పద్దతీ పాడు లేని జీవనం

 

మరో ఉదాహరణ. ఇది కొంచం పచ్చిగా ఉండవచ్చు. కానీ చదువరుల విచక్షణా ఙానానికి వదిలేస్తాను. వారు ఏది చెప్పినా తప్పులేదు. ఎందుకంటే వారి వారి అభిప్రాయాలు వారి వారి స్తితి గతుల నుంచి ఉద్వవించినవి కనుక.

ఆరోజు కొంచం తొందరగానే నిద్ర లేచాను.. అందువల్ల రోజూ జరిగే పనులన్నీ అనుకున్న సమయాని కన్నా కొంచం ముందుగానే జరిగి పోయాయి. అలాగే బస్ స్టాప్ కి కూడా ఓ పావు గంట తొందరగా చేరుకున్నాను. మా కార్యాలయానికి వెళ్ళే బస్సు ఎనిమిది గంటల ముప్పై అయిదు నిమిషాలకి వస్తుంది. ఓ పావు గంట ముందుగానే వచ్చాం కదా .. ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తుండగా.. మైలున్నర దూరంలో ఉన్న కార్యాలయానికి నడిచి వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. సరిలే.. నడిస్తే ఆరోగ్యానికి మంచిదే కదా అనుకుంటూ.. చెవులకు హెడ్ సెట్ తగిలించుకుని.. సంగీతాన్ని మంద్ర స్తాయిలో ఉంచి నడక మొదలు పెట్టాను. మామూలుగా బస్సులో వెళితే, ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ మూలంగా ప్రతి రోజూ పదిహేడు నిమిషాలు అవుతుంది. ఆరోజు నడుచుకుంటూ వస్తే, ఇరవై ఏడు నిమిషాలైంది. అలాగే ఒళ్ళు కూడా కాస్త అలిసింది. దాని వల్ల ఉదయం త్రాగిన బోర్నవీటా పాలు కాస్తా కరిగి చమట రూపంలో విసర్జించ బడినది.

కార్యాలయానికి చేరుకునేటప్పటికి దాదాపుగా తొమ్మిది కావచ్చింది. అలసి ఉన్నానేమో లేక ఒంట్లో నీటి శాతం తగ్గడం వల్ల కాసిని నీళ్ళు పట్టించేసాను. రోజూ మామూలుగా త్రాగే రెండు లీటర్ల నీటికి తోడు మరో ముప్పావు లీటరు నీరు శరీరం లోకి అదనంగా చేరుకుంది. అంతే.. పది గంటలకు అటూ ఇటూగా మూత్ర విసర్జన చేయ్యవలసి వచ్చింది. సరే .. దానిదేముంది.. ఆఫీసే కదా, ఎన్ని సార్లు పోతే ఎవ్వడైనా లెక్క పెడతాడా ఎవ్వడేమంటాడులే అని మెల్లగా మూత్రసాల వైపు అడుగులేసా. జనరల్ గా అన్ని ప్రదేశాలు క్లోజ్‍డ్ గా ఉంటాయి.

మా మూత్రసాల దాదాపుగా వెయ్యిగజాల వైశాల్యంలో కట్టి ఉంటారు. కాబట్టి మనకు మూత్రసాల నుంచి ఎటువంటి దుర్ఘందం రాదు అనుకుంటూ లోపలికి అడుగు పెట్టిన నాకు ఒక్క సారిగా అపాన వాయువు ముక్కు పుటాల్ని తాకింది. అనుకోని ఆ వాసన నన్ను ఒక్కసారిగా మతి పోగొట్టేంత పని చేసింది. అదేదో సినిమాలో హీరోగారు రౌడీని గట్టిగా పీకి, "ఎవ్వడు కొడితే {మధ్యలో మిస్సయింది}, వాడే పండుగాడు.." అంటాడు. అప్పుడు ఆ రౌడీకి ఎదో అయిన్నట్లు అయింది నా పరిస్తితి. ఒక్క సారి బుర్ర పని చెయ్యడం మానేసింది. దిమ్మ తిరిగి ఒక్క సారిగా తూలి పడబోయి ప్రక్కనే ఉన్న గోడని ఆనుకుని నిలదొక్కుకున్నా. ఇంత గందర గోళంలో ఎలాగోలా వచ్చిన పని కానిచ్చి, హమ్మయ్య .. అనుకుంటూ బయట పడ్డాను. మరో అరగంటలో మరొసారి మూత్రసాలను దర్సించ వలసిన అవసరం వచ్చింది.

ఈ సారి ముందు జరిగిన అనుభవాన్ని ఙ్ఞప్తికి తెచ్చుకుంటూ, ముక్కుకి గుడ్డ కట్టుకుని మెల్లగా అందులోకి ప్రవేశించాను. ముక్కుకి ఉన్న గుడ్డ మూలంగానో .. ఏమో.. ఈసారి అంత ఘాటుగా అపాన వాయువు తగల లేదు. నేను ఉన్నానని మాత్రం తెలుస్తూనే ఉంది. కాకపోతే ఈసారి అనుభవం ఈ పుటకు మూలం. వెయ్యిగజాల స్థలంలో నిర్మించిన మూత్రసాల ఎంత పెద్దగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అందులో దాదాపుగా ఓ ఇరవైఐదు మల విసర్జన ప్రదేశాలు నిర్మించి ఉంటారు. వాటన్నింటికీ ప్రక్కగా మూత్ర విసర్జన చేసే అవకాశం కలిపించారు. అదిగో అప్పుడు మరో అనుభవం. ఒక్కొక్క మల విసర్జనా చోటునుంచి, అపాన వాయువు వదిలేటప్పుడు వచ్చే శబ్ధాలు, ఈసారు చెవులకు ఉన్న తుప్పు వదిలించాయి. ఒక్కొక్కడూ మరొకడిని మించి పిత్తుతున్నారు. నేను గట్టిగా శబ్దం చేసానంటే, నేను చేసానంటూ పోటీ పడి మరీ చేస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే.. క్షమించాలి .. వింటూంటే.. పిత్తుల పోటీ కనుక పెడితే, వీళ్ళని మించిన వాడు ఎవ్వడూ లేడనిపిస్తుంది. ఇక లాభం లేదని పరుగు పరుగున బయటకు చేరుకున్నా.

మూత్రసాలలో కొంచం రూమ్ ఫ్రష్‍నర్ కొడతారేమో అని అడగడానికి తలచి, భవన సముదాయం మైన్‍టైన్ చేసే వారి వద్దకు వెళ్ళి అసలు విషయం చెప్పకుండా, ’ మూత్రసాలలో కొంచం రూమ్ ఫ్రష్‍నర్ కొట్టండి ..’ అన్నా. పదకొండున్నరకు ఎగ్జాస్ట్ వేస్తాము అంతవరకూ ఇంతే, తరువాత పన్నెండు గంటలకు, మొదటిసారి రూమ్ ఫ్రష్‍నర్ కొడతాం, రెండవ విడతగా నాలుగు గంటలకు, మలి విడతగా రాత్రి తొమ్మిది గంటలకు కొడతాం, తప్పితే, మధ్యలో కొట్టం అని కరా ఖండీగా చెప్పెసారు. ఇదంతా మాకు మామూలే. ఇది ప్రతి రోజూ ఉండే ప్రవసనమే అని వాళంటూటే, "ఏడిసారు, చచ్చినోళ్ళు..", అనుకుంటూ మెల్లిగా నా సీటుకు చేరుకున్నాను. అదే మేమైతేనా... అంటే నా ఉద్దేశ్యంలో మా ఇంట్లో పెరిగిన వాళైతేనా అని. ఉదయానే నిద్ర లేవంగానే, పళ్ళుతోమావా.. దొడ్డికెళ్ళావా.. స్నానం చేసావా.. అంటూ కాలకృత్యాలు అన్నీ ఆయేంత వరకూ వదిలేవారు కాదు. మల విసర్జన రోజులో ఉదయం వేళ్ళల్లో తప్పితే మరి ఇంకొక సారి చేసే వాళ్ళం కాదు. అంటే అంతగా తినే వాళ్ళం కాదు, అలాగే అన్ని సార్లు వెళ్ళవలసిన అవసరం వచ్చేదీ కాదు అని అర్దం. ఒక వేళ్ళ వెళ్ళవలసి వచ్చినా, ఎదో శరీరంలో సుశ్తి చేసో లేక ఆరోగ్య పరిస్థితి మారో లెక జీర్ణావస్థ సరిగా పని చెయ్యక విరోచనాలు ఆయ్యెవే కానీ ఇలా వేళకాని వేళ్ళల్లో చోటు కాని చోట్లలో వెళ్ళే అలవాటు కాలేదు. వీళ్ళకేమో ఎక్కడ పడితే అక్కడ .. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎలా పడితే అలా.. ఏమి పద్దతో!! ఏమిటో!! మాయాలోకం..

ఇది జరిగిన తరువాత కొంత కాలానికి, సహోద్యోగులతో కలసి మందు కొట్టడానికి బారు కెళ్ళాం. అప్పుడు ఈ ప్రస్థావన వచ్చింది. నా అభిప్రాయం తెలియ జేసాను. వాళ్ళలో తెలియని స్పందన కొట్టొచ్చి నట్లుగా కనబడింది. మెల్లగా ఒక్కడొక్కడూ బయట పడడం మొదలు పెటాడు.

ఒకడంటాడు, సింహాలు పులులు ఉదయానే బహిర్బూమికి వెళతాయా!!
మరొకడు, ఏం.. ఇంట్లోనే వెళ్ళాలా.. బయట వెళ్ళకూడదా!!
ఇంకొడు.. అదేం లెక్క.. ఎప్పుడూ ఉదయానే వెళ్ళాలా.. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదా!!

వీళ్ళతో వాదించడం కాలాయాపన అలాగే సుద్ద వేస్టు అనుకుని, మా సంభాషణని మెల్లిగా మరో అంశంలోకి మార్చేసాను. కానీ నా అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

పులులు సింహాలు ఎక్కడ పడితే అక్కడ బహిర్బూమికి వెళతాయి, మరి తమరెందుకు మూత్రసాలకే వచ్చి వెళుతున్నారు అని మొదటి వాడిని ప్రశ్నించాననుకోండి వాడేమి చెబుతాడో..

ఇంట్లోనూ.. బయట .. ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళవచ్చు. తప్పులేదు, కానీ కార్యాలయంలో మూత్ర సాల కట్టింది అనుకోని సమయంలో ఎప్పుడైనా యాదృశ్చికంగా వెళ్ళవలసి వస్తే ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా అనేది యాజమాన్యం అభిప్రాయం. అంతే కానీ ఉద్యోగులంతా ఇళ్ళలో వెళ్ళకుండా ఇక్కడే వెళతారనేది కాదు కదా.

ఇక ఆఖరివాడి విషయానికి వస్తే.. జీవితం అన్న తరువాత ఒక పద్దతీ పాడూ అనేవి ఉంటాయి. ఎక్కడ చెయ్యాల్సిన పనులు అక్కడే చెయ్యాలి. సరసాన్ని నాలుగు గోడల మధ్యే చెయ్యాలి అనేది సమంజసం. కానీ కుక్కల్లాగా మనుషులు కూడా రోడ్డు మీదే శృంగారం సాగించి, తప్పు లేదు అని సమర్ధించుకునే సమాజంలో బ్రతుకుతున్న వీళ్ళకి ఏది ఎక్కడ చెయ్యాలో ఎవ్వరు చెబుతారో.

ఏమిటీ ఈ తరహా వర్క్ సంస్కృతి

నేను ఈ మధ్య వృత్తి రీత్యా అమెరికాలో ఉన్నాను కదా.. కొన్ని కొన్ని విషయాలు అసహ్యాన్ని కంపరాన్ని కలిగిస్తున్నాయి. వాటిల్లో ఇవిగో కొన్ని.

శుచి సుబ్రం - భారత దేశంలో మాకు నేరిన అలవాటు


ఉదయానే లేవంగానే పళ్ళు తోముకోవడం అలవాటు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే.. దాదాపుగా చిన్నప్పటి నుంచి పళ్ళు తోము కోందే మాట్లాడ వద్దేనేవారు. ఉదయానే పళ్ళు తోము కోవడం .. కళ్ళల్లో పుసులు తీసు కోవడం .. నాలుక గీకడం వంటివి .. ఎప్పుడైనా మర్చి పోయ్యాము అనుకోండి, పోలీస్ కుక్క వాసన పసిగట్టినట్లు ఎవరో ఒకరు పసిగట్టేశే వారు. అంతే, ఓ పది నిమిషాలు ఏక బీకిన తిట్లు చీవాట్ల దండకం. వాళ్ళ దండకం పడలేక చట్టుక్కున బాత్ రూమ్ లోకి దూరేశి ఓ పది నిమిషాలు బ్రష్ తో కుస్తీ పడి, అంతా అయ్యింన తరువాత తిట్టిన వాళ్ళ దగ్గర కెళ్ళి .. ఈ.. అంటూ పళ్ళన్నీ కనబడేటట్టు చూపించేత వరకూ వదిలే వారు కాదు.

 

ఇలా అలవాటై .. ఇక్కడికి వచ్చాక.. ఇక్కడ నాతో పని చేసే వాళ్ళ ప్రవర్తన చూసాక. మన సాంప్రదాయమే వీరి కన్నా కోటి రెట్లు మెరుగు అనిపిస్తోంది.

 


శుచి సుబ్రం - అమెరికాలో నేను గమనించిన అలవాటు

 

పనిలో తీవ్రంగా మునిగి ఉండగా ఏదో దుర్గంధం ముక్కు పుటాలకు తాకింది. ఏమిటా అని ఒక తల పక్కకు త్రిప్పితే, నాతో పనిచేసే సహ ఉద్యోగి. ఏదో పని పడింది. అడగడానికి వచ్చాడు. వాడు నోరు తెరిచినప్పుడల్లా దుర్ఘంధం ముక్కు పుటాల్ని చీల్చి చెండాడుతోంది. చికాకుగానే సమాధానమిచ్చి, వాడితో వేగే ఓపిక లేక, ఏవైనా సంధేహాలుంటే మెయిల్ చెయ్యమన్నాను. అదికాదూ .. అంటూ ఏదో చెప్పబోయాడు.

 

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో చూడలేదు, మరో అమెరికన్. వీడు వాడు కలిసి మెల్లిగా జారుకున్నారు. కడుపులో దేవుతూ ఉన్నట్లు ఉన్నందు వల్ల మెల్లిగా రెస్టు రూమ్.. అదేనండీ .. టాయిలెట్.. వైపు వడి వడిగా .. (ఇందులో మొహమాట పడవలసినది ఏమీ లేదు..) పరిగెత్తా.. తీరా అక్కడకు వెళ్ళాక తెలిసింది. ఇందాకటి ఇద్దరూ అక్కడ తీరికగా నించొని పళ్ళు తోముకుంటున్నారు.

ఇంతకీ విషయమేమిటంటే.. వీళ్ళు రాత్రి పీకలదాకా బాగా తాగి తెల్లారిదాకా చిందులేసి.. ఉదయాన ఇంటికెళ్ళి ఓ రెండు గంటలు నిద్రపోయి.. పక్క మంచం మీదనుంచి నేరుగా ఆఫీస్ చేరుకున్నారన్న మాట. ఇదిగో ఇక్కడి కొచ్చి దంత ధావనం చేస్తున్నారన్న మాట

పెద్దలే ఇలా ఉంటే, ఇక పిల్లల్లు ఏ విధంగా తయారవుతారు?
మరో చికాకు విషయంతో మరలా మీ ముందుంటా..

 
Clicky Web Analytics