నేను తెలుగులో బ్లాగింగి మొదలు పెట్టిన తరువాత ఈ నాటికి ఓ ముఖ్య ఘట్టాన్ని దాటానని నాకు ఈ అవలోకనం తెలియజేసింది. అంతే కాకుండా నాకు లేని ఏదో భాధ్యతిని గుర్తు చేసినట్లు ఉంది. వాటి గురించి వ్రాసుకునే ముందు ఓ అవలోకనం. నేను ప్రప్రధమంగా తెలుగులో వ్రాసుకోవడం మొదలు పెట్టింది “ఉబుసు పోక” అనే బ్లాగుతో. దానికి అనుసంధానంగా “భవదీయుడు” అనే మఱో బ్లాగు. ఆ నాటి వరకూ నాకు ఆంగ్లంలో బ్లాగడమే తెలుసు, తెలుగులో బ్లాగుతారని eతెలుగు లోకి వచ్చిన తరువాత తెలిసింది.
మొట్ట మొదటి సారిగా 2008వ సంవత్సరంలో మార్చి నెలలో 12వ తారీఖున “ఉబుసు పోక” బ్లాగాను. అలా సాగిన నా బ్లాగు ప్రహసనం మూడేళ్ళ తరువాత ఈ పుటతో నూట యాభైయొకటవ పుటకు చేరుకుంది. అలా కొంత కాలం అయ్యిన తరువాత, ఈ ఉబుసు పోక బ్లాగడాన్ని ఉత్తి హాస్యాస్పదమైన లేదా అంతగా ఆలోచించడానికి అవసరం లేని విషయాలకు మాత్రమే పరిమితం చేసి, కొంచం ఆలోచించడానికి అవసరమైన విషయాలను భవదీయుడు అనే బ్లాగులో వ్రాసుకోవడం మొదలు పెట్టాను. ఇలా భవదీయుడు బ్లాగు మే నెల ఐదో తారీఖున మొదలైంది. భవదీయుడు బ్లాగులో ఓ వంద పోస్టులు వరకూ పడ్డాయ్యన్నమాట. నిజంగా చెప్పాలంటే భవదీయుడు బ్లాగు నూట ఒక్క పోస్టులు నోచుకున్నా, ఒక పోస్టుని పలు కారణాల వల్ల తొలగించాల్సి వచ్చింది. మొదటి గణనాంకాలు
| ఉబుసు పోక | భవదీయుడు | |
| వ్రాసిన పోస్టుల సంఖ్య | 150 | 100 |
| మొత్తం స్పందనలు | 501 | 580 |
| పోస్టుకి ఎక్కువ స్పందనల | 22 | 58 |
| పోస్టుకి అత్యధిక హిట్స్ | 1502 | 886 |
| ఏ నెలలో అత్యధిక హిట్స్ | 2010 అక్టోబర్ | 2010 ఆగస్ట్ |
| అత్యల్ప హిట్స్ | 2011 మార్చ్ | 2011 మార్చ్ |
| ఇంతవరకూ ఎన్ని హిట్స్ | 20151 | 18661 |
ఇప్పుడు విడివిడిగా ఒక్కో బ్లాగుగురించి పరిశీలిస్తే.. వివిధ దేశాలనుంచి ఎన్ని విజిట్స్ వచ్చాయి, ఒక్కో దేశాన్నించి ఎన్ని అనే లెక్కలో ప్రధమ పది దేశాలను లెక్క వేస్తే ఈ క్రింది విధంగా లెక్క తేలింది.
| దేశాల వారిగా పుటల సందర్శన | ఉబుసు పోక | భవదీయుడు |
| భారతదేశం | 12556 | 8031 |
| అమెరికా | 4607 | 7287 |
| సింగపూర్ | 483 | 561 |
| యునైటెడ్ కింగుడం | 425 | 478 |
| యునైటెడ్ ఎమిరేట్స్ | 222 | 137 |
| కెనడా | 63 | 171 |
| చెక్ రిపబ్లిక్ | 148 | |
| ఫ్రాన్స్ | 134 | |
| అస్ట్రేలియా | 70 | 105 |
| నెదర్లాండ్స్ | 105 | |
| జపాన్ | 62 | |
| ఓమన్ | 56 |
ఇప్పుడు ప్రస్తావించ బోయే గణనాంకాలు కొంచం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే, ఎక్కువమంది ఏ ఏ విహారిణులు వాడారు అన్న ఆలోచన వచ్చిన తరువాత గణనాంకాలు చూస్తే, నాకు ఎంతో ప్రీతి ప్రాయమైన మైక్రోసాఫ్ట్ వారి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ మొదటి స్థానంలో ఉంది. దాని తరువాత స్థానం మొజిల్లా వారి ఫైర్ ఫాక్స్. అంతే కాకుండా దాదాపుగా నేను ఎన్నడూ వినని విహారిణుల గురించి కూడా నాకు తెలిసింది.
| విహరణి గణనాంకాలు | ఉబుసు పోక | భవదీయుడు |
| ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ | 8546 | 7528 |
| ఫైర్ ఫాక్స్ | 7053 | 7387 |
| క్రోం | 3774 | 2871 |
| సఫారి | 273 | 410 |
| ఒపెరా | 156 | 92 |
| క్రోం ఫ్రేం | 93 | 71 |
| ఒన్ రొయిట్ (OneRiot) | 30 | 54 |
| సింపుల్ పై (SimplePie) | 18 | 19 |
| pythumbnail.py | 12 | |
| PBSTB | 11 | |
| జావా | 18 | |
| సెర్చ్ టూల్ బార్ | 17 |
విచ్చేసిన అతిధులు వాడిన ఆపరేటింగ్ సిస్టం గణనాంకాలు ఒక్కసారి అవలోకిస్తే ఎక్కువ శాతం మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారని తెలియడం ఆశ్చర్యం కాదు కానీ, విచ్చేసే వారు వివిధ రకాలైన ఆపరేటింగ్ సిస్టంస్ వాడటమే కాకుండా, అధునాతన మైన సాధనాలైన మొబైల్ ఉపకరణాల ద్వారా కూడా విచ్చేస్తున్నారన్న విషయం నమ్మబుద్ది కాలేదు.
| ఆపరేటింగ్ సిస్టం గణనాంకాలు | ఉబుసు పోక | భవదీయుడు |
| విండోస్ | 19216 | 16502 |
| మాకింతోష్ | 305 | 1141 |
| మిగతా యునిక్స్ | 367 | 386 |
| లినిక్స్ | 136 | 324 |
| ఐఫోన్ | 62 | 120 |
| ఐపాడ్ | 55 | 39 |
| ఇపోడ్ | 10 | |
| విండోస్ NT 6.1 | 3 | |
| నోకియా | 6 | 1 |
| సామ్ సంగ్ | 1 | |
| LG | 11 | |
| FreeBSD | 2 |
నా ఈ బ్లాగులు ఏ ఏ అగ్రిగేటర్ల ద్వారా వీక్షించ బడుతున్నాయి అన్న ఆలోచనలో నాకు కొన్ని విషయాలు తెలిసాయి. భవదీయుడు బ్లాగుని తెలుగు బ్లాగర్స్ లోను అలాగే ఒన్ ఇండియా వారి బ్లాగ్స్ యందు కలపలేదని. వీలు చూసుకుని వాటికు కూడా కలుపుతాను.
| దారి చూపిన URLs స్థానం | ఉబుసు పోక | భవదీయుడు |
| కూడలి | 1 | 1 |
| మాలిక | 2 | 2 |
| గూగుల్ పోల్స్ | 3 | |
| హారం | 4 | 4 |
| జల్లెడ | 3 | 5 |
| తెలుగు బ్లాగర్స్ | 5 | |
| ఒన్ ఇండియా / దట్స్ తెలుగు | 6 |
ఈ మూడేళ్ళను సంవత్సరం ప్రకారం చూస్తే నాలుగు సంవత్సరాలను లెక్కలోకి తీసుకుని ఎన్నెన్ని పోస్టులు వ్రాసాను అని ఆలోచిస్తే కొంచం వైవిధ్యం కనబడుతోంది.
| సంవత్సరం | ఉబుసు పోక | భవదీయుడు |
| 2008 | 64 | 19 |
| 2009 | 30 | 33 |
| 2010 | 36 | 30 |
| 2011 | 19 | 18 |
ముగించే ముందు ఓ విషయం నాకు ఆశ్చర్య పఱచింది. భవదీయుడు బ్లాగులో అమెరికాపై వ్రాసిన మూడు పోస్టులు టాప్ పదింటిలో మొదటి మూడు స్థానాలు ఆక్రమించుకుంటే, ఉబుసు పోని బ్లాగులో సినిమా పాటల రివ్యూలు మొదటి స్థానాలు ఆక్రమించుకున్నాయి. ఇంకా విశ్లేషించ వచ్చు కానీ కొంచం ఎక్కువ విశ్లేషించుకుంటున్నానేమో అనిపిస్తూ విరమించుకుంటున్నాను. నేనె ఇంతగా డప్పు కొట్టుకుంటే నాకన్నా ఎక్కువగా వ్రాసేవారు ఎంత కొట్టుకోవాలో అన్న విషయం బుర్రలో దూరి బండ బూతులు తిడుతోంది.
0 స్పందనలు:
Post a Comment