ఈ విషయం మన పాలిత ప్రస్తుత ప్రభుత్వానికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని నా అభిప్రాయం. ఇది ప్రస్తుతం పాలిస్తున్న ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్రాసింది మాత్రం కాదు. ఇంతవరకూ పరిపాలన సాగించిన అన్ని ప్రభుత్వాల ప్రభుద్దులను ఉద్దేశించి వ్రాసేదే అని గమనించ గలరు. విశయం ప్రభుత్వాలది కాదుకానీ .. దుష్టులది.. మత ఛాందస్సులది.. మానవతా దృక్పధం లోపించిన వారిది..
గమనించాల్సిన విషయం - ౧
స్థలం : సికింద్రాబాద్, ఆనంద్ సినిమా థియేటర్ రోడ్డు మీద ఉన్న రక్త మైసమ్మ గుడి
ప్రస్తావించ దగిన విషయం:
ఈ గుడి ఎప్పుడు కట్టారో నాకైతే తెలియదు గానీ, నాకు 1996 నుంచి రాజధానితో పరిచయాలున్నాయి. అప్పటినుంచి రాజధానికి రాక పోకలు ఇబ్బడి ముబ్బడిగా చేసుంటాను. పైన చెప్పిన దారిలో చాలాసార్లు వెళ్ళి ఉంటాను. అలా సాగిన ప్రతీ సారీ అనుకుంటూనే ఉంటాను, రోడ్డుకు అడ్డంగా ఎవ్వరు కట్టారా అని .. అది కట్టిన వారు, ఆ కాలంలో ఊహించి ఉండరు, ఇలా .. ఈ కాలంలో నాలాంటి వాడు ఆలోచిస్తాడనిన్నీ.. ఆ త్రోవలో సాగే వారికి ఆ దేవాలయం ఒక అడ్డంకిగా మారుంతుందనిన్నీ..
ఏది ఏమైనా.. ఈమధ్య కాలంలో అటు వైపుగా సాగే వాళ్ళు గమనించ దగ్గ విషయమేమిటంటే.. ఆ గుడిని, రోడ్డు మధ్యనుంచి తీసి, రోడ్డుకు ప్రక్కగా ఉన్న కాలేజీ గ్రౌండు లోకి వెళ్ళేటట్టుగా పునర్‍నిర్మించారు. ఈ కదలిక వెనకాల ఉన్న వృత్తాంతం ఒక్క సారి పరికిద్దాం. ofcourse, దీని గురించి నాకేమీ తెలియదు కానీ ఊహిస్తున్నాను..
ఈ గుడిని కదల్చడానికి ఎవ్వరైనా Govt officials ముందుగా గుడిని ప్రారంభించిన వారితో చర్చలు జరిపి ఉంటారు .. ఆ తరువాత కళాశాల యాజమాన్యాన్ని కలిసి, ఈ గుడిని నిర్మించడానికి అవసరమయిన స్థలాన్ని వారినుంచి అనుమతి పొంది ఉంటారు.. ఇక్కడ గమనించ వలసిన మరో విషయంఏమిటంటే.. ఆ కళాశాల క్రైస్థవ మత పెద్ద పేరుమీద నడపబడు చున్నది. క్రైస్థవ మత పెద్ద పేరు మీద ప్రాధ్యాన్యంగా సాగే అట్టి కళాశాల యాజమాన్యం మరో మతానికి సంభందీంచిన గుడిని కట్టు కోవడనికి.. అదీ వారి స్థలంలో .. అనుమతి నిచ్చారంటే.. వారి దయా గుణానికి సిరస్సు వంచి నమస్కరించ వచ్చు..
ఇదంతా నాణానికి ఒక వైపు అన్నమాట. మరో వైపు.. మరో పుటతో..
------------
తల నుండు విషము ఫణికిని, వెలయంగ దొరకును వృశ్చికమునకున్,
తల తోక యనక నుండును, ఖలునకు నిలువెల్ల కదరా సుమతి
తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును, ఖలునకు నిలువెల్ల విషము గదురా సుమతీ
3 స్పందనలు:
పాలిత ప్రభుత్వం - పాలించబడిన ప్రభుత్వం
పాలితవత్ ప్రభుత్వం - (గతంలో) పాలించిన ప్రభుత్వం
సంస్కృతం బదులు తెలుగు సరిపోవచ్చు.
Very interesting.
the correct poem is this:
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదురా సుమతీ
తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం గారు..
వివరించినందులకు చాలా ధన్య వాదములు.
శంకరగిరి గారు,
ఈ పధ్యం గుర్తుకు రాక దాదాపు వారం రోజులు ఈ పుట ప్రచురాణ వాయిదా పడిందంటే నమ్ముతారా? అయినా నాపిచ్చి ..మీ పిచ్చి కాకపోతే.. ఇలాంటి నీతి శతకాలు ఈ రోజుల్లో ఎవ్వరు చదువుతారు చెప్ఫండి? ఒకవేళ చిన్నప్పుడు చదివినా.. ఇప్పుడు ఎవ్వరికి గుర్తుంటాయంటారు?
ఏది ఏమైనా సరియైన పధ్యాన్ని తెలియజేసి నందులకు .. చాలా నెనర్లు..
Post a Comment