ఆహా .. ఏమి పరిణామము, ఎంతటి శుభవార్త

గూగుల్ గుంపులలో ఉద్యోగ వార్తల నిమిత్తం it-consult​ing-us-sta​ffing అనే పేరుతో ఓ గుంపు నడుస్తోంది. ఈ గుంపు నందు ఎక్కువగా ఉద్యోగ అవకాశాల గురించి వివరిస్తూ ఉంటారు. దాదాపుగా ఎక్కువశాతం అవకాశాలు అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఉండే సంస్థలకు సంబందించినవై ఉంటాయి. అలాంటి చోట ఇవ్వాళ్ళ నాకు ఆశ్చర్యపరచే విధంగా ఓ ప్రకటన కనబడింది. అదేమిటంటే..

Topic: Requirements for SQL Server Developer,Teradata Developer :Vijayawada

ఇలాంటి ప్రకటన ఇలాంటి చోట ఇవ్వడం ముందుగా కొంచం అతి చేసినట్లు అనిపించవచ్చు. కానీ ఈ ప్రకటన ఇచ్చిన వారి వెబ్ సైట్ మరియు వారి వివరాలు చూసిన తరువాత ఈ ప్రకటన వెనకాల ఎంతో కొంత నిజాయతీ ఉండకపోదు అనిపించింది. ఇక్కడ నన్ను ఆశ్చర్య పరచిన మరియు సంతోషానికి గురిచేసిన విషయాలు..

మొదటిది, విజయవాడ కూడా సాఫ్ట్ వేరు నిపుణలకు అవకాశాలనిస్తున్నది అని.

రెండవది, విజయవాడ లాంటి చిన్నపట్టణంలోని ఓ సంస్థ అంతర్జాతీయ స్థాయికెదిగి ఆ స్థాయిలోని నిపుణలకు అవకాశాలిస్తామంటూ ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పడం. ఇవన్నీ చూడబోతే సాప్ట్ వేరు రంగం తొందరలో విజయవాడలో ఓ వెలుగు వెలగబోతున్నట్లు కనబడుతోంది. ఆహా, ఆలోచనే ఎంతటి హాయినిస్తోంది. ఇవన్నీ కనుక జరిగితే, చక్కగా నాలాంటి వాడు జీతం తక్కువైనా మావూరు చేరుకుంటారు.

ముంగించే ముందు ESS సంస్థ వారికి ఇలాంటి అవకాశాలు ఇస్తున్నందులకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ వీరు మరింతగా అభివృద్ది చెంది మరింత ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలిస్తే భారతదేశంలో విద్వత్తు ఉన్న యువత పరదేశ మోజులో పడి మాతృదేశానికి దూరం కాకుండా చేసిన వారౌతారని ఆశిస్తున్నాను.

6 స్పందనలు:

Anonymous said...

అంతకంటే కూడా "విజయవాడ చిన్నపట్టణం" అనే మాట జీవితంలో మొదటిసారిగా చదివి ఆశ్చర్యపోతున్నాను. 12 లక్షల జనాభా గల ఆ మెగాలో-పోలిస్ చిన్నపట్టణమా ?

చక్రవర్తి said...

అఙ్ఞాత గారు,

మీ అభిప్రాయం అర్దం అయ్యింది. జనాభాలో పెద్దదైనా, సాప్ట్ వేర్ పరంగా ఇది చిన్న పట్టణమే అని నా అభిప్రాయం.

ఏమైనా స్పందించినందులకు నెనరులు.

Anonymous said...

సాఫ్టువేరు సంగతి అలా ఉంచుదాం. ఆ మాటకొస్తే దేశంలో సాఫ్టువేరు విజయవాడ కంటే పెద్దనగరాల్లో కూడా లేదు. అసలు - బెజవాడఊరు కూడా వైశాల్యంలో చాలా పెద్దది. హైదరాబాద్, విశాఖల తరువాత అదొక్కటే రాష్ట్రంలోకెల్లా పెద్ద నగరం.

చక్రవర్తి said...

రెండొవ అఙ్ఞాత గారు,

విజయవాడపై మీకున్న అభిమానానికి నేను సంతోషిస్తూ, విజయవాడని చిన్న పట్టణం అని వ్రాసినందులకు తప్పైందని బ్లాగు పరంగా విన్నవించుకుంటున్నాను. ఈ తప్పును మన్నించి నన్ను క్షమించ మనవి.
విజయవాడ మన ఆంద్రప్రదేశ్ లోని మూడవ పెద్ద నగరం అని తెలియజేసినందులకు నెనరులు. ఇలాగే స్పందిస్తూ నాకు తెలియని వివరాలను తెలియ జేస్తూ ఉండండి.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అధికారికంగా పదహారున్నర అనధికారికంగా పాతిక లక్షల జనాభా ఉన్న వైజాగ్ ను మరి మేమింకా చిన్న పట్టణమనే అంటున్నాం మరి ???

చక్రవర్తి said...

రాంజేంద్ర గారు,

వైజాగ్ గురించి నేను స్పందించలేను, ఎందుకంటే, వైజాగ్ గురించి నాకేమీ తెలియదు. ఏదైనా స్పందించినందులకు నెనరులు.

 
Clicky Web Analytics