షట్టర్ ఐలాండ్.. రివ్యూ

Shutter-Island ఈ సినిమాని చూడమని ఓ తెలుగు బ్లాగర్ సజస్ట్ చేస్తే, సలహా ఇస్తే ధైర్యం చేసాను. మొదటి నలభైఐదు నిమిషాల వరకు ఏమీ విషయం లేదు. ఈ సినిమా ఓ మానసిక చికిత్సాలయం చుట్టూ తిరుగుతుంది. అనుకోకుండా ఓ అమ్మాయి ఈ చికిత్సాలయంలో కనబడకుండా పోయిందన్న కేసుపై ఇద్దరు పోలీసు అధికారులు అక్కడికి వెళతారు అన్న కధనంతో ప్రారంభవౌతుంది ఈ సినిమా.

వారిలో మొదటి వ్యక్తి మన హీరో గారు. మరో వ్యక్తి ఈయనకు సహయాధికారి. నాటకీయ పరిస్తితులలో మన హీరో గారిని కూడా అక్కడి పేషంట్‍ని చేస్తారు. అదిగో అక్కడే ఈ సినిమా కధకుని (మొత్తం) సృజనాత్మకత దాగి ఉంది. ఇందులో చాలా పైశాచిక  దృశ్యాలు ఉన్నాయి. ఇంత పైశాచికమైన సినిమాని నేను ఇంత వరకూ చూడలేదు. ఇకపై చూడబోనేమో. కొన్ని విషయాలలో ఈ సినిమా ప్రశంసనీయమైనా, కధా పరంగా నాకు అస్సలు నచ్చని సినిమా. ఎవ్వరూ చూడవద్దని నా మనవి.

ఈ సినిమాని సగం చూసిన తరువాత ఇక చూడకూడదనుకున్నాను. కానీ ఈ సినిమా ఇన్సెప్షన్ సినిమా కన్నా బాగుంది అని రివ్యూ వ్రాసేటప్పటికి ఏ విధంగా బాగుందో చూద్దాం అని పూర్తిగా చూస్తూ ఈ రివ్యూ వ్రాస్తున్నా. స్క్రీన్ ప్లే పరంగా కొన్ని కొన్ని సన్నివేశాలు ఈ సినిమా దర్శకుని ప్రతిభను చాటాయి. అన్నంత మాత్రాన ఈ సినిమా బాగుంది అని కాదు. ఈ సినిమాలో వైలెన్స్ శృతి మించి చూపించారు. కధ విపరీతంగా ఉంది. మనుష్యుల్లో ఇంత విపరీతంగా కూడా ఆలోచిస్తారు అన్న విషయం తెలిసిన తరువాత నా ఆలోచనలు ఎంత చెత్తగా ఉండకూడదో అర్దం అయ్యింది. ఇక్కడ ఎంత ఉత్తమంగా ఉండాలో అనే విషయం తెలియక పోయినా ఎంత వికృతంగా మరియు ఎంత చెత్తగా ఆలోచించకూడాదో అంతే కాకుండా ఎంత వికృతంతా ఉండకూడదో అర్దం అయ్యింది.

కొన్ని కొన్ని సీన్లు దర్శకుని ప్రతిభని చాటి చెప్పాయి. వాటిల్లో మొదటిది మన హీరోయిన్ గార్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు తీసిన షాట్. ఇక్కడ కొన్ని కంప్యూటర్ జిమ్మిక్స్ ఎవ్వరికీ తెలియక పోయినా నేను పట్టేశాను. మరొకటి హీరో గారు హీరోయిన్ని కలిసేటప్పుడు పలు పలు విధాలుగా చిత్రాలను సృష్టించడం. అలాగే మరొకటి మన హీరో గారు ఓ పెద్ద కొండ చెరియనుంచి క్రిందకు దిగే సీన్. అంత ఎత్తు నుంచి క్రిందకు దిగుతున్నట్టు చిత్రీకరించడం అచ్చంగా నిజంగా ఉంది.

కానీ ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అన్నీ మన మైండ్ లోనే ఉంటుంది అని ఈ సినిమా ద్వారా చెప్ప ప్రయత్నించారు. మన మైండ్ మాత్రమే మన భాధలను మన శరీరానికి తెలియజేస్తుంది, అలాగే అన్ని రకాల అనుభవాలను. అంటే, కోపాన్ని, తాపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని,  భాధని,  సంతోషాన్ని, ఏదైనా.. అన్ని మన మైండ్ నుంచే ఉద్బవిస్తాయని ఈ సినిమాలో చెప్ప ప్రయత్నించారు. అన్నింటి కంటే మించి మనకు అత్యంత సన్నిహితులు మరియు ప్రీతి పాత్రులైన వారలే మనకు అవరోధాలుగా మారతారని చెప్పడం బాగుంది.  తిమ్మిని బమ్మిని చేసి ఓ వ్యక్తిని పిచ్చి వాడిని చెయ్యడం ఎలా వీలౌతుందో అర్దం కావటం లేదు కానీ ఎలా పిచ్చి వాడిని చెయ్యవచ్చో ఇందులో చెప్పారు.

అంతేకాకుండా ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు మరో పాత కధ గుర్తుకు వస్తుంది. అది ఏమిటంటే.. ఓ బ్రాహ్మణుడు దానంగా వచ్చిన గొఱె పిల్లని పట్టుకు పోతుంటే దారి మధ్యలో పది మంది శూదృలు ఆ జంతువు గొఱె కాదు కుక్క అంటే, ఆ బ్రహ్మణుడు ఆ గొఱెను కుక్క అనుకొంటాడు. అనుకోవడమే కాకుండా దానంగా వచ్చిన గొఱెని కుక్క అని అనుమానించి వదిలేస్తాడు. అలా వదిలేసిన గొఱెన్ని శూదృలు తీసుకు వెళ్ళి పండగ చేసుకుంటారు. అలాగే అదేదో పాత సామెత చెప్పినట్టు. పదుగురాడిన మాట పాడియై వర్ధిల్లు అన్నట్టు.. పది మంది గొఱెని కుక్క అంటే ఎవ్వరికైనా అనుమానం వస్తుంది, ఎందుకు పది మంది ఇలా అంటున్నారో అని. అలాంటి మూల కధనే ఆధారంగా చేసుకుని నిర్మించిన సినిమా ఇది. నాలాంటి వాడు ఈలాంటి సినిమాని ఓ పది నిమిషాలు కూడా చూడడేమో.. కాకపోతే ఈ సినిమా ముగింపు చాలా చిత్రంగా ఉంది.

సాధారణంగా సినిమాలు రెండు రకాలుగా ఉంటాయన్నది నా అభిప్రాయం. ఒకటి కామెడీ అయితే మరొకటి ట్రాజడీ. ఈ సినిమా చూసిన తరువాత నాకు మూడో రకం కూడా ఉంటుందనిపించింది. అదేమిటంటే కన్ఫూజింగ్ అని. నెను వృత్తి పరంగా నాకు రిపోర్ట్ చేసే డవలపర్స్ అందరికీ ఒక మాట చెబుతూ ఉంటాను, అదేమిటంటే, వీలైతే ఎదుటి వారికి మీ విషయాన్ని కన్‍ఫర్మ్ చెయ్యండి వీలు కాని పక్షంలో కన్‍ఫ్యూజ్ చెయ్యండి అని. అలా ఈ సినిమా పలు సార్లు చూసిన తరువాత కూడా కన్‍ఫ్యూజింగానే ఉందంటే, దాని వెనుక పలు కారణాలు ఉండి ఉంటాయి. వాటిల్లో మొదటిది.. అయితే, నా బుఱ పీత బుఱ అయ్యినా అయి ఉండాలి లేదా తీసినవాళ్ళు ఉద్దేశ్య పూర్వకంగా అర్దం కాకూడదనే తీసి ఉండాలి. ఏది ఏమైనా అనవసరంగా రిస్క్ తీసుకున్ననేమో అనిపించింది. ఈ సినిమాని చూసినందులకు చింతిస్తున్నాను. ఈ సినిమా నేను చూసాను అన్న విషయం మర్చిపోవడానికి చాలా కాలం పడుతుందేమో!!

పరమ చెత్త సినిమా. అస్సలు ఇలాంటి సినిమాని జనాలు చూడటానికి అనుమతినిచ్చిన సెన్సార్ బోర్డ్ వారిని అనాలి. ఇలాంటి సినిమాని అనుమతించారంటే ఈ సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఎంతటి సున్నిత మనస్కులో అర్దం అవుతోంది. అంతే కాకుండా ఇలాంటి పైశాచిక సినిమాని తీసిన దర్శకుడిని అనాలి.. వీరందరికన్నా పైశాచికంగా సినిమా కధని రచించిన కధా రచయతని కూడా అనాలి.. వీరేంత వికృత మనుష్యులో అని. ఇలా ఈ సినిమాలో బోళుడంత చెత్త ఉన్నా, సినిమాటోగ్రఫీ పరంగా అలాగే ఫొటోగ్రఫీ పరంగా ఈ సినిమా భలే ఉంది అని చెప్పక పోయినా ఎంతో కొంత శ్రమ పడ్డారని మాత్రం చెప్ప గలను.

ఇదే పెద్ద ఎఛీవ్‍మెంట్ అనుకుంటే నేను పిల్లాడిగా ఉన్నప్పుడే తెలుగు సినిమాలను ఓ ఆటాడుకున్న విఠలాచార్య మ్రుందు వీరు ఎందుకూ పనికి రారు అన్నది నా అభిప్రాయం. కాకపోతే విఠలాచార్య గురించి వీరికి తెలియదు కాబట్టి వీరు బాగానే తీసారు అని చెప్పుకోవచ్చు. కాకపోతే మన విఠలాచార్యకు కొన్ని విలువలున్నాయి, కానీ షట్టర్ ఐలాండ్ సినిమా తీసిన దర్శకునికో లేదా సినిమాకు కధను చేకూర్చిన కధా రచయితకు విలువలు అంటే ఏమిటో తెలియదేమో అనిపిస్తోంది.

ఫైనల్‍గా ఒక్కటే ఒక విషయం. ఎవ్వరూ ఈ సినిమాని చూడవద్దని ప్రార్ధన. ఈ సినిమాపై ఇంత రివ్యూ వ్రాసిన నా కాలం వృధా.. ఈ సినిమా చూసిన నా సమయం వృధా.. నా ఈ రివ్యూ చదివిన మీ సమయం కూడా వృధానే.. అలా అన్ని వృధా అన్నంత మాత్రాన మీ స్పందన కూడా వృధా అనుకోవద్దు. ఏదో ఒకటి స్పందించండి. మరో పోస్టు వచ్చేంత వరకూ సెలవు..

ఫైనల్‍గా ఒక్కటే ఒక విషయం. ఎవ్వరూ ఈ సినిమాని చూడవద్దని ప్రార్ధన.

ఇన్‍సెప్షన్ - రివ్యూ

inception

మరో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సినిమా. ఇది నా నోటి నుంచి వెలువడిన మొదటి అభిప్రాయం. ఈ సినిమా మొత్తం కలలు మరియు కలలలోని కలల గురించి. బాగుంది. విజ్యువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కధలోని కొన్ని అంశాలు ఆలోచింప జేసివిగా ఉన్నాయి.

ఈ సినిమా కనుక అవతార్ నిర్మించిన జేమ్స్ కేమరూన్ అయితే కనుక ఇంకా బాగా తీసేవాడు. అన్నింటికన్నా మించి కధని రక్తి కట్టించే విధంగా సన్నివేశాలను సృష్టించడమే కాకుండా వాటిని వ్రాసిన కధకుడి ఆలోచనలో ఉన్నట్టు తీసిన స్క్రీన్ ప్లే హెడ్ టీమ్‍ని మెచ్చుకోకుండా ఉండలేము.

ఇందులోని కొన్ని కొన్ని సన్నివేశాలలో నాకు చాలా నవ్వు వచ్చింది. ఒక సారి విలన్ కలలో ఉన్నాననుకుంటే, కాదు నువ్వు నా కలలో ఉన్నావు అని సన్నివేశాన్ని మార్చడం భలే పసందుగా ఉంది.

మరోశారి ఏనుగుల గురించి ఆలోచించద్దు అని ఓ పాత్ర మరో పాత్రతో చెపి, ఇప్పుడు నువ్వేమి ఆలోచిస్తున్నావు అని అంటే.. ఏనుగుల గురించి.. అని సమాధానం ఇచ్చినప్పుడు.. ఆ ఆలోచన స్వతహాగా నీది కాదు. కానీ నువ్వు ఆలోచించాలని నేను అలా ఆలోచించోద్దు అని అనగానే నువ్వు ఆలోచించడం మొదలుపెడతావు.. ఇదిగో ఇలా నీకు తెలియకుండా నీలో చాలా ఆలోచనలను ఎదుటివారు నీ మసిష్కంలో నాటి పోతే నువ్వు వాటిని పెంచి పోషించి పెద్దవి చేస్తున్నావు. ఆ విధంగా నీలోని భావాలకు అలాగే ఆలోచనలకు వేరేవ్వరో ఇన్సెప్షన్ అని చెబుతాడు.

ఇదిగో ఇలా కొన్ని కొన్ని సీన్లు మిమ్మల్ని వద్దనకుండానే ఆలోచింప చేస్తాయి. కానీ ఈ సినిమా నాకు బోర్ కొట్టింది కాబట్టి రెండు ఇంటర్వెల్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఈ సినిమా ఆడే ధియేటర్లలో రెండు ఇంటర్వెల్స్ ఉంటే ఈ సినిమా ఆడుతుంది. లేక పోతే ఐ యామ్ నాట్ ష్యూర్ ఎబౌట్ ద ఫ్యూఛర్ ఆఫ్ ద మూవి. ఆఖరిగా అందిన సమాచారమేమిటంటే, నూట అరవై మిలియన్ డాలర్లు పెట్టి సినిమా తీస్తే, చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధానంగా మొదటి వారాంతపు కలక్షన్లు దాదాపు డెభై మిలియన్లు మాత్రమే వచ్చాయి, కాకపోతే ఆడ్స్ ద్వారా ఓ వంద మిలియన్లు సంపాదించుకున్నారు. అలా మొత్తం మీద చేతులు కాల్చుకోకుండానే బయట పడ్డారు మన వార్నర్ బ్రదర్స్

నా రెకమెండేషన్ అయితే ఇంటలిజెంట్ అయిన అమ్మాయితో ఈ సినిమా చూడండి లేదా ఇంటలిజెంట్ అయిన అబ్బాయితో చూడండి అదీ ఇదీ కాకపోతే మీరే ఇంటలిజెంట్‍గా ఆలోచించేటట్టైతే చూడండి, నాకు బోరు కొట్టింది అంటే నేను అంత ఇంటలిజెంట్ కాదన్న విషయం ఎప్పుడో అర్దం అయ్యింది కాబట్టి నన్ను “.. ఇంటలిజెన్స్ ని సినిమాని కలిపావు మరి తమరెట్లా చూశారో!!” అని ప్రశ్నించక ముందే నాకు బోర్ కొట్తిందని చెప్పానన్న మాట. నా ఈ ఇంటలిజెంట్ రివ్యూ ఎలా ఉంది?

సాల్ట్ – ఆంగ్ల సినిమా రివ్యూ

salt యాంజెలీనా జోలీ ముఖ్య పాత్రలో మరియు లీడింగ్ పాత్రలో నటించిన సాల్ట్ సినిమాని ఇవాళ చూసాను.

జనరల్ గా నాకు సినిమాలపై రివ్యూలు వ్రాసేంత పరిజ్ఞానం లేదు, కానీ ఈ రివ్యూ వెనక ఓ ఆంతర్యం ఉంది.

నేను స్వతహాగా యాంజెలీనీ జోలీ అభిమానిని.

నేను అభిమానించే అతికొద్ది మంది నటులలో ఈమె ఒకతి. అలాగే మన కమల్ హాసన్ మరొకరు. నేను ఇలా అభిమానించడానికి ఉండాల్సిన అర్హతలేమిటంటే .. ఒక్కటే.. అది వైవిధ్యం. ఇలా వైవిధ్యంగా నటించే వ్యక్తులలో నాకు నచ్చే వారు అక్కినేని నాగేశ్వర రావు గారు. స్వతహాగా దేవుడంటే నమ్మకం లేకపోయినా ఓ పరమ భక్తుని వేషం వెయ్యడమే కాకుండా అందర్నీ మెప్పించడం వీరి నటనా ప్రజ్ఞని చెప్పకనే చెబుతుంది. అలా తమ ప్రజ్ఞని తమ చిత్రాల ద్వారా తెలియ జేసే నటులలో ఒకరు యాంజెలీనా జోలి అని నా నమ్మకం. నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తాను కాబట్టి నేను మరియు నా అభిప్రాయాలు తప్పు కావచ్చు.

కానీ నేను ఓ సాధారణ సినిమా వీక్షకుడిని. అలాగే నాకు కొన్ని అభిరుచులు ఉంటాయి. అలాంటి అభిరుచుల వెనకాల నేను ఈ అమ్మాయి నటనకు అంతే కాకుండా ఈ అమ్మాయి ఎంచుకునే పాత్రలకు నేను ఓ అభిమానిని. ఎంత మంది అమ్మాయిలు ఈ అమ్మాయి లాగా ఆలోచిస్తారో గాని.. మన దేశంలో నాకు ఈ అమ్మాయి లాంటి అమ్మాయి మరొక వ్యక్తి కనబడింది. అది మరెవ్వరో కాదు, సుస్మితా సేన్. అప్పుడప్పుడు నేను నా భార్యతో చెబుతూ ఉంటాను, ఏమని అంటే, ఒక వేళ నేను నా భార్యని కనుక పెళ్ళి చేసుకోక పోతే అచ్చంగా సుస్సునే చేసుకుంటానని. అదేదో పాత సామేత చెప్పినట్టు, నేను మన సుస్సు లవ్వులో ఉన్నాం.. ఎటోచ్చి సుస్సుకే తెలియదు నేను లవ్ చేస్తున్నానన్న విషయం. కానీ మా లవ్వు ఫిఫ్టీ పర్సంట్ సక్సస్ (నా వైపు నుంచి). ఇక నా ఫీలింగ్స్ ప్రక్కన పెడితే, ఒక్క విషయం .. నేను మొదటి సారి యాంజలీనా జోలీ నటించిన టూంబ్ రైడర్ చూసిన తరువాత ఈమె ఫాన్ అయ్యాను.

ఇలా అభిమానిగా మారడం వెనకాల పలు కారణాలున్నాయి. మొదటిగా ఈ అమ్మాయి, సాధారణ అమ్మాయిలలాగా కధా ప్రాధాన్యమైన సినిమాలు మాత్రమే చెయ్యకుండా యాక్షన్ పూరితమైన సినిమాలు చేస్తుంది అనేది మొదటి అంశమైతే, మరొకటిది .. ఒక నల్ల జాతి పిల్లని దత్తత తీసుకోవడం. అంతే కాకుండా ముచ్చటగా మూడో సారిగా ఈ అమ్మాయి ఓ యాక్షన్ హీరోని పెళ్ళి చేసుకుంది. అదేనండి మన బ్రాడ్ పిట్, ఈమె మూడో భర్త. ఇక్కడ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం ముఖ్యం కాకపోయినా యాక్షన్ సినిమాలు చేసే మరో హీరోని చేసుకుంది అనేది ముఖ్యం. ఈ అమ్మాయి మిగతా ఇద్దరు మొగుళ్ళతో మూడు మూడేళ్ళకు మించి కాపురం చేయక పోయినా మన క్రూజ్ గారితో మాత్రం 2005 నుంచి కలసి కాపురం చెయ్యడమే కాకుండా భాద్యతాయుత మైన మరో పాత్రని నిజజీవితంలో పోషిస్తోంది అనేది మరో అంశం. అంతే కాకుండా ఈ అమ్మాయి అచ్చంగా ఆరుగురు పిల్లల తల్లి అంటే మీరెవ్వరూ నమ్మకపోవచ్చు. ఇందిలో ముగ్గురికి ఈమె స్వతహాగా జన్మనిచ్చిన తల్లి అయితే మరో ముగ్గురిని ఈమె దత్తత తీసుకుంది. ఈమె మొదటి కాన్పులో ఒక అమ్మాయికి తల్లైతే మరో కాన్పులో కవలలకు తల్లైంది. ఇలా ముగ్గురికి తల్లి అవ్వడమే కాముండా మరో ముగ్గురిని ఈమె దత్తత తీసుకుంది. మొదటిసారిగా 2002 లో ఇమె కంబోడియా దేశస్తురలైన ఒక అబ్బాయిని దత్తతీసుకుంటే, మరోసారి ఇథియోపియా దేశం నుంచి మరో అమ్మాయిని.. అంతే కాకుండా వియత్నాం దేశం లోని ఓ మూడేళ్ళ అబ్బాయిని ఆఖరి సారిగా దత్తత తీసుకుంది.

ఇక ఈ అమ్మాయి గురించి వ్రాయడం ప్రక్కన పెట్టి, సినిమా విషయానికి వస్తే.. మొత్తం మీద మూడు యాక్షన్ సీన్లు మాత్రమే ఉన్నాయి. మొదటి యాక్షన్ సీక్వెన్స్ ఇరవై మూడో నిమిషంలో మొదలైతే రెండొవ సీక్వెన్స్ అచ్చంగా నలభై ఆరో నిమిషంలో సాగుతుంది. ఆఖరి యాక్షన్ సీక్వెన్స్ మరో ఇరవైయ్యవో నిమిషంలో ఉంటుంది. నేను ఈ అమ్మాయి సినిమాలను ఒక్క యాక్షన్ కోసం మాత్రమే చూస్తాను. ఇందు వల్ల కొద్దిగా డిజ్జప్పాయింట్ అయ్యాను. కాకపోతే పాత సినిమాలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను ఎక్స్యూజ్ చేసాను. ఇకపైన అయినా కొంచం జాగ్రత్త తీసుకుంటుందని తలుస్తాను.

మొత్తం మీద నూట పది మిలియన్ల డాలర్లతో నిర్మితమైన వంద నిమిషాల నిడివిగలిగిన సినిమా నన్ను మెప్పించ లేక పోయింది. కాకపోతే నాకు నచ్చిన విషయాలు ఈ క్రింది విధంగా..

౧) ఈ అమ్మాయి తన శరీర ఆకృతిపై తగినంత శ్రద్ద వహించింది అని వేరే చెప్పనక్కరలేదు

౨) యాక్షన్ సీన్లు ఎవ్వరు రూపొందించారో కానీ బాగా చిత్రీకరించారు

౩) పగటి పూట చిత్రీకరిస్తూ చుట్టు అంతటి ట్రాఫిక్ ఉంచుకోవడం బాగుంది

ఇక నచ్చని విషయాలకొస్తే..

౧) ఈ అమ్మాయిని చూడడానికి వచ్చేదే యాక్షన్ సీన్ల కోసం అలాంటిది.. సినిమా మొత్తంలో మూడే మూడు యాక్షన్ సీక్వెస్న్ ఉంచడం మైనస్ పాయింట్

౨) మొదటి యాక్షన్ సీక్వెన్స్ కోసం అచ్చంగా 23 నిమిషాలు ఎదురు చూడాల్సి రావడం నా పేషన్సీకి పరీక్షే అయ్యింది

౩) సాధారణంగా ఈ సినిమా ట్రాడెజీ అంటే నమ్మ బుద్దు కాలేదు.. క్లైమాక్స్ అర్దం కాలేదు. చాలా ప్రశ్నలు!!

అలా .. ఎన్నో విషయాలు నన్ను డిజప్పాయింట్ చేసాయి. ఇక మీకు వీలైతే ఒక్క సారి చూడండి అని మాత్రం చెబుతాను. ఇలా చెబటం వెనకాల ఒకటే ఒక పరమార్థం.. అదేనండి నూట పది మిలియన్లతో నిర్మించిన సినిమా అన్న ఒక్కటే అర్దం.

రోబో పాటలు - రివ్యూ

ఇవాళ డెల్ వాడినుంచి కొత్త లాప్‍టాప్ షిప్ అయ్యి వచ్చింది. దానిలో సౌండ్ ఫీచర్ అదిరింది. సరే సినిమా పాటలు ఎలా వినిపిస్తుందో చూద్దాం అని రాగా డాట్ కాం కి వెళ్ళి లైవ్ రేడియో పెడదాం అనుకున్నా. తీరా చూస్తే రొబొ ఆడియో విడుదలైంది అని అక్కడ వార్త నన్ను మొట్ట మొదటగా ఆ పాటలే వినాలి అనిపించేటట్టు చేసింది. డౌన్లోడ్ చేసుకోనవసరం లేకుండా రాగా వాడే ఆన్ లైన్లో ఈ పాటలను వినిపిస్తున్నాడని తెలిసి అన్ని పాటల్ని సెలక్ట్ చేసి స్టార్ట్ చేసాను. యధావిధిగా మొట్ట మొదటగా ఏదో యాడ్ వస్తుంది. ఆ వచ్చిన యాడ్ ఏదో మొటర్ సైకిల్ వాడిది, కానీ అందులో కూడా రకరకాల సౌండ్స్ ఉన్నాయి. అ సౌండ్స్ అన్నీ డెల్ వాడి ఇన్సెరాన్ లో వింటుంటే.. అబ్బా.. అద్దిరిందనుకోండి. ఇక లాప్‍టాప్ సంగతి ప్రక్కన పెట్టి మన రోబో పాటల విషయానికి వద్దాం.

rajini-robot

జనరల్ గా చాలా చోట్ల లేటెస్ట్ పాటలు ఇంన్స్టెంట్ గా అంతర్జాలంలో దించుకోవడానికి దొరుకుతాయి. ఈ సినిమా పాటలు మాత్రం శుక్రవారం రిలీజ్ అయినా చాలా చోట్ల లింకులు సరిగా పని చెయ్యలేదు. దీనికి ఒకటే కారణం ఎంతమంది ఒకే సమయంలో డౌన్లోడ్ చేసుకోవడమే. అంటే దీన్ని బట్టి మనకు ఏమి అర్దం అయ్యిందంటే, ఆడియో రిలీజ్ అయ్యి రెండు రోజులై డౌన్లోడ్ కి బ్యాండ్ విడ్త్ దొరకలేదంటే, ఈ పాటలు ఎంత హాట్ కేక్స్ లాగా డౌన్లోడ్ అవుతున్నాయో చెప్పకనే చెబుతున్నాయి.

ఎలాగో రెండు గంటలు కుస్తే పడ్డ తరువాత ఓ లింకు ద్వారా అన్ని దొరికాయి. ఈ సమయంలో రాగా వాడు ఈ పాటల్ని స్ట్రీం చేస్తునే ఉన్నాడు. ఈ సినిమాకి సంగీతాన్ని మన రెహమాన్ అందిచారని చెప్పకనే చెబుతోంది. ఈ పాటలు మొదటి సారి వింటే అర్దం కావు. అలా మొదటి సారిగా ఏ పాటలైనా అర్దం కాక వినగా వినగా అర్దం అయ్యే పాటలు మన రెహమాన్ ఒక్కరే చెయ్యగలరు. ఈయనకు కొంచం వెస్ట్రన్ వాసన బాగా తెలుసు కాబట్టి ఈ పాటలన్నింటిలో దాదాపు ఆ శైలి లోనే చెయ్యప్రయత్నించి దానికి కొంచం శాస్త్రీయ టచ్ ఇచ్చారు.

ఈ పాటలు వింటుంటే కొత్తగా అనిపించలేదు. పాత దొంగ దొంగ సినిమాలోని రిధం కొంచం జ్ఞప్తికి వచ్చింది అలాగే మన పవన్ కళ్యాణ్ సినిమా కొమరం పులి పాటలు కూడా కొంచం గుర్తుకు వచ్చాయి మొత్తం మీద ఈ పాటలు అర్దం అవ్వాలంటే దాదాపు ఓ పది సార్లైనా వినాల్సిందే. ఈ రివ్యూ వ్రాసే సమయానికి ఈ పాటలు ఓ పాతిక సార్లు రివైండ్ అయ్యి ఉంటాయి. ఒక్కొపాట విషయనికి వస్తే..

ఓ మరమనిషి .. టైటిల్ పాటని జాగ్రత్తగా ఆలోచించి బాలు చేత పాడించడం భలే టాక్టీస్ అనిపించింది. బాలు గారి సంగతి తెలిసిందే కదా. ఎంతటి కష్టమైన పాటనైనా అవలీలగా పాడి మెప్పించగలరని. ఈ పాటలో రెహమాన్ కన్నా నాకు బాలుగారే ఎక్కువగా కనిపించారంటే అది అతిశయం కాదని మీరు ఒప్పుకుంటారు. “మగాడు కన్న మగవాడ..” అన్న పదాల ప్రయోగం విచిత్రంగా ఉంది. వాయిద్యాల స్థాయి అవసరానికి తగ్గట్టు ఉంది. అలాగే మన బాలు గారు ఉన్నట్టు తెలియడానికి “..పితృభాష తెలుగు కదా..” అని ఓ చోట వాడటం భలేగా ఉంది. మనం స్వతహాగా మాతృ భాష అంటాం, దీనికి భిన్నంగా పితృభాష అనే పదాన్ని ప్రయోగించారంటే అది ఖచ్చితంగా బాలుగారు ఇన్ఫ్లుయన్సే..

+౧

నీలో వలపు .. ఎందుకో ఈ పాట ఇప్పటికీ నాకు అర్దం కావటం లేదు. ఇది డ్యుయెట్ అయ్యింటుంది. ఇలాంటి పాటని ఎలా చిత్రికీరంచి ఉంటారో ఊహించుకోవాలంటే భయంగా ఉంది. ఏదో పాట నుంచి కాపీ కొట్టారని మాత్రం నా మది చెబుతోంది. అది ఏ పాటో జ్ఞప్తికి రావటం లేదు. కాని ఇది ఖచ్చితంగా కాపీ పాటే..

-౧

ఇనుపులో ఓ హృదయం .. వాయిద్యాల ప్రయోగం మరియు ఆంగ్ల భాషలోని లిరిక్స్ నాకు నచ్చని విషయాలు. ఈ రెండు ప్రక్కన పెట్టి తెలుగు పదాలున్న పాట మాత్రం యావరేజిగా ఉంది.

+-౧

హరిమో హరిమో.. ఈ పాటలో ఏమి చెబుదాం అని ప్రయత్నించారో అర్దం కాలేదు. “యంత్రుడు” అనే పదం ద్వారా యంత్రాన్ని పురుషుడ్ని చేసారు. కానీ ఈ పాటని సౌండ్ తగ్గించి వింటే బాగుంటుంది. అంటే సౌండ్ ఫుల్‍గా కాకుండా కొంచం తగ్గించి సరౌండ్ తీసేసి వింటే వినడానికి బాగేనే ఉంది. ఈ పాట దొంగ దొంగ సినిమాలోని ఓ పాటకు కొంచం అటు ఇటుగా ఉందనిపిస్తోంది.

+౧

కిలిమంజారో .. మృదువుగా సాగింది. ఈ పాటలో లిరిక్స్ పెద్ద పీట వేసుకుని వినడానికి ఇంపుగా ఉన్నాయి. వాయుద్యాల గోల ఎక్కువగా లేకపోవడం వల్ల నాకు నచ్చింది. కానీ పదప్రయోగాలు ఏవో తికమకగా ఉన్నా వినడానికి సొంపుగానే ఉన్నాయి.

+౧

బూమ్ బూమ్ రొబొ డా .. ఈ పాట విన్నప్పుడల్లా నాకు బాయ్స్ లోని పాటనుంచి కాపీ కొట్టారేమో అన్న అనుమానం వచ్చింది. ఈ పాటలో ఒక చోట మాతృబిడ్డవా అన్న వాడుక మరో పాటలో పితృభాష అంటూ వాడటం బటి చూస్తుంటే పాటలకు మాటలు కూర్చిన వారిలో కొంచం సమన్వయం లోపించినట్టు నాకు అనిపించింది. ఈ పాట ప్రారంభంలో వెస్ట్రన్ స్టైల్ లో ఉన్నా మధ్యలో మళ్ళీ మామూలు స్థాయికి చేరుకుని, ఫరవాలేదనిపించింది

+-౧

మొత్తం మీద ఆరు పాటల్లో రెండు న్యూట్రల్ గా అనిపించి పాయింట్లు కొట్టకపోవడంతో మూడు ప్లస్లలోంచి ఒక మైనస్ తీసేస్తే రెండు పాయింట్లతో ఫరవాలేదు అనిపించింది. ఈ పాటలు బాగా రావాలన్న తపన మరియు పడ్డ శ్రమ కనబటం లేదు. ఎందుకో నాకు రెహమాన్ ఈ సినిమాకి పెద్ద మనసు పెట్టి పని చెయ్యలేదనిపిస్తోంది. రెహమాన్ స్వతహగా కొత్తదనానికి పెద్ద పీట వేసే మనిషి అని నా అభిప్రాయం, కానీ ఈ సినిమా విషయంలో పాత పాటల ట్యూన్స్ కొన్ని వెలికి తీసి వాటికి కొత్త రూపం ఇచ్చి ప్రజెంట్ చేసారేమో అని నాకు అనిపించింది.

ఆఖరికి ఈ సినిమా చూడాలన్న కుతూహలం కలగటం లేదు అందువల్ల ఇది బాగానే ఆడుతుంది. ఎందుకంటే, నేను చూడాలనుకున్న బాబా బొల్తా పడింది, అంతే కాకుండా నేనేదాఇతే సినిమా చూడాలని అనుకుంటానో అది ఫ్లాప్ అవుత్తుంది. మొత్తం మీద దాదాపు నూటనలభై కోట్ల ఖర్చుతో రూపొందించిన రోబో బాగా కాకపోయినా ఓపెనింగ్స్ ద్వారా కనీసమొత్తం తెచ్చుకుంటుందని ఆశిస్తాను. ఒకవేళ ఈ సినిమా హిట్టైతే అప్పుడు యాభైరోజున టికెట్టు దొరికితే చూస్తాను. లేకపోతే ఇంతే సంగతులు.

Clicky Web Analytics