ఏపీ ఆల్ రౌండ్ వెబ్ సైట్ వారికి ధన్యవాదములు

gc7

ఈ రోజు యాదృఛికంగా రెండు విషయాలు నేను తెలుసుకున్నాను. వాటిలో ఒకటి సుందోప సుందుల గురించి మరొకటి వ్యాసమహాముని పుట్టు పూర్వోత్తరాలు మరియు వ్యాసునికి వినాయకునికి మధ్య జరిగిన ఒప్పందం గురించి. వీటిని నేను ఏపీఆల్‍రౌండ్ వారి వెబ్‍సైట్ నుంచి తెలుసుకున్నాను. వీరి వెబ్‍సైట్ లో భారతంలో చిన్న కధలు అనే లంకె నుంచి ఈ రెండు విషయాలు తెలుసుకున్నాను. మీరు చూసారా!! లేకపోతే ఇదిగో ఇప్పుడే వెళ్ళి చూడండి.

భారతంలో చిన్న కధలు అనే ధారావాహికలో శ్రీ ప్రయాగ రామకృష్ణగారు చేసిన శ్రమని వీరు అందిస్తున్నారు అని తెలిపారు. మెల్లగా మిగిలిన కధలు చదవాలని నిర్ణయం తీసుకున్నాను. మరి మీరు చదివారా!!

1 స్పందనలు:

Anonymous said...

నేనింకా చాలా తెలుసుకున్నాను.
>>>
అల్రెడీ ఇంగ్లీషు యూనివర్సల్ లాంగ్వేజి అని అందరికి తెలిసిపొయినా, మరి జనం వారి వారి లోకల్ లాంగ్వేజిలలో సినిమాలు చూడటం లేదా!. టివి సీరియల్స్ చూడటం లేదా ! రాయడం చదవటం కాస్తా తగ్గిందికానీ , మన ప్రస్తుత పరిస్థితులను అద్దం పట్టే కళారూపాలుగా ఇవి బాగానే చెలామణి అవుతున్నాయి. మారుతున్న సాంఘిక స్థితిగతులననుసరించి, మారుతున్న తెలుగు భాషను కలుషితమనకుండా, తెలుగు భాషాభివృద్ధికై ఇతర భాషా పదాలను స్వీకరిస్తూ , సరళ తెలుగు భాషలో కూడా నేటి ప్రపంచాన్ని చర్చించడం , తద్వారా "తెలుగు వాడుక" ను పెంచడం మా అభిమతం. ముఖ్యంగా తెలుగు లోకం లోకాన్నంతా "తెలుగు" లోనే తెలుసుకోవాలన్నదీ, అది ఒక్కటే "తెలుగుభాష" ను నిలిపి, తెలుగు మనిషిని ఉన్నతస్థాయిలో ఉంచగలుగుతుంది అని మా అభిప్రాయం.నమ్మకం.

 
Clicky Web Analytics