ఓ చెత్త పోస్ట్ - ఎడ్వర్‍టైజ్‍మెంట్స్

ఇవ్వాళ Z సినిమా వారి ఛానెల్లో అష్టాచమ్మా సినిమా వస్తుంటే, అప్పుడెప్పుడో ఈ సినిమా బాగుంది అన్న మాటపై ఈ సినిమాని చూడటానికి సిద్దమైయ్యాను. ఇంతకు ముందు ఇలాగే ఓ సారి మంగతాయారు అనే సీరియల్ మధ్యలో వచ్చే ప్రకటనల గురించి వ్రాసుకున్నాను. ఇప్పుడు సినిమా మధ్యలో వచ్చే ప్రకటనల గురించి.

ఇక సినిమా బ్రేకుల మధ్య వచ్చే ప్రకటనలగురించి వ్రాసే ముందుగా ఓ పచ్చి నిజం. ప్రకటనలు దాదాపు ఎనిమిది నిమిషాలకు అటూ ఇటూగా సాగుతాయి. సరాసరిన అవి ఎనిమిదిన్నర నిమిషాలు ఉంటాయన్నమాట. దానికి తోడు సినిమాని అధికపక్షం పధ్నాలుగు నిమిషాలుగా సాగిస్తూ అధమ పక్షం పది నిమిషాల వ్యవధిలో ప్రకటనల కొరకు బ్రేక్ ఇస్తారన్నమాట. అంటే దాదాపుగా ఓ ఇరవై నుంచి పాతిక ప్రకటనలు ప్రసారం చేస్తున్నారు.

ప్రధానంగా ఎక్కువ ప్రకటనలు దాదాపు ఇరవై సెకన్ల వ్యవధిలో సాగుతాయి. ఆ తరువాత స్థాయిలో ముప్పై నిమిషాల వ్యవధిలో సాగే ప్రకటనలు ఉంటే, ఇరవై ఐదు సెకన్ల వ్యవధి కలిగిన మరియు పదిహేను సెకన్ల వ్యవధిలో కలిగిన ప్రకటనలు అటూ ఇటూగా మూడు నాలుగు స్థానాలను ఆక్యుపై చేస్తాయి.

image ఇదిగో ఇక్కడ చూపినట్లుగా ఎనిమిదిన్నర నిమిషాల సరాసరి సమయాన్నిముక్కలు చేస్తే వచ్చే భాగాలు ఇలా ఉంటాయన్నమాట. ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఎక్కువ సమయం, అంటే ముప్పై సెకన్ల ప్రకటనలు రెండొవ స్థానంలో ఉన్నా ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకుని ఉండటమే కాక ఎక్కువ నిడివి కలిగి ప్రతీ ఇతర ప్రకటనలకు అనువుగా ఉంటాయి. అలాగే రెండొవస్థానంలో ఉన్న ఇరవై సెకన్ల ప్రకటనలు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఆదాయాని ఆర్జించడానికి ఇవి మొదటి స్థానంలో ఉంటాయి. ఇక్కడ నాకు చికాకు పెట్టిన విషయం ఏమిటంటే, బాడీ స్ప్రే అయిన యాక్స్ కంపెనీ వారి ప్రకటన ఒక్కోసారి అన్ని స్లాట్లు ఆక్రమించి పాడిందే పాట పాచి పళ్ళ రోత అన్నట్లు ఉంటుంది.

వీటన్నింటికీ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కార్యక్రమాన్ని ఫలానా ఫలానా వారు సమర్పింస్తున్నారు అంటూ ప్రకటనలకు ముందు మఱియు చివర ఓ పదిహేను సెకన్ల పాటు విసిగించడమే కాక, Z ఛానాల్లో వచ్చే సీరియల్స్ గురించి ఓ పది పది సెకన్ల పాటు ఊదర కొట్టేయ్యడమే చికాకు పెట్టే విషయం. ఈ విషయాలను నమ్మని వారి కోసం ఓ చిన్న వివరణ ఈ క్రింద విధంగా..

ప్రకటన
వరుస నిడివి
1 10
2 15
3 20
4 20
5 30
6 25
7 30
8 30
9 20
10 30
11 20
12 25
13 20
14 25
15 20
16 20
17 30
18 25
19 25
20 30
21 15
22 10

9 స్పందనలు:

Anonymous said...

మొన్నీ మధ్య కూడా ఇలాగే ఒకాయన చెత్త పోస్ట్, సుత్తి పోస్ట్ అని రాసుకున్నారు. ఇప్పుడు మీరు. బ్లాగర్లందరూ పెద్ద రచయితలు కారు కదా అన్నీ గొప్ప పోస్ట్‌లే రాయడానికి. అలా ప్రకటించుకోవడం ఎందుకు?

చక్రవర్తి said...

అఙ్ఞాత గారు,

ఇంతకు ఎవ్వరా ఓకాయన అండ్ ఏమిటా సుత్తి? తెలిసి మరీ చెప్పకపోయ్యారో మీ తల వెయ్యి వక్కలౌతుంది. ఇది ఈ భేతాళుని శాపం.

ఇక అలా ప్రకటించుకోవడం ఎందుకంటే, ఏదో చెత్త కలిగిన పోస్టు కాబట్టి అది చెత్త పోస్ట్ అయ్యింది. అందుకన్నమాట, అర్దం అయ్యిందనుకుంటాను. ఏమైనా స్పందించినందులను నెనరులు. మీ స్పందనకై ఎదురు చూస్తుంటాను.

Saahitya Abhimaani said...

Well written about the ad menace in the TV. Advertisements have reached the proportion of Visual and Audio pollution.

These marketing managers who try din us with their advertisements do not realise one thing. That is HATRED for the product they are advertising.

When we are seeing the same ad over and over, unconsciously, we develop hatred towards that product.

I never purchase anything connected to Nescafe because of the ad menace they created in movie theatres during 1970-80s.

The Ad Managers should know when and how long they should show their ads but not to the extent of ad pollution which shall have completely negative results, defeating the very purpose of their so called advertising their product.

said...

బావున్నాయి మీ stats.

Anonymous said...

మేమెప్పుడో తెలుగు చానెళ్ళు చూడకూడదని ఒట్టుబెట్టుకుని మనసా వాచా కర్మణా ఆచరిస్తున్నాం.... మీరే ఇంకా చూస్తున్నారు. అలా పక్క భాషల చానెళ్ళు చూసి చూసి ఓ రెండు కొత్తబాషలు కూడా నేర్చేసుకుంటేను....

Anonymous said...

చెప్తే నా తల వెయ్యి వక్కలౌతుంది అని ఆయనంటున్నారే! ఇప్పుడెలా? పరిష్కారం మీరే చెప్పాలి.

చక్రవర్తి said...

శివరామ ప్రసాదు గారు,

ప్రకటనల విషయం నాకు అర్దం అయ్యిన తరువాత ఎంత కోపమొచ్చిందో వివరించలేను కానీ, మీరు వివరించిన తీరు చాలా బాగుంది. నిజమేనండి, ఇది ఒక పొల్యూషన్ అని నాకు అనిపిస్తోంది. ఇచ్చిన విరామంలో వేసిన ప్రకటనలే వేసి, చికాకు తెప్పిస్తుంటే ఏమి చెయ్యాలో తోచక చేసిన పనే ఈ పుట. ఇక యాడ్ మానేజర్స్ తెలుసుకోవాల్సిన విషయం మనం చెప్పినా వాళ్ళకు అర్దం అవ్వదని నా అభిప్రాయం, ఎందుకంటే, వారి అర్దం అయ్యేదల్లా ఒక్కటే, పది సెకన్ల ప్రకటనకి ఎంత డబ్బొస్తుంది, ఇరవై సెకన్ల ప్రకటనకి ఎంత వస్తుంది, అని మాత్రమే ఆలోచిస్తారని అనుకుంటాను.
ఏమైనా స్పందించి మీ మనోభావాన్ని నాతో పంచుకున్నందులకు ధన్యవాదములు. ఇకపై కూడా ఇలాగే స్పందిస్తారని తలుస్తాను.

చక్రవర్తి said...

సాధారణ పౌరుడు గారు,

స్పందించి మెచ్చుకున్నందులకు నెనరులు.

ఆచంగ గారు,

మీ ఆలోచనేదో బాగుందండి, మనకు అర్దం కాని భాషేదో ఎంచుకుని ఈ తలకాయి పగలు కొట్టుకునేదేదో అక్కడ కొట్టించుకుంటే, పరాయి భాషైనా వస్తుంది కదా. ఆ ప్రయత్నం ఒకసారి చేసి చూస్తాను. అంతవరకూ మీరు స్పందించినందులకు అందుకోండి నా ధన్యవాదములు.

అఙ్ఞాత గారు,

వీలైతే తెలియజేయ్యండి, లేదా మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఏమైనా స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందులకు నెనరులు.

శరత్ కాలమ్ said...

ఇండియాలో టివి ఛానల్సులో విషయం తెలియదు కానీ మా దగ్గర మాత్రం వ్యాపార ప్రకటనలకు శబ్దం ఎక్కువగా వుంటుంది. వాటి శబ్దాన్ని నియంత్రించాలని, మిగతా ప్రసారాలతో పాటు సమానంగా వుంచాలని ఓ చట్టం ఎవరో ప్రతిపాదించారు కానీ అది ఎంతవరకు వచ్చిందో తెలియదు.

 
Clicky Web Analytics