ఓయ్ – నా అభిప్రాయం


నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం చాలా ఛూజీగా ఉంటాను. అలా నేను చూద్దాం అనుకున్న ఓ సినిమా ’ఓయ్’. నేనేదైతే చూద్దాం అనుకుంటానో ఆ సినిమా చాలా చెత్తగా బోరింగ్ గా ఉంటుంది అని సినీ జనాలు అంటారు. అలాగే కొన్ని కొన్ని బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టి నష్టాలతో వారం రోజులు కూడా ఆడలేదనేది నిజం. కానీ ఎందుకో నాకు అలాంటి కధలే ఆకట్టుకుంటాయి. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, నాకు నచ్చడానికి అక్కడ కధ ముందుగా తెలియాల్సిన అవసరం లేదు. అలా కధ తెలియ కుండా నచ్చిన సినిమా ఓయ్. ఈ సినిమా నచ్చడానికి ఉన్న ఒకే ఒక్క కారణం ఈ సినిమా టాగ్ లైన్. His first love called him Oye..


ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు
౧) అశ్లీలం లేకపోవడం
౨) డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకపోవడం
౩) కుటుంబ సమేతంగా చూడడానికి అనువైన వాతావరణం
౪) కొన్ని కొన్ని సన్నివేశాలు అచ్చంగా హీరో హీరోయిన్ల మధ్య జరిగినట్లుగా చిత్రీకరించడం, కానీ వీరిద్దరూ వారి వారి స్నేహితులుతో మాట్లాడుకోవడం కధనం
౫) కొన్ని కొన్ని సందర్బాలలో వయస్సులో ఉన్న యువత ఎలా ఆలోచిస్తారో చాలా బాగా చూపించడం


ప్రతీ సినిమాలోని కొన్ని నచ్చని అంశాలు ఉంటాయి. అలాగే ఈ సినిమాలోని నచ్చని అంశం


హీరోయిన్ చావు కాకపోయినా, హీరో పుట్టిన రోజు బహుమతులు ఇస్తూ టీ కప్పులో వేడి తేన్నీరు కాలేక పోయ్యాను అని చెప్పడం చాలా హృదయ విదారకంగా ఉంది. కొన్ని విషయాలు ఇల్లాజికల్ గా అనిపించినా, వాటిల్ని మనం కధలో భాగంగా తీసుకుని లైట్ తీసుకోవాలి. ఉదాహరణకి వైజాగ్ నుంచి కాశీకి ఓడలో వెళ్ళడం, దిష్టి బొమ్మలో డబ్బులు ఉండటం, ఇద్దరు ఎక్కి తక్కువ దూరాలకు ప్రయాణించ గల ఓ చిన్న హెలికాఫ్టర్ కాశీనుంచి వైజాగ్ వరకూ రావడం, ఓడపై రియల్ ఎస్టేట్ వ్యాపారం, సునీల్ పాత్ర, ఇలా అనవసరమైనవి కొన్ని ఈ సినిమా దివాళాకు కారకాలు.


ఏది ఏమైనా, ఈ సినిమా తప్పని సరిగా చూడదగ్గ సినిమా. కధ పరంగా చాలా పట్టు ఉన్న సినిమా, కధనం మరియు చిత్రీకరణ నాకు బాగా నచ్చాయి. పాటలు కూడా ఒక్కసారి వినొచ్చు అనేటట్టుగా ఉన్నాయి. నా వ్యక్తిగత కలక్షన్స్ లోకి ఈ చిత్రం చేరుతుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

2 స్పందనలు:

IMCurtain said...

Lovely post! Dropping by...

p/s: We would like to invite all of you to join our blogging community which helps you to get more visitors to your blogs. It's totally free and you get the chance to meet other celebrity bloggers. Visit us at Free Blog Traffic

Vimal said...

చక్రవర్తి గారు, మీ అభిప్రాయం చాలా చక్కగా తెలిపారు, మీకు ఏ కారణాల వల్ల ఆ సినిమా నచ్చిందో నాకు కూడా అందుకే నచ్చింది.
సినిమా ఫ్లాప్ కి మీరు చెప్పిన కారణాలు కూడా నిజమే కావొచ్చుకాని, సినిమా లో హీరో హీరోయిన్ ని ఒకేలా సాధారణంగా చూపిస్తే జనాలకి విసుగు వస్తుందేమోనని కాస్త స్టఫ్ఫ్ కోసం పెట్టాడు ఆ సీన్స్ అన్నీనూ.

ఛత్రపతి లోని ఒక కార్కెటర్ ని పెట్టి అతనిని మంచి వాడిలా చూపించడానికి బొమ్మలో డబ్బులు, కమీడియన్స్ ని పెట్టి హాస్యం చూపించాలని రియల్ ఎస్టేట్, ఇలా రకరకాల కారణాల వల్ల అలాపెట్టాడేమో అని నా అభిప్రాయం, సినిమా దివాలకి అవి కారణాలు కావేమో, ఆ సినిమా కి తగిన ప్రచారం జరగలేదు, హీరోయిన్ మొదటి సినిమా లోనే చనిపోయింది, ఇలాంటివి ఏవైనా కారణాలు కావొచ్చని నా ఊహ!

 
Clicky Web Analytics