శక్తి – ఓ భారీ (చెత్త) సినిమా

shakthi

సినిమాని సినిమాగా చూడాలి అన్న విషయాన్ని ఓ సినిమా అభిమాని నాతో అన్నారు. అలాంటి స్టేట్‍మెంట్ ఈ సినిమా విషయంలో బాగా సూట్ అవుతుంది. సినిమా పరంగా చూస్తే, చాలా విలువలున్న సినిమా. కాకపోతే సామాన్య ప్రేక్షకుడికి కావలసినవి సినిమా విలువలు కాదు, వ్యాపారపరంగా ఉండాల్సిన సినిమా మషాలాలు ఇందులో కనబడలేదు. కాకపోతే తీసిన దర్శకుడికి తీయించిన ప్రొడ్యూసర్లకు ఓ మంచి విజ్యువల్ ట్రీట్ ఉన్న సినిమా తీసాము అన్న తృప్తి తప్ప, కాసులు వచ్చిఉంటాయని నేను అనుకోను.

అశ్వినీ దత్ నిర్మించిన సినిమాలలో చిరంజీవి సరసన శ్రీదేవి నటించిన “జవీఅసు” అనేసినిమా  నాకు తెలిసిన మొదటి భారీ భడ్జట్ ప్రణాళికపై తీసినది. పెద్ద బడ్జట్ సినిమాలంటే, ఎవ్వరైనా చాలా జాగ్రత్త తీసుకుంటారు. అందునా అశ్వినీ దత్ ఎటువంటి ప్రలోభాలకు లొంగని వ్యక్తిగా ఇండస్ట్రీలో నానుడి. అలాంటి అశ్వినీ దత్ ఈ సినిమా విషయంలో ఎందుకో అశ్రద్ద వహించి చెత్త సినిమాకు అంతంత ఖర్చు పెట్టారు. కధా పరంగా చాలా వైవిధ్యం చూపిద్దాం అన్న తపన కనబడ్డా అది కొంచం ఎక్కువై మోతాదు మించి బెడిసి కొట్టింది.

ఏదైనా కొత్తగా చేద్దాం అన్న ప్రయత్నం బాగానే ఉంటుంది, కాకపోతే అలా కొత్తగా చేసేది చెత్తగా కాకుండా జాగ్రత్త పడక పోతే ఇలా అవుతుంది. ఈయనగారి సినిమాలో దాదాపుగా ఏదో చోట నందమూరి వంశాన్ని పొగిడే ప్రయత్నం చేసి విసుగు పుట్టిస్తుంటాడు, కానీ ఈ సినిమాలో అలాంటిది చెయ్యలేదని నాకు అనిపిస్తోంది. లేదా, ఒక వేళ చేసి ఉంటే, నేను దానిని మిస్ అయ్యుండవచ్చు. చూడబోతే, ఈయన గారికి కూడా వాళ్ళ బాబాయి లక్షణాలు మెండుగా కనబడేటట్టు ప్రస్పుటిస్తున్నాయి. ఈ విషయాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే, అంత తొందరగా బాగు పడతాడు లేదా.. ఈయన గారు కూడా పిస్తోలు పట్టుకుని కనబడ్డ నిర్మాతలను కాల్చేసే స్థితికి ఎంతో దూరంలో లేడని నా అభిప్రాయం.

ఈ సినిమా విషయంలో చెప్పుకోదగ్గ విషయాలేమిటంటే..

  1. గ్రాఫిక్స్ పరంగా కొంచం శ్రమ పడ్డారు
  2. ఆయుధాలను చాలా శ్రద్ద వహించి తీసారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలలో ఇలా ఆయుధాలను ప్రత్యేకించి ఎక్కువ శ్రద్దతో తయారు చేస్తుంటేరు. అఫ్ కోర్స్ మన వీరో గారు ఫాక్షన్ సినిమాల నుంచి ఏదో ఒక ఆయుధాన్ని వాడే విషయం మనకు తెలిసినదే, కాకపోతే వాడే ప్రతీ సారి కొంచం కొత్తగా చేయ్యడం బాగుంది
  3. హిందీ తారాగణాన్ని వాడటం నచ్చలేదు కానీ ప్రయత్నం చెత్తగా ఉంది
  4. హీరోయిన్ పరంగా అంత అవసరం కనబడలేదు
  5. నేషనల్ సెక్యూరిటీ అంటూ చెత్త చెత్త పదాలు వాడి వాటికి ఉన్న గౌరవాన్ని మంటలో కలిపారు

3 స్పందనలు:

శరత్ 'కాలమ్' said...

ఏంటీ, ఆ సినిమా చెత్తగా వుందా! అలా అనడానికి ఎన్ని గుండెలు మీకు?!

vijay said...

ఏంటీ....మీరు శక్తీ సినిమా చూశారా...
మానాయనే... మాబాబే.....

చక్రవర్తి said...

శరత్ గారు,

చెత్తగా ఉన్నదానిని చెత్తగా ఉంది అనడానికి ఎన్ని గుండెలు కావాలబా!!

విజయ్ గారు,
అంత సానుభూతా!!! థాంక్స్ ఫర్ ద సింపథి అండ్ థాంక్స్ ఫర్ ద కామెంట్

 
Clicky Web Analytics