ఇవ్వాళ కార్యాలయం (ఆఫీస్) లో నేను చెయ్యాల్సిన పని ఏమత్రం ముందుకు సాగనప్పుడు, ఆటవిడుపుగా ఉంటుందని చేసిన పనులు వాటి వివరాలు ఈ క్రింది విధంగా..
౧) వరూధిని గారి బ్లాగ్ లోని "స్కూటీ నేర్పగలవా.." కు నా అభిప్రాయాన్నితెలియజేయడం
౨) శ్రీవిద్య గారి బ్లాగ్ లోని, "మనిషి గెలవాలంటే మనసు ఓడిపోవాలా..? (నేనొప్పుకోను)" అన్నపుటకి విహారి ఇచ్చిన అభిప్రాన్ని వ్యతిరేకించడం
౩) ఉమామహేస్వరరావు ని చూసి, వాత పెట్టుకుని, ఒక "వ్యక్తిత్వ పరీక్ష"కు హాజరు అయ్యి, దాని ద్వారా తెలిసిన విషయాలను నా వెరే బ్లాగులో భద్రపరిచాను
౪) ఈ బ్లాగు తోలు (skin) ఒలొచి.. వేరేది ఏదైనా వెద్దామని చేసిన ప్రయత్నంలో ప్రస్తుత తోలు నచ్చడంతో ఇలా మార్చేసాను
౫) నాబ్లాగుని ఎంత మంది, ఎన్ని సార్లు చూస్తారో అన్న కుతూహలంతో.. ఒక కొలతల సంఖ్యామాన కొలబద్దను తగిలించాను.
౬) ఇంకా ఏమి చెయ్యాలోతెలియక ఇదిగో ఇలా..
ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయమాసన్నమయినది.. ఇంతే సంగతులు.. ఇట్లు.. ఓ సగటు సాఫ్ట్‍వేర్ ఇంజినీరు..
హయ్యోరామా.. ఇంకొక విషయం మర్చిపోయాను.. Disclaimer.. కూడా కొత్తగా చేర్చాను. మీఅభిప్రాయములను తెలియజేయడం మరచిపోకుండి.
3 స్పందనలు:
చక్రవర్తి గారూ, మీరు "భార్యతో కలిసి టపా" రాసినాక నా బ్లాగుకి ఒకటే హిట్లు. ఏమిటబ్బా నేనేమి కొత్త టపా రాయలేదు కదా అని చూస్తే ఎక్కువగా మీ బ్లాగు నుండి
వచ్చినవే. ఆ ఒక్కరోజే 191 హిట్లు వచ్చాయి, ఇది ఇప్పటివరకు నా బ్లాగుకు ఒక్కరోజులో వచ్చిన అత్యధిక హిట్స్.
"పట్టు చీర అద్దెకిచ్చి, పీట పట్టుకు తిరిగిందంట..", ఈ భర్తలు బండి కొనిచ్చి, వెంట body gaurdలా తిరగడం,.....పోనీలేండి మీరన్నా నిజాన్ని గ్రహించారు!!
ఇక మీరు చెప్పిన రోజు ఎప్పటికి రాదులేండి :)
191 హిట్లా.. నేనా.. my god .. దీన్ని బట్టి నాకు అర్దమయ్యిందేమిటంటే.. పని చెయ్యకుండా.. సోది కోడుతూ.. కాలయాపన చేస్తున్నాననిపిస్తోంది .. ఏది , ఏమయినా.. నేను కోంచం speed తగ్గించుకోవలసిన సమయం ఆసన్నమయినదన్నమాట.
అది సరేగానీయండి.. అదేంటండి .. ఒక్క సారిగా అంత మాట అనేసారు .. "ఇక మీరు చెప్పిన రోజు ఎప్పటికి రాదులేండి :).." గురించి .. చక్కగా మీరేదో ఒకరోజు స్కూటీ వేసుకుని .. జాయి.. జాయి .. మంటూ రోడ్డు మీద తిరుగుతున్నాని టప వ్రాస్తారో అని నేను ఎదురుచూస్తూంటేను.. అదే అదునుగా తీసుకుని, నా అర్దాంగికి ఒ స్కూటీనో.. హొండా అక్టీవానో.. కొనిచ్చేసి.. నువ్వుకూడా అలా తిరగవచ్చు కదా అని అందామనుకుంటుంటేను.. నా ఆసల మీద నీళ్ళు చల్లారు కదాండి..
:) నేను స్కూటర్ వేసుకుని బాగానే తిరుగుతున్నానండి, నేను చెప్పేది వెనక మా వారిని కూర్చోపెట్టుకుని తిరగటం:)))
Post a Comment