పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్త

ఓ పెద్ద ఫ్లాప్, కొమరం పులి నుంచి బయట పడి, కొత్తగా రిలీజ్ అవుతున్న తీన్‍మార్ సినిమా హీరో అయిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్త. కొమరం పులి పాటల గురించి ఓ రివ్యు ఇంతకు ముందు వ్రాసాను. అది నేను వ్రాసిన మొదటి పాటల రివ్యు. స్వతహగా నేను సినిమాలు చూడాలనుకోను, కానీ ఏదైనా సినిమా నేను చూడాలనుకుంటే.. అంతే సంగతులు.. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందే.

అలా నేను చూడాలనుకున్నానంటే అది ఖచ్చితంగా ఫ్లాపే అని చాలా సార్లు ఋజువైంది. కొమరం పులి సినిమా విషయంలో కూడా ఇది నిజమైంది. కాకపోతే కొత్తగా వచ్చే తీన్‍మార్ సినిమా విషయంలో నేను చూడాలనుకోవటం లేదు. అన్నంత మాత్రాన ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పలేను కానీ, ఫ్లాప్ మాత్రం కాదు. అంటే, నిర్మాతకు నష్టం లేదు అన్నమాట.

ఆ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక శుభవార్తే అని నా అభిప్రాయం. ఈ పుట చదివిన వారిలో పవన్ అభిమానులెవ్వరైనా ఉంటే, స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేయ మనవి.

6 స్పందనలు:

గిరీష్ said...

love ajkal remake kada..so minimum bane untundi. andulonu trivikram matalu rasadanta..

చక్రవర్తి said...

గిరీష్ గారు,

హిందీ సినిమా రీమేక్ అయినంత మాత్రాన అది ఆడాలని రూల్ లేదు అలాగే త్రివిక్రం గారు ఇచ్చిన లేటెస్ట్ ఫ్లాప్ గురించి మీకు తెలుసనుకుంటాను. అన్నింటికన్నా మించి నేను చూడాలనుకోవటం లేదు మీరు అది గమనించాలి.

ఏదీ ఫన్ కోసం ఇలా అన్నాను. నాకు సినిమా పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. కాబట్టి మీరు చెప్పినట్టు బాగానే ఉండవచ్చు. స్పందించినందులకు నెనరులు

కత పవన్ said...

బతికించారు మహాప్రభో :))))))))

ENANI KEKA said...

Movie lo love feel undhi...

anipowerstar said...

ekosari maa anna muvis ku velaku babu

anipowerstar said...

ekosari maa anna muvis ku velaku babu

 
Clicky Web Analytics