బాలయ్య సినిమాకి నేను వ్రాసే పంచ్ డైలాగ్

ఈ మధ్య బాలయ్య తీస్తున్న కొత్త సినిమాకి నాకు డైలాగ్స్ వ్రాసే అవకాసం వచ్చింది. పనిలో పనిగా ఓ పది డైలాగ్స్ బాలయ్యకు వినిపించడం జరిగింది. వాటిలో ఈ క్రింద చెప్పినది బాలయ్యకు బాగా నచ్చింది. కాబట్టి ముందుగా మీకు లీక్ చేస్తున్నా, ష్.. ఎవ్వరికీ చెప్పొద్దు. సినిమా కధ ఇంకా చర్చల్లో ఉంది, కధ ఏదైతేనేం, ఆఖర్లో డైలాగ్స్ వ్రాసేది నేనేగా.

నువ్వు ఒక్కడివే రా, ఒక్కొక్కడ్ని పెంచుకుంటురా, ఒక్కొక్క సారిగా రా, వచ్చిన ఒక్కొసారి ఒక్కోదెబ్బతో నేనొక్కడ్నే ఒక్కటిస్తా ఒక్కొక్కడూ వందౌతాడు

16 స్పందనలు:

ఆ.సౌమ్య said...

కెవ్వ్ కెవ్వ్....కనీసం అరగంట నవ్వుంటాను...బాలయ్య సినిమా డైలాగుల్లో ఇది ultimate అయిపోతుంది...దీన్ని మించినది ఇంకొకటి లేదు, రాదు...విజయోస్తు....మీరు ఇరగ్గుమ్మేయండి. :P

వేణూ శ్రీకాంత్ said...

హ హ అదిరిందండి :)

Indian Minerva said...

సూపరో సూపరు.

చక్రవర్తి said...

సౌమ్యగారు,

మీలాంటి అభిమానం ఉండాలి గానీ బాలయ్య సినిమాకి స్క్రిప్ట్ కూడా వ్రాసేస్తాను. స్పందించి మీ ఆనందాన్ని తెలియ జేసినందులకు నెనరులు.

వేణూ గారు,
ఆనందించి బాగుందనే స్పందనను ప్రోత్సాహాంగా తలంచి మీ స్పందనను అందించినందులకు ధన్యవాదములు

అరుణ్ గారు,
మీ స్పందనకు ధన్యవాదములు. ఇలానే స్పందింస్తూ ఉండండి.

సుజాత said...

చక్రవర్తి గారూ నాకేదో భయంగా ఉంది! స్వాతి కి చెప్పారా? పాపం...పిచ్చి పిల్ల! :-))

చక్రవర్తి said...

సుజాత గారు,

నా భార్య వద్ద అంత టైం ఎక్కడుందండి, ఈ మధ్య తనూ ఓ కధ వ్రాస్తోందికదా.. మీరు చూడలేదా!! అందుకని ప్రస్తుతం శ్రీమతి గారు బిజీ.. ఏమైనా సరే మీరు అన్నారు కాబట్టి ఇవ్వాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ స్పందనకు నెనరులు.

మనసు పలికే said...

Excellent :D:D:D:D

Anonymous said...

:-)

చక్రవర్తి said...

అపర్ణగారు / అజ్ఞాత గారు,

స్పందించి మీ ఆనందాన్ని తెలియ జేసినందులకు నెనరులు. ఇలాగే స్పందిస్తూ ఉండండి

harephala said...

మీ Dynamics మాత్రం బ్రహ్మాండంగా ఉంది! ముళ్ళపూడి వారికి చెప్తే, వారు తీసే చిత్రంలో కొన్నైనా మీచేత వ్రాయిస్తారు! రావణుడి తో రాముడు యుధ్ధం చేసేటప్పుడు బావుంటాయి!!!

శరత్ 'కాలమ్' said...

:)
స్వాతి గారి కథలో మీరు గెస్టు/ఘోస్టు డవిలాగులు ఏమీ వ్రాయడం లేదు కదా మీరు?

కృష్ణప్రియ said...

:))

చక్రవర్తి said...

ఫణి బాబు గారు,

మీ స్పందన నాలో నాకు తెలియని మరో కోణాన్ని చూపింది. ముళ్ళపూడి వారిని ఎలా సంప్రదించాలో మీకు తెలిస్తే నాకు ఉప్పందించండి. లంకకు నిప్పెట్టిన ఆంజనేయునిలా నేను నాకు వీలైనంత నిప్పుపెట్టే ప్రయత్నం చేస్తాను. మీ ఎనాలసిస్ తప్పుకాకుండా నా వంతు కృషి చేస్తాను. స్పందించి నాలో కొత్త ఉత్సాహాన్ని ప్రేరేపినందులకు నెనరులు

శరత్ గారు,
ముందుగా స్పందించి మీ మనసులోని ప్రశ్నని అడిగినందులకు నెనరులు. ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే, లేదండి అలాంటివి నేను చెయ్యను. అది పూర్తిగా తన స్వయంకృషే. కాబట్టి మీరు ధైర్యంగా ఫాలో అవ్వవచ్చు.

కృష్ణప్రియ గారు,
స్పందించి మీ ఆనందాన్ని తెలియజేసినందులకు నెనరులు

sarat4macy said...

erri kekandi sooooooopr

Anonymous said...

latest news about balayya filing cases choodaledha ??

చక్రవర్తి said...

so what .. chiru's blood bank employes also filed another against ihatechiru.com .. who cares?

 
Clicky Web Analytics