాణానికి ఎడమ చేతి వైపునే నేను కొన్న మొబైల్ షాపు.

అర్దం కాక పోతే, నన్ను 944 1418 139 నందు పలకరించండి.

Sharma VJ said...

నెస్సర్లు చక్రవర్తి గారు, ఆ ప్రదేసం నాకు సుపరిచితమే.

 
Clicky Web Analytics