ఏమిటీ ఈ తరహా వర్క్ సంస్కృతి

నేను ఈ మధ్య వృత్తి రీత్యా అమెరికాలో ఉన్నాను కదా.. కొన్ని కొన్ని విషయాలు అసహ్యాన్ని కంపరాన్ని కలిగిస్తున్నాయి. వాటిల్లో ఇవిగో కొన్ని.

శుచి సుబ్రం - భారత దేశంలో మాకు నేరిన అలవాటు


ఉదయానే లేవంగానే పళ్ళు తోముకోవడం అలవాటు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే.. దాదాపుగా చిన్నప్పటి నుంచి పళ్ళు తోము కోందే మాట్లాడ వద్దేనేవారు. ఉదయానే పళ్ళు తోము కోవడం .. కళ్ళల్లో పుసులు తీసు కోవడం .. నాలుక గీకడం వంటివి .. ఎప్పుడైనా మర్చి పోయ్యాము అనుకోండి, పోలీస్ కుక్క వాసన పసిగట్టినట్లు ఎవరో ఒకరు పసిగట్టేశే వారు. అంతే, ఓ పది నిమిషాలు ఏక బీకిన తిట్లు చీవాట్ల దండకం. వాళ్ళ దండకం పడలేక చట్టుక్కున బాత్ రూమ్ లోకి దూరేశి ఓ పది నిమిషాలు బ్రష్ తో కుస్తీ పడి, అంతా అయ్యింన తరువాత తిట్టిన వాళ్ళ దగ్గర కెళ్ళి .. ఈ.. అంటూ పళ్ళన్నీ కనబడేటట్టు చూపించేత వరకూ వదిలే వారు కాదు.

 

ఇలా అలవాటై .. ఇక్కడికి వచ్చాక.. ఇక్కడ నాతో పని చేసే వాళ్ళ ప్రవర్తన చూసాక. మన సాంప్రదాయమే వీరి కన్నా కోటి రెట్లు మెరుగు అనిపిస్తోంది.

 


శుచి సుబ్రం - అమెరికాలో నేను గమనించిన అలవాటు

 

పనిలో తీవ్రంగా మునిగి ఉండగా ఏదో దుర్గంధం ముక్కు పుటాలకు తాకింది. ఏమిటా అని ఒక తల పక్కకు త్రిప్పితే, నాతో పనిచేసే సహ ఉద్యోగి. ఏదో పని పడింది. అడగడానికి వచ్చాడు. వాడు నోరు తెరిచినప్పుడల్లా దుర్ఘంధం ముక్కు పుటాల్ని చీల్చి చెండాడుతోంది. చికాకుగానే సమాధానమిచ్చి, వాడితో వేగే ఓపిక లేక, ఏవైనా సంధేహాలుంటే మెయిల్ చెయ్యమన్నాను. అదికాదూ .. అంటూ ఏదో చెప్పబోయాడు.

 

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో చూడలేదు, మరో అమెరికన్. వీడు వాడు కలిసి మెల్లిగా జారుకున్నారు. కడుపులో దేవుతూ ఉన్నట్లు ఉన్నందు వల్ల మెల్లిగా రెస్టు రూమ్.. అదేనండీ .. టాయిలెట్.. వైపు వడి వడిగా .. (ఇందులో మొహమాట పడవలసినది ఏమీ లేదు..) పరిగెత్తా.. తీరా అక్కడకు వెళ్ళాక తెలిసింది. ఇందాకటి ఇద్దరూ అక్కడ తీరికగా నించొని పళ్ళు తోముకుంటున్నారు.

ఇంతకీ విషయమేమిటంటే.. వీళ్ళు రాత్రి పీకలదాకా బాగా తాగి తెల్లారిదాకా చిందులేసి.. ఉదయాన ఇంటికెళ్ళి ఓ రెండు గంటలు నిద్రపోయి.. పక్క మంచం మీదనుంచి నేరుగా ఆఫీస్ చేరుకున్నారన్న మాట. ఇదిగో ఇక్కడి కొచ్చి దంత ధావనం చేస్తున్నారన్న మాట

పెద్దలే ఇలా ఉంటే, ఇక పిల్లల్లు ఏ విధంగా తయారవుతారు?
మరో చికాకు విషయంతో మరలా మీ ముందుంటా..

 
Clicky Web Analytics