అపోలో ఆసుపత్రి – నా అనుభవం : Part 2

క్రిందటి పుటలో మొదలైన నా అనుభవాలను అనుభవాలుగా మాత్రం మిగల్చకుండా, వ్రాత రూపకంగా మార్చేక్రమాన్ని చదివారనుకుంటను, ఇప్పుడు మరో భాగం. ఈ భాగంలో అస్సలు విషయం ఏవేమి టెస్టులు చేస్తారు, వాటికి ఉన్న ప్రాసస్త్యం ఏమిటి మొదలైనవాటి గురించి వివరిస్తూ, అ ఆ పరిక్షలు నిర్వహిస్తున్నప్పుడు నా స్పందనలు ఎలా ఉన్నాయి అనే వాటిని యధా తధంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.

తొమ్మిది గంటలకు మొదలైన నా కేసు వివరాలు తాబేలు వేగంతో కదలడం మొదలైనాయి. ఈ లోగా చంద్రలతగారి లోని పోస్టులు చదవడం ప్రారంభించాను. చదువుతూ ఆ రిసెప్షనిస్ట్ ఏమి చేస్తోందా అని గమనిస్తూ తెలుగు పాటలు వింటూ మడత పేజీ భరతం పట్టడం మొదలు పెట్టాను. ఇక్కడ నేను గమనించిన విషయం నాకు చాలా అశ్చర్యం వేసింది. అర్దం అయిన విషయం జీర్ణించుకునే సరికి నా ప్రక్కన ఉన్న ప్రపంచం అంతా ఓ వ్యాపార యుద్ధ భూమిలా అనిపించింది. నాలా మాస్టర్ చెకప్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళలో మధ్య తరగతి మనుష్యుల ఉన్నారు, అలాగే ఎన్నారైలున్నారు, నార్త్ అమ్మాయిలున్నారు, సౌత్ బామ్మలున్నారు, తల స్నానం చేసి తలంతా విరబూసుకుని ఉన్న మహిళలున్నారు, చేతులకు ఉన్న పదివేళ్ళకు పదిహేను బంగారు ఉంగరాలు పెట్టుకున్న గోల్డ్ షాప్ ఓనర్స్ ఉన్నారు, మెడలో ఓ పాతిక కాసుల బంగారు ఆభరణాలతో మొత్తం మీద ఓ వంద కాసుల బంగారాన్ని దిగేసుకున్న గృహిణులు ఉన్నారు, వీటన్నింటికి వ్యతిరేకంగా అస్సలు ఆభరణం లేకుండా ఉత్తి చుడిదార్ ధరించిన మహిళలున్నారు, నిండుగా హుందాగా గుంభనంగా నడిచే ముత్తైదువులున్నారు. వీరందరూ కాష్ పార్టీలు అన్నమాట. నేనొక్కడినే ఫ్రీ అన్నట్టు ఉంది మన రిసెప్షనిస్టు రెస్పాన్స్. జేబులోంచి డబ్బులు ఎవ్వరు ముందు తీస్తే వారి కాగితం ముందుకు కదులుతోంది.

దాదాపు యాభై నిమిషాల సేపు ఓపికగా ఎదురు చూసిన తరువాత నాలోని సహనం నశించింది. మెల్లగా లేచి ఇంతకు ముందు ప్రస్తావించిన రిసెప్షనిస్టు వద్దకు వెళ్ళి నా కాగితం విషయం ప్రస్తావించగా, మీ కాగితాలు లోపలికి పంపించాను లాబీలో కూర్చోండి పిలుపు వస్తుంది అని చెప్పింది. ఇక్కడ నాకు నచ్చని విషయం ఏమిటంటే, విషయాన్ని అడిగేంతవరకూ చెప్పకపోవటమే. సరే ఏదోకటి, కాగితం ముందుకు కదిలింది కదా అనుకుంటూ లాబీలో నాపేరు ద్వనించేవరకూ ఎదురుచూద్దాం అని అటుపై సాగాను. అక్కడ మరో యాభై మంది వారి వంతుకోసం ఎదురు చూస్తున్నారు. నలుగిరితో నారాయణ అన్నట్టు నా వంతు వచ్చేవరకూ ఇక్కడ తిష్ట తప్పదని మళ్ళీ మడత పేజీ పై దృష్టి మళ్ళించాను.

ఈ పూర్తి కార్యక్రమం గురించి మా మానేజ్ మెంట్ వాళ్ళని అడిగితే, అపోలో హాస్పటల్ స్టాఫ్ అంతా చాలా టాలెంటేడ్ అంతే కాకుండా టైమ్లీ ఆర్గనైజ్డ్ కాబట్టి మీ కార్యక్రమం మొత్తం కనా కష్టంపై పన్నిండుగంటల కల్లా పూర్తౌతుంది అని అభయమిచ్చిన పిదప మహా అయితే ఓ ఒంటి గంటకల్లా అన్ని పనులు పూర్తౌతాయి, చక్కగా లంచ్ టైంకల్లా ఇంటికి చేరుకోవచ్చు అనుకున్నా. అప్పుడు అనుకోలేదు అంచనాలు తారుమారౌతాయని. ఇలా నేను కంపెనీ తరుఫున బాడీ చెకప్ చేయించుకోవడం ఇది మూడవసారి. మొదటి సారి ఎల్‍బీట్ హాస్పటల్లో మరోసారి కామినేని హాస్పటల్లో. ముగ్గురిలోకి ఎల్‍బీట్ వారు కొంచం టైమ్లీగా అన్ని టెస్టులు చేసారు అని చెప్పుకోవచ్చు. కానీ వీరు కొంచం కాస్ట్లీ అని జనాల్లో నానుడి. కొంచం ఖరీదు ఎక్కువ అయినా కస్టమర్ సాటిస్‍ఫాక్షన్ ఎక్కువ అని నా అభిప్రాయం. అపోలో లాంటి కార్పోరేట్ హాస్పటల్స్ లో ఇంత శాతం కస్టమర్ సాటిస్‍ఫాక్షన్ ఉంటుందని నేననుకోను. మరి అపోలో వాళ్ళు ఆసియాలో కెల్లా అతి పెద్దదైన మెడికల్ సిటీ ఎలా కట్టారా అన్న నా ప్రశ్నకి అప్పుడు సమాధానం లేదు.. ఇప్పుడు ఉంది కానీ రాబోయే పుటల్లో విషయాన్ని వివరిస్తాను.

ఇక్కడ నా విషయంలో నేను స్వతహాగా వచ్చి చేయించుకోవటం కాదు కాబట్టి, అంతే కాకుండా మా కంపెనీ వారు నాకు మరో ఛాయిస్ ఇవ్వనందున వచ్చాను కాబట్టి నా వంతు కొరకు ఎదురు చూస్తూ వేచి యున్నాను. నేనే కనుక ఇలాంటి టెస్టులు చేయించుకోవలసి వస్తే, అపోలోకి ఎప్పటికీ రాను. అలాగే మీరు రావద్దు అని నా మనవి. వస్తే మాత్రం సంచినిండా డబ్బులేసుకుని రండి.

అసలు విషయం వ్రాయడం మరచి ఏదేదో వ్రాస్తున్నట్టున్నాను. కనుక ఇక వెనక్కి వద్దాం. అదిగో అప్పుడే ఎంటర్ అయ్యాడు ఈ సినిమాలోని హీరో. పేరు మధు. అక్కడ అటెండర్. ఖంఠం బాగానే ఉంది. అప్పటిదాకా మెల్లగా మాట్లాడుతున్న గుసగుసలే వినబడుతుంటే, ఈ టోన్ అన్నింటిని మించి, ఇక్కడ నేనే రాజుని అన్నట్టు ద్వనించింది. వస్తూ వస్తూనే రిసెప్షనిస్టుని ఓ మారు పలకరించి అక్కడ ఉన్న అందరినీ ఓ మారు గమనించి అసహనంగా ఉన్న వారిని టార్గెట్ చెయ్యడం మొదలుపెట్టాడు. అలా అసహనంగా ఉన్న వారిని ముందుగా కుశల ప్రశ్నలతో పలకరించి వారి చేతుల్లో ఉన్న కాగితాలను తీసుకుని వారి వారి టెస్టులకు సంబందించిన గదులు ఎక్కడ ఉన్నాయో వివరించడం మొదలు పెట్టాడు. దాంతో అక్కడి వాతావరణంలో ఓ విధమైన చలనం వచ్చిందని చెప్పుకోవాలి.

నా దురదృష్టం కొద్ది, ఆ రోజే మరో కంపెనీ వారు, ఓ వంద మందికి అప్పాయింట్‍మెంట్ ఫిక్స్ చేసినట్టున్నారు. మధుకి ఆ కంపెనీ వారి టెస్టులన్నీ కూలంకుషంగా తెలుసనుకుంటా, ఠక ఠక అక్కడ ఉన్న యాభై మందిని ఓ ఇరవై నిమిషాలలో సద్దేసాడు. ఒక్కసారి ఆలోచించండి యాభైమందిని ఇరవై నిమిషాలలో సముదాయించాడంటే, ఎంతటైం ఒక్కొక్కళ్ళకి కేటాయించాడో .. అంతే కాకుండా అందరికి సరైన సమాధానం ఇచ్చి వారందర్ని కవర్ చేసాడంటే ఎంత టాలెంటెడ్ అంతే కాకుండా రోజూ చేసే పని కదా ఎంత రాటు తేలాడో. ఈ రోజుకి మధు నిజంగానే హీరో.. అపోలో ఇతనికి ఎంతో రుణపడి ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ ఇతని టాలెంట్ కి తగ్గ ఫలితం జీతం రూపంలో ఇస్తున్నారా అని నాకు అనుమానం.

చాలా సేపు మౌనంగా ఉన్న నాదగ్గరకి మరో పది నిమిషాల తరువాత వచ్చాడు. అందర్ని తెలంగాణా యాసలో ఏకవచనంతో పలకరించిన మధు, నాదగ్గరకి వచ్చి సార్ అంటూ పలకరించి, ఏంటండి మౌనంగా ఉన్నారు అంటూ మాట కలిపాడు. అదేం లేదయ్యా, నా పేరు పిలుస్తారు అని అన్నారు, అందుకని ఎదురు చూస్తున్నా అని సగం చెప్పానో లేదో, వెంఠనే మరో ప్రక్కన ఉన్న సిస్టర్స్ వైపు చూస్తూ మన సార్ కాగితాలు ఎక్కడ ఉన్నాయో చూడండి అని ఓ కేక వేశాడు. అక్కడ ఉన్న సిస్టర్స్ అందరికీ ఇతను బాగా తెలుసనుకుంటా, వెంటనే స్పందించి నా కాగితాన్ని వెతికే ప్రయత్నం చేసారు. అవి దొరకగానే నాకు తోడుగా ఓ పది మందికి టోకెన్స్ ఇచ్చారు. అప్పుడు సమయం పావుతక్కువ పదకొండు గంటలు.

ముందుగా బ్లడ్ తీసుకుంటారంట, ఆ తరువాత మిగిలిన టెస్టులు మొదలౌతాయి. ఇదిగో ఇప్పుడు మరో అవరోధం, మూడవది. రక్తం నమూనాలు సేకరించే సాంపుల్ ట్యూబ్స్ అయ్యిపోయాయి. అంతకు ముందు రోజు రాత్రి షిఫ్ట్ లో ఉన్న టీమ్ కొన్ని మాత్రమే మిగిల్చారు, అవి నా వంతు వచ్చేటప్పటికి అయ్యి పోయాయి. ఈ విషయాన్ని మధు గమనించి అక్కడే ఉన్న మరో సహద్యోగిని ఆ పనిపై పురమాయించాడు. అతను వెళ్ళి పెద్ద కార్టన్ తీసుకు వచ్చారు. ఇవి వచ్చేటప్పటికి మరో ఇరవై నిమిషాలు ఎదురు చూపులు. నేను ఇలా ఎదుర్ చూస్తున్నట్లు గమనించి, సార్ మనం ఎక్స్‍రే తీయించుకుందాం వచ్చేయ్యండి అంటూ నన్ను అటు తీసుకు పోయ్యాడు. అలా మొదలైంది నా బాడీ చెకప్.

నాలుగో అవరోధం: ఎక్స్‍రే తీయుంచుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి ఆపరేటర్ నన్ను ఓ స్టాండ్ కి చాతీని ఆనించి నుంచోమని ఊపిరి తిత్తుల నిండా గాలి తీసుకో మన్నాడు. ఇది లంగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి అన్నమాట. సరే కదా అని అలా నుంచున్నానో లేదో ఇలా స్విచ్ నొక్కి వెంటనే వచ్చి ఓ బాంబ్ పేల్చాడు. ఏంటి సార్ మీ లంగ్స్ చాలా చిన్నగా ఉన్నాయి, నిజ్జంగా మీరు గాలి బాగా పీల్చారా అని ప్రశ్నించడంతో నాకు ఏమి సమాధానం ఇవ్వాలో అర్దం కాక, అన్యమనస్కంగా బాగానే ఊపిరి తీసుకున్నాను అని బదులిచ్చి ఏమైఉంటుందో అన్న అనుమానంతో బయట పడ్డాను.

ఓ తెలుగు నానుడితో ఈ పుటని ఇక్కడితో ఆపుతాను. అదేమిటంటే,

అనుమానం పెను భూతం..

15 స్పందనలు:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

బాగుంది, తరువాయి భాగం కోసం వెయిటింగ్.

ఓ బ్రమ్మీ said...

గణేష్ గారు,

స్పందించినందులకు నెనరులు, తరువాయి భాగం తొందర్లో..

Anonymous said...

అనుమానం పెను భూతం..

keka, waiting for the next post. Write with out extending this long. This is a sugesstion, because i lost interest with this post, due to the length. I may read the next if you cut short some unwanted stuff

Anonymous said...

అనుమానం పెను భూతం..

keka, waiting for the next post. Write with out extending this long. This is a sugesstion, because i lost interest with this post, due to the length. I may read the next if you cut short some unwanted stuff

ఓ బ్రమ్మీ said...

అజ్ఞాత గారు,

ముందుగా మీ స్పందనని వివరించినందులకు నెనరులు. నిడివి తగ్గించే ప్రయత్నం చేస్తాను. తరువాతి పోస్టు ఇంత వివరంగా కాకుండా, కొంచం సూటిగా సుత్తి లేకుండా వ్రాయ ప్రయత్నిస్తాను.

Anonymous said...

ఇదేదో అపోలో ని అన్ పాపులర్ చెయ్యటానికే రాస్తున్నట్టున్నారు.మీ అపాయింట్ మెంట్ సరి చూసుకోకపోవటం మీ తప్పు,లేదా ఆ రిసెప్షనిస్ట్ చేసిన తప్పు. దానికి ఏకంగా సంస్థనే అన్ పాపులర్ చేయటం అన్యాయం.

ఓ బ్రమ్మీ said...

మొదటి అజ్ఞాత గారు,

అపోలోని అన్ పాపులర్ చెయ్యటం వల్ల నాకొచ్చే లాభం ఏమిటో నాకు అర్దం కాలేదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇక రెండవ విషయం, నేనేమి పెద్ద పేరున్న బ్లాగర్ని కాదు, నేను అన్ పాపులర్ చేస్తే జనాలు స్పందించడానికి. నేనెక్కడ అపోలో ఎక్కడ, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి నేను ఏకంగా అపోలోని నిందించడం లేదు నా అనుభవాలు నలుగురితో పంచుకుంటున్నాను, అంతే..

ఏమైనా స్పందించినందులకు నెనరులు

chanukya said...

మీ నిజాయితీకి ధన్యవాదాలు.Basic గా మనము(ఇండియన్స్)under-civilized,especially cities లో.అది మీకు ఇక్కడ తెలిసింది.

ఓ బ్రమ్మీ said...

చాణుక్య గారు,

స్పందించినందులకు నెనరులు. ఇక ఇండియన్స్ సివిలైజేషన్ విషయానికి వస్తే విభేదించడానికి నాకు ఏ కారణం కనబడటం లేదు. కాకపోతే, గతమెంతో ఘన కీర్తి కలిగిన భారతదేశంలో నేను ఒక్కడిని అన్న భావన అందరిలో కలగకపోగా, .. ఆ.. తొక్కేం కాదు.. అన్న భావన ఇప్పుడు అందరిలో ఎక్కువౌతోందని నా అభిప్రాయం. ఈ జనరేషన్ మరియు వచ్చే జనరేషన్ వరకూ ఇలాగే సాగుతుంది ఆ తరువాత మారవచ్చు అని ఆశిద్దాం. అంతవరకూ ఇలాగే స్పందిస్తూ ఉండండి.

Anonymous said...

మార్తాండకి తక్కువ, శరత్కాలానికి ఎక్కువ. ఇదేం పీకుడు సార్? అపోలోలో నేను వుండుంటే వేళ్ళు సితక్కొట్టేసేటోదిని. స్టోరీల్ టైప్ చేయనీకి కాకుండా.

ఓ బ్రమ్మీ said...

మూడో అజ్ఞాత,

పేరు చెప్పడానికి ధైర్యం లేని యదవనాయాళ్ళు చాలా మంది తో శరత్ గారిని చేర్చవద్దు. శరత్ గారు చాలా ధైర్యం ఉన్న వ్యక్తి, నీలాగానో లేక నువ్వు ఉదహరించిన మార్తాండ లాగానో ముఖం చాటేసి వ్రాసేరకం కాదు. నీకు నిజ్జంగానే దమ్ముంటే, నాయాల్ది.. రారా.. చూసుకుందాం .. కొడకా, తెలంగాణా అంటే తెలంగాణాలో లేదా రాయలసీమలో అంటే అక్కడ, ఎక్కడంటే అక్కడే నీ తాట ఒలచకపోతే నేను తెలుగు బ్లాగర్ని కాదే కాదు. నాపేరుని బాలయ్య అని మార్చుకుంటా. అంతదాకా తొక్కలో కామెంట్స్ ఆపి పని చేసుకోరా *@#$%&‌%$@#$$%% &(*&@#$

Anonymous said...

చాలా బాగా రాశారు, మీ అపోలో అనుభవాలు.
బూతులు కూడా బాగా అలవాటున్నట్టే అలవోకగా అనేశారు. మీరు బాలయ్య ఫేనా? :D

ఓ బ్రమ్మీ said...

నాల్గొవ అజ్ఞాతగారు,

స్పందించినందులకు నెనరులు. నేను బాలయ్య ఫాన్ కాదండి, బాలయ్య డైలాగ్ ఒకటి కాపీ కొట్టినందులకు అలా అన్నాను. అదేదో సినిమాలో బాలయ్య ఇలా అన్నట్టు గుర్తు .. ఎహేహే, నీ ఊరికొచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా.. అదే తరహాలో అందాం అని ప్రయత్నం చేసా అది ఇలా అయ్యింది.

Anonymous said...

ఆతనెవరో అపోలోలో వుండే టెక్నీషియన్ అయ్యుంటాడు. మీ జాగ్రత్తలో మీరు వుండండి, ఎందుకు అనవసరమైన గొడవ?

ఓ బ్రమ్మీ said...

ఐదో అజ్ఞాత గారు,

నిజమే సుమా.. ఆ యాంగిల్ నేను ఆలోచించలేదు. ఏమైనా రిజల్ట్స్ ఎలాగో వచ్చేసాయి కదా, మరేం భయం లేదు. స్పందించినందులకు నెనరులు

 
Clicky Web Analytics