భారతావనికి వన్నె తెచ్చిన మహానుభావులు : భాగం-౧

పాత e-ఉత్తరాలు తిరగేస్తుంటే, ఒక ఉత్తరం నా కంటికి ఇంపుగా కనబడగానే.. తెలుగులోకి తర్జుమా చేసి మీ అందరికి అనువుగా ఉంటుందని ఇక్కడ ఉంచే ప్రయత్నంలో తప్పొప్పులుంటే, మన్నించగలరు. మూల పుస్తకాన్ని ఈ లింకు నుంచి పొందగలరు. ఎందరో మహానుభావులు, వారిలో కొందరు వీరు..

ఆర్యభట్ట (౪౭౬ - 476 CE) - ఖగోళ శాస్త్రాన్ని అవపోసన పట్టిన మెదటి వ్యక్తి

clip_image001

ప్రస్తుత బీహారులోని పాట్నలో క్రీ.పూ. ౪౭౬ (476 AD) జన్మించిన ఈ ఆచార్యుడు, భూమి గుండ్రంగా ఉందని, అది తన అక్షం చుట్టు తాను తిరుగుతోందని.. మెట్ట మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి. అంతేకాకుండా, సంఖ్యాక శాస్త్రంలో పై (Image:Pi-symbol.svg) విలువను దగ్గర దగ్గరగా సూచించిన మొదట వ్యక్తికూడా వీరే. వీటన్నింటినీ మించి, సున్నాకు ఒక విలువ గలదనీ, అట్టి సున్నకు విలువ కట్టడం అసాధ్యమనీ, ఈ ఆచార్యుని ప్రతిపాదనే ఈయన ఉనికిని చాటుతుంది. ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో మచ్చుకు కొన్ని..

  • భూమి చుట్టుకొలతను ౨౪౮౩౫ (24835) మైళ్ళుగా ప్రతిపాదించారు, అది ఈనాటి లెక్కకు చాలాదగ్గర. ప్రస్తుత లెక్కల ప్రకారం భూచుట్టు కొలత ౨౪౯౦౦ (24900) మైళ్ళు
  • గ్రహాణాలు వాటి వివరణ
  • సంఖ్యాశాస్త్రం.. ఎన్నో.. మరెన్నో..

రెండవ భాస్కరాచార్య (౧౧౧౪ - 1114 CE) - బీజగణితానికు ఆద్యులు

clip_image001[4]

ప్రస్తుత మహారాష్ట్రలోని జలగావు జిల్లాలో జన్మించిన ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో అతి ముఖ్యమయినవి, లీలావతీ మరియు బీజ గణితం. భూమికి గురుత్వాకర్షణశక్తి ఉంటుందని తెలియ జేసిన న్యూటన్‍కు ముందుగానే, సుమారు ఐదు వందల సంవత్సరాల క్రిందటనే భూమికి గురుత్వాకర్షకశక్తి ఉంటుందని, సూర్య సిద్ధాంతంగా ప్రతిపాదించినారు.

కానడ మహర్షి - ఆణుసిద్ధాంత కర్త

clip_image001[6]

ప్రస్తుత గుజరాత్ లోని ద్వారక లో జన్మించినట్లు వీరి అభిప్రాయం. అణు సిద్దాంతంలో జాన్ డాల్టన్ ప్రతిపాదించిన అణువులు, పరమాణువులు వంటి ఎన్నో విషయాలను వీరు, జాన్ డాల్టన్ కన్నా సుమారు రేండువేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రతిపాదించినారు. అణువు యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో వాటిల్లో రసాయనక చర్యలు ప్రతి చర్యలు ఎలా జరుగుతాయో వీరు తమ గ్రంధాలలో తెలియ జేసారు అన్నవాటికి సాక్ష్యాలు కోకొల్లలు.

నాగార్జున మహర్షి

clip_image001[8]

రసాయన శాస్త్రానికి పితమహునిగా పేరుగాంచిన వీరు, మధ్యప్రదేశ్ నందుగల బలుకా గ్రామమునందు జన్మించారు. రసాయన శాస్త్రం మరియు మూలకాశాస్త్రం లలో వీరి ౧౨ (12) సంవత్సరాలు చేసిన కృషి ఫలితమే, రస రత్నాకరం, రసృదయ మరియు రసేంద్ర మంగళం వంటి గ్రంధాలు. ఆరోగ్య మంజరి మరియు యోగాసర్ వంటి గ్రంధాలు కూడా వీరి ఙాన గుళికలే. ఆనాటి విస్వవిద్యాలయయిన "నలందా విస్వవిధ్యాలయం"లో వీరు గురుతుల్యులు.

 

మరిన్ని రేపటి పుటలో.. అంతవరకూ చదువుతూ మీ మీ స్పందనలు తెలియజేయగలరు.

2 స్పందనలు:

chandramouli said...

ఈ సంకలనం నేనుకూడా చూచాను,కాని అప్పటినుంచి ఈ విషయం తెలిసినవళ్ళందరిని అడుగుతూవచ్చను..ఏంటి? అంటార ..అక్కడికే వస్తున్నా...

ఇప్పుడు వాళ్ళు రచించిన గ్రంధాలు అన్ని ఏక్కడ ఉన్నాయి,అసలు వున్నాయా? ఈ పాటీకే,గాంధార రాజులు,తుషార రాజులు(pak and afgan) ఈపాటికే నాశనం చేశారా?

ఒక వేళ అవి పునర్ముద్రితమయి..దొరుకున్నాయి అంటే,ఎక్కడ దొరకవచ్చువంటివాటి మీద మీకు ఏమన్నా విషయాలు తెలిస్తే కొద్దిగా అది కూడా మీ జాబితాలో చేర్చగలరు అని అశిస్తూ...

చంద్ర.

Anonymous said...

Mr chandramouli,

From the year 712 AD, india was presented with and ocean of assulats. we lost many worthy things in the destruction that ensued. And now people like you are asking for proofs. we were ruled by muslims whose only aim is to convert the entire earth into islam and 300 years of british who feels that white man is great and everything else is waste.
with such great enemies it is really wonder that india ever survived.

 
Clicky Web Analytics