నైతిక విలువలు పుష్కలంగా ఉన్న టాటా కాపిటల్ వారి ప్రకటన

ఈ మధ్య అనుకోకుండా ఓ చెత్త ప్రకటన చూచిన తరువాత అనుకోకుండా ఈ ప్రకటన నా కంట పడింది. చెడ్డదానిని చెత్తగా ఉంది అని చెప్పినప్పుడు బాగున్నదానిని బాగుంది అని చెప్పడానికి నేనెందుకు వెనకాడాలని ఆలోచించిన తరువాత ఇదిగో మఱో ప్రకటన గురించి నా అభిప్రాయం. ఈ ప్రకటనలో చక్కగా ఇద్దరు పిల్లలనే వాడుకోవడంలో అశ్లీలానికి చోటు లేకుండా పోయింది.

అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ ప్రకటన వెనకాల దాగిఉన్న మూలాంశము. నాకు అది త్యాగంగా అనిపించింది. వ్యాపార పరంగా వీరు త్యాగం చేస్తారని అనుకోను, కానీ జనాలను నమ్మించే ప్రయత్నంలో ఈ మంచి ఆలోచనను చూపించిన విధం బాగుంది. ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అసభ్యంగా హుందాగా చెప్పవచ్చో ఈ ప్రకటనలో చాలా బాగా చూపించారు.

10 తరువాతి సంఖ్యలపై చెత్త కోణం

అంకెల గురించి తెలియని వారు ఉండరు. తొమ్మిది తరువాత వచ్చే సంఖ్యని పది అని ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు. కాకపోతే, ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఆ తరువాత వచ్చే సంఖ్య గురించే.. 11 మఱియు 12 వదిలేసి తరువాత వచ్చే అంకెలను తలచుకుంటే, అవి చక్కగా

పది + మూడు = పదమూడు

పది + నాలుగు = పద్నాలుగు

వగైరా వగరా అంటూ సాగి పోకుండా సదరు పదుల వరస అంతా చెత్త చెత్తగా పొంతన లేకుండా సాగుతుంది. అదే ఇరవైల వరసలో అంకెలు చక్కగా పొందికగా ఒద్దికగా ఓ పద్దతి ప్రకారంగా సాగుతాయి..

ఇరవై + ఒకటి = ఇరవైఒకటి

ఇరవై + రెండు = ఇరవైరెండు

డెభై + మూడు = డెభై మూడు

అరవై + నాలుగు = అరవైనాలుగు

తొంభై + ఐదు = తొంభై ఐదు

ముప్పై + ఆరు = ముప్పైఆరు

నలభై + ఏడు = నలభైఏడు

తొంభై + ఎనిమిది = తొంభైఎనిమిది

యాభై + తొమ్మిది = యాభైతొమ్మిది

అంటూ చక్కగా ఓ లెక్కా పత్రంగా సాగుతాయి. ఎటొచ్చీ ఈ పదుల వరసే తలతిక్కగా సాగుతుంది. ఈ విషయం ఒక్క తెలుగులోనే అనుకుంటే పొరపాటే, గ్రహపాటు పరంగా ఇది అటు ఆంగ్లంలోను ఇటు హిందీలో కూడా వంకరటింకరగా చెత్త చెత్తగా గజిబిజిగా ఉన్నాయి. ఇవి కనిపెట్టినవాడు కనుక నాకు కనబడితేనా.. నా సావిరంగ చింత బరిక పట్టుకుని.. దింతాక్ చితా చితా జింతాక్ థా.. చేసేస్తా.

నాకు అర్దం కాని విషయం ఏమిటంటే, ఒక్క తెలుగుకే తెగులు పట్టిందనుకుంటే, అటు ఆంగ్లానికి ఇటు హిందీకి కూడా పోయ్యే కాలం దాపురించింది. నాకు ఈ మూడు భాషలలోనే ఈ అంకెలను ఏమంటారో తెలుసు, మిగిలిన భాషలలో కూడా ఇలాగే ఉందే లేదో ఆయా భాషలు వచ్చిన వారు చెప్పాలి.

ఎలా ఉంటే పద్దతిగా ఉంటుంది
తెలుగులో ఆంగ్లంలో హిందీలో తెలుగులో ఆంగ్లంలో హిందీలో
పది+ఒకటి =
పదకొండు ఎలవెన్ గ్యారాహ్ పదొకటి వన్టీవన్ ఇక్ దస్
పది + రెండు = పన్నెండు ట్వల్వ్ బారాహ్ పద్రెండు వన్టీటూ బా దస్

ఈ విధంగా సాగితే, రాబోయే రోజులకి కాబోయే లెక్కల మాస్టారిని నేనే..

సృజనాత్మకత ఎక్కడ లేదు?

IMG_0043

అప్పుడెప్పుడో వెంకటేష్ గారి సినిమాలో హీరోయిన్ చేసింది అని విన్నాను ఇదిగో ఇవ్వాళ్ళ అనుభవిస్తున్నాను. పైన శీర్షికకి ఇక్కడ వ్రాసిన మొదటి వాక్యానికి పొంతన లేదనుకుంటున్నారా? పైన చిత్రంలో కనబడుతున్నవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

చదివే వారికి ఓ క్లూ కూడా ఇచ్చేసాను. వెంకటేష్ చేసిన సినిమాలలో స్నేహం అనే ఇతివృత్తం ఆధారంగా తీసిన సినిమాలోని హీరోయిన్ చద్దన్నం పారేయ్యకుండా పిండి ఒడియాలు చేస్తుంది. అదిగో అలాగునే మా అమ్మ ఇవ్వాళ్ళ మధ్యాహ్నం వేళకి ఓ ఫలహారం చేసింది. ఏమిటో అనుకుంటే, ఇదిగో ఇలా పకోడీలు వచ్చాయి. పకోడీలు శనగపిండితో చేస్తారు కదా వద్దులే నేను తినను కాలికి చీము పడుతుందేమో అని దాటేయ్యబోతే, ఒరేయ్ భడవాయ్ ఇవి శనగపిండి పకోడీలు కాదు, ఇందాక మనం తిన్న తరువాత మిగిలిన అన్నాని ముద్ద చేసి ఇలా వేయించాను అని నెత్తిమీద ఓ మొట్టికాయ్ వేసింది.

నిజం చెప్పొలంటే, మా అమ్మ పెద్దగా చదువుకోలేదు కానీ వంట మాత్రం బాగానే చేస్తుంది. క్రొత్తగా ఏదైనా చేసే విషయాన్ని సృజనాత్మకత అని అంటే, మా అమ్మ లాంటి వారిని చూచిన తరువాత సృజనాత్మకత ఎక్కడ లేదు అనిపిస్తుంది. కాకపోతే చెయ్యాలి అన్న ఆలోచన రావడమే ముఖ్యం.

శక్తి – ఓ భారీ (చెత్త) సినిమా

shakthi

సినిమాని సినిమాగా చూడాలి అన్న విషయాన్ని ఓ సినిమా అభిమాని నాతో అన్నారు. అలాంటి స్టేట్‍మెంట్ ఈ సినిమా విషయంలో బాగా సూట్ అవుతుంది. సినిమా పరంగా చూస్తే, చాలా విలువలున్న సినిమా. కాకపోతే సామాన్య ప్రేక్షకుడికి కావలసినవి సినిమా విలువలు కాదు, వ్యాపారపరంగా ఉండాల్సిన సినిమా మషాలాలు ఇందులో కనబడలేదు. కాకపోతే తీసిన దర్శకుడికి తీయించిన ప్రొడ్యూసర్లకు ఓ మంచి విజ్యువల్ ట్రీట్ ఉన్న సినిమా తీసాము అన్న తృప్తి తప్ప, కాసులు వచ్చిఉంటాయని నేను అనుకోను.

అశ్వినీ దత్ నిర్మించిన సినిమాలలో చిరంజీవి సరసన శ్రీదేవి నటించిన “జవీఅసు” అనేసినిమా  నాకు తెలిసిన మొదటి భారీ భడ్జట్ ప్రణాళికపై తీసినది. పెద్ద బడ్జట్ సినిమాలంటే, ఎవ్వరైనా చాలా జాగ్రత్త తీసుకుంటారు. అందునా అశ్వినీ దత్ ఎటువంటి ప్రలోభాలకు లొంగని వ్యక్తిగా ఇండస్ట్రీలో నానుడి. అలాంటి అశ్వినీ దత్ ఈ సినిమా విషయంలో ఎందుకో అశ్రద్ద వహించి చెత్త సినిమాకు అంతంత ఖర్చు పెట్టారు. కధా పరంగా చాలా వైవిధ్యం చూపిద్దాం అన్న తపన కనబడ్డా అది కొంచం ఎక్కువై మోతాదు మించి బెడిసి కొట్టింది.

ఏదైనా కొత్తగా చేద్దాం అన్న ప్రయత్నం బాగానే ఉంటుంది, కాకపోతే అలా కొత్తగా చేసేది చెత్తగా కాకుండా జాగ్రత్త పడక పోతే ఇలా అవుతుంది. ఈయనగారి సినిమాలో దాదాపుగా ఏదో చోట నందమూరి వంశాన్ని పొగిడే ప్రయత్నం చేసి విసుగు పుట్టిస్తుంటాడు, కానీ ఈ సినిమాలో అలాంటిది చెయ్యలేదని నాకు అనిపిస్తోంది. లేదా, ఒక వేళ చేసి ఉంటే, నేను దానిని మిస్ అయ్యుండవచ్చు. చూడబోతే, ఈయన గారికి కూడా వాళ్ళ బాబాయి లక్షణాలు మెండుగా కనబడేటట్టు ప్రస్పుటిస్తున్నాయి. ఈ విషయాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే, అంత తొందరగా బాగు పడతాడు లేదా.. ఈయన గారు కూడా పిస్తోలు పట్టుకుని కనబడ్డ నిర్మాతలను కాల్చేసే స్థితికి ఎంతో దూరంలో లేడని నా అభిప్రాయం.

ఈ సినిమా విషయంలో చెప్పుకోదగ్గ విషయాలేమిటంటే..

  1. గ్రాఫిక్స్ పరంగా కొంచం శ్రమ పడ్డారు
  2. ఆయుధాలను చాలా శ్రద్ద వహించి తీసారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలలో ఇలా ఆయుధాలను ప్రత్యేకించి ఎక్కువ శ్రద్దతో తయారు చేస్తుంటేరు. అఫ్ కోర్స్ మన వీరో గారు ఫాక్షన్ సినిమాల నుంచి ఏదో ఒక ఆయుధాన్ని వాడే విషయం మనకు తెలిసినదే, కాకపోతే వాడే ప్రతీ సారి కొంచం కొత్తగా చేయ్యడం బాగుంది
  3. హిందీ తారాగణాన్ని వాడటం నచ్చలేదు కానీ ప్రయత్నం చెత్తగా ఉంది
  4. హీరోయిన్ పరంగా అంత అవసరం కనబడలేదు
  5. నేషనల్ సెక్యూరిటీ అంటూ చెత్త చెత్త పదాలు వాడి వాటికి ఉన్న గౌరవాన్ని మంటలో కలిపారు

 
Clicky Web Analytics