ఉంటాను .. నిరీక్షణతో ..

ప్రియతమా .. !!

నీవు వచ్చే దారిలో

కలల స్వప్నాల పువ్వులను పరచి..

ఉంటాను .. నిరీక్షణ తో ..

హృదయపు వాకిటికి

ఆసల తోరణాలు కట్టి

ఉంటాను .. నిరీక్షణ తో ..

కనురెప్పల కవాటాలకు

కోర్కెల ముగ్గులు వేసి

ఉంటాను .. నిరీక్షణ తో ..

కళ్ళలో ప్రేమ అనే

వొత్తిని వెలిగించి

ఉంటాను .. నిరీక్షణ తో ..

కరిగి పోయిన కాలం సాక్షిగా

తిరిగి రాని లోకాలకు వెళ్ళిన నీకై

ఉంటాను .. నిరీక్షణ తో ..

నీ .. రాని రాకకై,

నిరీక్షిస్తూ ఉంటాను ..


7 స్పందనలు:

teresa said...

చాలా బావుంది.
ఆస కాదు, ఆశ.. భావ వ్యక్తీకరణ ఎంత బావున్నా మీ టపాలన్నింట్లోనూ తప్పులు విపరీతం! భాషని సంస్కరించుకోండి. మీరు ఇంగ్లీషు మీడియంలో చదివారు గావును :(

చక్రవర్తి said...

teresa గారు,

పదవ తరగతి వరకూ నేను చదువుకుంది తెలుగు మాధ్యమమే, ఆపై ఆంగ్ల మాధ్యమమం.

భాషను సంస్కదించుకునే పనిలోనే ఈ బ్లాగు. ఏది ఏమైనా మీకు కనిపించిన తప్పులన్నీ ఇలా ఏరి పారేయ్యండి. నేనేమీ అనుకోను.

సరిదిద్దినందులకు నెనరులు

జ్యోతి said...

తెలుగు మీడియమ్ చదివి ఇన్ని తప్పులా??? మళ్లీ చెక్ చేసుకోండి చక్రవర్తిగారు...............

చక్రవర్తి said...

తప్పులున్నాయి అని ఊరుకోకుండా.. కొంచం శ్రమ పడి అవి ఏమిటో చెప్పి సరిదిద్దవచ్చు కదా

Anonymous said...

చాలా బాగుందండి! వెనకటి సామెత ఒకటి గుర్తు కొస్తొంది మీ మాట ప్రకారం(నీ నెత్తి మీద ఎదొ పడిందంటీ, నీ చేత్తొ తీసేయ్ అన్నాడట). ఎంత బద్దకిస్ట్ మీరు

చక్రవర్తి said...

అయ్యా అనామకులుంగారు,

నేను తప్పులు వెతికి వాటికి సరిఅయిన పదాలని చెప్ప మన్నానే కానీ, నా బ్లాగులో సరిదిద్ద మనలేదు కదా.. తప్పులున్నాయి అంటే సరిపోదు, ఏది తప్పు దానికి ఏది ఒప్పు కూడా చెప్పాలని నా అభిమతం

ఒఠిగా అభాండాలు వేసేయ్యకుండా, teressaగారు చెప్పినట్లు చెబితే బాగుంటుందని నా అభిప్రాయం

పరిమళం said...

Beautiful!

 
Clicky Web Analytics