తెలుగు బ్లాగర్లకు - మరో నిజం


"తెలుగు బ్లాగర్లందరికీ ఓ శుభవార్త" అంటూ నేను ప్రచురించిన పుటకు ఓ నలభై మంది తెలుగు బ్లాగర్లు దేశం లోని పలు ప్రాంతాలనుంచి వారి వారి చిరునామాలు ఇచ్చి ఉచితంగా కంప్యూటర్ విజ్ఞానం వారి జనవరి నెల పుస్తకాన్ని పొందారు. అందరూ పొందారు అని తెలియ జేయకపోయినా ఒకరిద్దరు తెలియజేసారు. అందరికీ ఒకే రోజు డిటిడిసి ద్వారా పంపబడ్డాయి కాబట్టి ఒకరిద్దరికి అందినా అందరికీ అందే ఉంటుందని నా అభిప్రాయం. ఇక అసలు విషయానికి వస్తే, నేను ఈ పుట ద్వారా ఒక నిజాన్ని మరియు ఒక విన్నపాన్ని చేయదలుచుకున్నాను.

నిజం ఏమిటంటే..

ఉచితంగా పుస్తకం ఇస్తాము అంటే, ఎందుకు ఇస్తున్నారు? దీని వెనుక చక్రవర్తికి వచ్చే లాభమేమిటి? అది ఇది కాకుండా, సదురు కంప్యూటర్ విజ్ఞానం వారికి లాభమేమిటి? ఇదంతా హంబక్కేనా లేక మరో రకమైన కుటిల మార్కెటింగ్ ప్రయత్నమా? ఇలా పలు పలు ప్రశ్నలు వేసి కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేసిన వారు చాలామంది. ఇక్కడ వారి ప్రస్తావన అనవసరం అలాగే ఎవ్వరినీ నేను కించ పరచే ప్రయత్నమూ చెయ్యటం లేదు. కానీ ఒక్క విషయమేమిటంటే, ఈ ప్రయత్నం లాభాపేక్షలేనిది. ఈ ప్రయత్నం ఎందుకు జరిగిందంటే.. సదురు కంప్యూటర్ విజ్ఞానం యాజమాన్యం మమ్ములను హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో కలిసింది. తెలుగు భాష పట్ల eతెలుగు సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించి, ఇలా తెలుగులో వ్రాసుకునే వారికి గౌరవ పూర్వకంగా ఓక నెల పత్రిక ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ప్రతి నెల ఓ ఇద్దరు తెలుగు బ్లాగర్ల గురించి మరియు వారు చేస్తున్నటువంటి బ్లాగు గురించి ప్రచురిస్తే బాగుంటుందని మాతో సంప్రదించారు. అందులోని మొదటి ప్రయత్నంగా నేను చేసిన విన్నపానికి లభించిన స్పందనను గమనించిన కంప్యూటర్ విజ్ఞానం యాజమాన్యం విస్తుపోయి తెలుగు బ్లాగర్ల గురించి ప్రచురించే విషయాన్ని మానుకున్నారు.

విన్నపమేమిటంటే..

ఉచితంగా అందుకున్న వారు, దయచేసి మొదటిగా మీ బ్లాగులో ఈ అవకాశం మీకు నిజ్జంగా ఉచితంగానే లభ్యమైందనిన్నీ.. అందుకు మీరు సంతోషంగా ఉన్నట్లైతే సంతశించినట్లుగా లేకపోతే లేనట్లుగా తెలియ జేయమనవి. అంతే కాకుండా, ఈ పుస్తకాన్ని చదివిన తరువాత ఈ పుస్తకానికి మరింత సోభ చేకూరాలంటే ఏమి చేస్తే బాగుంటుందో అనేటటువంటి మీ అమూల్యమైన సలహాలు లేదా సూచనలు లేదా ఫిర్యాదులు లేదా మరేదైనా మీ బ్లాగులో ఓ పుట ప్రచురించమనవి.

నా ఈ మనవి మన్నించి సలహాలు సూచనలు తెలియజేయడం మరువకండి

సెహ్వాగ్ సెంచరి చెయ్యలేడు

 

VS

భారత మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య నాగపూర్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మాచ్ మూడవరోజు ఓపెనర్ సెహ్వాగ్ సెంచరీ చేశాడు. బాగుంది. కానీ నా ఈ శీర్షిక ఏమి చెబుతోందంటే, మన సదురు దుడుకు బ్యాట్స్ మెన్ బాగా బౌలింగ్ వేశే దేశాలన్నింటినీ ఉతికి ఆరేశాడు కానీ, పసికూనలైన బంగ్లాదేశ్ మరియు జింబాబ్వేలపై మాత్రం ఒక్క సెంచరీ చెయ్యలేక పోయ్యాడు. ఎందుకంటారు?

నా ఉద్దేశ్యంలో అతనొక అద్బుత ఆటగాడు. ఆటలోని మెళుకువలు తెలిసిన వాడు. తెలివైన బౌలర్లు వారి అనుభవమంతా వారి బౌలింగ్ లో చూపిస్తారు. అలా వారి నైపుణ్యాన్ని వైవిధ్యమైనటువంటి బంతుల ద్వారా వారు విసురుతూ ఉంటారు. అలాంటి బంతులు విసరడంలో చేయి తిరిగిన మహా మహాలును అవలీలగా ఎదుర్కొన్న మన హీరో గారు అనుభవరాహిత్యంతో ఉన్న బంగ్లాదేశ్ లేదా జింబాబ్వే ఆటగాళ్ళపై ఎందుకని చేయ్యలేకపోయ్యాడంటే, బౌలర్లు తెలివిగా బంతులు విసరకపోవడమే..

మీరేమంటారు .. ??

ఓయ్ సినిమా మాతృక

ఈ మధ్య కొంచం ఖాళీగా ఉండటం వల్ల, HBO ఛానెల్ బాగా వంట పట్టింది. అదిగో అలాంటి దాని వల్ల తెలిసిన ఒక నిజం ఓయ్ సినిమా హాలీవుడ్ సినిమా నుంచి కాపో కొట్టారని. అప్పుడెప్పుడో ఒక సారి ఓయ్ సినిమాపై నా అభిప్రాయాన్ని ఓ పుటగా ప్రచురించి నట్టు గుర్తు. చూడబోతే ఓయ్ చాలా నచ్చేశింది. కానీ దాని ఒరిజినల్ మాతృక దీనికన్నా చించేసింది. గుండెల్ని పిండేశింది.
నాకు కియాను రీవీస్ ఇలాంటి సినిమాలు కూడా చేస్తాడా అనిపించింది. ఈ సినిమాని నేను మొదటి నుంచి చూడలేదు, ఏదో అలవోకగా ఛానల్స్ మారుస్తూ ఉంటే HBO వచ్చింది. అందులో మన హీరో కనబడ్డాడు. నాకు ఈ హీరో అంటే ఓ రకమైన సాఫ్ట్ కార్నర్ ఉంది. కొంచం సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీస్తాడు అలాగే నటిస్తాడు అని. సరే ఇదికూడా మరో సైన్స్ ఫిక్షన్ సినిమా అయ్యుంటుందని చూడటం మొదలు పెట్టాను. ఆ సున్నితమైన సంభాషణలు, ఆ సున్నితమైన భావాలు, ఆ ముఖ కవళికలలో దొర్లిన రశనుభూతులు.. అహా.. చెప్పనలవి కాదనుకోండి.

కధలోకి వస్తే, హీరోయిన్ గారికి కాన్సర్. తాను చనిపోతానని తనకు తెలుసు. చనిపోయేలోగా తనకు ఇష్టం వచ్చినట్లు బ్రతకాలని కోరిక. ఇంతలో మన హీరో గారు కలుస్తారు. మన హీరో గారికి ఉద్యోగం ఉండదు. తన స్నేహితుడితో కలసి ఏవో ప్రయత్నాలు సాగిస్తుంటాడు. అదిగో అలాంటప్పుడు మన హీరోయిన్ గారితో పరిచయం, బ్లా .. బ్లా.. తరువాత మన హీరోయిన్ గారు జబ్బు పడ్డారన్న విషయం తెలియడం, హీరోయిన్ కి హాస్పటల్ లో ఉండటం ఇష్టం లేక ఇంటికి రావడం అన్నీ జరిగిపోతాయి. ఈ కధలో మరో చిన్న ట్విస్ట్. తండ్రి లేని ఓ చిన్న పిల్లవాడు. ఈ పిల్ల వాడు ఆఖర్లో మన హీరో గారిని చర్చికి తన తండ్రిగా రమ్మనడం, మన హీరో గారు వెళ్ళడం, వంటి సీన్లు బాగా పండాయి.

నాకు సినిమాలు ధుఃఖాంతం అయితే నచ్చదు. అందుకు భిన్నంగా ఈ సినిమా క్లైమాక్స్ చాలా సున్నితంగా తీసి లలిత మైన భావనతో ముంగించడం ఈ సినిమాకే హైలేట్. వీలైతే మీరు కూడా చూడండి

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

సెక్స్ నిర్వచనం

ఓ మునివర్యుడు ఇలా నిర్వచించాడు..

భార్యతో చేసినప్పుడు అది ఒక .. భాద్యత

ప్రియురాలితో చేసినప్పుడు అది ఒక .. కళ

భర్మచారి(ణి)తో చేసినప్పుడు అది ఒక .. పాఠం (ఎలా చేయ్యాలో నేర్పించే విధానం)

వ్యభిచారితో చేసినప్పుడు అది ఒక .. వ్యాపారం

విధవరాలి
తో చేసినప్పుడు అది ఒక .. దాతృత్వం

--
తో చేసినప్పుడు అది ఒక .. త్యాగం

(Fill in the blanks)
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

తెలుగు బ్లాగర్లందరికీ ఓ శుభవార్త



తెలుగులో బ్లాగే వారందరికీ ఈ నూతన సంవత్సర కానుకగా కంప్యూటర్ విఙ్ఞానం వారు జనవరి నెల పుస్తకాన్ని ఉచితంగా మీ ఇంటికే పంపే ఏర్పాటు చేసారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిన వారు చెయ్యవలసినదల్లా.. మీ బ్లాగు పేరు మరియు మీ ఇంటి పోస్టల్ అడ్రసుని నాకు పంపించడమే. ఈ సదవకాశం ఫిబ్రవరి నెల పత్రిక వచ్చే లోపులే అని గమనించగలరు. కావున ఈ నెల ఇరవయ్యో తారీఖులోపుల మీ చిరునామాలను నాకు పంపండి. మర్చిపోవద్దు...

జనవరి నెల పత్రికతో ఉచితంగా బ్లాగుల గురించిన ఒక చిఱు పుస్తకాన్ని మరియు సిడీని ఇస్తున్నారు. నా మైల్ ఐడీ dskcheck@gmail.com


-------------------------------------------
అనగ అనగ రాగ మదిసయల్లు చుండు, తినగ తినగ వేము తియ్యనుండు,
సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వధా అభిరామ వినురవేమ

 
Clicky Web Analytics