RRKK ఓ రివ్యూ

నేను ఓ సామాన్య సినిమా ప్రేక్షకుడిని. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. కానీ అమెరికా వచ్చిన తరువాత చాలా సినిమాలు దొంగతనంగా చూస్తున్నాను. నేను సినిమాలు చూడకపోవడానికి కారణాన్ని ఇంతకు ముందు తెలియ జేసాను. నాకు జీవితంలో కష్టం కన్నా సౌకర్యం ముఖ్యం. అలాంటి సౌకర్య్ం కొన్ని చోట్ల దొరకదు. అందులో హైదరాబాద్ సినిమా హాళ్ళలో అస్సలు కష్టం. అందుకనే నేను సినిమా అంటే చాలా దూరంగా ఉంటాను. కానీ అమెరికా వచ్చిన తరువాత ఇక తప్పటం లేదు. అలాగే ఈ రోజు రామ రామ కృష్ణ కృష్ణ చూడడం జరిగింది. ఈ పుటని సినిమా మొత్తం చూడకుండానే మొదలు పెట్టాను. అంటే మొదటి భాగం నాకు ఎంత నచ్చిందో అర్దం చేసుకోగలరు.

rrkk

హాస్యం ప్రధానంగా తీసారనిపించింది. సినిమాలో కొన్ని పాత కక్షలు ఉన్నా, కధానిక ప్రాకారం చాలా బాగా తీసారు. వ్యాపార పరంగా కొన్ని ఫ్లాష్ బ్యాక్ కధలు చాలా అతికినట్టున్నాయి. ఈ హీరో పేరు నాకు తెలియదు కానీ, అదేదో సినిమా పేరు గుర్తుకు రావటం లేదు కానీ .. ప్రేమకోసం అమెరికా వెళ్ళి హీరోయిన్ ని అక్కడ వదిలేసి వస్తాడు, అలా ఆ సినిమానుంచి ఈ సినిమా వరకూ ఏమాత్రం తన స్టైల్ మార్చుకోకుండా యధాతధంగా కృత్రిమం కనబడకుండా నెట్టుకొచ్చేసాడు.

దర్శకుడెవ్వరోకానీ బాగానే చిత్రీకరించాడు. కధని ఎవ్వరు వ్రాసారో కానీ కాస్తంత కమర్షియల్ గా తీర్చిదిద్దారు. కాస్తంత ప్రేమ కాస్తంత సెంటిమెంటు కాస్తంత హాస్యం కాస్తంత త్యాగం మరింత ఆప్యాయత చేర్చి మధ్యతరగతి కుటుంబం ప్రశాంతంగా చూసేటట్టు తీర్చి దిద్దారు.

ఈ మధ్య కుటుంబ సమేతంగా చూడదగ్గ అతి కొన్నిసినిమాలలో ఇది ఒకటి అని నా అభిప్రాయం. హైదరాబాద్ చేరుకున్న తరువాత తప్పనిసరిగా ఈ సినిమాకి నా భార్య సమేతంగా వెళ్ళి చూస్తాను. అలాగే మీరుకూడా చూడండి. నా భార్యకి ఓ చక్కటి సినిమా చూపించానన్న ఆనందం ప్రక్కనున్న వాళ్ళ చెమట కంపు అధిగమిస్తుంది. క్లైమాక్స్ లో హింస పాళ్ళు అనవసరమైనా కధాపరంగా మాస్ జనానికి బాగానే ఆకట్టుకుంటుంది. అర్జున్ సెలక్ట్ చేసుకునే పాత్రలన్నీ చాలా హుందాగా ఉంటాయి. అప్పుడెప్పుడో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఓ టీవీ ఛానల్ కోసం చేసిన ఓ టాక్ షోలో అర్జున్ జగపతి బాబు ఇద్దరూ మంచి స్నేహితులని విన్నా. ఆ తరువాత నేను చూసిన అర్జున్ మొదటి సినిమా ఇదే. చాలా హుందాగా చేశాడు. మొత్తం మీద నాకు నచ్చింది. నిర్మాతకు నా వంతు డబ్బులు భాగ్యనగరం చేరుకున్న తరువాత. అంతవరకూ ఇంతే సంగతులు..

7 స్పందనలు:

Anonymous said...

చమట కంపు ఉండొద్దూ అంటే మల్టీ-ప్లెక్స్ లకి వెళ్ళాలి. అంతే కాని, పాపం, ఇంట్లో వారికి కాస్త చేంజ్ ఉండకపోతే ఎలా?

నెలలో ఒక్క రోజైనా ఇంటి టెషన్స్ మరిచి హాయిగా ఉండాలి. అర్థంచేసుకోండి. సలహా మాత్రమే!

రాకేశ్వర రావు said...

బాగుంది।

Anonymous said...

అదో పరమ చెత్త సినిమా .. మొదటి నుంచీ చివరిదాకా నందమూరి గొడవ .. నందమూరి మా జాతి గొప్పది .. అదే గొడవ .

స్వాతి said...

శ్రీవారు
మీరు భాగ్యనగరం వచ్చే సరికి ఇక్కడ ఆ సినిమా ఆడకపోవచ్చు.

తార said...

ఇంకెక్కడ ఆడుతున్నదీ సినిమా? మాంఛి ప్రింట్ డవున్‌లోడ్ చేసుకొని, చూసి డబ్బులు కొరియర్లో పంపండి నిర్మాతకి

చక్రవర్తి said...

మొదటి అజ్ఞాత గారు,

సదురు మల్టీప్లెక్స్ లకు కూడా వెళ్ళి ప్రయత్నం చెయ్యడం జరిగింది. అక్కడ కూడా పని పాట లేని పిల్లకాయలు చేసే యదవ పనులు వెకిలి వేషాలు వాటికితోడుగా చొంగలు కార్చుకుంటూ వాళ్ళు చేసే చేశ్టలు చూసాక సినిమాల పైన ఉన్న మోజు కాస్త వికటించి సినిమాలకు వెళ్ళటం అంటేనే అసహ్యం వేస్తోంది. అందుకని ఎంచక్కగా వారానికొక సారి నెక్లెస్ రోడ్డులో మా చిన్న బండిపైన 'ఝూం..' అంటూ నేను నా పెళ్ళాం తిరిగి ఫుడ్ కోర్టులో ఏదైనా లాగించేసి ఇంటికి చేరుకుంటాం. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు

రాకేశ్వర రావు గారు,

స్పందించినందులకు నెనరులు

రెండవ అజ్ఞాత గారు,

నాకు ఇందులో నందమూరి గోల ఎందుకో కనబడలేదు.. ఏమైనా స్పందించినందులకు నెనరులు

పెళ్ళాం,

ఏదో ఒకటి చేద్దాంలే.. డోన్ట్ వఱి

తార గారు,

మీరు చెప్పిన రెండుపనుల్లో మొదటిది నేనెలాగో చేసేసాను కాబట్టి రెండొవ పని చెయ్యడానికి మీ సహాయం కావాలి. నా యందు దయయుంచి ఆ నిర్మాత చిరునామా సంపాదించండి. డబ్బులు ఎలా పంపించాలో నేను ఆలోచిస్తాను.

తార said...

అంత శ్రమ మీకెందుకు? ఆ పంపే డబ్బులు ఎవో నాకు పంపండి, నేనే ఎవో తిప్పలు పడి, కుదిరినప్పుడు ఆ నిర్మాతకి ఇస్తాను.

 
Clicky Web Analytics