ఆడ పిల్ల పుట్టాలనుకుంటున్నారా???

అయితే ప్రొద్దుట పూట ఫలహారం మానేయ్యండి. అంతే.. గర్బాధారణ జరిగే రోజులలో స్త్రీలు కనుక బ్రేక్‍ఫాస్ట్ మానేస్తేనంట ఆడ పిల్లలు పుట్టడానికి ఎక్కువ అవకాశాలున్నాంట. ఏంటీ నామాట నమ్మటంలేదు కదా.. బ్రిటీషు శాస్త్రవేత్తలు ఈ రోజు పత్రికా ముఖంగా ఈ విషయాన్ని వెల్లడిచేసారు.

Exeter మరియు Oxford విశ్వవిధ్యాలయాల సంయుక్త పరిశోధనల ఫలితాలు చాలా చాలా క్రొత్త క్రొత్త విషయాలను తెలియజేసాయని Exeter విశ్వవిధాలయలో పని చేస్తున్న ఫియనా మాత్యు అనే శాస్త్రవేత్త తెలియజేసారు. ఈయన ప్రకారం గర్బాధారణ జరిగే రోజులలో తల్లులు కనుక ఉదయం వేళలలో తక్కువ కేలరీలు కలిగిన అహారాన్ని భుజించడం ద్వరా పుట్టబోయే పిల్లలలో మగ పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న విషయం ఋజువు అయ్యిందన్నారు. మానవ శరీరం ఉదయం వేళలలో ఎమీ భుజించక పోవడాన్ని, తక్కువ కేలరీ కలిగిన పదార్దం పెద్ద ప్రేవులలో ఉన్నట్లుగా గ్రహిస్తుందని, ఈ రకంగా తల్లి పోషక పదార్దానికి పుట్ట బోయె పిల్లలకు చాలా దగ్గరి సంభందం ఉన్నట్లు వారు విశదీకరించారు.

౭౪౦ (740) మంది మొదటి సారిగా గర్బం దాల్చిన యువతుల మీద జరిపిన సర్వే ఫలితాలను తెలియజేస్తూ, వారిలో ఎక్కువ శాతం తల్లులు మగ బిడ్డలకు జన్మ నిచ్చారని, వారంతా చక్కగా ఎక్కువ శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకున్నారని కూడా వివరించారు. తక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని భుజించిన మిగిలిన యువతులకు ఆడ పిల్లలు కలిగారనేది వారి వాదన.

పూర్తి వ్యాసాన్ని AOL వారి లింకు నుంచి చదవగలరు

2 స్పందనలు:

కొత్త పాళీ said...

ఇంకేం బ్రహ్మాండం!
ఇప్పటిదాకా ఆడ శిశువుల్నీ భృణాల్నీ మాత్రమే హత్య చేస్తూ వచ్చాం.
ఇహ ఆడశిశువుకి జన్మనిచ్చే అవకాశామున్న తల్లుల్నే తిండి పెట్టక మాడ్చి చంపేద్దాం. ప్రపంచాన్నంతా పురుషపుంగవుల్తో నింపేద్దాం.

ఓ బ్రమ్మీ said...

కొత్త పాళీ గారు,

ఇక్కడ ఒక్క విషయం తమరు గమనించాలి. ఆడ శిశువుకు జన్మ నిచ్చే అవకాసం కోసం ఎదురు చూసే నాలాంటివారికి ఇదొక శుభవార్త. అలాగే ఉదయం వేళ్ళల్లో ఫలహారం తినొద్దన్నారు కానీ మిగతా వేళలలో దండిగానే లాగించేయచ్చు కదా..
మా ఇంట్లో నేను ఫలహారం విషయంలో రాజీ పడను. అందరినీ ఒక పాళ్ళు ఎక్కువగా లాగించేయ్య మంటాను. కానీ నా భార్య మరియు మా అమ్మ అంటూ ఉంటారు, ఏమనంటే.. మధ్యాహాన్నం కొంచం దండిగానే తింటాం కదరా, కాబట్టి, బ్రేక్‍ఫాస్ట్ కొంచం లైటుగా తీసుకుంటాం.. అని. నేను ఏ మాత్రం కనికరించ కుండా, బ్రేక్‍ఫాస్ట్ మాత్రం ఓకింత ఎక్కువగా దగ్గరుండి మరీ తినిపిస్తాను. కాదనలేక తింటూ ఉంటారు. ఇట్లాంటి మా ఇంట్లో ఇప్పుడు ఈ విషయం తెలిసిందనుకోండి, ఇంతే సంగతులు.. తరువాతి విషయాన్ని మీ ఊహకే వదిలేస్తున్నాను.
ప్రతీ విషయం లోనూ సగం లాభం అలాగే సగం నష్టం ఉంటుంది, దానిలోంచి మనం దేన్ని గ్రహిస్తున్నామనేది మన వివేకానికే వదిలేద్దాం. అంతే గానీ స్త్రీ శిశువు జననానికి నేను వ్యతిరేకం కాదు అని గమనించ గలరు. నావరకూ నేను అందరికీ ఒక్క మాట చెబుతుంటాను. అదేంమిటంటే, ప్రతీ కుటుంబంలోనూ పెద్ద పిల్ల ఆడపిల్లే కలగాలని. ఆట్టి కుటుంబంలో తరువాత పుట్టే పిల్లల భవిష్యత్తును ఆ పెద్ద పిల్ల స్వతంత్రంగా తన భుజాలమీద వేసుకుంటుంది. తాను చదువు కుంటూ వాళ్ళనీ చదివిస్తుంది. నేను స్వతహాగా చాలా ఋజువులు చూసాను. అందుకనే వేయి దేవుళ్ళకు ప్రార్దిస్తా.. దేవుడా నాకు మెదటి బిడ్డగా ఓ కూతురు నియ్యి స్వామీ అని. మీరు కూడా wish me all the best

 
Clicky Web Analytics