ఇన్‍సెప్షన్ - రివ్యూ

inception

మరో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సినిమా. ఇది నా నోటి నుంచి వెలువడిన మొదటి అభిప్రాయం. ఈ సినిమా మొత్తం కలలు మరియు కలలలోని కలల గురించి. బాగుంది. విజ్యువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కధలోని కొన్ని అంశాలు ఆలోచింప జేసివిగా ఉన్నాయి.

ఈ సినిమా కనుక అవతార్ నిర్మించిన జేమ్స్ కేమరూన్ అయితే కనుక ఇంకా బాగా తీసేవాడు. అన్నింటికన్నా మించి కధని రక్తి కట్టించే విధంగా సన్నివేశాలను సృష్టించడమే కాకుండా వాటిని వ్రాసిన కధకుడి ఆలోచనలో ఉన్నట్టు తీసిన స్క్రీన్ ప్లే హెడ్ టీమ్‍ని మెచ్చుకోకుండా ఉండలేము.

ఇందులోని కొన్ని కొన్ని సన్నివేశాలలో నాకు చాలా నవ్వు వచ్చింది. ఒక సారి విలన్ కలలో ఉన్నాననుకుంటే, కాదు నువ్వు నా కలలో ఉన్నావు అని సన్నివేశాన్ని మార్చడం భలే పసందుగా ఉంది.

మరోశారి ఏనుగుల గురించి ఆలోచించద్దు అని ఓ పాత్ర మరో పాత్రతో చెపి, ఇప్పుడు నువ్వేమి ఆలోచిస్తున్నావు అని అంటే.. ఏనుగుల గురించి.. అని సమాధానం ఇచ్చినప్పుడు.. ఆ ఆలోచన స్వతహాగా నీది కాదు. కానీ నువ్వు ఆలోచించాలని నేను అలా ఆలోచించోద్దు అని అనగానే నువ్వు ఆలోచించడం మొదలుపెడతావు.. ఇదిగో ఇలా నీకు తెలియకుండా నీలో చాలా ఆలోచనలను ఎదుటివారు నీ మసిష్కంలో నాటి పోతే నువ్వు వాటిని పెంచి పోషించి పెద్దవి చేస్తున్నావు. ఆ విధంగా నీలోని భావాలకు అలాగే ఆలోచనలకు వేరేవ్వరో ఇన్సెప్షన్ అని చెబుతాడు.

ఇదిగో ఇలా కొన్ని కొన్ని సీన్లు మిమ్మల్ని వద్దనకుండానే ఆలోచింప చేస్తాయి. కానీ ఈ సినిమా నాకు బోర్ కొట్టింది కాబట్టి రెండు ఇంటర్వెల్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఈ సినిమా ఆడే ధియేటర్లలో రెండు ఇంటర్వెల్స్ ఉంటే ఈ సినిమా ఆడుతుంది. లేక పోతే ఐ యామ్ నాట్ ష్యూర్ ఎబౌట్ ద ఫ్యూఛర్ ఆఫ్ ద మూవి. ఆఖరిగా అందిన సమాచారమేమిటంటే, నూట అరవై మిలియన్ డాలర్లు పెట్టి సినిమా తీస్తే, చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధానంగా మొదటి వారాంతపు కలక్షన్లు దాదాపు డెభై మిలియన్లు మాత్రమే వచ్చాయి, కాకపోతే ఆడ్స్ ద్వారా ఓ వంద మిలియన్లు సంపాదించుకున్నారు. అలా మొత్తం మీద చేతులు కాల్చుకోకుండానే బయట పడ్డారు మన వార్నర్ బ్రదర్స్

నా రెకమెండేషన్ అయితే ఇంటలిజెంట్ అయిన అమ్మాయితో ఈ సినిమా చూడండి లేదా ఇంటలిజెంట్ అయిన అబ్బాయితో చూడండి అదీ ఇదీ కాకపోతే మీరే ఇంటలిజెంట్‍గా ఆలోచించేటట్టైతే చూడండి, నాకు బోరు కొట్టింది అంటే నేను అంత ఇంటలిజెంట్ కాదన్న విషయం ఎప్పుడో అర్దం అయ్యింది కాబట్టి నన్ను “.. ఇంటలిజెన్స్ ని సినిమాని కలిపావు మరి తమరెట్లా చూశారో!!” అని ప్రశ్నించక ముందే నాకు బోర్ కొట్తిందని చెప్పానన్న మాట. నా ఈ ఇంటలిజెంట్ రివ్యూ ఎలా ఉంది?

11 స్పందనలు:

Anonymous said...

its really a damn good movie

James cameron lost his plot boss
he cant

Anonymous said...

పై వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

సవ్వడి said...

i like this movie verymuch... i did not get bore at any time.


Cameron's Avatar is base less movie. i did not like it.

కన్నగాడు said...

అనానిమస్ అభిప్రాయమే నాది కూడా, కామెరాన్ అద్భుతమైన సినిమాలందించాడు కాని నాకు తెలిసినంత వరకు సంక్లిష్టమైన స్క్రీన్।ప్లేల జోలికి వెళ్ళకుండా తీసాడు. అతనింత బాగా తీయగలడని అనుకోను. ఈ చిత్రానికి స్క్రీన్।ప్లే రాసుకున్నది దర్శకుడే.

ఓ బ్రమ్మీ said...

మొదటి / రెండవ అజ్ఞాత గారు,

కామరూన్ ఎక్కడ లాస్ అయ్యారో వివరించగలరా..

సవ్వడి గారు,

మీకు కియాను రీవీస్ నటించిన మేట్రిక్స్ సినిమా తెలుసనుకుంటాను. అవతార్ లోని కొన్ని మూల ఆలోచనలు ఈ సినిమా నుంచే ప్రేరేపించబడ్డాయి. అందువల్ల మనం సినిమాలను సినిమాలుగా మాత్రమే చూడాలి తప్పితే బేస్ ఉందా లేదా అని చూడకూడదు. ఏమైనా మీ స్పందనకు నెనరులు

కన్నగాడు గారు,
కామరూన్ పై మీకున్న అభిప్రాయానికి చాలా థాంక్స్. ఏమో!! తియ్యగలడేమో!! స్పందించినందులకు నెనరులు

Boreddy Mahesh Reddy said...

మీ రివ్యూ చూశాను. చాలా బాగుంది. తప్పని సరిగా ఈ సినిమా చూస్తాను.

Anil Dasari said...

Inception is a joke. Go watch 'Shutter Island' instead. Similar story, same lead actor, same obstacles (guilt) but executed very well with a twist in the tail. On the other hand, Inception is a just a mediocre action film with hard to understand lingo thrown in at random. The sound track (by one of my fav composers, Hans Zimmer) is as boring as the movie itself. WB is on a terrific hit streak for almost a decade now. Whatever they touch is turning into gold. I think that magical touch is what saved Inception.

And oh .. Cameron doesn't need to prove anything. He's beyond that.

ఓ బ్రమ్మీ said...

మహేష్ గారు,

ఎలా చూద్దాం అని డిసైడ్ అయ్యారు.. గర్ల్ ఫ్రండ్ తోనా .. లేక మరింకేమైనా..

స్పందించినందులకు నెనరులు

అబ్రకదబ్ర గారు,

ఇదిగో ఇప్పుడే దించుకోవడానికి ప్రయత్నిస్తాను. డీటేల్డ్ గా స్పందించినందులకు నెనరులు. ఆ స్పందనేదో తెలుగులో పెట్టు ఉంటే ఇంకొంచం బాగుండేది. ఇలాగే స్పందిస్తూ ఉండ మనవి

ఓ బ్రమ్మీ said...

అబ్రకదబ్ర గారు,

మీరు ఉదహరించిన సినిమా చూసాను. ఆ సినిమాపై ఓ రివ్యూ కూడా వ్రాస్తున్నాను. ఒక్క ముక్క చెప్పాలంటే షట్టర్ ఐలాండ్ అనే సినిమా పరమ చెత్తగా ఉంది మరియు మరమ పైశాచికంగా ఉంది అనిపిస్తోంది. షట్టర్ ఐలాండ్ సినిమాతో పోల్చి చూస్తే, ఇన్‍సెప్షన్ సినిమా నావరకూ నాకు వంద రెట్లు మెఱుగనిపించింది. ఇన్‍సెప్షన్ సినిమాలో ఎలాంటి పైశాచిక చర్యలు లేవు అంతే కాక మాధమేటికల్ గా ఎన్నో లెక్కలు దాగి ఉన్నాయి. ఇవన్నీ మీలాంటి మేధావికి అర్దం కాకపోవడం నన్ను మీలాంటి వాళ్ళని మేధావి అని అనుకోవడం వృధానేమో అనిపిస్తోంది. మీపై నాకు ఇంతవరకూ మంచి / సత్ భావన ఉంది, ఎప్పుడైతే షట్టర్ ఐలాండ్ గురించి వ్రాస్తూ ఈ సినిమా మెచ్చుకోదగ్గదిగా ఉన్నదన్నారో అప్పుడే మీ స్థాయి అధఃపాతాళానికి పడిపోయింది. నా దృష్టిలో మీస్థాయి పడిపోయినంత మాత్రాన తమరి వ్యక్తిత్వం మారదు కదా.. అందుకే ఓ విన్నపం. వీలైతే ఇలాంటి పైశాచిక సినిమాలను చూడటం మానేయ్యండి. అంతకంటే మరో మనవి లేదు

Anonymous said...

నీ బొంద ఏమిటి ఈ వాగుడు
[ఇన్‍సెప్షన్ సినిమా నావరకూ నాకు వంద రెట్లు మెఱుగనిపించింది. ఇన్‍సెప్షన్ సినిమాలో ఎలాంటి పైశాచిక చర్యలు లేవు అంతే కాక మాధమేటికల్ గా ఎన్నో లెక్కలు దాగి ఉన్నాయి. ఇవన్నీ మీలాంటి మేధావికి అర్దం కాకపోవడం నన్ను మీలాంటి వాళ్ళని మేధావి అని అనుకోవడం వృధానేమో అనిపిస్తోంది. మీపై నాకు ఇంతవరకూ మంచి / సత్ భావన ఉంది, ఎప్పుడైతే షట్టర్ ఐలాండ్ గురించి వ్రాస్తూ ఈ సినిమా మెచ్చుకోదగ్గదిగా ఉన్నదన్నారో అప్పుడే మీ స్థాయి అధఃపాతాళానికి పడిపోయింది. నా దృష్టిలో మీస్థాయి పడిపోయినంత మాత్రాన తమరి వ్యక్తిత్వం మారదు కదా.. ]
ఆయన మేధావని నీకు చెప్పాడా పో పొయ్యి సినిమా హాల్లో టాయిలెట్ దగ్గర నిలబడి అక్కడ కొచ్చే వాళ్ళని చూసి సినిమా విశ్లేషణ చెయ్యి .

Anil Dasari said...

Many thanks.

 
Clicky Web Analytics