ప్రవర్తన - పరివర్తన, భావం - స్వభావం

నేను ఈ మధ్య చదివిన ఒక బ్లాగు పుటలో, సదురు స్వంతదారుడు తన అభిప్రాయాన్ని చక్కగా అందమయిన భాష్యంలో తెలియజేసినారు. ఆది ఏ బ్లాగు, ఏ విషయమది అనునటువంటి విషయాలు ప్రస్తుతం అప్రస్తుతం. అసలు విషయమల్లా.. ఆ పుటకు స్పందించిన వ్యక్తులలో నేను ఉన్నాను. నాతో పాటుగా మరొక వ్యక్తి.. ఈ క్రింది విధంగా స్పందించారు.

... టైపులో చాల పుట్టుకొచ్చాయి. chain schemes మరి డేంజర్. ఆ మధ్య *** అని ఒ లం* కొ** (naa కొ**ది hyderabad అనుకొంటా) కోట్లల్లో జనాలని ముంచాడు. ఇంకో లం* కొ** (ఆ లం* కొ**ది కూడా హైదరాబాదీ) books ని CD లోకి ఎక్కించే HOME BASED WORK అని (ఈ నా కొ** BANK EMPLOYEE). చాల మంది చాల పోగుట్టుకొన్నారు. అలాగే CHARMINAR, KRISHI ... ఈ లం* కొ**లందరికి HYDERABAD వాళ్ళు భలే దొరుకుతారు ..

కొన్ని విషయాలను ఆ బ్లాగు రచయత తీర్చిదిద్దితే బాగుండేది. కానీ ఆ బ్లాగు ప్రచురించిన రచయతకు ఈ స్పందన చదివిన తరువాత ఎటువంటి భావన కలిగినట్లు లేదు.. చక్కగా ఉన్నదున్నట్లుగా publish చెసేసారు, కొంచం కూడా moderate చెయ్యకుండా. ఇది చదివిన తరువాత, నా మనసుకు కొంచం భాధ కలిగి, సదురు స్పందించిన వ్యక్తికి విడిగా ఆయన వ్యక్తిగత మెయిల్‍కి క్రింది విధంగా ఒక విన్నపాన్ని తెలియజేసాను.

నా పేరు చక్రవర్తి, నేను మీరు స్పందించిన తీరుపై, నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి, మీకు ప్రత్యెకంగా ఉత్తరం వ్రాయుచుంటిని. మీ స్పందనకు ముందు నేను స్పందించాను, గమనించగలరు. మీ పదజాలం లోని కొన్ని అసంమజసంగా ఉన్నవి. దయచేసి, ఇక మీదట తమరు అటువంటి పదజాలం వాడరని ఆశిస్తున్నాను. మీరు ఉదహరించిన సదరు *** అనేటటువంటి వ్యకి మంచి వాడు కాదనుకుందాం, అతను చేసిన తప్పుకి అతని తల్లిని 'లం*' అని సంభోదించడం ఏ మాత్రం వివేకం .. మీకు కచ్చి ఉంటే అతనిని తిట్టండి అంతేకాని అతని తల్లి తండ్రులను అనవసరంగా అపార్దం చేసుకోవడం ఎంత మాత్రం భావ్యమో ఆలోచించగలరు.
అన్యధా మంచిగా ఆలోచిస్తారని, నన్ను + నా అభిప్రాయాన్ని తప్పుగా భావించరని ఆశిస్తూ..

దీనికి ఎంత త్వరగా బదులు వచ్చిందంటే.. బహుశా.. ఒక రెండు గంటల వ్యవధిలో ఈ క్రింది విధంగా తిరుగుటపా వచ్చింది.

నమస్కారం, మహా కవి శ్రీ శ్రీ, ఇంకా చాల మంది చాలా, చాలా పుస్తకాలలో , సినిమాలలో వాడారు. నేను కొత్తగా ఈ పదాలు వాడ లేడు- కనిపెట్టలేదు . గమనిచగలరు. SORY. నేను అటువంటి పదాలను వాడకుండా ఉండలేను.
BEST REGARDS

ఈ తిరుగు టపా చదివిన తరువాత నాకు నోటివెంట మాటలేదు. ఏమిటిది?? ఎవ్వరితో పోలిక??? మహాకవి శ్రీ శ్రీ గారు వాడారు కదా అని మనం నిరబ్యంతరంగా ఇట్లాంటి పదాలను వల్లించ వచ్చా??? మనలో ఉండవలసిన తెలివి తేటలేమయినట్లు?? మనలో ఉండవలసిన వివేకమేమయినట్లు?? పెద్దవాళ్ళు ఎదో తప్పుచేసారనుకోండి, అటువంటి తప్పు మనంకూడా తప్పకుండా, తప్పు చేయవలెనా??? కందుకూరి వీరేశలింగం పంతులుగారు వితంతువునైనా గౌరవించాలని చెప్పిన మంచికి ఎటువంటి విలువలేదా??

ఇవన్నీ ఒక ఎత్తైతే, వయస్సుతో పాటు పెరగవలసిన పెద్దరికమేమయినట్లు?? కొంచమయినా హుందాగా బ్రతకాలి అన్న ఆలోచనలేకుండా, 3rd grade people లా ప్రవర్తించిన ఇట్టి మనుషులను ఏమి చేయ్యాలో అర్దం కావడంలేదు. వీరు మంచిగా.. మర్యాదగా మారతారని నేను కలలో కూడా ఊహించలేను. వీరే ఇలా ఉంటే, వీరి ఇంట పుట్టి పెరిగిన పిల్లలు ఏవిధంగా తయారవుతారో ఊహించుకుంటే.. దేవుడా.. వారిని, వారి వారి సహచరులను నువ్వే కాపాడుమని వేడుకోవడం మినహా .. ఏమీ చెయ్యలేను. కానీ ఒక్కటి మాత్రం చెయ్యగలను.. మా తాతగారు బ్రతికున్నరోజులలో చెప్పిన మాట ఒకటి వీరిలాంటి వారికి నూటికి నూరు శాతం వర్తిస్తుంది..

దుశ్టులు, దుర్మార్గులు,స్త్రీలను గౌరవించడం చేతకానివారు, అమర్యాదగా ప్రవర్తించే వారు.. ఇలా కొంచం పెద్ద లిస్టే ఉంది.. వీరంతా మనం విసర్జించేటటువంటి మల మూత్రాలతో సమానం. పెంట మీద రాయి వేశామనుకోండి ఏమి జరుగుతుందో తెలుసుకదా.. అటువంటప్పుడు, అట్లాంటి వారితో మనకి పనేమిటి?? దూరంగా ఉంటే పోలా.. మనకూ మంచిది.. వారికీ మంచిది.

ఏమంటారు?

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

7 స్పందనలు:

సూర్యుడు said...

మీతో నూరు శాతం ఏకీభవిస్తాను. ఈ విష్యంలో కన్నడిగులు చాలా ముందున్నారు, అసభ్య పదజాలాన్ని చాలా చాలా అరుదుగా వింటారు. ఆక్కడ ఏంట్రా అంటేనే పెద్ద తప్పన్నట్టు, ఇంక మిగిలిన పదాల సంగతి చెప్పక్కర్లేదనుకుంటా.

సౌమ్యంగా మాట్లాడటానికి ఏమి సమస్యో

నమస్కారలతో,
సూర్యుడు :-)

తెలుగు'వాడి'ని said...

మీరు ప్రస్తావించిన వ్యాఖ్య(ల) గురించి వాటికి మీరు వ్యక్తపరచిన ఆలోచనలు/అభిప్రాయాలు, మీ ఉత్తరప్రత్యుత్తరం మరియు మీరు స్పందించిన తీరు చూసిన తరువాత ... "వీరే ఇలా ఉంటే, వీరి ఇంట పుట్టి పెరిగిన పిల్లలు ఏవిధంగా తయారవుతారో ఊహించుకుంటే.." మరియు "దేవుడా.. వారిని, వారి వారి సహచరులను నువ్వే కాపాడుమని వేడుకోవడం మినహా" అనే వాక్యాలు ఖచ్చితంగా సబబు కాదు అని నాకనిపించింది మరియు మీరు వాడకుండా ఉంటే బాగుండేదేమో..

మీ ఇద్దరి ఆలోచనాధోరణిలో పెద్ద తేడా ఏమీలేదు అండి (మీకు కొంచెం కష్టంగా అనిపించినా వాస్తవమైతే ఇదే)... ఆయనేమో ఎవరో మోసం చేసారని వారి తల్లిని తీసుకొచ్చారు ఈ వ్యాఖ్యలలోకి ఏదో పద ప్రయోగం ద్వారా ... మీరేమో ఈయనేదో వాడకూడని పదం వాడారు అని ఆయన పిల్లలను/సహచరులను తీసుకొచ్చారు ఈ టపాలోకి ..

తేడా ఏదైనా ఉంది అంటే ... మీరు ఇద్దరూ వాడిన పదప్రయోగాలు అంతే ... ఆయనేమో డైరెక్ట్ గా లం* అని వాడారు ... మీరేమో కొద్ది సంయమనంతో 'ఏవిధంగా .. ఊహించుకుంటే' అని వదిలిపెట్టేసిన భావం కలుగజేశారు.

మోసం చేసింది వాడు అయితే, వాడి తల్లి ఏమి జేసింది అని ప్రశ్నించిన మీరే, తప్పు పదం వాడింది ఈయన అయితే ఆయన పిల్లలు ఏవిధంగా తయారవుతారో అని సందిగ్ధంగా ప్రశ్నించినపుడు .... కనీసం మీకు, ఒక వాక్యానికి మరొక వాక్యం మీకు మీరే contradict చేస్తున్నారు అన్న విషయం తోచలేదా!? :-( ఇంకొకసారి బాగా ఆలోచించి చూడండి ... తరువాత మరలా చర్చిద్దాం అప్పుడు

అలాగని (నిగ్రహం కోల్పోయో, సంయమనం లోపించో లేక తన భావవ్యక్తీకరణ/తను అంతేనో .. కారణం ఏదైనా) నేను తన వ్యాఖ్యలను నేనేమీ సమర్ధించటం లేదు.

కొసమెరుపు : 'ఒక అమ్మ ఒక అయ్యకి పుట్టిన వాళ్లు అయితే' అని మాట్లాడిన (దీనికి కూడా మాట్లాడటం అనే వాడితే మాట్లాడటం అనే పదాన్ని అవమానించటమేనేమో) ఒక రాజకీయనాయకుడు(!?) మరుసటి రోజు, మా మాండలికంలో ఇలానే అంటారు ..అట్లాగే వేలువిడిచిన మా మేనమామ తాతగారి చిన్నకోడలి పెద్ద మనుమరాలు పుట్టిన కాలంలో/ప్రాంతంలో కూడా ఇలానే అంటారు... పెద్ద తప్పు ఏమీ కాదు అని దులబరించుకుని వెళుతున్న కాలం ఇది ... అలాగే సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఇంతవరకు ఏ తెలుగు నిఘంటువులో లేని పదాలను రోజూకొకటి చొప్పున 'తెలుగుదేశం' లోని ప్రజానీకానికి పరిచయం చేస్తున్న రోజులివి ....

ప్రభావితం చేయగలిగే(వి)వారు, ప్రభావితం అయ్యేవారు ఎంతో సమన్వయంతో సహజీవనం సాగిస్తున్న కలికాలమిది. అంతే !

sriku said...

భలేవారే , కన్నడా సినిమాల్లో తిట్లు ఇష్టం వచినట్టు వాడతారు , నేను కర్నాటకా లో ఉండే సమయంలో తర్ల నన్ మగ అని ఒక సినిమా కూడా వచ్చింది దాని అర్ధం ఏదో దొంగ నా కొ.... అని

kasturimuralikrishna said...

one who has no respect for others,has no respect for himself too.dont worry about such people.world is too big and life is too short to worry about such things.

ఓ బ్రమ్మీ said...

అయ్యా "తెలుగు ’వాడి’ని" గారు..

మున్ముందుగా, ఇంత శ్రమచేసి, స్పందించినందులకు ధన్యవాదములు..

గాడిదని గుర్రాన్ని ఒకే తాడికి కట్టేశారు కదా!! ఎంత మాట ఎంత మాట... నాకు, సదురు మహానుభావుడికి, ఇద్దరికీ వారి వారి ఆలోచనాధొరణిలో పెద్ద తేడా లేదాండీ.. బాగుందండి మీ వరస... మీ భాధల్లా నేను వారి పిల్లలను, సహచరులను నా భావంలోకి తీసుకు వచ్చననే కదా మీ అభిప్రాయం.

ఒక్క విషయం మీరు నిశితంగా గమనించాలి... పిల్లలు ఎదిగే వయస్సులో ఎక్కువగా వారి వారి తల్లి తండ్రులనే (ఎక్కువగా.. మరొక్కసారి) అనుకరిస్తూంటారు. అలా అనుకరిస్తూనే వారి కంటూ ఒక అభిరుచులు లెదా వ్యక్తిత్వం అనేటటువంటివి ఏర్పరుచుకుంటారు. ఈ ప్రభుద్దుడేమో మహా మహా కవులే అనగాలేంది, నేనంటే తప్పేంటి అని ప్రశ్నించే స్తితిలో ఉంటే.. వీరి పిల్లలు, మా నాన్నే అనగా లేంది, నే నంటే తప్పేంటి అంటూ రోడ్డున పడ్డారనుకోండి.. అప్పటి పరిస్తితి ఒక్క సారి ఊహించుకోగలరు.

ఇక రెండవది.. ఎవ్వరైనా మీ గురించి అడిగేటప్పుడు, మీ తల్లి తండ్రులు ఎవ్వరు అని అడుగుతారు కానీ .. మీరు ఎంత మంది పిల్లలు? వారికి వారి పిల్లలెవ్వరు?? అని మాత్రం అడగరని నా అభిప్రాయం. ఇంటిని చూడు, ఇల్లాలిని చూడు అంటారు .. అలాగే, ఒక్కొక్కసారి మనం తప్పుగా లెక్కలు చేస్తే.. సరదాకి, నీకు లెక్కలు చెప్పిన మాస్టారు ఎవ్వరు? అని మనకన్నా ముందున్న తరాన్ని మాత్రమే ప్రశ్నిస్తారు కానీ.. మన తరువాతి తరాన్ని మాత్రం ఎట్టి పరిస్తితులలో ప్రశ్నించరు. ఎదో సంస్కృతంలో చెప్పినట్లు.. యధా రాజా తధా ప్రజ.. గా.. ఎక్కువ శాతం పిల్లలు మాత్రం .. యధా తల్లి తండ్రులు, తధా పిల్లలు అనేది జగమెరిగిన సత్యం. అలాగే ఎక్కడో ఒకటి రెండు exceptions అనేవి ఉంటాయి.. కానీ ఎక్కువ పాళ్ళు, పిల్లలు తల్లి తండ్రులను వారి అడుగు జాడలలోనే పయనిస్తూ ఉంటారనేది నా అభిప్రాయం.

ఏది ఏమైనా.. మీ ఉద్దేస్య ప్రకారం తల్లిని అవమానించడం తప్పుకాదు గానీ.. పైన ఉదహరించిన మహానుభావుల లాంటి వారి పిల్లల పరిస్తితి అలోచిస్తే జాలేస్తోందని తెలియజేయడం మాత్రం, "తల్లిని దూషించినంత దానికి సమానేనంటారు.." ఏం చేస్తాం.. సరేలేండి .. ఇక ముందు ఎప్పుడు ఇట్లాంటి ప్రస్తావన వచ్చినా .. సదురు మహానుభావుల గురించే ప్రస్తావింస్తాను కానీ, మిగిలిన వారి గురించి ప్రస్తావించనని మనస్పూర్తిగా తెలియజేస్తున్నాను.

క్షమించేయ్యండిసారు .. అన్యధా మంచిగానే తలుస్తాను.

తెలుగు'వాడి'ని said...

చక్రవర్తి గారు: ముందుగా నేను నా వ్యాఖ్యలో , "అలాగని (నిగ్రహం కోల్పోయో, సంయమనం లోపించో లేక తన భావవ్యక్తీకరణ/తను అంతేనో .. కారణం ఏదైనా) నేను తన వ్యాఖ్యలను నేనేమీ సమర్ధించటం లేదు." ... అని చెప్పినా కూడా మీకు "మీ ఉద్దేస్య ప్రకారం తల్లిని అవమానించడం తప్పుకాదు గానీ ...", " తల్లిని దూషించినంత దానికి సమానేనంటారు.." అనేది ఎక్కడినుంచి వచ్చిందో అర్ధంకావటంలేదు.

టపాలో మీ తాతగారు లేక పై వ్యాఖ్యలో మీరు చెప్పిన పోలిక గురించి గానీ, నేను మొదట గానీ లేక ఇప్పుడు గానీ నేనేమీ వ్యాఖ్యానించ(బోను)లేదు ఎందుకంటే అవి మీరు తనకి డైరెక్ట్ గా ఆపాదించినవి...అవి మీ ఇష్టం. ఎవరి భావ వ్యక్తీకరణ వారిది ... ఆలోచనలకు ఎవరి అక్షరరూపం వారిది. కనుక మీరు ఎలా చెప్పినా అది సంపూర్తిగా మీ ఇష్టం.

ఇకపోతే .. మీరు మీ వ్యాఖ్యలో చెప్పిన "ఒక్క విషయం మీరు నిశితంగా గమనించాలి ... " దగ్గర నుంచి ... "కానీ ఎక్కువ పాళ్ళు, పిల్లలు తల్లి తండ్రులను వారి అడుగు జాడలలోనే పయనిస్తూ ఉంటారనేది నా అభిప్రాయం." అనే వరకు నేను మీతో సంపూర్తిగా ఏకీభవిస్తాను ..

కాకపోతే "అలాగే ఎక్కడో ఒకటి రెండు exceptions అనేవి ఉంటాయి.." అని మీకు కూడా తెలుసు కాబట్టి వారి పిల్లలను, సహచరులను, తల్లిదండ్రులను మొదలగువారిని ఈ రెండు శాతంలోనే ఉంచుతూ పెద్ద మనసుతో "ఈ ప్రభుద్దుడేమో మహా మహా కవులే అనగాలేంది, నేనంటే తప్పేంటి అని ప్రశ్నించే స్తితిలో ఉంటే.. వీరి పిల్లలు, మా నాన్నే అనగా లేంది, నే నంటే తప్పేంటి అంటూ రోడ్డున పడ్డారనుకోండి.. అప్పటి పరిస్తితి ఒక్క సారి ఊహించుకోగలరు." అతని వాళ్ల గురించి ఇంత దూరం ఆలోచించటం/ఊహించటం వద్దనేదే నా అభిప్రాయం/ఉద్దేశ్యం.

క్షమించెయ్యండి లాంటి పెద్ద పదాలు వద్దులేండి ... Our effort is to make this Telugu Blog World a better place to live/read and so as the rest of the world for every one out there.

ఓ బ్రమ్మీ said...

అయ్యా "తెలుగు ’వాడి’ని" గారు..

తమరు, నిగ్రహం కోల్పోయో, సంయమనం లోపించో లేక తన భావవ్యక్తీకరణ/తను అంతేనో .. కారణం ఏదైనా) నేను తన వ్యాఖ్యలను నేనేమీ సమర్ధించటం లేదు.. అని అంటూనే.. నిగ్రహం కలిగి, సంయమనం పాటించి, భావ వ్యక్తీకరణకు చక్కటి రూపమిచ్చి, సున్నితంగా, మధురంగా, వినయంతోటి విన్నవించుకున్న నాఅలోచనా ధొరణికీ .. సదరు మహానుభావుడి ఆలోచనా ధోరణికీ పెద్ద తేడా ఏమీ లేదన్న మాటకి నాకు అనిపించినది ఏమిటంటే.. "నేను చూపిన జాలి.. తల్లిని దూషించిన వారి వ్యాఖ్యలు.. రెండూ సమానమే.." అని. తప్పుగా తలంచి ఉంటే, మీరు చెప్పినట్లు, ఇక ముందు అలాంటి వ్యాఖలు చెయ్యనులేండి.

 
Clicky Web Analytics