షట్టర్ ఐలాండ్.. రివ్యూ

 

Shutter-Island ఈ సినిమాని చూడమని ఓ తెలుగు బ్లాగర్ సజస్ట్ చేస్తే, సలహా ఇస్తే ధైర్యం చేసాను. మొదటి నలభైఐదు నిమిషాల వరకు ఏమీ విషయం లేదు. ఈ సినిమా ఓ మానసిక చికిత్సాలయం చుట్టూ తిరుగుతుంది. అనుకోకుండా ఓ అమ్మాయి ఈ చికిత్సాలయంలో కనబడకుండా పోయిందన్న కేసుపై ఇద్దరు పోలీసు అధికారులు అక్కడికి వెళతారు అన్న కధనంతో ప్రారంభవౌతుంది ఈ సినిమా.

 

వారిలో మొదటి వ్యక్తి మన హీరో గారు. మరో వ్యక్తి ఈయనకు సహయాధికారి. నాటకీయ పరిస్తితులలో మన హీరో గారిని కూడా అక్కడి పేషంట్‍ని చేస్తారు. అదిగో అక్కడే ఈ సినిమా కధకుని (మొత్తం) సృజనాత్మకత దాగి ఉంది. ఇందులో చాలా పైశాచిక  దృశ్యాలు ఉన్నాయి. ఇంత పైశాచికమైన సినిమాని నేను ఇంత వరకూ చూడలేదు. ఇకపై చూడబోనేమో. కొన్ని విషయాలలో ఈ సినిమా ప్రశంసనీయమైనా, కధా పరంగా నాకు అస్సలు నచ్చని సినిమా. ఎవ్వరూ చూడవద్దని నా మనవి.

ఈ సినిమాని సగం చూసిన తరువాత ఇక చూడకూడదనుకున్నాను. కానీ ఈ సినిమా ఇన్సెప్షన్ సినిమా కన్నా బాగుంది అని రివ్యూ వ్రాసేటప్పటికి ఏ విధంగా బాగుందో చూద్దాం అని పూర్తిగా చూస్తూ ఈ రివ్యూ వ్రాస్తున్నా. స్క్రీన్ ప్లే పరంగా కొన్ని కొన్ని సన్నివేశాలు ఈ సినిమా దర్శకుని ప్రతిభను చాటాయి. అన్నంత మాత్రాన ఈ సినిమా బాగుంది అని కాదు. ఈ సినిమాలో వైలెన్స్ శృతి మించి చూపించారు. కధ విపరీతంగా ఉంది. మనుష్యుల్లో ఇంత విపరీతంగా కూడా ఆలోచిస్తారు అన్న విషయం తెలిసిన తరువాత నా ఆలోచనలు ఎంత చెత్తగా ఉండకూడదో అర్దం అయ్యింది. ఇక్కడ ఎంత ఉత్తమంగా ఉండాలో అనే విషయం తెలియక పోయినా ఎంత వికృతంగా మరియు ఎంత చెత్తగా ఆలోచించకూడాదో అంతే కాకుండా ఎంత వికృతంతా ఉండకూడదో అర్దం అయ్యింది.

కొన్ని కొన్ని సీన్లు దర్శకుని ప్రతిభని చాటి చెప్పాయి. వాటిల్లో మొదటిది మన హీరోయిన్ గార్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు తీసిన షాట్. ఇక్కడ కొన్ని కంప్యూటర్ జిమ్మిక్స్ ఎవ్వరికీ తెలియక పోయినా నేను పట్టేశాను. మరొకటి హీరో గారు హీరోయిన్ని కలిసేటప్పుడు పలు పలు విధాలుగా చిత్రాలను సృష్టించడం. అలాగే మరొకటి మన హీరో గారు ఓ పెద్ద కొండ చెరియనుంచి క్రిందకు దిగే సీన్. అంత ఎత్తు నుంచి క్రిందకు దిగుతున్నట్టు చిత్రీకరించడం అచ్చంగా నిజంగా ఉంది.

కానీ ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అన్నీ మన మైండ్ లోనే ఉంటుంది అని ఈ సినిమా ద్వారా చెప్ప ప్రయత్నించారు. మన మైండ్ మాత్రమే మన భాధలను మన శరీరానికి తెలియజేస్తుంది, అలాగే అన్ని రకాల అనుభవాలను. అంటే, కోపాన్ని, తాపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని,  భాధని,  సంతోషాన్ని, ఏదైనా.. అన్ని మన మైండ్ నుంచే ఉద్బవిస్తాయని ఈ సినిమాలో చెప్ప ప్రయత్నించారు. అన్నింటి కంటే మించి మనకు అత్యంత సన్నిహితులు మరియు ప్రీతి పాత్రులైన వారలే మనకు అవరోధాలుగా మారతారని చెప్పడం బాగుంది.  తిమ్మిని బమ్మిని చేసి ఓ వ్యక్తిని పిచ్చి వాడిని చెయ్యడం ఎలా వీలౌతుందో అర్దం కావటం లేదు కానీ ఎలా పిచ్చి వాడిని చెయ్యవచ్చో ఇందులో చెప్పారు.

అంతేకాకుండా ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు మరో పాత కధ గుర్తుకు వస్తుంది. అది ఏమిటంటే.. ఓ బ్రాహ్మణుడు దానంగా వచ్చిన గొఱె పిల్లని పట్టుకు పోతుంటే దారి మధ్యలో పది మంది శూదృలు ఆ జంతువు గొఱె కాదు కుక్క అంటే, ఆ బ్రహ్మణుడు ఆ గొఱెను కుక్క అనుకొంటాడు. అనుకోవడమే కాకుండా దానంగా వచ్చిన గొఱెని కుక్క అని అనుమానించి వదిలేస్తాడు. అలా వదిలేసిన గొఱెన్ని శూదృలు తీసుకు వెళ్ళి పండగ చేసుకుంటారు. అలాగే అదేదో పాత సామెత చెప్పినట్టు. పదుగురాడిన మాట పాడియై వర్ధిల్లు అన్నట్టు.. పది మంది గొఱెని కుక్క అంటే ఎవ్వరికైనా అనుమానం వస్తుంది, ఎందుకు పది మంది ఇలా అంటున్నారో అని. అలాంటి మూల కధనే ఆధారంగా చేసుకుని నిర్మించిన సినిమా ఇది. నాలాంటి వాడు ఈలాంటి సినిమాని ఓ పది నిమిషాలు కూడా చూడడేమో.. కాకపోతే ఈ సినిమా ముగింపు చాలా చిత్రంగా ఉంది.

సాధారణంగా సినిమాలు రెండు రకాలుగా ఉంటాయన్నది నా అభిప్రాయం. ఒకటి కామెడీ అయితే మరొకటి ట్రాజడీ. ఈ సినిమా చూసిన తరువాత నాకు మూడో రకం కూడా ఉంటుందనిపించింది. అదేమిటంటే కన్ఫూజింగ్ అని. నెను వృత్తి పరంగా నాకు రిపోర్ట్ చేసే డవలపర్స్ అందరికీ ఒక మాట చెబుతూ ఉంటాను, అదేమిటంటే, వీలైతే ఎదుటి వారికి మీ విషయాన్ని కన్‍ఫర్మ్ చెయ్యండి వీలు కాని పక్షంలో కన్‍ఫ్యూజ్ చెయ్యండి అని. అలా ఈ సినిమా పలు సార్లు చూసిన తరువాత కూడా కన్‍ఫ్యూజింగానే ఉందంటే, దాని వెనుక పలు కారణాలు ఉండి ఉంటాయి. వాటిల్లో మొదటిది.. అయితే, నా బుఱ పీత బుఱ అయ్యినా అయి ఉండాలి లేదా తీసినవాళ్ళు ఉద్దేశ్య పూర్వకంగా అర్దం కాకూడదనే తీసి ఉండాలి. ఏది ఏమైనా అనవసరంగా రిస్క్ తీసుకున్ననేమో అనిపించింది. ఈ సినిమాని చూసినందులకు చింతిస్తున్నాను. ఈ సినిమా నేను చూసాను అన్న విషయం మర్చిపోవడానికి చాలా కాలం పడుతుందేమో!!

పరమ చెత్త సినిమా. అస్సలు ఇలాంటి సినిమాని జనాలు చూడటానికి అనుమతినిచ్చిన సెన్సార్ బోర్డ్ వారిని అనాలి. ఇలాంటి సినిమాని అనుమతించారంటే ఈ సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఎంతటి సున్నిత మనస్కులో అర్దం అవుతోంది. అంతే కాకుండా ఇలాంటి పైశాచిక సినిమాని తీసిన దర్శకుడిని అనాలి.. వీరందరికన్నా పైశాచికంగా సినిమా కధని రచించిన కధా రచయతని కూడా అనాలి.. వీరేంత వికృత మనుష్యులో అని. ఇలా ఈ సినిమాలో బోళుడంత చెత్త ఉన్నా, సినిమాటోగ్రఫీ పరంగా అలాగే ఫొటోగ్రఫీ పరంగా ఈ సినిమా భలే ఉంది అని చెప్పక పోయినా ఎంతో కొంత శ్రమ పడ్డారని మాత్రం చెప్ప గలను.

ఇదే పెద్ద ఎఛీవ్‍మెంట్ అనుకుంటే నేను పిల్లాడిగా ఉన్నప్పుడే తెలుగు సినిమాలను ఓ ఆటాడుకున్న విఠలాచార్య మ్రుందు వీరు ఎందుకూ పనికి రారు అన్నది నా అభిప్రాయం. కాకపోతే విఠలాచార్య గురించి వీరికి తెలియదు కాబట్టి వీరు బాగానే తీసారు అని చెప్పుకోవచ్చు. కాకపోతే మన విఠలాచార్యకు కొన్ని విలువలున్నాయి, కానీ షట్టర్ ఐలాండ్ సినిమా తీసిన దర్శకునికో లేదా సినిమాకు కధను చేకూర్చిన కధా రచయితకు విలువలు అంటే ఏమిటో తెలియదేమో అనిపిస్తోంది.

ఫైనల్‍గా ఒక్కటే ఒక విషయం. ఎవ్వరూ ఈ సినిమాని చూడవద్దని ప్రార్ధన.

5 స్పందనలు:

జేబి - JB said...

ఈ పోస్ట్ చదివాక నేను దాదాపు పది నిమిషాలు దొర్లిదొర్లి నవ్వానండీ! మీరు ప్రతిదీ బావిలోంచి చూస్తారని తెలుసును (అమెరికాపై మీ పాత పోస్ట్లన్నీ ఇదివరకే చదివాను) - కానీ మీరు మిగతావారిని చూడద్దనడంతో స్పందించక తప్పట్లేదు.

- ఈ సినిమాలో హింస ఉన్నా సింహాకాదుకదా కనీసం ఈవిల్ డెడ్ స్థాయిలో కూడా లేదు. పైశాచికత్వం ఏ సన్నివేశంలో కనిపించిందో చెప్తారా? శవాలగుట్ట సన్నివేశం మటుకు కొంత జుగుప్సాకరంగా తీశాడు.

- "అలాగే అన్ని రకాల అనుభవాలను. అంటే, కోపాన్ని, తాపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని, భాధని, సంతోషాన్ని, ఏదైనా.. అన్ని మన మైండ్ నుంచే ఉద్బవిస్తాయని ఈ సినిమాలో చెప్పప్రయత్నించారు" : ఇది కూడా నాకెక్కడా అనిపించలేదే!

- ఇది ఒక థ్రిల్లర్లాంటిది - కామెడీ-ట్రాజెడీ మాత్రమే తెలిసిన మీకు నచ్చకపోవడంలో/అర్థంకాకపోవడంలో తప్పులేదులేండి. కానీ దానికి దర్శకుడిని-రచయితని తిట్టడం బాలేదు.

- చిన్నప్పుడు మాయలు-మంత్రాలవలన విఠలాచార్య సినిమాలు, పెద్దయ్యాక అంత తక్కువ సాంకేతిక సౌకర్యాలతో చేసిన అద్భుతాల వలన విఠలాచార్యగారంటే నాకు అభిమానం. కానీ, ఆయన సినిమాలలో కథ ఎక్కువుండదండి.

- మీరు మార్టిన్ స్కోర్సిస్ (ఉచ్ఛారణ తప్పుకావచ్చు) తీసిన మిగతా సినిమాలు చూడద్దులేండిగానీ, మిగతావారికి ఆయనమీద చెడుఅభిప్రాయం దయచేసి కల్పించకండి.

జేబి - JB said...

ఈ పోస్ట్ చదివాక నేను దాదాపు పది నిమిషాలు దొర్లిదొర్లి నవ్వానండీ! మీరు ప్రతిదీ బావిలోంచి చూస్తారని తెలుసును (అమెరికాపై మీ పాత పోస్ట్లన్నీ ఇదివరకే చదివాను) - కానీ మీరు మిగతావారిని చూడద్దనడంతో స్పందించక తప్పట్లేదు.

- ఈ సినిమాలో హింస ఉన్నా సింహాకాదుకదా కనీసం ఈవిల్ డెడ్ స్థాయిలో కూడా లేదు. పైశాచికత్వం ఏ సన్నివేశంలో కనిపించిందో చెప్తారా? శవాలగుట్ట సన్నివేశం మటుకు కొంత జుగుప్సాకరంగా తీశాడు.

- "అలాగే అన్ని రకాల అనుభవాలను. అంటే, కోపాన్ని, తాపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని, భాధని, సంతోషాన్ని, ఏదైనా.. అన్ని మన మైండ్ నుంచే ఉద్బవిస్తాయని ఈ సినిమాలో చెప్పప్రయత్నించారు" : ఇది కూడా నాకెక్కడా అనిపించలేదే!
....

జేబి - JB said...

- ఇది ఒక థ్రిల్లర్లాంటిది - కామెడీ-ట్రాజెడీ మాత్రమే తెలిసిన మీకు నచ్చకపోవడంలో/అర్థంకాకపోవడంలో తప్పులేదులేండి. కానీ దానికి దర్శకుడిని-రచయితని తిట్టడం బాలేదు.

- చిన్నప్పుడు మాయలు-మంత్రాలవలన విఠలాచార్య సినిమాలు, పెద్దయ్యాక అంత తక్కువ సాంకేతిక సౌకర్యాలతో చేసిన అద్భుతాల వలన విఠలాచార్యగారంటే నాకు అభిమానం. కానీ, ఆయన సినిమాలలో కథ ఎక్కువుండదండి.

- మీరు మార్టిన్ స్కోర్సిస్ (ఉచ్ఛారణ తప్పుకావచ్చు) తీసిన మిగతా సినిమాలు చూడద్దులేండిగానీ, మిగతావారికి ఆయనమీద చెడుఅభిప్రాయం దయచేసి కల్పించకండి.

Loser said...

First meeru cenima review ki paniki raarani meere clear ga proove chesukunnaru. May be meeru Telugu cinema ki matrame review raasthe maalanti vallaki entho melu chesina vaaravuthaaru.

Meeru Inception movie review kuda andaraki nachindi kabatti baagundani raasaremo ani doubt vasthundi. adi popular cinema avvakapothe danni chandaalamaina cinema ani review raasevallu.

Meeru Simha lanti cinema reviews raasthe mee blogs ki atleast mass following ainaa untundi.

elaago different movies choose vallaki mee reviews elaago nachavu.

Loser said...

Nanna chitti. nuvvu English movie review aapali. Meeru Telugu mass cinemalaku matrame review isthe chaala santhoshisthaa.

Mee valla koddo goppo creative movies choose vallu kuda routine ga aalochinchadam modalu pedathaaru.

meeku dandesi dannam pedathaa.. English movie reviews aaapandi.

 
Clicky Web Analytics