అమెరికాలో సగటున ప్రతి రోజు – గంటల ప్రకారం

అమెరికాలోని ప్రతీ పౌరుడు సగటున పదిహేను సంవత్సరాల వయసు దాటిన వారు రోజులోని ఇరవై నాలుగు గంటలను ఏవిధంగా గడుపుతున్నారు అని జరిపిన సర్వేలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి సంఖ్యలు చూసాక నేను ఆశ్చర్య చతికుడనైయ్యాను.

అన్నింటికన్నా నన్ను ఆశ్చర్య పఱచినదేమిటంటే, సగటున ఎనిమిదిన్నర గంటలు వీళ్ళు నిద్రపోతున్నారట. అంతే కాకుండా మరో ఆశ్చర్యమైన విషయమేమిటంటే ఉద్యోగం ఉన్నవాళ్ళు సగటున ఎనిమిది గంటల పదహారు నిమిషాలు ఉద్యోగం చేస్తుంటే, లేని వాళ్ళు చక్కగా ఏదైనా పనికి వచ్చే పని పట్ల దాదాపు నాలుగున్నర గంటలు పని చేస్తున్నారు. వీళ్ళ విషయంలో పనికి వచ్చే పని ఏమిటంటే, వ్యాయామం, సోషల్ సర్వీస్, ఇంకా ఇంకా వగైరా వగైరా అన్నమాట. వీళ్ళు తిండికి అచ్చంగా గంటకు తగ్గకుండా కేటాయిస్తారు. నా విశ్లేషణలు అనవసరం గానీ అచ్చంగా వీరి సంఖ్యలను యధా విధిగా ఇక్కడ ఉంచుతాను.

Purpose Time (h:min)
Sleeping

8:23

Work / Related activity

4:30

Employed

8:16

Watching TV

2:37

Leisure/Sports (NonTv)

2:06

Eating, Drinking

1:10

Housework

0:33

కొమరం పులి పాటలు - రివ్యూ

ఈ మధ్య నేను చూద్దాం అనుకున్న సినిమాలలో మరొకటి ఈ సినిమా. పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకున్నాడో సేవ్ అవుతాడు లేదా షేవే.. ఎందుకంటే నేను చూద్దాం అనుకున్న సినిమాలు దాదాపు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ స్నేహితుడితో జరిగిన చర్చలో నాకు అర్దం అయ్యిందేమిటంటే.. ఏదైనా సినిమాని చూడాలనుకున్నప్పుడు ముందుగా ఆ హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎక్సుపెక్టేషన్స్ పెట్టుకోవాలని ఆ తరువాత ఆ సినిమాని చూసి టాక్ ఇవ్వాలని. ఈ సినిమా నేను చూడడం వెనకాల ఉన్న ఎక్సుపెక్టేషన్స్ ఏమిటంటే..

పులి

ఒకటి ) కొమరం భీం అనే ఓ చరిత్రకారుడి పేరు వాడుకున్నందువల్ల

రెండు) రెహమాన్

మూడు) సూర్య

కానీ ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కోసం అయితే మాత్రం అస్సలు చూడటం లేదు. పవన్ కాక మరేవ్వరైనా చూస్తాను. అందువల్ల పవన్ నుంచి నాకు ఎటువంటి ఎక్సుపెక్టేషన్స్ లేవు. ఇక రెహమాన్ పాటల విషయానికి వస్తే..

  • ఒక పాట చాలా మంద్రంగా సున్నితంగా తీర్చిదిద్దాడు.. అదే నమ్మకమీయ్యరా స్వామి అంటూ సాగుతుంది.. అదేదో సినిమాలో, నాగార్జున హీరోగా .. హీరోయిన్ ఎంట్రన్స్ గుడిలో ఇలాంటి పాటతోనే జరుగుతుంది.. ఇంతటి ప్రశాంత మైన పాటను ఎలా చిత్రీకరించారో చూడాలి

+౧

  • ఒక పాట అస్సలు నచ్చలేదు .. అదే పవర్ స్టార్ అంటూ ఉంటుంది .. చెత్తగా ఉంది.. ముమ్మయిత్ ఖాన్ లాంటి అమ్మాయి అయితే బాగా చేస్తుంది .. మరి ఈ పాటకి ఎలాంటి అమ్మాయిని సెలక్ట్ చేసారో..

-౧

  • మారాలంటే అనే పాట కూడా నచ్చింది ..

+౧

  • చిత్ర పాడినట్టు ఉన్న పాట మరొకటి .. దోచేయ్ దొరికింది .. అంటూ సాగే పాట. ఓ ప్రక్కన నచ్చినట్టు అనిపించేటంతో ఆంగ్ల బ్యాక్ డ్రాప్ తో చెడకొట్టాడు.. ఈ పాటలో పాడిన అమ్మాయి గొంతులో హస్క్ బాగుంది, ఈ పాట నాకు నచ్చి నచ్చనట్టుంది

+-౧

  • మహమ్మహ మాయే .. అంటూ మొదలైన పాట ముందుగా ఇంప్రస్ చెయ్యలేదు కానీ, ఈ పాట లిరిక్స్ వ్రాసిన వారెవ్వరో గాని కొంచం కళాత్మకంగా రశికంగా వ్రాయాలని తపన పడ్డట్టు కనబడింది. ఈ పాట చివర్లో వచ్చే ట్యూన్ దాన్ని కూర్చిన విధానం నచ్చింది. రెహమాన్ సిగ్నేచర్ కనబడింది

+౧

  • అమ్మతల్లే అనే పాటపై రివ్యూ వ్రాయాలంటే కొంచం వళ్ళు దగ్గర పెట్టుకోవాలనిపిస్తోంది. ఇందులో చాలా గమకాలు కనబడుతున్నాయి. సంగీత ప్రావీణ్యం ఉన్నవాళ్ళు దీనిగురించి విశ్లేషిస్తే బాగుంటుంది. అంతే కానీ నాలాంటి వాడు కాదు .. కావున బాగుందనే అనుకుంటున్నాను

+౧

మొత్తం మీద అయిదు ప్లస్లు రెండు మైనస్లు కలిపితే రెండు పాటలు మినహ మిగిలినవన్నీ బాగున్నాయి. ఇక సినిమా ఎలా తీస్తారో.. ఈ సినిమా చాలా కాంట్రవర్సీస్ మధ్య చిత్రీకరిస్తున్నారు..

నేను చూద్దాం అనుకున్నాగా.. ఇంకే హాయిగా ఫ్లాప్ అవుతుంది .. నేను చక్కగా ప్రశాంతంగా ఊరి చివ్వర సినిమా హాల్లో హాయిగా చూడోచ్చు..

ఇది నేనే ..

నేను విసుగ్గా ఉన్నప్పుడు నా మొహం ఎంత చెండాలంగా ఉంటుందో ఈ మధ్యనే నాకు తెలిసింది. ఎంత ఛండాలంగా ఉన్నానంటే, నన్ను నేనే అసహ్యించుకునేంత. ఒక్క సారి ఆటైమ్ లో నేను ఎలా ఉన్నానో అని అనుకునెంతలో నా స్నేహితుడొకరు ఆ సన్నివేశాన్ని చిత్రంగా బంధించి నాకు పంపాడు..ఇదిగో ఇలా..

YaakME

డార్లింగ్ – రివ్యూ

ఈ హీరో చేసిన సినిమాలపై నాకు ఓ రకంగా సద్బావన ఉంది. కొన్ని కొన్ని చోట్ల ఈ హీరో కధా రచయతలని ప్రభావితం చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే, కొన్ని సీన్లు ఈ హీరో కోసమే వ్రాసి చిత్రీకరించారేమో అని అనుమానం.

darling

ఈ సినిమా నేను చూడాలని అనుకున్నాను. అందువల్ల ఇది తప్పనిసరిగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి ఉంటుందని తలుస్తాను. ఈ సినిమా నేను చూడలనుకున్న కొన్ని విషయాలలో ఒకటి పాటలలో గల ఓ వైవిధ్యం. ఈ పాటలకు బాణి కట్టింది ఎవ్వరో గాని కొంచం మనసు పెట్టి చేశారని చెప్పుకోవచ్చు. ఈ పాటలని వృత్తి రీత్యా కాకుండా ప్రాణం పెట్టి చేసారని నాకు అనిపించింది.

నచ్చిన అంశాలు

  1. కధలో భారతదేశం గురించి వీరోయిన్ డైలాగులు
  2. విలన్ గారు తన ప్రతాపం సినిమా మూడొంతులు దాకా చూపించక పోవడం
  3. కధని పూర్తిగా కుంటుంబ పరంగా చూడటానికి అన్నట్టు తీర్చిదిద్దడం
  4. పాటలు ..
  5. ప్రతీ సినిమాలో అమ్మనే గొప్పగా చూపించే దర్శకులు ఈ సినిమాలో తండ్రిని హీరోగా చూపించడం
  6. సినిమా పూర్తిగా రెండు గంటల యాభై నిమిషాలున్నా, దాదాపు రెండుగంటలపాటు సినిమాని వైలెన్స్ లేకుండా తీర్చి దిద్దడం దర్శకుని ప్రతిభ కాకపోయినా కధ వ్రాసిన వాళ్ళను మెచ్చుకోకుండా ఉండలేం

 

నచ్చని అంశాలు

  1. ఆత్మహత్య చేసుకో బోయిన వైనం.. అస్సలు అలాంటి సీన్లు తీయ్యడం
  2. అక్కడ కూడా సాఫ్ట్ వేర్ బూమ్ ఇన్ల్ఫూయన్స్ మన వీరో గారికి కష్టాలు తెచ్చాయని కధారచయత వ్రాయడం, దానిని మన దర్శకులుంగారు సినిమాలో చిత్రీకరించడం.. ఛ!! ప్రతీ సినిమాలో ఇదో పెద్ద ఫ్యాషన్ అయ్యింది..
  3. కట్నం .. ఆస్ట్రేలియా సంబంధం.. తొక్కలో ట్విస్ట్
  4. అంగ్ల సినిమా మేట్రిక్స్ లోంచి కొన్ని సీన్ల ఆలోచనలను దొంగిలించడం

ఆఖరిగా ఈ సినిమాని నేను రికమెండ్ చేస్తాను.. మీరు చూసారా..

RRKK ఓ రివ్యూ

నేను ఓ సామాన్య సినిమా ప్రేక్షకుడిని. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. కానీ అమెరికా వచ్చిన తరువాత చాలా సినిమాలు దొంగతనంగా చూస్తున్నాను. నేను సినిమాలు చూడకపోవడానికి కారణాన్ని ఇంతకు ముందు తెలియ జేసాను. నాకు జీవితంలో కష్టం కన్నా సౌకర్యం ముఖ్యం. అలాంటి సౌకర్య్ం కొన్ని చోట్ల దొరకదు. అందులో హైదరాబాద్ సినిమా హాళ్ళలో అస్సలు కష్టం. అందుకనే నేను సినిమా అంటే చాలా దూరంగా ఉంటాను. కానీ అమెరికా వచ్చిన తరువాత ఇక తప్పటం లేదు. అలాగే ఈ రోజు రామ రామ కృష్ణ కృష్ణ చూడడం జరిగింది. ఈ పుటని సినిమా మొత్తం చూడకుండానే మొదలు పెట్టాను. అంటే మొదటి భాగం నాకు ఎంత నచ్చిందో అర్దం చేసుకోగలరు.

rrkk

హాస్యం ప్రధానంగా తీసారనిపించింది. సినిమాలో కొన్ని పాత కక్షలు ఉన్నా, కధానిక ప్రాకారం చాలా బాగా తీసారు. వ్యాపార పరంగా కొన్ని ఫ్లాష్ బ్యాక్ కధలు చాలా అతికినట్టున్నాయి. ఈ హీరో పేరు నాకు తెలియదు కానీ, అదేదో సినిమా పేరు గుర్తుకు రావటం లేదు కానీ .. ప్రేమకోసం అమెరికా వెళ్ళి హీరోయిన్ ని అక్కడ వదిలేసి వస్తాడు, అలా ఆ సినిమానుంచి ఈ సినిమా వరకూ ఏమాత్రం తన స్టైల్ మార్చుకోకుండా యధాతధంగా కృత్రిమం కనబడకుండా నెట్టుకొచ్చేసాడు.

దర్శకుడెవ్వరోకానీ బాగానే చిత్రీకరించాడు. కధని ఎవ్వరు వ్రాసారో కానీ కాస్తంత కమర్షియల్ గా తీర్చిదిద్దారు. కాస్తంత ప్రేమ కాస్తంత సెంటిమెంటు కాస్తంత హాస్యం కాస్తంత త్యాగం మరింత ఆప్యాయత చేర్చి మధ్యతరగతి కుటుంబం ప్రశాంతంగా చూసేటట్టు తీర్చి దిద్దారు.

ఈ మధ్య కుటుంబ సమేతంగా చూడదగ్గ అతి కొన్నిసినిమాలలో ఇది ఒకటి అని నా అభిప్రాయం. హైదరాబాద్ చేరుకున్న తరువాత తప్పనిసరిగా ఈ సినిమాకి నా భార్య సమేతంగా వెళ్ళి చూస్తాను. అలాగే మీరుకూడా చూడండి. నా భార్యకి ఓ చక్కటి సినిమా చూపించానన్న ఆనందం ప్రక్కనున్న వాళ్ళ చెమట కంపు అధిగమిస్తుంది. క్లైమాక్స్ లో హింస పాళ్ళు అనవసరమైనా కధాపరంగా మాస్ జనానికి బాగానే ఆకట్టుకుంటుంది. అర్జున్ సెలక్ట్ చేసుకునే పాత్రలన్నీ చాలా హుందాగా ఉంటాయి. అప్పుడెప్పుడో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఓ టీవీ ఛానల్ కోసం చేసిన ఓ టాక్ షోలో అర్జున్ జగపతి బాబు ఇద్దరూ మంచి స్నేహితులని విన్నా. ఆ తరువాత నేను చూసిన అర్జున్ మొదటి సినిమా ఇదే. చాలా హుందాగా చేశాడు. మొత్తం మీద నాకు నచ్చింది. నిర్మాతకు నా వంతు డబ్బులు భాగ్యనగరం చేరుకున్న తరువాత. అంతవరకూ ఇంతే సంగతులు..

పంచాక్షరి నా రివ్యూ

ఈ సినిమా చూడాలని నేను అనుకోలేదు, అందువలన ఇది హిట్ అయ్యి ఉంటుందని అనుకుంటాను. ఎందుకంటే, నేనే సినిమా అయితే చూడాలని అనుకుంటానో ఆ సినిమా ఆడదు. ఇది చాలా కాలంగా ఋజువయిన నా నమ్మకం. అందుకనే ఈ అనుకోవడం. ఏది ఏమైనా.. అనుకోకుండా ఈ సినిమా చూడడం జరిగింది.
మొన్నామధ్య ఓ స్నేహితుడితో జరిగిన చర్చలో ఈ సినిమాని నాగార్జునే ప్రొడ్యూస్ చెయ్యడంపై నా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. నా ఆలోచన వరకూ ఈ సినిమాని ఒక్క నాగార్జున లాంటి దైవ నమ్మకం లేని వాళ్ళు మాత్రమే చెయ్యగలరు. ఈ సినిమాని చూసిన తరువాత నా అభిప్రాయం మరింత బలపడింది.
panchakshari
ఈ సినిమాని మఱో అరుంధతిగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నం అడుగడుగునా కనబడింది. పైన చెప్పినట్లు ఈ సినిమాని దైవ / భక్తి భావంతో కాకుండా కమర్షియల్ దృక్పధంతో తీసారని అక్షర సత్యం. ఇందులో కొంత శ్రద్ధవహించారని చెప్పొచ్చు. ఈ సినిమాలో అనూష్క కొంచం వొళ్ళు దగ్గర పెట్టుకుని నాట్యం చేసిందని చెప్పాలి. అరుంధతిలో అయితే అచ్చంగా పరమ చెత్తగా చేసినప్పటికీ దర్శకుని ప్రతిభముందు అనూష్క ఇమ్మెట్యూరిటి కనబడలేదు. ఈ సినిమాలో అయితే కొంచం ప్రాక్టీస్ చేసినట్టు కనబడింది.
ఇందులో అవసరంలేని కొన్ని విషయాలలో ఒకటి బ్రహ్మానందం పాత్ర. ఆసాంతం చెత్తగా అనిపించింది. అలాగే పంచాక్షరి భర్తగా నటించిన కారెక్టర్ యొక్క నెగెటివ్ షేడ్ అనవసరమనిపించింది. ఈ సినిమా ఎన్ని కత్తెరలకు నోచుకుందో చెప్పకనే చెబుతోంది. అన్నింటికీ మించి మంచి కధ అయినా తీసిన విధానం ఏమాత్రం మెచ్చుకోదక్క లేక పోయినా నావరకూ అయితే పరమ చెత్తగా ఉంది.
కానీ ఒక్క విషయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నాగార్జున లాంటి నాశ్తిక కుటుంబం ఇలాంటి దైవ ప్రధానమైన కధని సినిమాగా తీయ్యడానికి ధైర్యం చెయ్యడం వారి వ్యాపార దృక్పధాన్ని చెప్పకనే చెబుతోంది. అలా వ్యాపార పరంగా ఆలోచించడమే కాకుండా.. చక్కగా.. కొన్ని గ్రాఫిక్స్ విషయాలలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించడంలో వీరి శ్రధని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను.
మొత్తంగా ఈ సినిమా నాకు నచ్చకపోయినా, కధాపరంగా కాకుండా టెక్నికల్ విలువల పరంగా ఈ సినిమాని చూడమని నేను రికమెండ్ చేస్తాను. నేను చూశాను.. మరి మీరు చూశారా..

అమెరికాలో ఈగలు

అమెరికాలో కూడా ఈగలుంటాయని నాకు నేటి వరకూ అనుకోలేదు. నా పిచ్చి కాకపోతే, ఈగలకు పాస్ పోర్ట్ మరియు విసాలాంటివి అవసరంలేదు కదా.. వాటికి కావలసినదల్లా రుచికరమైన ఆహారపదార్దం ఆరు బయట ఉంచడమే.. నేను నా భోజనాన్ని ప్లేటులో పెట్టుకుని హాయగా ఉంటుందని, స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నా.. ఇదిగో ఇలా నేను కూర్చున్నానో లేదో.. వెంటనే తయారయ్యాయి.

fly

హల్లో ఈగల్స్.. ఎలా ఉన్నారు?

 
Clicky Web Analytics