వేదం – నా అభిప్రాయం

నేను స్వతహాగా సినిమాలు చాలా తక్కువ చూస్తూ ఉంటాను. ఇలా సినిమాల పట్ల నాకు అనాశక్తత పెరగటానికి ఒకటే కారణం .. సినిమా హాలు వద్ద టికెట్ల కోసం క్యూలో నిలబడాలంటే చికాకు. అందులోనూ ఆ క్యూలో నిల్చున్నోళ్ళు చమట వాసన మరింత భయంకరంగా ఉంటుంది. అందుకని సినిమాలంటే నాకు నిరాశక్తత. నేను చూసిని కొన్ని సినిమాలు అచ్చంగా డబ్బు కోసం తీసి మానవతా విలువలకు విరుద్దంగా నితి నియమాలను పణ్ణంగా పెట్టి తీసి నాకు సినిమాలపై ఎహ్యా భావాన్ని  మిగిల్చాయి. వీటన్నింటికీ వ్యతిరేకంగా తీసినదే ఈ సినిమా ..

vedam2

చాలా రోజుల తరువాత ఎక్కి ఎక్కి ఏడ్చాను.. నాతో కలసి వెరిజాన్ పనిచేసిన హరునాద్ గారి బ్లాగులో ఎక్కడో ఈ క్రింది వాక్యం చదివినట్టు గుర్తు ..

నాకు ధుఃఖం వలన ఏడుపు రాదు .. కానీ మంచితనం వల్లన ఏడుపొస్తుంది..

అలా .. నాకూ ఈ సినిమా చూస్తున్నంత సేప్పుడల్లా ఆ సినిమాలో చూపించిన మధ్య తరగతి వాళ్ళ చేతగానితనం, ముస్లిం యువకులలోని మంచితనం, వ్యభిచారుల పాత్రల ద్వారా పలికించిన నిజాలు నన్ను చాలా భాధపెట్టాయి..

నేను సినిమాలు చూడకపోవడానికి మరోకారణం కొన్ని సినిమాలు దుఃఖాంతం అవుతాయి. జీవితంలోనూ కష్టాలే.. దానికి తోడు డబ్బులిచ్చి మరీ కష్టాలు కొని తెచ్చుకోవాలా!! అందుకనే సినిమాలంటే నాకు చికాకు. సముద్రం అంత జీవితంలో కొండంత కష్టాలతో దినం దినం చచ్చే నాలాంటోడికి ఎడారిలో సెలయేరులా సినిమా అనేది ఒక ఆటవిడుపు కావాలికానీ, ఏడవడానికి మరో కారణం కాకూడదు. అందుకనే నేను సినిమాలు చూడను. కానీ దేశం కాని దేశంలో తెలుగు మీద మమకారం నన్నుదొంగతనంగానైనా సినిమాలు చూసేటట్టు చేస్తున్నాయి.

ఏది ఏమైనా నేను మాత్రం ఈ సినిమాని చూద్దాం అనుకున్నాను. జనరల్ గా నేను ఏ సినిమా అయితే చూద్దాం అనుకుంటానో ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది .. మరి ఈ సినిమా సంగతేమిటో నాకు తెలియదు. ఈ సినిమాని నేను సినిమా హాల్లో చూడనందుకు చాలా సంతోషిస్తున్నాను. దాని వనకాల ఉన్న ఒకే ఒక్క కారణం, నేను ఏడిస్తే జనాలు చూస్తారు అన్న ఒక్క ఇనిహిబిషన్. అలాగే ఈ చిత్రానికి జేజేలు పలక్కుండా ఉండలేక పోతున్నాను.

నాకు నచ్చింది కానీ చూడమని చెప్పను.

9 స్పందనలు:

Harish said...

I felt it very boring movie.

చక్రవర్తి said...

హరీష్ గారు,

తప్పులేదు.. అది మీ ఇష్టం. స్పందించి నందులకు నెనరులు..

Sandeep said...

ఈ సినిమా నేను చూడలేదు. చూశానా లేదా అన్నది పక్కన పెడితే, మన చుట్టూ మనం గీసుకున్న గీతల్ని దాటి తీసిన సినిమాలను ఎప్పుడైనా ఆదరించాలి అన్నది నా అభిప్రాయం. మీ వ్యాసం బాగుంది.

చక్రవర్తి said...

సందీప్ గారు,

మనం గీసుకున్న గిరి దాటి బయటకు రావడానికి ఎంతో ధైర్యం మరియు మనోః నిబ్బరం కావాలి. నిన్న నేను చూసిన మరో సినిమా "ద బ్యూటిఫుల్ మైన్డ్" .. అహా .. చాలా బాగా తీసారు. మీకు వీలైతే ఆ సినిమాని ఒక్క సారి చూడండి.
ఒక్కొక్క సారి మన సరిహద్దుల్లుని దాటి వచ్చి సినిమాని ఆదరించాలి అన్న విషయం చాలా బాగా చెప్పారు. ఏది ఏమైనా స్పందించి నందులకు నెనరులు..

Seenu said...

సినిమా మొత్తం బోర్......
ఏ ఒక్క సీన్ చూడాలనిపించలేదు.

చక్రవర్తి said...

శీను గారు,

స్పందించినందులకు నెనరులు..

శ్రీ said...

@ చక్రవర్తి,

నేను మొదటి వారం లోనే సినిమా చూసాను, చాలా నచ్చింది.

ఈ సినిమాకి ఆంగ్లములో క్రాష్ అనే సినిమా మూలం. వీలున్నపుడు దాన్ని కూడా చూడండి.

చక్రవర్తి said...

శ్రీ గారు..

ఇప్పుడే డౌన్లోడ్ చేస్తాను.. చూద్దాం ఆ సినిమా ఎలా ఉంటుందో.. ఎంత ఆంగ్ల మాతృక అయినా మనోళ్ళు కూడా బాగానే కాపీ కొట్టారు .. మన నేటివిటీ దెబ్బతినకుండా బాగా తీసారని నా అభిప్రాయం.
అది సరే కానీ మీకు ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి?

మంచు.పల్లకీ said...

వేదం నేను చూడలేదు కానీ క్రాష్ చూసాను.. ఒకె సినిమా అది.. 2006 లొ అస్కార్ బెస్ట్ మూవీ..

 
Clicky Web Analytics