షట్టర్ ఐలాండ్.. రివ్యూ

 

Shutter-Island ఈ సినిమాని చూడమని ఓ తెలుగు బ్లాగర్ సజస్ట్ చేస్తే, సలహా ఇస్తే ధైర్యం చేసాను. మొదటి నలభైఐదు నిమిషాల వరకు ఏమీ విషయం లేదు. ఈ సినిమా ఓ మానసిక చికిత్సాలయం చుట్టూ తిరుగుతుంది. అనుకోకుండా ఓ అమ్మాయి ఈ చికిత్సాలయంలో కనబడకుండా పోయిందన్న కేసుపై ఇద్దరు పోలీసు అధికారులు అక్కడికి వెళతారు అన్న కధనంతో ప్రారంభవౌతుంది ఈ సినిమా.

 

వారిలో మొదటి వ్యక్తి మన హీరో గారు. మరో వ్యక్తి ఈయనకు సహయాధికారి. నాటకీయ పరిస్తితులలో మన హీరో గారిని కూడా అక్కడి పేషంట్‍ని చేస్తారు. అదిగో అక్కడే ఈ సినిమా కధకుని (మొత్తం) సృజనాత్మకత దాగి ఉంది. ఇందులో చాలా పైశాచిక  దృశ్యాలు ఉన్నాయి. ఇంత పైశాచికమైన సినిమాని నేను ఇంత వరకూ చూడలేదు. ఇకపై చూడబోనేమో. కొన్ని విషయాలలో ఈ సినిమా ప్రశంసనీయమైనా, కధా పరంగా నాకు అస్సలు నచ్చని సినిమా. ఎవ్వరూ చూడవద్దని నా మనవి.

ఈ సినిమాని సగం చూసిన తరువాత ఇక చూడకూడదనుకున్నాను. కానీ ఈ సినిమా ఇన్సెప్షన్ సినిమా కన్నా బాగుంది అని రివ్యూ వ్రాసేటప్పటికి ఏ విధంగా బాగుందో చూద్దాం అని పూర్తిగా చూస్తూ ఈ రివ్యూ వ్రాస్తున్నా. స్క్రీన్ ప్లే పరంగా కొన్ని కొన్ని సన్నివేశాలు ఈ సినిమా దర్శకుని ప్రతిభను చాటాయి. అన్నంత మాత్రాన ఈ సినిమా బాగుంది అని కాదు. ఈ సినిమాలో వైలెన్స్ శృతి మించి చూపించారు. కధ విపరీతంగా ఉంది. మనుష్యుల్లో ఇంత విపరీతంగా కూడా ఆలోచిస్తారు అన్న విషయం తెలిసిన తరువాత నా ఆలోచనలు ఎంత చెత్తగా ఉండకూడదో అర్దం అయ్యింది. ఇక్కడ ఎంత ఉత్తమంగా ఉండాలో అనే విషయం తెలియక పోయినా ఎంత వికృతంగా మరియు ఎంత చెత్తగా ఆలోచించకూడాదో అంతే కాకుండా ఎంత వికృతంతా ఉండకూడదో అర్దం అయ్యింది.

కొన్ని కొన్ని సీన్లు దర్శకుని ప్రతిభని చాటి చెప్పాయి. వాటిల్లో మొదటిది మన హీరోయిన్ గార్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు తీసిన షాట్. ఇక్కడ కొన్ని కంప్యూటర్ జిమ్మిక్స్ ఎవ్వరికీ తెలియక పోయినా నేను పట్టేశాను. మరొకటి హీరో గారు హీరోయిన్ని కలిసేటప్పుడు పలు పలు విధాలుగా చిత్రాలను సృష్టించడం. అలాగే మరొకటి మన హీరో గారు ఓ పెద్ద కొండ చెరియనుంచి క్రిందకు దిగే సీన్. అంత ఎత్తు నుంచి క్రిందకు దిగుతున్నట్టు చిత్రీకరించడం అచ్చంగా నిజంగా ఉంది.

కానీ ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అన్నీ మన మైండ్ లోనే ఉంటుంది అని ఈ సినిమా ద్వారా చెప్ప ప్రయత్నించారు. మన మైండ్ మాత్రమే మన భాధలను మన శరీరానికి తెలియజేస్తుంది, అలాగే అన్ని రకాల అనుభవాలను. అంటే, కోపాన్ని, తాపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని,  భాధని,  సంతోషాన్ని, ఏదైనా.. అన్ని మన మైండ్ నుంచే ఉద్బవిస్తాయని ఈ సినిమాలో చెప్ప ప్రయత్నించారు. అన్నింటి కంటే మించి మనకు అత్యంత సన్నిహితులు మరియు ప్రీతి పాత్రులైన వారలే మనకు అవరోధాలుగా మారతారని చెప్పడం బాగుంది.  తిమ్మిని బమ్మిని చేసి ఓ వ్యక్తిని పిచ్చి వాడిని చెయ్యడం ఎలా వీలౌతుందో అర్దం కావటం లేదు కానీ ఎలా పిచ్చి వాడిని చెయ్యవచ్చో ఇందులో చెప్పారు.

అంతేకాకుండా ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు మరో పాత కధ గుర్తుకు వస్తుంది. అది ఏమిటంటే.. ఓ బ్రాహ్మణుడు దానంగా వచ్చిన గొఱె పిల్లని పట్టుకు పోతుంటే దారి మధ్యలో పది మంది శూదృలు ఆ జంతువు గొఱె కాదు కుక్క అంటే, ఆ బ్రహ్మణుడు ఆ గొఱెను కుక్క అనుకొంటాడు. అనుకోవడమే కాకుండా దానంగా వచ్చిన గొఱెని కుక్క అని అనుమానించి వదిలేస్తాడు. అలా వదిలేసిన గొఱెన్ని శూదృలు తీసుకు వెళ్ళి పండగ చేసుకుంటారు. అలాగే అదేదో పాత సామెత చెప్పినట్టు. పదుగురాడిన మాట పాడియై వర్ధిల్లు అన్నట్టు.. పది మంది గొఱెని కుక్క అంటే ఎవ్వరికైనా అనుమానం వస్తుంది, ఎందుకు పది మంది ఇలా అంటున్నారో అని. అలాంటి మూల కధనే ఆధారంగా చేసుకుని నిర్మించిన సినిమా ఇది. నాలాంటి వాడు ఈలాంటి సినిమాని ఓ పది నిమిషాలు కూడా చూడడేమో.. కాకపోతే ఈ సినిమా ముగింపు చాలా చిత్రంగా ఉంది.

సాధారణంగా సినిమాలు రెండు రకాలుగా ఉంటాయన్నది నా అభిప్రాయం. ఒకటి కామెడీ అయితే మరొకటి ట్రాజడీ. ఈ సినిమా చూసిన తరువాత నాకు మూడో రకం కూడా ఉంటుందనిపించింది. అదేమిటంటే కన్ఫూజింగ్ అని. నెను వృత్తి పరంగా నాకు రిపోర్ట్ చేసే డవలపర్స్ అందరికీ ఒక మాట చెబుతూ ఉంటాను, అదేమిటంటే, వీలైతే ఎదుటి వారికి మీ విషయాన్ని కన్‍ఫర్మ్ చెయ్యండి వీలు కాని పక్షంలో కన్‍ఫ్యూజ్ చెయ్యండి అని. అలా ఈ సినిమా పలు సార్లు చూసిన తరువాత కూడా కన్‍ఫ్యూజింగానే ఉందంటే, దాని వెనుక పలు కారణాలు ఉండి ఉంటాయి. వాటిల్లో మొదటిది.. అయితే, నా బుఱ పీత బుఱ అయ్యినా అయి ఉండాలి లేదా తీసినవాళ్ళు ఉద్దేశ్య పూర్వకంగా అర్దం కాకూడదనే తీసి ఉండాలి. ఏది ఏమైనా అనవసరంగా రిస్క్ తీసుకున్ననేమో అనిపించింది. ఈ సినిమాని చూసినందులకు చింతిస్తున్నాను. ఈ సినిమా నేను చూసాను అన్న విషయం మర్చిపోవడానికి చాలా కాలం పడుతుందేమో!!

పరమ చెత్త సినిమా. అస్సలు ఇలాంటి సినిమాని జనాలు చూడటానికి అనుమతినిచ్చిన సెన్సార్ బోర్డ్ వారిని అనాలి. ఇలాంటి సినిమాని అనుమతించారంటే ఈ సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఎంతటి సున్నిత మనస్కులో అర్దం అవుతోంది. అంతే కాకుండా ఇలాంటి పైశాచిక సినిమాని తీసిన దర్శకుడిని అనాలి.. వీరందరికన్నా పైశాచికంగా సినిమా కధని రచించిన కధా రచయతని కూడా అనాలి.. వీరేంత వికృత మనుష్యులో అని. ఇలా ఈ సినిమాలో బోళుడంత చెత్త ఉన్నా, సినిమాటోగ్రఫీ పరంగా అలాగే ఫొటోగ్రఫీ పరంగా ఈ సినిమా భలే ఉంది అని చెప్పక పోయినా ఎంతో కొంత శ్రమ పడ్డారని మాత్రం చెప్ప గలను.

ఇదే పెద్ద ఎఛీవ్‍మెంట్ అనుకుంటే నేను పిల్లాడిగా ఉన్నప్పుడే తెలుగు సినిమాలను ఓ ఆటాడుకున్న విఠలాచార్య మ్రుందు వీరు ఎందుకూ పనికి రారు అన్నది నా అభిప్రాయం. కాకపోతే విఠలాచార్య గురించి వీరికి తెలియదు కాబట్టి వీరు బాగానే తీసారు అని చెప్పుకోవచ్చు. కాకపోతే మన విఠలాచార్యకు కొన్ని విలువలున్నాయి, కానీ షట్టర్ ఐలాండ్ సినిమా తీసిన దర్శకునికో లేదా సినిమాకు కధను చేకూర్చిన కధా రచయితకు విలువలు అంటే ఏమిటో తెలియదేమో అనిపిస్తోంది.

ఫైనల్‍గా ఒక్కటే ఒక విషయం. ఎవ్వరూ ఈ సినిమాని చూడవద్దని ప్రార్ధన. ఈ సినిమాపై ఇంత రివ్యూ వ్రాసిన నా కాలం వృధా.. ఈ సినిమా చూసిన నా సమయం వృధా.. నా ఈ రివ్యూ చదివిన మీ సమయం కూడా వృధానే.. అలా అన్ని వృధా అన్నంత మాత్రాన మీ స్పందన కూడా వృధా అనుకోవద్దు. ఏదో ఒకటి స్పందించండి. మరో పోస్టు వచ్చేంత వరకూ సెలవు..

9 స్పందనలు:

Anwartheartist said...

మార్టిన్ స్కొర్సెస్ సినిమా ఇది ఆయనంటే నాకెంత భక్తొ,, ప్రేమో , అయినా ఈ సినిమా వొకటి, బెక్స్ కార్ బెర్తా వొకటి అస్సలు ఎక్కలేదు, నాక్కూడా చెత్త అనాలనిపిస్తుంది కాని నా అర్ధం చేసుకొలేనితనమెమొనని ఒక అనుమానంకూడా.

కన్నగాడు said...

హ్హ హ్హ , మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందనుకుంటా ఈ సినిమా. కానీ నాకు ఈ సినిమా నచ్చింది, ముఖ్యంగా పతాక సన్నివేశాలు. అందరికీ నచ్చాలని లేదు, కాస్త నెమ్మదిగా సాగుతుంది కథ. బై ద వే ఈ సినిమాకు అధారమైన పుస్తకం ఒక బెస్ట్ సెల్లర్

Ranga Raju said...

it's really good one why don't u like this movie

Anonymous said...

I liked this movie very much.kaani ee review raasintarvata meeroka basic point gurthu pettukuni vundalsindi, meeku nachanantha matrana evariki nachakoodadu ani kaani meeku nachite andariki nachalani kaani rule emi ledu kada, paapam ee cinema bagundanna paapaniki abrakadabra gaarini meeru medhavi kaadu anadam chala haasyaspadam ga undi, I think even he could have told the same about your view on Inception as he didnt like it.

భాస్కర రామిరెడ్డి said...

చక్రవర్తి గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

హారం

Harish Pulimi said...

This is one of my favourite movies. The basic point is that there are two possibilities: one is the protagonist is sane and the other is the protagonist is insane. If you take any shot in this movie, both the theories are valid, thats the beauty of the movie. The fact is left to the viewers to decide. Its not the type of movie where we can watch relaxed and forget. These kind of movies make us think more and more. Also I dont agree with your comment on violence, where is the violence in this movie? Are soldiers not killing people in real life? Are insane people not doing strange things? If you really want to watch a violent movie watch Magadheera or any Balakrishna's movies which are watched by entire families.

One thing is definitely true: your time was not wasted after watching this movie. Treat it as a valuable experience.

ఓ బ్రమ్మీ said...

హరీష్ గారు,

మున్ముందుగా స్పందించినందులకు నెనరులు. ఇక మీ స్పందన విషయానికి వస్తే, రెండు పాజిబిలిటీస్ ఉంటాయి అని వ్రాసారు. అవి ఏమిటో నాకు అర్దం కాలేదు మరోసారి వివరించండి. ఎందుకంటే, మీరు వ్రాసిన వాక్యాన్నే రెండు సార్లు వ్రాసారు. Hang him, not leave him & hang him not, leave him అనేవి రెండు స్టేట్‍మెంట్స్ కానీ వీటి అర్దాలు కామా పెట్టే పొజీషన్ పట్టి మారిపోతాయి. అలా మీరు వాసిన వాక్యాలలో ఎక్కడో ఏదో మిస్స్ అయ్యింది ఒక్క సారి గమనించి మరోసారి స్పందించమనవి.

Harish Pulimi said...

1. Sane: The hero is a real detective and they made him believe that he is a patient
2. Insane: The hero is really a patient and under the impression that he is a detective

ఓ బ్రమ్మీ said...

హరీష్ గారు,

వివరించినందులకు నెనరులు.

 
Clicky Web Analytics