నేను ఈ మధ్య చదివిన ఒక బ్లాగు పుటలో, సదురు స్వంతదారుడు తన అభిప్రాయాన్ని చక్కగా అందమయిన భాష్యంలో తెలియజేసినారు. ఆది ఏ బ్లాగు, ఏ విషయమది అనునటువంటి విషయాలు ప్రస్తుతం అప్రస్తుతం. అసలు విషయమల్లా.. ఆ పుటకు స్పందించిన వ్యక్తులలో నేను ఉన్నాను. నాతో పాటుగా మరొక వ్యక్తి.. ఈ క్రింది విధంగా స్పందించారు.
... టైపులో చాల పుట్టుకొచ్చాయి. chain schemes మరి డేంజర్. ఆ మధ్య *** అని ఒ లం* కొ** (naa కొ**ది hyderabad అనుకొంటా) కోట్లల్లో జనాలని ముంచాడు. ఇంకో లం* కొ** (ఆ లం* కొ**ది కూడా హైదరాబాదీ) books ని CD లోకి ఎక్కించే HOME BASED WORK అని (ఈ నా కొ** BANK EMPLOYEE). చాల మంది చాల పోగుట్టుకొన్నారు. అలాగే CHARMINAR, KRISHI ... ఈ లం* కొ**లందరికి HYDERABAD వాళ్ళు భలే దొరుకుతారు ..
కొన్ని విషయాలను ఆ బ్లాగు రచయత తీర్చిదిద్దితే బాగుండేది. కానీ ఆ బ్లాగు ప్రచురించిన రచయతకు ఈ స్పందన చదివిన తరువాత ఎటువంటి భావన కలిగినట్లు లేదు.. చక్కగా ఉన్నదున్నట్లుగా publish చెసేసారు, కొంచం కూడా moderate చెయ్యకుండా. ఇది చదివిన తరువాత, నా మనసుకు కొంచం భాధ కలిగి, సదురు స్పందించిన వ్యక్తికి విడిగా ఆయన వ్యక్తిగత మెయిల్‍కి క్రింది విధంగా ఒక విన్నపాన్ని తెలియజేసాను.
నా పేరు చక్రవర్తి, నేను మీరు స్పందించిన తీరుపై, నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి, మీకు ప్రత్యెకంగా ఉత్తరం వ్రాయుచుంటిని. మీ స్పందనకు ముందు నేను స్పందించాను, గమనించగలరు. మీ పదజాలం లోని కొన్ని అసంమజసంగా ఉన్నవి. దయచేసి, ఇక మీదట తమరు అటువంటి పదజాలం వాడరని ఆశిస్తున్నాను. మీరు ఉదహరించిన సదరు *** అనేటటువంటి వ్యకి మంచి వాడు కాదనుకుందాం, అతను చేసిన తప్పుకి అతని తల్లిని 'లం*' అని సంభోదించడం ఏ మాత్రం వివేకం .. మీకు కచ్చి ఉంటే అతనిని తిట్టండి అంతేకాని అతని తల్లి తండ్రులను అనవసరంగా అపార్దం చేసుకోవడం ఎంత మాత్రం భావ్యమో ఆలోచించగలరు.
అన్యధా మంచిగా ఆలోచిస్తారని, నన్ను + నా అభిప్రాయాన్ని తప్పుగా భావించరని ఆశిస్తూ..
దీనికి ఎంత త్వరగా బదులు వచ్చిందంటే.. బహుశా.. ఒక రెండు గంటల వ్యవధిలో ఈ క్రింది విధంగా తిరుగుటపా వచ్చింది.
నమస్కారం, మహా కవి శ్రీ శ్రీ, ఇంకా చాల మంది చాలా, చాలా పుస్తకాలలో , సినిమాలలో వాడారు. నేను కొత్తగా ఈ పదాలు వాడ లేడు- కనిపెట్టలేదు . గమనిచగలరు. SORY. నేను అటువంటి పదాలను వాడకుండా ఉండలేను.
BEST REGARDS
ఈ తిరుగు టపా చదివిన తరువాత నాకు నోటివెంట మాటలేదు. ఏమిటిది?? ఎవ్వరితో పోలిక??? మహాకవి శ్రీ శ్రీ గారు వాడారు కదా అని మనం నిరబ్యంతరంగా ఇట్లాంటి పదాలను వల్లించ వచ్చా??? మనలో ఉండవలసిన తెలివి తేటలేమయినట్లు?? మనలో ఉండవలసిన వివేకమేమయినట్లు?? పెద్దవాళ్ళు ఎదో తప్పుచేసారనుకోండి, అటువంటి తప్పు మనంకూడా తప్పకుండా, తప్పు చేయవలెనా??? కందుకూరి వీరేశలింగం పంతులుగారు వితంతువునైనా గౌరవించాలని చెప్పిన మంచికి ఎటువంటి విలువలేదా??
ఇవన్నీ ఒక ఎత్తైతే, వయస్సుతో పాటు పెరగవలసిన పెద్దరికమేమయినట్లు?? కొంచమయినా హుందాగా బ్రతకాలి అన్న ఆలోచనలేకుండా, 3rd grade people లా ప్రవర్తించిన ఇట్టి మనుషులను ఏమి చేయ్యాలో అర్దం కావడంలేదు. వీరు మంచిగా.. మర్యాదగా మారతారని నేను కలలో కూడా ఊహించలేను. వీరే ఇలా ఉంటే, వీరి ఇంట పుట్టి పెరిగిన పిల్లలు ఏవిధంగా తయారవుతారో ఊహించుకుంటే.. దేవుడా.. వారిని, వారి వారి సహచరులను నువ్వే కాపాడుమని వేడుకోవడం మినహా .. ఏమీ చెయ్యలేను. కానీ ఒక్కటి మాత్రం చెయ్యగలను.. మా తాతగారు బ్రతికున్నరోజులలో చెప్పిన మాట ఒకటి వీరిలాంటి వారికి నూటికి నూరు శాతం వర్తిస్తుంది..
ఏమంటారు?దుశ్టులు, దుర్మార్గులు,స్త్రీలను గౌరవించడం చేతకానివారు, అమర్యాదగా ప్రవర్తించే వారు.. ఇలా కొంచం పెద్ద లిస్టే ఉంది.. వీరంతా మనం విసర్జించేటటువంటి మల మూత్రాలతో సమానం. పెంట మీద రాయి వేశామనుకోండి ఏమి జరుగుతుందో తెలుసుకదా.. అటువంటప్పుడు, అట్లాంటి వారితో మనకి పనేమిటి?? దూరంగా ఉంటే పోలా.. మనకూ మంచిది.. వారికీ మంచిది.
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి