బ్లాగు ప్రపంచం లోకి మరో విశిష్ట వ్యక్తి

ఇదిగో ఈ మధ్యనే మరో రాజకీయ నాయకుడు, "ఒక్క రోజైనా ప్రధాన మంత్రి కావాలన్నదే ధ్యేయంగా రాజకీయ్యాని నడుపుతున్నారు.." అని పిలవబడే మరో విశిష్టమైన వ్యక్తి బ్లాగు ప్రపంచం లోకి ప్రవేశించారు.  ఎవ్వరో అనుకుంటున్నారా.. అదేనండీ మన భారతీయ జనతా పార్టీ ప్రముఖులు, గౌరవనీయులైన లాల్ కృష్ణ అద్వాని. ఆయన మొదటి పుటలోని పలుకులు నాకు బాగా నచ్చాయి. మీరందరూ చదవ వలసిన కొన్ని మంచి మాటలు అందులో ఉన్నాయి. అయన ఏది చేసినా నిర్మొహమాటంగా.. నిర్దయగా.. నిస్పక్షపాతంగా.. తనదైన ముద్ర కలిగి ఉండేలా చేస్తారు. నాకు పుట్టి బుద్దెదిగినప్పటి నుంచి ఈయన చేసిన లేదా పాల్గొన్న చాలా కార్యక్రమాలలో స్వలాభం ఏమీ కనబడలేదు. దేశభక్తికి ఉదాహరణ ఎవరు అని అడిగితే, ఓ రకంగా వీరే అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.

 

ఇంతా చెప్పి వీరి బ్లాగు లంకె ఇవ్వలేదను కుంటున్నారా.. ఇదిగో .. http://blog.lkadvani.in/ ఈయన మాటలని కొంచం తర్జుమా చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే, ఎలాగో అక్కడ చదువుతారు కదా అని, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. కాకపోతే, వారి ఇప్పటి వరకూ బ్లాగిన విషయాలను దృష్టిలో ఉంచుకుని స్పందిస్తే, అచ్చంగా నాలుగే నాలుగు పుటలు ప్రచురణకు వచ్చాయి. వాటిల్లో రెండు పుస్తకాల గురించే. కొంతలో కొంత చక్కగా నిజాన్ని ఒప్పుకున్నారు. ఏమిటంటారా.. అదేనండి.. ఎన్నికలు వస్తున్నాయి కదా.. దాని గురించి. నిజమే, జీవితం అంటే ఎన్నికలు మాత్రమే కాదు కదా అంటూ జీవితానికి పరమార్దం spiritual life, (ఆత్మ .. ఏమనాలో పాలు పోలేదు).

 

ఏది ఏమైనా, విఙ్ఞాన విషయానికి వస్తే చాలా విషయాలు తెలిసి అనర్గళంగా చర్చించే చాలా కొద్ది మంది రాజికీయ నాయకులలో వీరు ఒక్కరు. అంతే కాకుండా బ్లాగు పరంగా సాంకేతిక పరిఙ్ఞానాన్ని ఉపయోగించుకున్న మొదటి రాజకీయ నాయకుడని నా అభిప్రాయం. చాలా మంది రాజకీయ నాయకులు కంప్యూటర్‍లను వాడగా చూసాము, కానీ ఇంత బాహాటంగా వ్రాయడం మొదలు పెట్టిన వారు వీరేనని నేననుకోవడం. అమితాబ్ బచ్చన్ గారు కూడ బ్లాగుతున్నారు, కానీ వారి ఎంతైనా ఇప్పుడు వితంతువే కదా.. ఏమిటి!!! అమితాబచ్చన్ వితంతువా అని అనుకుంటున్నారా.. నిజమేనండి.. రాజకీయ్యాలు నాకు పడవు, చేసింది చాలు అని ఉద్వాసన పుచ్చుకున్నారు కదా. నాకు తెలిసి ఆయన తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనుకోను.

 

ఇంతకీ మీరేమంటారు?

ఇది నిజమా..!! ఎలా?

ఏదో పరధ్యానంలో ఈ చిత్రాన్ని చూడడం జరిగింది. చూసిన తరువాత నమ్మలేక పోయ్యాను. మళ్ళీ మళ్ళి చూసాను. ఒక వేళ ఇందులో కల్పితం ఏమైనా ఉందేమో అని. ఎక్కడా అలాంటి అవకాశం కూడా లేకుండా ఒరిజినల్‍గా ఉంది.

కధలోకి వెళితే, అప్పుడెప్పుడో అమెరికాలోని ఒక సింహాం పిల్ల బేరానికి పెట్టారు. ఈ విషయం ఆనోట ఆనోట ఓ పెద్దాయన చెవిన పడింది. తీరా అక్కడకు వెళ్ళి చూడాపోతే, ఇరుకైన బోనులో బక్క చిక్కిన ఓ సింహం పిల్ల బేలగా ఈయ్యననే చూస్తూ కనబడిందంట. ఇదేదో బాగానే ఉంది అని ఆ పెద్దాయన ఈ సింహం పిల్లని తనతో పాటుగా ఇంటికి తీసుకు పోయాడంట. వీరి ఇంటికి దగ్గర్లోని ఒక చర్చి ప్రాంగణంలో ఈ పులి పిల్లని ఆడుకోనిచ్చారట ఆ చర్చి నిర్వాహకులు. ఈ సింహం పిల్ల అనుకున్న దానికన్నా వేగంగా, త్వర త్వరగా పెరిగి పెద్దదవుతూ ఉన్నంతలో కొంత కాలం తరువాత ఆ పెద్దాయనకు ఓ ఆలోచన వచ్చింది..

ఛా!! సింహం ఏంటీ.. వేటాడక పోవడ మేమిటి!! దాని రాజసమేమైంది.. దాని రాజరికమేమైంది. స్వతహాగా స్వతంత్రంగా అడవిలో తిరగ వలసిన జంతువును, సాధు జంతువుగా మిగిలి పోవలసిందేనా!! పుట్టుకతో వచ్చిన స్వభావం పెంపకంతో మారి వాటి స్వగుణాన్ని, వాటి గుర్తింపును కోల్పోవాలా!!

అన్నదే తడవుగా, ఈ సింహం పిల్లని చక్కగా తీసుకు వెళ్ళి ఆఫ్రికాలో వదిలి వచ్చారు. ఆ తరువాత కొంత కాలానికి, బహుశా దాదాపుగా ఓ సంవత్సర కాలం తరువాత ఆ సింహం పిల్ల ఎలా ఉందో చూద్దాం అనిపించి ఈ పెద్దాయన వెళ్ళారు. అదిగో అప్పుడు తీసిన చిత్రమే ఇది. ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠతో చూసాను. చూస్తున్నంత గుండె దిటవు చేసుకుని గమనించాను. కధ అంతా ఆంగ్లంలో ఉన్నా ఎందుకో వ్రాయాలని అనిపించింది.

మమతానురాగాలు ఒక్క మనుష్యులకే స్వంతం అనుకుని విర్రవీగే నాకు, నోరు లేని జీవాలు అందునా వేటాడడమే తత్వంగా, జన్మ హక్కుగా భావించే కౄర జంతువులకు కూడా మనసనేది ఉంటుందనీ, అవి కూడా ప్రేమిస్తాయనీ.. వాటికి కూడా స్నేహం అనేది ఒకటి ఉందనీ, స్నేహితుల విలువ ఏమిటో వాటికి తెలుసనీ.. మనుష్యులు మరియూ వారి సాంగత్యం లోని ప్రేమాప్యాయతలు మాకు అవగతమే అనే భావనను ఈ వీడియో ద్వారా తెలిసింది. మీరేమంటారు?

ప్రస్తుతానికి ఈ వీడియో తొలగించినట్లున్నారు. మీరు యౌతుబే.కం లో "christian the lion" అని గానీ.. "lion reunion" అనిగానీ వెతకండి

వ్యాపార సలహా - జై కార్పొరేషన్ లిమిటెడ్

ఇవ్వాళ మరో కంపెనీ చాలా తక్కువ వెలకి వ్యాపారం చెయ్యబడింది. అదే జై కార్పరోషన్ లిమిటడ్. దీని ప్రాధమిక షేర్ విలివ ఒక రూపాయి మాత్రమే. కానీ ఈ షేర్ విలువ 64.35 దగ్గర చేతులు మారుతోంది. గత సంవత్సర కాలంలో ఈ షేర్ ఇంత కంటే తక్కువ ఖరిదులో ఎప్పుడూ అమ్మకం జరగ లేదు. అధికంగా 1259/- అమ్ముడు పోయిందంటే నమ్ముతారా!!! కానీ ఇది నిజం.

మరి నా సలహాకి వస్తే, వచ్చే వారంలో ఈ షేర్ ధర మరింత తగ్గే సూచన కనబడుతోంది. కాబట్టి కొంచం తెలివిగా ఉండి 40/- రూపాయిలకి దగ్గరగా దొరికితే.. ఓ వంద కొని ఉంచు కోండి. స్వల్ప వ్యవధి కన్నా దీర్ఘ కాలంలో మీకు తప్పని సరిగా లాబాలని చేకూర్చే అవకాశాలు ఈ షేర్‍కి ఉంది.

ఈ నా అభిప్రాయం.. ఫూర్తిగా స్వగతం, ఎవ్వరూ ఈ విషయంలొ భాధ్యులు కారు. ఇది ఒక సలహా మాత్రమే. ఇట్టి సలహాల వల్ల తమరు నష్టపోయిన యెడల దానికి నేను భాద్యుడను కాను.. నన్ను భాధ్యులను చేయకండి.

వ్యాపార సలహా - రోల్టా ఇండియా

ఇవ్వాళ మొదటి సారిగా నేను నా పని మానుకుని మరీ ఈ షేరుకై ఎదురు చూసాను. ఈ రోజు మద్య్హాన్నం దాదాఔ ఒంటి గంట దరి దాపులలో ఈ షేరు నలభై నాలుగు(44/-) రూపాయల దగ్గర వ్యాపారం జరిగింది. స్వతహాగా ఈ షేరు అంత తక్కువకు దొరకదు. నిన్న నూట ఆరు(106/-) రూపాయల దగ్గర ముగించిన వ్యాపారం ఈ రోజు ఉదయాన కొంచం ఊపందుకుంది. తరువాత కొంచం మంద కొడిగా జారుతూ వచ్చి ఒక్క సారిగా ఒంటి గంటా ప్రాంతంలో నలభై నాలుగు రూపాయలకు పడిపోయింది. అనంతరం ఒక్క గంటలోనే తేరుకొని తొంభై రెండు(92/-) రూపాయలకు చేరుకుంది. ఇదిగో ఈ మధ్యలో నా పని అంతా చెడిందనుకోవాలి. ఆ తరువాత వ్యాపార ముగింపు దశలో కొంత నష్టపోయి ఎనభై ఏడు (87/-)రూపాయలకు దగ్గర ముగిసింది.

 

ఏది ఏమైనా, ఈ షేర్ మీద మార్కెట్‍లో చాలా ఊహాగానాలు వస్తున్నాయి. మీరు కనుక నా సలహా తీసుకోవాలంటే, రేపు లేదా మరునాడు వీటి మీద ఓ కన్నేసి ఉంచండి. ఈ రోజు ముగింపుని గత వారంలో జరిగిన పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే.. వచ్చే వారంలో మరింత దిగువకు చేరే అవకాశం మెండుగా కనబడుతోంది. ఈ షేర్ గత సంవత్సరంలో ఇంత కంటే తక్కువగా ఎప్పుడూ అమ్ముడు పోలేదు. కాబట్టి వీలైతే, కుదిరితే ఓ వంద షేర్లు నలభై ఐదు(45/-) నుంచి యాభై ఐదు(55/-) రూపాయల మధ్య దొరికితే కొనేయ్యండి. ఒక నెల రెండు నెలల కాలంలో ఈ షేర్ తిరిగి నూట ఇరవై రూపాలకు(120/-) చేరుకునే అవకాశం ఉంది.

 

ఈ నా అభిప్రాయం.. ఫూర్తిగా స్వగతం, ఎవ్వరూ ఈ విషయంలొ భాధ్యులు కారు. ఇది ఒక సలహా మాత్రమే. ఇట్టి సలహాల వల్ల తమరు నష్టపోయిన యెడల దానికి నేను భాద్యుడను కాను.. నన్ను భాధ్యులను చేయకండి.

వ్యాపార సలహా - సత్యం కంప్యూటర్స్

షేర్ మార్కెట్ విఫణిలో నిన్న జరిగిన పరిణమాలు జగద్విదితమే. రామ లింగ రాజు నెల కొల్పిన "సత్యం కంప్యూటర్స్" షేర్ విలువ పూర్తిగా పడి పోయింది. ఒక్క సారిగా రెండు వందల రూపాయిల దగ్గర్నుంచి ముప్పై రూపాయిలకు పడి, క్రొద్దిగా పెరిగి నలభై రూపాయల దగ్గర ముగిసింది. జర బద్రం ... చాలా చాలా విషయాలు తేట తెల్లం అవుతున్నాయి. ఇప్పటికే న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజి వాళ్ళు సత్యం కంప్యూటర్స్ వ్యాపార లావాదేవీలను నిలిపి వేశారు. అలాగే మన నేషనల్ స్టాక్ ఎక్సేంజి వాళ్ళు కూడా ఈ స్టాక్‍ను డీలిస్ట్ చేసేశారు. ఇప్పుడు ఒక్క బొంబాయి స్టాక్ ఎక్సేంజి లో మాత్రమే లావాదేవీలు జరుగుతున్నాయి. నిన్నటి వ్యాపార లావాదేవీలు ముగిసే నాటికి ఈ స్టాకు విలువ దాదాపు 40/-.

ప్రస్తుత కాల పరిస్తితులను దృష్టిలో ఉంచుకుని విశ్లేషిస్తే, ఈ షేరు ధర దాదాపుగా పది రూపాయలు దిగువకు చేర వచ్చని వ్యాపార నిపుణుల అంచనా. అందుకని, కొంచం ఓపికతో వేచి ఉండండి. లేదా షేర్ మార్కెట్ లో నష్టాలు చవి చూసిన వారు, స్వల్ప వ్యవధి (అంటే కొన్ని నిమిషాలలో) ఎంతో కొంత సంపాదించుకుని జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలను కుంటే, ఈ షేర్ చక్కగా ఉపయోగ పడుతుంది. అందుకని తొందర పడి, ఈ షేర్ నందు పెట్టుబడి పెట్టకండి. ఒక్క రెండు మూడు రోజులు ఆగి నిర్ణయం తీసుకోండి, మీ నష్టాలను పూడ్చుకోండి. తిరిగి ఈ షేర్ లావాదేవిలు మొదలవుతాయి.

ఇప్పటికే సత్యం కంప్యూటర్స్ షేర్‍ను రిలయన్స్ కాపిటల్‍గా వ్యవహరించే ఊహా గానాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా, ఈ సంస్థని మరో యాజమాన్యం పునరుద్ధరించే పనిలో పడడం ఒక రకంగా శుభ సూచకమే. త్వరలో మళ్ళీ లావాదేవీలు మొదలువుతాయని ఆశిద్దాం. అంత వరకు ఈ షేర్‍ని ఈ కంటితో కనబెడుతూ ఉండంది. ఎందుకైనా మంచిది 10/- లేదా 15/- మధ్యలో ఎంతో కొంత కొనడం మంచిదే అని నా అభిప్రాయం.

ఈ నా అభిప్రాయం.. ఫూర్తిగా స్వగతం, ఎవ్వరూ ఈ విషయంలొ భాధ్యులు కారు. ఇది ఒక సలహా మాత్రమే. ఇట్టి సలహాల వల్ల తమరు నష్టపోయిన యెడల దానికి నేను భాద్యుడను కాను.. నన్ను భాధ్యులను చేయకండి.

 
Clicky Web Analytics