ఈ హీరో చేసిన సినిమాలపై నాకు ఓ రకంగా సద్బావన ఉంది. కొన్ని కొన్ని చోట్ల ఈ హీరో కధా రచయతలని ప్రభావితం చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే, కొన్ని సీన్లు ఈ హీరో కోసమే వ్రాసి చిత్రీకరించారేమో అని అనుమానం.
ఈ సినిమా నేను చూడాలని అనుకున్నాను. అందువల్ల ఇది తప్పనిసరిగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి ఉంటుందని తలుస్తాను. ఈ సినిమా నేను చూడలనుకున్న కొన్ని విషయాలలో ఒకటి పాటలలో గల ఓ వైవిధ్యం. ఈ పాటలకు బాణి కట్టింది ఎవ్వరో గాని కొంచం మనసు పెట్టి చేశారని చెప్పుకోవచ్చు. ఈ పాటలని వృత్తి రీత్యా కాకుండా ప్రాణం పెట్టి చేసారని నాకు అనిపించింది.
నచ్చిన అంశాలు
- కధలో భారతదేశం గురించి వీరోయిన్ డైలాగులు
- విలన్ గారు తన ప్రతాపం సినిమా మూడొంతులు దాకా చూపించక పోవడం
- కధని పూర్తిగా కుంటుంబ పరంగా చూడటానికి అన్నట్టు తీర్చిదిద్దడం
- పాటలు ..
- ప్రతీ సినిమాలో అమ్మనే గొప్పగా చూపించే దర్శకులు ఈ సినిమాలో తండ్రిని హీరోగా చూపించడం
- సినిమా పూర్తిగా రెండు గంటల యాభై నిమిషాలున్నా, దాదాపు రెండుగంటలపాటు సినిమాని వైలెన్స్ లేకుండా తీర్చి దిద్దడం దర్శకుని ప్రతిభ కాకపోయినా కధ వ్రాసిన వాళ్ళను మెచ్చుకోకుండా ఉండలేం
నచ్చని అంశాలు
- ఆత్మహత్య చేసుకో బోయిన వైనం.. అస్సలు అలాంటి సీన్లు తీయ్యడం
- అక్కడ కూడా సాఫ్ట్ వేర్ బూమ్ ఇన్ల్ఫూయన్స్ మన వీరో గారికి కష్టాలు తెచ్చాయని కధారచయత వ్రాయడం, దానిని మన దర్శకులుంగారు సినిమాలో చిత్రీకరించడం.. ఛ!! ప్రతీ సినిమాలో ఇదో పెద్ద ఫ్యాషన్ అయ్యింది..
- కట్నం .. ఆస్ట్రేలియా సంబంధం.. తొక్కలో ట్విస్ట్
- అంగ్ల సినిమా మేట్రిక్స్ లోంచి కొన్ని సీన్ల ఆలోచనలను దొంగిలించడం
ఆఖరిగా ఈ సినిమాని నేను రికమెండ్ చేస్తాను.. మీరు చూసారా..