కొమరం పులి పాటలు - రివ్యూ

ఈ మధ్య నేను చూద్దాం అనుకున్న సినిమాలలో మరొకటి ఈ సినిమా. పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకున్నాడో సేవ్ అవుతాడు లేదా షేవే.. ఎందుకంటే నేను చూద్దాం అనుకున్న సినిమాలు దాదాపు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ స్నేహితుడితో జరిగిన చర్చలో నాకు అర్దం అయ్యిందేమిటంటే.. ఏదైనా సినిమాని చూడాలనుకున్నప్పుడు ముందుగా ఆ హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎక్సుపెక్టేషన్స్ పెట్టుకోవాలని ఆ తరువాత ఆ సినిమాని చూసి టాక్ ఇవ్వాలని. ఈ సినిమా నేను చూడడం వెనకాల ఉన్న ఎక్సుపెక్టేషన్స్ ఏమిటంటే..

పులి

ఒకటి ) కొమరం భీం అనే ఓ చరిత్రకారుడి పేరు వాడుకున్నందువల్ల

రెండు) రెహమాన్

మూడు) సూర్య

కానీ ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కోసం అయితే మాత్రం అస్సలు చూడటం లేదు. పవన్ కాక మరేవ్వరైనా చూస్తాను. అందువల్ల పవన్ నుంచి నాకు ఎటువంటి ఎక్సుపెక్టేషన్స్ లేవు. ఇక రెహమాన్ పాటల విషయానికి వస్తే..

  • ఒక పాట చాలా మంద్రంగా సున్నితంగా తీర్చిదిద్దాడు.. అదే నమ్మకమీయ్యరా స్వామి అంటూ సాగుతుంది.. అదేదో సినిమాలో, నాగార్జున హీరోగా .. హీరోయిన్ ఎంట్రన్స్ గుడిలో ఇలాంటి పాటతోనే జరుగుతుంది.. ఇంతటి ప్రశాంత మైన పాటను ఎలా చిత్రీకరించారో చూడాలి

+౧

  • ఒక పాట అస్సలు నచ్చలేదు .. అదే పవర్ స్టార్ అంటూ ఉంటుంది .. చెత్తగా ఉంది.. ముమ్మయిత్ ఖాన్ లాంటి అమ్మాయి అయితే బాగా చేస్తుంది .. మరి ఈ పాటకి ఎలాంటి అమ్మాయిని సెలక్ట్ చేసారో..

-౧

  • మారాలంటే అనే పాట కూడా నచ్చింది ..

+౧

  • చిత్ర పాడినట్టు ఉన్న పాట మరొకటి .. దోచేయ్ దొరికింది .. అంటూ సాగే పాట. ఓ ప్రక్కన నచ్చినట్టు అనిపించేటంతో ఆంగ్ల బ్యాక్ డ్రాప్ తో చెడకొట్టాడు.. ఈ పాటలో పాడిన అమ్మాయి గొంతులో హస్క్ బాగుంది, ఈ పాట నాకు నచ్చి నచ్చనట్టుంది

+-౧

  • మహమ్మహ మాయే .. అంటూ మొదలైన పాట ముందుగా ఇంప్రస్ చెయ్యలేదు కానీ, ఈ పాట లిరిక్స్ వ్రాసిన వారెవ్వరో గాని కొంచం కళాత్మకంగా రశికంగా వ్రాయాలని తపన పడ్డట్టు కనబడింది. ఈ పాట చివర్లో వచ్చే ట్యూన్ దాన్ని కూర్చిన విధానం నచ్చింది. రెహమాన్ సిగ్నేచర్ కనబడింది

+౧

  • అమ్మతల్లే అనే పాటపై రివ్యూ వ్రాయాలంటే కొంచం వళ్ళు దగ్గర పెట్టుకోవాలనిపిస్తోంది. ఇందులో చాలా గమకాలు కనబడుతున్నాయి. సంగీత ప్రావీణ్యం ఉన్నవాళ్ళు దీనిగురించి విశ్లేషిస్తే బాగుంటుంది. అంతే కానీ నాలాంటి వాడు కాదు .. కావున బాగుందనే అనుకుంటున్నాను

+౧

మొత్తం మీద అయిదు ప్లస్లు రెండు మైనస్లు కలిపితే రెండు పాటలు మినహ మిగిలినవన్నీ బాగున్నాయి. ఇక సినిమా ఎలా తీస్తారో.. ఈ సినిమా చాలా కాంట్రవర్సీస్ మధ్య చిత్రీకరిస్తున్నారు..

నేను చూద్దాం అనుకున్నాగా.. ఇంకే హాయిగా ఫ్లాప్ అవుతుంది .. నేను చక్కగా ప్రశాంతంగా ఊరి చివ్వర సినిమా హాల్లో హాయిగా చూడోచ్చు..

 
Clicky Web Analytics