నా కొత్త ఫోన్ విషయాలు ప్రస్తావించే ముందు.. అస్సలు నేను ఈ ఫోన్ ఎందుకు కొనవలసిందో అన్న విషయం మీద చిన్న ఉపోధాతం
అవి డిసెంబర్ 2005 రోజుల్లో.. నేను దుబాయ్ లోని ఎమిరేట్స్ లో పనిచేసే రోజులు.. దుబాయ్ వెళ్ళే ముందు నా ఆఖరి పెళ్ళి చూపులు జరిగాయి.. అమ్మకు ఆ అమ్మాయి నచ్చింది. సరే కదా అని సంభంధం కుదుర్చు కున్నారు. ఇంకే.. కొత్తకదా.. నేను ఆ అమ్మాయితో ఎప్పుడైనా మాట్లాడాలి అంటే వాళ్ళ అమ్మగారి (ప్రస్తుత అత్తగారు) ఫోన్ కి చేస్తుండే వాడిని. ఒక్కొక్కసారి మా కబుర్లు అత్తయ్యగారికి వచ్చే కాల్స్ కి ఇబ్బందిగా ఉండేది. ఇక మేము మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుందని, నా శ్రీమతి కోరికపై nokia వాళ్ళ పాత మోడల్ 1100 బహుమతిగా ఇచ్చాను. నేను స్వతహాగా Gadgets అంటే పిచ్చి ఉన్న వాడిని కాదు. అందుకనే.. basic model ఫరవాలేదనిపించింది.
ఇక్కడ మరొక విషయమేమిటంటె.. నా శ్రీమతికి అదే మొదటి మొబైల్.. దేవుడి దయవల్ల కొంచం బాగానే సంపాదిస్తున్నా, మొబైల్ కి మాత్రం ప్రాముఖ్యత నిచ్చేవాడిని కాదు. తరువాత నేను దుబాయ్ నుంచి తిరిగి రావడమూ.. నాకు మొబైల్ లేక పోవడం వల్ల తన ఫోన్ వాడుకునే వాడిని. అదిగో అప్పుడు మొదలైంది.. కొత్త మొబైల్ కొనమనే ప్రస్తావన. జనవరి 2007లో nokia వాళదే, మరొక basic model 2310 నాకోసం కొనుక్కుని 1100 మోడల్‍ని శ్రీమతికి ఇచ్చేసా.. తనకంటూ ఫొన్ అయితే ఉంది కానీ, కెమెరా మొబైల్ లేదని .. తనకు వెంటనే ఒక కొత్త ఫోన్ కొని పెట్టమని ఒకటే పోరు.. అప్పటినుంచి అదిగో .. ఇదీగో అంటూ కాలాయాపన చేస్తూ వచ్చాను. ఈ సంవత్సరం మే లో నా శ్రీమతి ఉధ్యోగంలో చేరింది, అదిగో అప్పుడు ఇక తప్ఫించుకో లేననిపించి ప్రమాణం చేసా.. జులై 16 తారీకున తప్పని సరిగా కొనిపెడతానని .. ఇక తప్పీంది కాదు.
అలా, కొన్నదైతే శ్రీమతి కోసం. కానీ ప్రస్తుతం నేను వాడుకుంటున్నానన్న మాట. కొంత కాలం తాను వాడుకున్న తరువాత, దీనిలో ఉన్న ఫీచర్స్ అర్ధం కాక ప్రక్కన పెడితే, ఇదిగో నేను కొట్టేసి ఇలా experiments చేస్తున్నాను అన్న మాట.
కొత్తగా వచ్చింది ఏదైనా కొత్తల్లో బాగానే ఉంటుంది. నేనేమీ అతీతుడిని కాదు. అందుకే.. ఈ మధ్య నేను తీసిన చిత్రాలను ఇక్కడ పొందు పరుచుదాం అని నిర్ణయించాను. ముందుగా నేను + నా శ్రీమతి ఉన్న చిత్రం
ఈ చిత్రం చూసిన తరువాత నాకు ఒక్క విషయం అర్దమయ్యింది. అది ఏమిటంటే.. నాకన్నా నా భార్యే కొద్దో గొప్పో అందంగా, మరో విధంగా చెప్పాలంటే.. photogenic గా ఉందని.
అంతే కాకుండా.. నా కళ్ళ క్రింద చారలు కొంచం ఎక్కువగా వచ్చాయని. దీనిని చూసిన తరువాత నేనే నన్ను చూసి భయపడ్డానంటే నమ్ముతారా.. పాపం నా భార్య పొద్దస్తమానం చూసి చూసి అలవాటు పడిపోయుంటుంది.
ఏది ఏమైనా కళ్ళ క్రిందటి ఈ చారల విషయం లో ఏదో ఒకటి తప్పకుండా చెయ్య వలసిందే.. లేకపోతే.. హమ్మో.. పెళ్ళాం .. నేను బాగా లేనని వేరే ఎవ్వరి నైనా తెచ్చుకుంటే.. అస్సలుకే మోసం..
మీకు ఏదైనా చిట్కా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టు కోండే..
ఇక కొంచం యాంగిల్ మార్చి ప్రయత్నిస్తే.. ఇదిగో ఈ క్రింది విధంగా వచ్చింది
గుడ్డిలో మెల్ల .. అనే విధంగా .. ఈ యాంగిల్‍లో నాకు కళ్ళ క్రింద చారలు కనబడటం లేదు ..
హమ్మయ్య!!!! ఈ డైరెక్షన్ ఫిక్స్ చేసేసా..
ఇక మీదట ఎప్పుడు నా ఫొటో తియ్యా లన్నా ఈ యాంగిల్ మిస్ అవ్వకూడదు..
ఈ మధ్య నేను ఉధ్యోగం చేసే కార్యాలయాన్ని మర్చేసా.. "నేను ఉధ్యోగం మారాను" అని వ్రాస్తే బాగుంటుంది అనుకుంటున్నారా.. చేసే పని అదే .. కానీ కార్యాలయం మాత్రం వేరే.. అలాంటప్పుడు "ఉధ్యోగం మారాను .. " అని వ్రాస్తే, ఎందుకో కుదిరినట్టు లేదు ..
ఎదో కొత్తగా ఉంటుందని అలా వాడాను..
వెరైటీగా ఉందనుకుంటాను .. ఏమంటారు?
ఇంతకీ ఈ చిత్రంలో ఉన్నది ఏమిటనుకుంటున్నారు?
కొంచం జాగ్రత్తగా గమనించండి.. గోల్కొండ లాగా ఏదైనా కనబడుతోందా??
లేదా.. అయితే చిత్రం పెద్దది చేసి చూడండి..
పెద్దది కావాలంటే చిత్రానికి ఒక మొట్టికాయ వెయ్యండి..
నేను స్వతహగా పెద్ద చిత్రాన్ని చూసిన తరువాత తెలిసింది, నా ఫోన్ యొక్క ప్రతిభ..
బాగానే ఉంది.. ఎదో అనుకున్నా కానీ .. బాగానే తీస్తోంది..
ఏమి చేసానో తెలియదు .. ఒక్క సారిగా చిత్రాలన్నీ రంగులు పోయి.. ఇదిగో ఈ క్రింద చిత్రం మాదిరిగా అంతా నలుపు తెలుపు అయ్యిపోయింది. దేవుడా .. నాకు ఈ ఫోన్ ఎందుకిచ్చావు? ఇప్పుడు మళ్ళీ రంగులెలా తెప్పించాలి?
ఇంకోక విచిత్రం, అంటే.. కెమెరా ఫోన్ నాకు కొత్త కదా.. అలాగే అనిపిస్తుంది. అలా అనిపించక పోతే వింత కానీ .. విచిత్రం అనిపించడం వింతేమీ కాదు..
అస్సలు ఇంతకీ ఆ vచిత్రం ఏమిటంటారా.. క్రింద ఉన్న మూడు చిత్రాలు గమనించిన తరువాత చెబుతా.. ముందు వీటిని చూసారా..
ఇదే నేను పనిచేసే కొత్త కార్యాలయం.. MLA Colonyలో ఉంది.
ఈ బిల్డింగ్ ఎవ్వరిదో చెప్పమంటారా.. మన జలగం వెంగళరావు గారు లేరూ.. వారి మనవడిది..
ఎవ్వరిదైతే మనకేంటండీ.. నావరకు నాకు .. ఎక్కడ పనిచేస్తున్నాం.. ఏ పని చేస్తున్నాం .. ఎంత వస్తోంది .. అనేవే ముఖ్యం..
ఇక సోది వదిలేసి .. రెండవ చిత్రం దగ్గరకు వద్దాం..
దీని గురుంచి ఎదైనా తెలియ జేసే ముందు .. ఇక్కడ మధ్యలో ఉన్న మహిళ గురించి కొంచం ప్రస్తావించాలి.
నాతో పనిచేసే సహ ఉధ్యోగిని మా కార్యాలయం వైపు వెళుతోంది. గమనించారా..
ఆరెంజ్ రంగు గల చుడీదార్..
పట్టారా..
ఇప్పుడు దాదాపుగా తన మన దృష్టి పధం లోంచి జారుకున్నట్లు గమనించి ఉంటారు .. ఇక అసలు విషయానికి వస్తే.. నా ఫోన్‍కు ఉన్న కొన్ని వసతులలో ఒకటి, దానికదే ఒకేసారిగా 3గానీ 5గానీ చిత్రాల్ని తీసేస్తుంది. కాకపోతే .. మనం చెయ్యాల్సినదల్లా... aim and hold.. తరువాత దానిపని అదే చేసుకుంటుంది.
ఎందుకో నాకు ఈ facility బాగుందనిపించింది.
ఎప్పుడైనా.. నలుగురితో కలిసి ఫోటో దిగాలనుకున్నప్పుడు.. ఈ విధంగా చేస్తే.. ఒక స్టిల్ మిస్స్ అయ్యినా మరొకటి బాగా వస్తుందని నా అభిప్రాయం.
ఇంతటితో నా ఫోన్ చిత్రాలు ముగియలేదు.. మున్ముందు మరిన్ని.. అంతవరకూ ససేషం..
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి