గత కొన్ని రోజులుగా సాక్షి దిన పత్రికను క్రమం తప్పకుండా చదువుతున్నాను. గతంలో మాదిరిగా కంటే, ఇప్పుడు ఎక్కువగా అధికార పక్ష పత్రికగా అనిపిస్తోంది. ఎంతైనా తండ్రిగారిని, వారి ప్రభుత్వాన్ని కాదనలేరు కదా!!! ఈ పత్రిక ద్వారా ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రజలకు అర్దమవుతున్నాయనేది మాత్రం నగ్న సత్యం. కాకపోతే, ఊరికే పంచి పెట్టే పామ్‍ప్లేట్లను డబ్బులిచ్చి కొన్నుక్కుంటున్నట్లుంది. ఏది ఏమైనా చక్కగా కనులకు విందుగా బాగానే ఉంది.
ఇవాళ్టి విషయానికొస్తే.. పేపర్ బాయిస్ మీద మొదలు పెట్టిన వ్యాసం పేజీ తిప్పగానే వార్తాహరులు వైపు, రచనా వ్యాసాంగం రంగాలలో పనిచేసే వారి జీతభత్యాల వైపు మళ్ళించారు. కానీ రెండు పేజీలలోనూ ఉన్న ఫొటోలు మాత్రం పేపర్ బాయిస్‍వే వెయ్యడం ఇక్కడ గమనించ దగ్గ విషయం. పైకి మాత్రం పెపర్ బాయిస్ గురించి అన్నట్లనిపించేలా ఉన్న చిత్రలను చూసి భంగపడ్డాను. తీరా అందులో అస్సలు విషయమల్లా ఏమిటంటే.. సాక్షి మొదలు పెట్టిన దగ్గర నుంచి, ఇందులో పని చేసే వారి జీతాలు పెరిగినాయంటూనే, ప్రతి పక్షాల్లాంటి ప్రత్యర్దుల పని వారి జీత భత్యాలు పెరగటం లేదని ముగించారు. వ్యాపారమన్నాక ఆ మాత్రం ఒడి దుడుకులు ఉండవక తప్పదు కదా!! ఈ మాత్రం దానికే అంత పెద్ద ఆర్టికల్ వ్రాసేయ్యాలా??
ఏది ఏమయినా, ఈ మధ్య సాక్షి వారికి వార్తలు తగాయనడంలో ఎంతో కొంత నిజంమేననీ, ఇదంతా స్థలాన్ని పూరించుకోవడానికె చేస్ ప్రయత్నాలనేది సత్య దూరాలు కావు. వీరు తోందరలోనే కొన్ని పేజీలను తొలగించేసి, పత్రికా పేజీల సంఖ్యను తగ్గించేస్తారనుకోవడం, అతిశయంకాదు. వీటన్నింటి లోకి నాకు నచ్చిన ఒక విషయమేమిటంటే, ప్రధాన పత్రిక చివ్వరి పేజీలో ఒక మంచి మాటను తెలియజేస్తూ వస్తున్నారు. ఈ తతంగం ఎలా ఉందంటే, బాలమురళీ సుబ్రమణ్యం గారు నిర్వహించే కార్యక్రమం, పాడాలని ఉంది లో చివరగా బాలుగారు ఒక మంచి విషయాన్ని ప్రజలకు విన్నవించుకుంటారు. అదే తరహాలో వీరు చివ్వరి పేజీలో చక్కగా ఒక చిన్న విషయాన్ని సున్నితంగా తెలియజేస్తున్నారు.
చుద్దాం ఇక ముందు వీరు ఏవిధంగా మారతారో.. అంతవరకూ.. సెలవు..
క్షమించాలి.. బాల సుబ్రమణ్యంగారిని, బాల మురళి గారిగా ప్రచురించినందులకు.
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
1 స్పందనలు:
"ఈ తతంగం ఎలా ఉందంటే, బాలమురళీ గారు నిర్వహించే కార్యక్రమం, పాడాలని ఉంది లో చివరగా బాలుగారు ఒక మంచి విషయాన్ని ప్రజలకు విన్నవించుకుంటారు."
యస్.పి. బాలసుబ్రమణ్యం గారిని బాలమురళి అంటే, అది యస్.పి.బి కి నచ్చదు, బాలమురళి గారికి కూడా నచ్చదు, వాళ్లిద్దరికి నచ్చినా నచ్చకపోయినా అసలు మనకే వినడానికి/చూడ్డానికి బాగోలేదు ;)
~సూర్యుడు :-)
Post a Comment