దుష్టులకు దూరంగా ఉండాలి - The Final Cultమొదటి పుట దేవాలయ స్థాన బ్రంశం గురించి ప్రస్తావిస్తే.. రెండవ పుట పరోపకారార్ధం మిదం శరీరం అంటూ చనిపోయిన తరువాత కూడా తాము ఉండడానికి అనువైన ప్రదేశాన్ని, శ్మసానాన్ని, కూడా వాహన చోదకుల ఉపయోగార్ధం త్యాగం చేసిన వైనాన్ని గుర్తుకు చెస్తుంది.

ఇక
ఆఖరుగా, విషయాన్ని ప్రస్తావించడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డాన్నో.. విషయాన్ని ఎలా తెలియ జేయాలా అని నేను ఎంత ప్రయాస పడ్డానో.. అసలు విషయాన్ని సున్నితంగా ఎలా తెలియ జేయాలో తెలియక ఎన్ని సార్లు పుటని పదే పదే పలు విధాలుగా వ్రాసుకున్నానో .. నా ఆత్మకు అలాగే పైన ఉన్న దైవానికి మాత్రమే తెలుసు.

అయినా ఉన్న విషయాన్ని తెలియ జేయడానికి ఇంత శ్రమ అవసరమా?? ఎంత నిజాయతిగా ఉందా మనుకున్నా .. దాన్ని వక్ర బుద్ధితో చూసే జనం అర్దంచేసుకోక పోగా.. అపార్ధం చేసుకుని అనర్ధాన్ని కలిగిస్తారనే భయం నుంచి బయట పడి ధైర్యంగా సాహసం చేస్తున్నా..
 
ఇక్కడ కనబడుతున్న రోడ్డు map కొంచం దాదాపుగా వచ్చేటట్టు ప్రయత్నించా..

గమనించాల్సిన విషయం -


స్థలం : ఏల్ వీ ఫ్రసాద్ మార్గ్ మొదలయ్యే చోటు. నాగార్జునా సర్కిల్నుంచి హైటెక్ సిటీ వేళ్ళే దారి. ఈదారిలోనే TV9 వారి ఆఫీస్ ఉంది.

ప్రస్తావించ దగిన విషయం:

దారి గురించి ప్రస్తావించే ముందుగా కొన్ని విషయలు.

వివరణ : ఎర్ర గీతలో ఉన్న దారి పుట ప్రస్తావన
వివరణ : నీలం గీతలో ఉన్న దారి వెడల్పుని ఎర్ర గీతలో ఉన్న దారి వెడల్పుని గమనించండి
వివరణ : బూడిద రంగు ఉన్నవి భవన సుదాయం
వివరణ : తెలుపు రంగు దారిగుండా ట్రాఫిక్ పయనిస్తూ ఉంటుంది
వివరణ : అంకె 1 వేసిన చోట, ఒక బేకరి ఉంది
వివరణ : అంకె 2 వేసిన చోట, ఒక మెకానిక్ షెడ్డు ఉంది
వివరణ : అంకె 3 వేసిన చోట, ఎంత వరకూ ఉందో తెలియదు గానీ అక్కడ ఒక మసీదు ఉంది
వివరణ : ఇక్కడ 3 అంకె వేసిన చోట గీతని గమనించారు కదా.. లోపల ఎలా ఉందో నాకు తెలియదు ..కానీ ఆగీతకి కుడివైపున అంతా ఖాళీ స్థలమే..
వివరణ : పైగా ఎర్రని వృత్తాకారం ఉన్న చోటు.. ఎత్తుగా ఉంటుంది. దారిలో ఒక బస్సు ఎక్కిందంటే.. అంతే సంగతులు .. చిన్నపిల్లవాడే వేగంగా పాకుతాడెమో అనిపిస్తుంది..

ఇక అసలు విషయానికొద్దాం..

పైన చెప్పిన దారిలో ఉదయం వేళ్ళల్లో ట్రాఫిక్ చాలా దారూణంగా ఉంటుంది. అందునా TV9 ఆఫీస్ దగ్గర నరకమే అనుకోండి. దారంతా ఎత్తుగా ఉండటమే కాకూండా.. కూడలి దాటిన తరువాత, ఎర్ర వృత్తాకారాం చుట్టున చోటు ఇరుకైన రోడ్డు. ద్విచక్ర వాహనం చోదకులైతే గానీ.. కార్లూ గానీ.. బసస్సు వాళైతే గానీ.. ఎవ్వరేళినా.. First Gearలో వెళుతూ ఎంత కాలూష్యాన్ని విడుస్తున్నారో అటుగా వెళ్ళే వాళ్లని అడిగితే తెలుస్తుంది. ఎప్పుడూ అటుగా వెళ్లుతున్నప్పుడల్లా.. క్రింద విధంగా అనిపిస్తుంది.

ఎన్నో ఫ్లై ఓవర్లు వేసిన పలు ప్రభుత్వాల అధికారులు దారి గుండా ఎప్పుడూ సాగినట్లు లేరు .. ఒక వేళ సాగినా.. వారి దృష్టికి ఇక్కడి ఇబ్బంది వచ్చినట్లు లేదు.. పోనీ ఎవ్వరైనా వారి దృష్టికి తీసుకొద్దాం అని ప్రయత్నం చేసినా.. వారు దానిని చూడదలుచు కున్నట్లు లేరు .. ఎందుకని?

ఇక్కడ ముస్లింలకు సంభందించిన మసీదు ఉన్నందున మత్రమేనా?? ఏం.. ప్రభుత్వాధికారులు మసీదు పెద్దలతో చర్చలు జరిపి ప్రజాపయోగార్దం ఖాళిగా ఉన్న స్థలాన్ని ఎందుకు రోడ్డుగా మరల్చ లేక పోతున్నారు? రోడ్డుకు అడ్డంగా ఉందన్న ఒకే ఒక కారణం చేత.. ఆనంద్ థియేటర్ దగ్గర మూడంతస్తుల భవనాన్ని, అందులో ఉన్న వ్యాపార కార్య కలాపాల్ని కూల్చేసిన ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఒక చిన్న బేకరీని దానిని ఆనుకుని ఉన్న మెకానిక్ షెడ్ని తొలగించ లేక పోవడం వెనుక ఉన్న రహస్య మేమి? ఇదంతా ముస్లింల ఆస్తి అన్న ఒకే ఒక కారాణమా..

ముస్లింలు అంటే అర్దం చేసుకునే మనుషులు కారా?? వారికి వారి మతమే ముఖ్యమా?? వారికి "లోక కళ్యాణం" అనే పదానికి అర్ధం తెలియదా?? వారు పరోపకరార్థం ఏమీ చెయ్యరా?? లేక మన ప్రభుత్వాధికారులు వారితో చెర్చించ లేదా?? (లేదా) ముస్లింలు అంతా దుర్మార్గులు వారు ఎవ్వరి మాట వినరు, వారితో ఎంతైనా దూరంగా ఉండాలి అనేటటు వంటి ఆలోచనేమైనా ఉందా.. ఎందుకని విషయంలో ఎటువంటి ప్రయత్నమూ జరిగినట్లు కనబడటం లేదు..

నా వరకూ నాకు ఎంతో మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు.. వారంతా స్వతహాగా నిదానస్తులు.. ఎంతో సహృదయులు.. స్వతహగా చాలా మంచి వారు .. అంత ఎందుకు.. ఒకప్పటి మన ప్రధమ పౌరుడు, గౌరవనీయూడు, డాక్టర్ Abdul Kalam ఒక ముస్లిం కాదా.. మరి ఇలాంటి వారు నాకు కనబడుతున్నప్పుడు.. ఎందుకు పైన చెప్పిన మసీదు ఆవరణాన్ని రోడ్దుగా మలచ లేకపోతున్నం? నేనేమన్నా తప్పుగా ఆలోచిస్తున్నానా??

మొత్తం కధలో విలన్లు ఎవ్వరు? మసీదు స్వంతదారులా? మన ప్రభుత్వ అధికారులా? గోరంత విషయాన్ని కొండంతలుగా చూస్తున్న నాదా??

ఏది ఏమైనా.. ముస్లిం సోదరులూ నేను మిమ్మలను ఉద్దేశించి పుట వ్రాసానని మీరు భావిస్తే.. అన్యధా క్షమించండి.. నా ప్రచురణ మిమ్ములను వ్యతిరేకించడం కాదు గానీ.. మిమ్ములను ఆశ్రయించని ప్రభుత్వ అధికారులకు కనువిప్పు కలిగించే ప్రయత్నమే అని గమనించ గలరు. ఆఖరుగా మరొక్క సారిగా.. మీ అభిమతాన్ని గాన్నీ.. మీముల్లను ఏవిధంగా నైనా కించ పరచానని మీ కనిపిస్తే.. దయచేసి క్షమించ గలరు..

4 స్పందనలు:

Anonymous said...

I expected this kind of ending,
there is nothing wrong in raising such questions, but your title suggests a different meaning than you expressed in the post.Pl review the title

చక్రవర్తి said...

అయ్యా అనామకుడు గారూ..

మీ స్పందనకు ధన్య వాదములు .. మీకు వచ్చిన ఆలోచనే నాకూ వచ్చింది. నేను ఈ పుట యొక్క మూలం ఆలోచించేటప్పుడు నుంచి ఆలోచిస్తూనే ఉన్నా.. ఈ టైటిల్ ఎవ్వరి నుద్దేశించి అని..

చదివే చదువరులూ.. నా ఉద్దేశ్యంలో ఇక్కడ దుష్టులు అనేవారు సమాజ శ్రేయస్సుకు తోడ్పనివారు అనే అర్దం, తప్ప, మరెవ్వరూ కాదని గమనించ గలరు.

అది నేనవ్వ వచ్చును..లేదా..మీరవ్వవచ్చును.. లేదా మరి ఎవ్వరైనా.. సరే.. అంతే తప్ప ఎదో ఒక వర్గం వారు కాదని గమనించ గలరు

GURRAM SEETA RAMULU said...

mee blog saradaaga undandi
vachanam raayagalaru
enduku prayatnicharu
mee lanti telivigalavaalla mounam
upekshichalemu
ok take it eassy any how nice to see u
gurram seetaramulu
EFLU NIVERSITY
HYD http#gurramseetaramulu.blogspot.com

rudra said...

nenu kuda eppudina ee route lo vellinappudu naku anipisthuntindi..enduku govt vallu deeni gurunchi pattinchu kooru..migatha places ayina rude ly kulagottatharu...mari idi enduku vadilipettaro teleyadam ledu kadaa....

 
Clicky Web Analytics