ఏందుకిలా జరుగుతోంది??

గత వారం మొత్తం అస్సలు పని నడవలేదు. కానీ కార్యాలయానికి వెళుతున్నాను, వస్తున్నాను. ఎదో యాంత్రికంగా రోజంతా గడుస్తోంది. ఎదో కోల్పోయినట్లు.. ఎదో లోపించినట్లు.. ఎందుకిలా నాలో ఈ స్తబ్దత?? ఏమీ చెయ్యలేక పోతున్నాను.. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండే నాలో ఒక్కసారిగా ఈ శూన్యం ఎలా ప్రవేసించిందో తెలియదు. కానీ మొత్తంగా నేను అన్నింటిని కోల్పోయాననిపిస్తోంది. ఎందుకిలా జరిగింది?

ఎలా ఈ శూన్యాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడెప్పుడో చదివిన జోక్ ఒకటి ఇప్పుడు గురుకొస్తోంది. ఒక ఉద్యోగి తన భాధని ఈ క్రింద విధంగా వ్యక్తీకరించాడు

నేను కనుక ఇచ్చిన పనికి ఎక్కువ సమయం తీసుకుంటే, నేను చాలా నెమ్మదిగా పనిచేస్తున్నానంటారు
అదే నా పై అధికారి కనుక ఎక్కువ సమయం తీసుకుంటే, అతను బాగా ఆలోచించి చేస్తున్నాడంటారు

నేను కనుక ఇచ్చిన పనిని చెయ్యలేకపోతే, నేను భద్దకస్తు
అదే నా పై అధికారి కనుక చెయ్యలేకపోతే, అతను బాగా బిజీగే ఉన్నాడంటారు

నేను కనుక అడగకుండా ఏదైనా ఉపయొగమైన పనిచేస్తే ఎచ్చులుపోతున్నానంటారు
అదే నా పై అధికారి కనుక ఏదైనా ఉపయొగమైన పనిచేస్తే, అతను కొత్త విషయాలు శృష్టిస్తున్నాడంటారు

..

..

తెలుగులోకి తర్జుమా చేస్తుంటే అర్దం మారి పోతున్నందున, ఆంగ్లంలో..

When I Take a long time to finish, I am slow,
When my boss takes a long time, he is thorough

When I don't do it, I am lazy,
When my boss does not do it, he is busy,

When I do something without being told, I am trying to be smart,
When my boss does the same, he takes the initiative,

When I please my boss, I am apple polishing,
When my boss pleases his boss, he is cooperating,

When I make a mistake, I'm an idiot.
When my boss makes a mistake, he's only human.

When I am out of the office, I am wondering around.
When my boss is out of the office, he's on business.

When I am on a day off sick, I am always sick.
When my boss is a day off sick, he must be very ill.

When I apply for leave, I must be going for an interview
When my boss applies for leave, it's because he's overworked

When I do good, my boss never remembers,
When I do wrong, he never forgets

అలా, నేను క్రిందటి వారం అస్సలు పని చెయ్యకపోవడాన్ని, నా టీమ్‍లోని సభ్యులంతా నేను ఎదో క్రొత్త ఆలోచనతో సతమవుతున్నాననుకుంటున్నారు. ఎలా?? ఎలా?? నేను మాములు మనిషి నవ్వాలి? మునుపటిలా చలాకీగా పనిచేస్తూ, మా సంస్థకు కాలాయాపన లేకుండా, ఇచ్చిన పని మొదలు పెట్టాలి? అస్సలే, క్రిందటి వారమే క్రొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ అస్సలు అర్దం కావటంలేదు. ఎంతటి క్లిష్టమైన ప్రాజెక్ట్‍నైనా ఇట్టే పట్టెసి, చట్టుక్కున ముక్కున పెట్టేసుకునే నేనేనా ఇలా ప్రవర్తిస్తున్నానా అని నామీద నాకే ఒక అనుమానం

లేక నేనేమైనా ముసలివాడినైనానా అన్న అనుమానం మొదలైంది. నాలోని తెలివి తేటలన్నీ ఒక్క సారిగా కోల్పోయానా అన్న భయం వెంటాడుతోంది. ఈ పరిస్తితి నాకు చాలా క్రొత్తగా ఉంది. ఇది నాకు ఒక్కడికేనా లేకా ఎవ్వరికైనా వస్తుందా?? ఎవ్వరైనా ఇట్లాంటి జబ్బుకు గురైనారా??? దీనికేమైనా మందు ఉందా???

ఎవ్వరినా.. ఎదైనా .. ఎలాంటిదైనా.. చెప్పండి.

2 స్పందనలు:

తెలుగు'వాడి'ని said...

చక్రవర్తి గారు : ముందుగా మీరు పైన చెప్పిన ఈ విషయాలు అందరికీ అనుభవైకవేద్యమే ఎప్పుడో ఒకప్పుడు కనుక వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి. ఇకపోతే ఇప్పటి మీ మనఃస్థితి చాలా సహజాతిసహజం ముఖ్యంగా మీరు Software field లో పని చేస్తుంటే .. నిజం చెప్పాలి అంటే ఇలా అనిపించకపోతేనే కొంచెం తేడా ఉన్నట్టు (మీలో లేక కంపెనీలో[నూటికో, కోటికో ఇలాంటివి ఒక్కటే ఉంటే] లేక మీ work assignments[ఎప్పుడూ variety/latest technologies] ;-) :-)

చూస్తూ/చదువుతూ ఉంటే ఇది మీకు మొదటిసారిలాగా ఉంది .. ఇది ఆరంభం మాత్రమే .. ఇలాంటి తీవ్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ఇక ముందు కూడా ... కాకపోతే ఇంత తీవ్రంగా అనిపించవు ముందు ముందు ... కనుక మీరు జబ్బనీ, మందులనీ అంత ఎక్కువ ఆలోచించకండి ..

చిట్కాలు :

1. Take a break. Go out for a vacation to a new place. (Don't take your Laptop if you have one). Regroup yourself.

2. మీకు అప్పచెప్పిన పనిని మీకు ఇప్పటికే బాగా తెలిసిన మరియు/లేదా అతి సులభమైన పధ్ధతిలో సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయండి కానీ submit చేయకండి (ఇంకా గడువు ఉంది కాబట్టి) .. [ నాకు తెలిసినంతలో మీకు పది రోజులు గడువు ఇస్తే మీరు దీనిని ఈ పధ్ధతుల్లో నాలుగయిదు రోజుల్లో చేసెయ్యగలరు ] .. ఇప్పుడు మిగతా సమయంలో అదే పనిని వేరే పధ్ధతిలో (to make it more generic and indepedant module) మరియు/లేదా లేటెస్ట్ టెక్నాలజీతో ఎలా చేయవచ్చో ప్రయత్నించండి. [ ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఈ code/technology మీ client/customer కి OK అయితే all happy లేదా కనీసం మీకు కొత్త technology నేర్చుకున్నారు అన్న తృప్తి అన్నా ఉంటుంది. ]

3. ఇలా కాదులే అనుకుంటే ... ఒక చల్లని సాయం సమయంలో ఆదివారం పూట ఒక మూడు-నాలుగు 'మాంఛి' తెలుగు సినిమాలు వరుసగా చూసెయ్యండి ...పడుకోబోయే ముందు దిట్టంగా ఇడ్లీనో/అట్టో తిని, కాఫీ తాగి పడుకోండి [పీడ కలలు రాకుండా].. అప్పుడు తెలుస్తుంది మీకు మీ ఉద్యోగ జీవితం ఎంత రసరమ్యమో ...

4. ఇక ఇవన్నీ పనిచెయ్యకపోతే .. జ్యోతి గారి క్రేజీ కాంబినేషన్స్ అనే టపా చదవండి (వ్యాఖ్యలు మరువకండి సుమా) ... ఒకటో రెండో మనకు కూడా ఎక్కడో తగలకపోవు కదా !!!

గమనిక : ఇలాంటి ఆలోచనలకు ముఖ్యకారణం .. మీరు ఒకే టెక్నాలజీ పై ఎక్కువ కాలం పనిచేయటం, లేదా related/similar projects పై పనిచెయ్యటం, మీకు challenging గా అనిపించకపోవటం, కొత్తవి నేర్చుకోవటానికి మీకు interest లేకపోవటం, మీ కష్టానికి తగిన గుర్తింపు(రకరకాలు) లేకపోవటంతో వీడిచ్చే salary కి మరలా కొత్త నేర్చుకోవటమొకటి అనే నిరాసక్తత ఆవహించటం, కడుపులో చల్ల కదలకుండా(ఇక్కడ కూడా రకరకాలైన కారణాలు : ఇల్లు-ఆఫీస్ దగ్గరగా ఉండటం, అలవాటైన technology/projects, friends/colleagues) జీవితం గడిచిపోతుంది కదా మరలా కొత్త company కి ఎందుకు అక్కడా ఇదే కధ కదా అనే ఆలోచనలు రావటం, లేదా ధైర్యం చేసి మారదాము అన్నా Market conditions సరిగ్గా లేకపోవటంతో ప్రస్తుతం ఉన్న company లోనే బండి లాగించవలసిన పరిస్థితులు మొదలగునవి.

కనుక మీరు ఎక్కువ (ఆలో)చించకండి ... కొన్ని రోజుల్లో అదే సర్దుకుంటుంది .. కానీ ఇవి తరచుగా (కొన్ని రోజుల లేదా ఒకటి-రెండు నెలల తేడా అయితే మాత్రం అవి ఇంతకు ముందు వాటి ripple effects అని గుర్తుకు తెచ్చుకోండి) వస్తూ ఉంటే మాత్రం ఒక కన్నువేసి ఉంచండి ... అప్పుడు వీటి మూలాలలోకి వెళ్లవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ అసంతృప్తి, ఆవేశం/చిరాకు/కోపం రూపంలో బయటకు వచ్చే తొలి దశలోనే మందు (మందు అన్నానని జబ్బు అనుకోకండి) (అంటే technology/project/company మారటం మొదలగునవి చేయటం అన్నమాట) వేయవలసిన అవసరం ఉంది.

ఈ ఆలోచనలన్నీ ముఖ్యంగా మీ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపించనంతవరకు పెద్దగా ఆలోచించవలసింది ఏమీ లేదు.

అంతవరకూ ఆలోచనలనే నిశ్చల(!?) కడలిలోకి (ఇంకొక) రాయి వేయకండి ...

అలాగే ఈ మధ్య అందరూ ... సినిమాని సినిమాలాగే చూడాలి ... కధని కధలాగే చదవాలి ... అని చెపుతున్నారు ... నేనేమన్నా తక్కువ తిన్నానా :-) ... ఉద్యోగాన్ని ఉద్యోగంలాగే చెయ్యాలి..

Anonymous said...

Simple. Take a Holiday. Throw a party. Or do whatever you wanted to do. Buy yourself a gift.... or just flirt with someone. Cheer up.

 
Clicky Web Analytics