నాతెలుగు తల్లికి (వాడిన) మల్లెపూదండ

నేను ప్రస్తుతం ఉంటున్నది మన రాష్ట్రరాజధాని, హైదరాబాదులో. మన రాష్ట్ర భాష తెలుగు. అట్టి తెలుగుకి ఎంత దుస్తితి పట్టిందో ఒక్క సారి అవలోకనం చేసుకుందాం.

భాషాప్రయుక్త భావనపై వేరు పడి, తెలుగును ఒక వెలుగు తెచ్చిన వారందరూ ఈనాటి మన హైదరాబాదు నగర స్ంచారానికి వెళ్ళారనుకోండి, తిరిగి వచ్చి నేనింకా ఎందుకు బ్రతికి ఉన్నానని భావించి.. మన హైదరాబాదు జనాల్ని పుట్టించిన ఆ బ్రహ్మ దేవుడు కూడా మార్చలేడని తెలుకుని, మీళ మధ్య బ్రతకడం కన్నా చావడమే మేలనుకుంటారు.

నండూరి సుబ్బారావు గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, మల్లంపల్లి సోమసేఖర శర్మ గారు, కొంపల్లి జనార్దన రావు గారు, ఆధునిక తెలుగు పితామహుడిగా పేరుగాంచిన గురజాడ వేంకట అప్పారావు గారు, పైన చెప్పిన వారికి ఏమాత్రం తీసిపోని శ్రీరంగం శ్రీనివాసరావు గారు, వీరందరినీ మించిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, కవికొండల వెంకట రావు గారు, చింతా దీక్షితులు గారు అబ్బురి రామకృష్ణ రావు గారు, చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు, ఆంద్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణగారు .. ఎందరో మరెందరో మహానుభావులు కనుకా ఈరోజుల్లోని పిల్లలని చూసి ఉంటే.. మనభాషకి పట్టిన గతికి చింతించడమే కాక, తాము పడ్డ కష్టానికి.. చేసిన కృషికి లభిస్తున్న ఆదరణకి ఎంత భాధ పడేవారో ఒక్క సారి ఊహించుకోండి.

అస్సలు ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా?? నిన్నటి సాక్షి పత్రికలో చదివిన వ్యాసం కిక్కు ఇవ్వాళ్టికి నషాళానికి ఎక్కింది. ఈ మధ్య మన ప్రస్తుత అధికార ప్రబుత్వం చిన్నపిల్లలకు ఒకటవ తరగతి నుంచి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతోందట. పిల్లలకి చిన్నవయస్సు నుంచే తెలుగుని దూరం చేస్తే.. వారికి మన మాత్రు భాషపై మమకారం ఎలా పెరుగుతుంది? అభం శుభం తెలియని పిల్లలు.. అందునా పసి మొగ్గలు.. వాళ్ళు, వాళకేం తెలుస్తుంది ఏ భాష నేర్చుకోవాలి అని??? అన్నెం పుణ్యం తెలిసిన మన భుద్దికేం అయ్యింది?? ఎదో పెద్దయిన తరువాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి కాబట్టి ఇప్పటినుంచే పెద్ద పెద్ద పాఠశాలలో చిన్న చిన్న చదువులు చదివించేస్తే సరిపోతుందని అలోచిస్తున్న నేటి తల్లి తండ్రులు తప్పు చేస్తున్నారా.. లేక వాళని చూసుకుని వారు వేసే ఓట్లకోసం ఈ ప్రభుత్వం ఇంతకు బరి తెగించిందా??

ఏదైనా భాషపై పట్టు రావాలంటే మూడు మాధ్యమాల ద్వారా మాత్రమే కుదురుతుంది. అవి, మాట్లాడగలగడం మెదటిదైతే.. చదవగలగడం రెండవ దస. ఆఖరున వ్రాయగలగడం. మాట్లాడడానికైతే ఇంట్లో తల్లి తండ్రులు.. స్నేహితులు, పరిచయస్తులు.. ఇలా చాలామంది ఉన్నారు. కానీ తెలుగుని చదవడానికి మరియు వ్రాయడానికి ఉన్న ఒకె ఒక్క అవకాశం .. పాఠశాల మాత్రమే. అట్టి పాఠశాలలోనే మనం తెలుగుని విస్మరిస్తున్నామంటే... ఇక పిల్లలకు తెలుగుదనం యొక్క ఉనికి ఒక్క మాటలకి మాత్రమే మిగిలిపోతుంది. ఈ రోజుల్లోని తల్లి తండ్రులు తమ తమ పిల్లల్ని చక్కగా.. అమ్మా .. నానగారు .. అనేటటువంటి పిలుపులకు దూరంచేసి.. మమ్మీ డాడి వంటి అరువు తెచ్చుకున్న పిలుపులకు దగ్గర చేస్తున్న వైనం ఏమాత్రం హర్షణీయం??

ఇవన్నీ ఒక ఎత్తైతే.. మన రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న టికెట్ కండక్టర్లకు ఎంతమందికి తెలుగు వచ్చో ఎప్పుడైనా మాట్లాడి చూసారా?? అప్పుడప్పుడు మేము విజయవాడనుంచి వచ్చేటప్పుడు తెల్లవారుఝాము వేళలో బాగుంటుంది కదా అని బస్సు ప్రయాణం చేస్తూ ఉంటాము. నాకు ఆశ్చర్యం వేసే విషయమేమిటంటే.. వాళు అనేటటు వంటి మొట్ట మొదటి మాట.. కహా జానెకా.. (హిందిలో, ఎక్కడికి వెళాలి?). ఒకటి రెండుసార్లు భాషపై ఉన్న మమకారం చంపుకోలేక, వాళు మారరని తెలిసీ నావంతు కృషిగా వారితో మాట మాట కలిపి,వారికి అస్సలు తెలుగు వచ్చో.. రాదో.. తెలుసుకునే ప్రయత్నంలో, వాళకి తెలుగు తెలుసు అన్న చేదు నిజం తెలిసిన తరువాత నాగొంతుక మూగబోతుంది. కొంత మందైతే, తెలుగు తెలిసినా రానట్లు నటించడం చూస్తుంటే, వాళను ఏమి చెయ్యలేని నా నిస్సహాతకు నామీద నాకే అసహ్యమేస్తుంది. మరి కొందరైతే మరో అడుగు ముందుకేసి, హమ్ కో తెలుగు నహి అతాహై.. తుమ్ హిందీ మే బోల్.. అంటూ తిరిగి, రివర్స్‍లో నన్నే గదమాయిస్తూంటారు. మన ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తే, ఇట్లాంటి వాళు అలాంటి ఉద్యోగాలు చెసేవారా??? ఏమి చేస్తాం.. ఏమీ చెయ్యలేం.. చూస్తూ కూర్చోవటం తప్ప. దేవుడా.. నా తెలుగు తల్లిని రక్షించు.

9 స్పందనలు:

Purnima said...

Hmmm.. meeru cheppina daanilO point undi. maatlaadadam swatahaagaa vastundi emo... kaani chadavadam, vraayadam maatrame schools lo ne modalu avvaali. naaku ee maatram telisina telugu.. "First Language" kinda nenu nerchukunna telugu ee.

mana bhaashalO vidyanabhyasistE adi haanikaram ani manam enduku aalochistaamo naaku ardam kaadu. Alochinchaalsina vishayam.

క్రాంతి said...

టపా చాలా బాగుంది.కాని అక్షర దోషాలు లేకుండా ఉంటే ఇంకా బాగుండేది.దుస్తితి,ప్రబుత్వం,మాత్రు,భుద్ది... ఇలాంటివన్న మాట!

BHARAT said...

అయ్యా /అమ్మా ,

నాది ఒక సూటి ప్రశ్న , మీరు ఈ మధ్యమం లో చదివారు ...

తెలుగు లొనా ? ఆంగ్లం లోనా ?

ఇప్పుడు మీరు చెప్పిన వార్త లొ విషయం ఎంటంటె ప్రభుత్వ పాఠశాల ల గురించి ,అందులొ చెరేది పేద వారేనని మళ్ళీ
చెప్పకర్లెదెమొ ...వారు అంగ్లం నెర్చుకొవటం తప్పా ?

మీకు తెలుగు మీద మంచి అభిమానం ఉంది కాబట్టి మీ పిల్లలను తెలుగు మాధ్యమం లో భొదించె పాఠశాల లొనే చెర్పిస్తున్నరు కదూ ?

ఓ బ్రమ్మీ said...

అయ్యా భరత్ గారు,

మీ సూటి ప్రశ్నకు దన్యవాదములు. మొదటగా, నేను ౧౦వ (10) తరగతి వరకూ తెలుగు మాద్యమున చదువుకుంటిని. ఇక అ తదుపరి, కంప్యూటర్ తెలుగులో భోదించనందున ఆంగ్ల మాద్యమునకు మారవలసి వచ్చింది.

రెండవది, ప్రబుత్వ పాఠశలలో పేద వారే చదువుతారు అనే మీ అలోచనతో నేను ఏకీభవించను. ఎందుకంటారా.. విజయవాడలో ఉన్న కొన్ని ప్రబుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన విధ్యని అందించేవిగా ఇప్పటికీ పేరున్న పాఠశాలలు, నాకు తెలిసి షుమారుగా ౩ నుంచి ౧౦ (10) వరకూ గలవు.

ప్రస్తుత రాజధాని విషయానికొస్తే.. నాకు తెలియని విషయం నేను ప్రస్తావించను.

ఇక తమరు నా పిల్లల విషయాన్ని ప్రస్తావించారు. దురదృష్టవసాత్తు నాకు ఇంకా పిల్లలు కలుగలేదు. ఒక వేళ కలిగితే వాళ భవిష్యత్తుకై నేను వేసుకున్న ప్రణాళిక మీకు బ్లాగు ముఖంగా తెలియ జేస్తున్నాను.
మాకు జన్మనిచ్చిన తల్లిగారికి (మా అమ్మకు అన్నమాట), విజయవాడను వదిలి మాదగ్గర ఉండాలంటే, కొంచం ప్రాంతాభిమానం వల్ల నెలలో సగం రోజులు ఇక్కడ, సగం రోజులు అక్కడ ఉంటారు. అందువల్ల మాకు ఇంకా విజయవాడతో సంభందం కొనసాగుతోంది. పిల్లల విషయానికొస్తే.. వాళ్ళు ౫ (5) ఎళ్ళ వయస్సు వచ్చేంత వరకూ తల్లి దగ్గరనే ఉంచి, చదువుకునే వయ్యస్సు వచ్చెటప్పటికి విజయవాడ పంపిచ్చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు తప్పనిసరిగా ప్రబుత్వ పాఠశాలలోనే చదువుకుంటారు.

ఈ విషయంలో మీకు ఎటువంటి అనుమానాలు అఖరలేదు. మీకు నామీద అనుమానమయితే పిల్లలు కలిగిన తరువాత ఐదు సంవత్సరాలకు మళ్ళీ నన్ను కలవండి. అంతవరకూ అపనమ్మకాలకు దూరంగా ఉండమని బ్లాగు ముఖంగా ప్రార్దన.

oremuna said...

నాక్కూడా ఇంకా పిల్లలు లేరు :) కాకుంటే పిల్లలు కలిగితే మాత్రం శుభ్రంగా ఇంగిలీషు పీసే!!!! పీర్ ప్రెజర్ :( అంతే పోష్గా అంతే క్వాలిటీతో తెలుగు మీడియం స్కూల్ ఉంటే అప్పుడు ఆలోచిస్తాను.

ఓ బ్రమ్మీ said...

చావా కిరణ్ గారు,

మెదటగా, మీకు తొందరలో సంతాన ప్రాప్తి కలగాలని ఆ పరమశివుని ప్రార్దిస్తాను.

రెండవది, పాష్‍గా ఉంటేనే చేర్పిస్తాను అనడం అంతగా సమంజసం కాదేమో. అంత క్వాలిటి కావాలంటే, ఒక్కసారి వీలుచూసుకుని, విజయవాడ దర్సించగలరు. మీకు అంతర్జాతీయ స్థాయి కాకపోయినా జాతీయ స్థాయికి ఏ మాత్రం తీసుపోని పాఠశాలలు గత ౨౫ (25) సంవత్సరాలకు పైగా నిరంతరంగా విధ్యాదానం చేస్తున్నాయి.

ఆలోచించగలరు.

కొత్త పాళీ said...

అర్రె, మీరూ మా విజయవాడే!
విజీవాడా జిందాబాద్!!

Anonymous said...

తెలుగు భాషని వ్రాయడము చదవడము వచ్హిన వారికి మాత్రమె ఆంధ్రప్రదేష్ ఉద్యొగము అని జి.ఓ. జారి చేయాలి

Valluri Sudhakar said...

ఏది ఎమైనా, మన బెజవాడ వాళ్ళందరికి, మాతృభాషమీద మమకారం ఎక్కువండి.

...వల్లూరి.

 
Clicky Web Analytics