బాగా చదవడం ఒక విధంగా మంచి పని కాదేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది .. ఇదిగో ఇవాళ అనిపించినట్లు.. ఇంతకీ ఏమయిందంటే.. ఇరోజు యధావిధిగా మైక్రోసాఫ్ట్ బ్లగులు చదువుతుంటే.. Kevin Frei .. బ్లాగుని యాదృచ్చికంగా సందర్సించటమయినది.. ఈ మహానుభావుడు తన సోంత విషయాలను వేరే చోట బ్లాగ్ చేస్తున్నారు.
అబ్బో!! ఏమి భాష.. ఏమి వివరణ.. ఏమి పారదర్సకత.. ఎన్నో .. ఎన్నేన్నో .. మరెన్నో విషయాలు .. ఎమాత్రం దాపరికం లేకుండా .. ఏంత విపులంగా .. ఒక వ్యక్తి ఇన్ని విషయాలు ఇలా ఒకే చోట ఇలా పొందు పరచడం చూస్తోంటే.. ముచ్చటేస్తోంది.. అంతే అబ్బుర పడ్డాను కూడా..
ఎంతైనా ఒక వ్యక్తి ఇన్ని విషయాలు ఇలా వ్యక్తీకరిస్తూ ఉంటే.. అతని స్వాతంత్ర్యానికి / అనుభవానికి / తెలివికి / పరిఞానానికి కొంచం అసూయగానూ.. కొంచం భాధగానూ ఉన్నట్లుంది .. అసూయ దేనికంటారా .. అన్ని సౌకర్యాలు .. అట్టి పని పరిస్తితులు .. ఇంకా.. ఇంకా.. నాకులేవే అని.. "భాధ" ఎందుకంటే.. భావాని వ్యక్తీకరించే భాష ఉన్నా .. భావాన్ని తెలియజేసే ప్రక్రియలో పరిణితి రాలేదే అనేదే..
ఏది ఏమైనా .. ఒక రోజు నేను చాలా స్వాతంత్ర్యంగా .. నిర్మోహమాటంగా .. నిర్బయంగా నా అభిప్రాయాలను ఇక్కడ పొందు పరుస్తాని భావిస్తున్నాను ..
అంతవరకూ .. అపనిలో .. అప్రహతికంగా సాగిపోయే .. ఒ సగటు బ్లాగరు ..
1 స్పందనలు:
Nice Post
All the best :).
Post a Comment