రోబో పాటలు - రివ్యూ

ఇవాళ డెల్ వాడినుంచి కొత్త లాప్‍టాప్ షిప్ అయ్యి వచ్చింది. దానిలో సౌండ్ ఫీచర్ అదిరింది. సరే సినిమా పాటలు ఎలా వినిపిస్తుందో చూద్దాం అని రాగా డాట్ కాం కి వెళ్ళి లైవ్ రేడియో పెడదాం అనుకున్నా. తీరా చూస్తే రొబొ ఆడియో విడుదలైంది అని అక్కడ వార్త నన్ను మొట్ట మొదటగా ఆ పాటలే వినాలి అనిపించేటట్టు చేసింది. డౌన్లోడ్ చేసుకోనవసరం లేకుండా రాగా వాడే ఆన్ లైన్లో ఈ పాటలను వినిపిస్తున్నాడని తెలిసి అన్ని పాటల్ని సెలక్ట్ చేసి స్టార్ట్ చేసాను. యధావిధిగా మొట్ట మొదటగా ఏదో యాడ్ వస్తుంది. ఆ వచ్చిన యాడ్ ఏదో మొటర్ సైకిల్ వాడిది, కానీ అందులో కూడా రకరకాల సౌండ్స్ ఉన్నాయి. అ సౌండ్స్ అన్నీ డెల్ వాడి ఇన్సెరాన్ లో వింటుంటే.. అబ్బా.. అద్దిరిందనుకోండి. ఇక లాప్‍టాప్ సంగతి ప్రక్కన పెట్టి మన రోబో పాటల విషయానికి వద్దాం.

rajini-robot

జనరల్ గా చాలా చోట్ల లేటెస్ట్ పాటలు ఇంన్స్టెంట్ గా అంతర్జాలంలో దించుకోవడానికి దొరుకుతాయి. ఈ సినిమా పాటలు మాత్రం శుక్రవారం రిలీజ్ అయినా చాలా చోట్ల లింకులు సరిగా పని చెయ్యలేదు. దీనికి ఒకటే కారణం ఎంతమంది ఒకే సమయంలో డౌన్లోడ్ చేసుకోవడమే. అంటే దీన్ని బట్టి మనకు ఏమి అర్దం అయ్యిందంటే, ఆడియో రిలీజ్ అయ్యి రెండు రోజులై డౌన్లోడ్ కి బ్యాండ్ విడ్త్ దొరకలేదంటే, ఈ పాటలు ఎంత హాట్ కేక్స్ లాగా డౌన్లోడ్ అవుతున్నాయో చెప్పకనే చెబుతున్నాయి.

ఎలాగో రెండు గంటలు కుస్తే పడ్డ తరువాత ఓ లింకు ద్వారా అన్ని దొరికాయి. ఈ సమయంలో రాగా వాడు ఈ పాటల్ని స్ట్రీం చేస్తునే ఉన్నాడు. ఈ సినిమాకి సంగీతాన్ని మన రెహమాన్ అందిచారని చెప్పకనే చెబుతోంది. ఈ పాటలు మొదటి సారి వింటే అర్దం కావు. అలా మొదటి సారిగా ఏ పాటలైనా అర్దం కాక వినగా వినగా అర్దం అయ్యే పాటలు మన రెహమాన్ ఒక్కరే చెయ్యగలరు. ఈయనకు కొంచం వెస్ట్రన్ వాసన బాగా తెలుసు కాబట్టి ఈ పాటలన్నింటిలో దాదాపు ఆ శైలి లోనే చెయ్యప్రయత్నించి దానికి కొంచం శాస్త్రీయ టచ్ ఇచ్చారు.

ఈ పాటలు వింటుంటే కొత్తగా అనిపించలేదు. పాత దొంగ దొంగ సినిమాలోని రిధం కొంచం జ్ఞప్తికి వచ్చింది అలాగే మన పవన్ కళ్యాణ్ సినిమా కొమరం పులి పాటలు కూడా కొంచం గుర్తుకు వచ్చాయి మొత్తం మీద ఈ పాటలు అర్దం అవ్వాలంటే దాదాపు ఓ పది సార్లైనా వినాల్సిందే. ఈ రివ్యూ వ్రాసే సమయానికి ఈ పాటలు ఓ పాతిక సార్లు రివైండ్ అయ్యి ఉంటాయి. ఒక్కొపాట విషయనికి వస్తే..

ఓ మరమనిషి .. టైటిల్ పాటని జాగ్రత్తగా ఆలోచించి బాలు చేత పాడించడం భలే టాక్టీస్ అనిపించింది. బాలు గారి సంగతి తెలిసిందే కదా. ఎంతటి కష్టమైన పాటనైనా అవలీలగా పాడి మెప్పించగలరని. ఈ పాటలో రెహమాన్ కన్నా నాకు బాలుగారే ఎక్కువగా కనిపించారంటే అది అతిశయం కాదని మీరు ఒప్పుకుంటారు. “మగాడు కన్న మగవాడ..” అన్న పదాల ప్రయోగం విచిత్రంగా ఉంది. వాయిద్యాల స్థాయి అవసరానికి తగ్గట్టు ఉంది. అలాగే మన బాలు గారు ఉన్నట్టు తెలియడానికి “..పితృభాష తెలుగు కదా..” అని ఓ చోట వాడటం భలేగా ఉంది. మనం స్వతహాగా మాతృ భాష అంటాం, దీనికి భిన్నంగా పితృభాష అనే పదాన్ని ప్రయోగించారంటే అది ఖచ్చితంగా బాలుగారు ఇన్ఫ్లుయన్సే..

+౧

నీలో వలపు .. ఎందుకో ఈ పాట ఇప్పటికీ నాకు అర్దం కావటం లేదు. ఇది డ్యుయెట్ అయ్యింటుంది. ఇలాంటి పాటని ఎలా చిత్రికీరంచి ఉంటారో ఊహించుకోవాలంటే భయంగా ఉంది. ఏదో పాట నుంచి కాపీ కొట్టారని మాత్రం నా మది చెబుతోంది. అది ఏ పాటో జ్ఞప్తికి రావటం లేదు. కాని ఇది ఖచ్చితంగా కాపీ పాటే..

-౧

ఇనుపులో ఓ హృదయం .. వాయిద్యాల ప్రయోగం మరియు ఆంగ్ల భాషలోని లిరిక్స్ నాకు నచ్చని విషయాలు. ఈ రెండు ప్రక్కన పెట్టి తెలుగు పదాలున్న పాట మాత్రం యావరేజిగా ఉంది.

+-౧

హరిమో హరిమో.. ఈ పాటలో ఏమి చెబుదాం అని ప్రయత్నించారో అర్దం కాలేదు. “యంత్రుడు” అనే పదం ద్వారా యంత్రాన్ని పురుషుడ్ని చేసారు. కానీ ఈ పాటని సౌండ్ తగ్గించి వింటే బాగుంటుంది. అంటే సౌండ్ ఫుల్‍గా కాకుండా కొంచం తగ్గించి సరౌండ్ తీసేసి వింటే వినడానికి బాగేనే ఉంది. ఈ పాట దొంగ దొంగ సినిమాలోని ఓ పాటకు కొంచం అటు ఇటుగా ఉందనిపిస్తోంది.

+౧

కిలిమంజారో .. మృదువుగా సాగింది. ఈ పాటలో లిరిక్స్ పెద్ద పీట వేసుకుని వినడానికి ఇంపుగా ఉన్నాయి. వాయుద్యాల గోల ఎక్కువగా లేకపోవడం వల్ల నాకు నచ్చింది. కానీ పదప్రయోగాలు ఏవో తికమకగా ఉన్నా వినడానికి సొంపుగానే ఉన్నాయి.

+౧

బూమ్ బూమ్ రొబొ డా .. ఈ పాట విన్నప్పుడల్లా నాకు బాయ్స్ లోని పాటనుంచి కాపీ కొట్టారేమో అన్న అనుమానం వచ్చింది. ఈ పాటలో ఒక చోట మాతృబిడ్డవా అన్న వాడుక మరో పాటలో పితృభాష అంటూ వాడటం బటి చూస్తుంటే పాటలకు మాటలు కూర్చిన వారిలో కొంచం సమన్వయం లోపించినట్టు నాకు అనిపించింది. ఈ పాట ప్రారంభంలో వెస్ట్రన్ స్టైల్ లో ఉన్నా మధ్యలో మళ్ళీ మామూలు స్థాయికి చేరుకుని, ఫరవాలేదనిపించింది

+-౧

మొత్తం మీద ఆరు పాటల్లో రెండు న్యూట్రల్ గా అనిపించి పాయింట్లు కొట్టకపోవడంతో మూడు ప్లస్లలోంచి ఒక మైనస్ తీసేస్తే రెండు పాయింట్లతో ఫరవాలేదు అనిపించింది. ఈ పాటలు బాగా రావాలన్న తపన మరియు పడ్డ శ్రమ కనబటం లేదు. ఎందుకో నాకు రెహమాన్ ఈ సినిమాకి పెద్ద మనసు పెట్టి పని చెయ్యలేదనిపిస్తోంది. రెహమాన్ స్వతహగా కొత్తదనానికి పెద్ద పీట వేసే మనిషి అని నా అభిప్రాయం, కానీ ఈ సినిమా విషయంలో పాత పాటల ట్యూన్స్ కొన్ని వెలికి తీసి వాటికి కొత్త రూపం ఇచ్చి ప్రజెంట్ చేసారేమో అని నాకు అనిపించింది.

ఆఖరికి ఈ సినిమా చూడాలన్న కుతూహలం కలగటం లేదు అందువల్ల ఇది బాగానే ఆడుతుంది. ఎందుకంటే, నేను చూడాలనుకున్న బాబా బొల్తా పడింది, అంతే కాకుండా నేనేదాఇతే సినిమా చూడాలని అనుకుంటానో అది ఫ్లాప్ అవుత్తుంది. మొత్తం మీద దాదాపు నూటనలభై కోట్ల ఖర్చుతో రూపొందించిన రోబో బాగా కాకపోయినా ఓపెనింగ్స్ ద్వారా కనీసమొత్తం తెచ్చుకుంటుందని ఆశిస్తాను. ఒకవేళ ఈ సినిమా హిట్టైతే అప్పుడు యాభైరోజున టికెట్టు దొరికితే చూస్తాను. లేకపోతే ఇంతే సంగతులు.

6 స్పందనలు:

Vinay Chaganti said...

Thanks for your review. Am refreshed and cautioned reading your post.

చక్రవర్తి said...

వినయ్ చాగంటి గారు,

మీ స్పందన నాకు అర్దం కాలేదు.. కొంచం కఫ్యూజ్ అయ్యాను. వివరించ గలరు. ఏది ఏమైనా మొట్టమొదటిగా స్పందించినందులకు నెనరులు

మధురవాణి said...

ఓ మరమనిషి... పాటలో మీరొకటి గమనించారా? పాట ఇద్దరు పాడుతుంటారు. ఒకటి రోబోని సృష్టించిన సైంటిస్టు, ఇంకోటి ఆ రోబోనే పాడుతుంటాడు. సైంటిస్టు వల్లే పుట్టాడు కాబట్టి, 'మగాడు కన్నా మగవాడా' అన్నారు. నీకు చాలా భాషలు వచ్చు కదా రోబో' అంటే... దానికి సమాధానం గా రోబో 'ఎన్ని భాషలు వచ్చినా నా పితృభాష తెలుగు కదా' అంటాడు. అన్నట్టు, సినిమాలో ఈ రెండు పాత్రల్లో రజనీకాంత్ కనిపిస్తారంటా! :)

ఇంకో పాట బూం బూం రోబో రా..పాట బహుశా రోబోని తయారు చేసాక దాని గురించి వర్ణిస్తూ పాడేది అనుకుంటాను.'పరిణయ ఘడియలు తెలియకముందే నువ్వు మాకు బిడ్డవా!' అని పాడుతుంది అమ్మాయి (హీరోయినేమో మరి!) అది మీరనుకున్నట్టు 'మాతృబిడ్డ' కాదండి.

నేనైతే ఫుల్ మార్కులు వేసేస్తాను పాటలకి. మళ్ళీ మళ్ళీ వింటే మీకూ ఇంకా నచ్చుతాయని నాకనిపిస్తోంది. :)

మధురవాణి said...

అన్నట్టు, హరిమా హరిమా పాటలోనే కాకుండా 'యంత్రుడు' అని మళ్ళీ మళ్ళీ ఎక్కడ వాడినా గానీ.. అదంతా చిట్టి (రోబో పేరు అదే :) రోబోని గురించే కదండీ..
ఇంకోటి.. ఇనుపులో కాదండీ.. రోబో పాడే ప్రేమ గీతం ఇది.. 'ఇనుములో హృదయం మొలిచెనే' అంటూ రోమియో లాగా అమ్మాయి వెంట పడుతున్నాడన్నమాట!

అమర్ (Amar) said...

Source: Raaga.com (they dont stream super qulaity audio..not even 128kbps MP3)

Music System: Dell Inspiron (unless you have some creative sound blaster card on that..its not the best system out there to listen music)

I dont know why you are saying అ సౌండ్స్ అన్నీ డెల్ వాడి ఇన్సెరాన్ లో వింటుంటే.. అబ్బా.. అద్దిరిందనుకోండి.

I think you have to experience more on that..just a thought :-)

యంత్రుడు said...

పిత్రుభాష అని పలకడానికి బాలు ఇంఫ్లుయన్సు కాదు బాబు. అది రోబొ పాడుకునె పాట. దాన్ని తయారు చేసిన వాడు మగాడే కదా(హీరో). దానికి అమ్మ వుండదు కదా! నీలో వలపు దేనికీ కాపీ కాదు. రెహమాన్ స్వరపరిచిన పాత గీతాల్లో రాగాలు గుర్తుకొస్తే అది కాపీ అవ్వదు.just average stuff.

 
Clicky Web Analytics