“నా గురించి” అంటూ ఒక ఉచిత సౌలభ్యాన్ని about.me అనే వెబ్ సైట్ వారు అందుబాటులోకి తీసుకు వచ్చారు. నేను ఒక సైట్ తయారు చేసుకున్నాను. ప్రస్తుతానికి ఇది బాగుంది. వీలైతే చదివే వారు ఉపయోగించుకోండి. ఈ సౌలభ్యంలో నాకు నచ్చిన మరియు నా సలహాలు ఈ క్రింది విధంగా..
నచ్చిన విషయాలు:
1) చక్కగా మనకు నచ్చిన చిత్రాన్ని మన సైట్ నందు ఉంచుకోవచ్చు
2) మనకు ఉన్న వివిధ బ్లాగులను ఒక చోట చేర్చి చూపించ వచ్చు
3) ట్వీటర్ ట్వీట్స్ మరియు మరికొన్ని ఇతర ఉపకరణాలలో నా క్రియలు ఇక్కడ నుంచే చూడవచ్చు
నా సలహాలు
1) ప్రస్తుతానికి వీరు ఒక బ్లాగర్ ఎక్కౌంట్ మాత్రమే కలుపుకోవడానికి అనుమతినిస్తున్నారు. నాకు తెలుగు బ్లాగులు రెండు ఉన్నందున, ఒకటి కన్నా ఎక్కువ బ్లాగులు కలుపుకునే విధానం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం
2) మనం అప్‍లోడ్ చేసుకున్న చిత్రాన్ని మన సైట్ నందు అయితే మధ్యస్తమంగా (center) ఉంచుకోవచ్చు లేదా అంతటా పరచేవిధంగా (tile) చేసుకునే వీలు ఉంది. అంతే కానీ కుడి చేతి వైపునకో లేదా ఎడమ చేతి వైపునకు ఎడ్జెస్ట్ చేసుకునే అవకాశం లేదు.
ప్రస్తుతానికి ఇక్కడితో ఆపుతూ మిగిలిన విషయాలను మీరు తెలుసుకోండి