రక్షించండి .. మమ్మల్ని కాపాడండి

ముందుగా మన ముఖ్యమంత్రి డా. వై. ఏస్. ఆర్ మృతికి రెండులైన్ల సంతాపం
.
.
ఇక విషయానికి వస్తా.

ఇదిగో ఇక్కడ చూస్తున్న చిత్రం మేముండే ప్రదేశం. పేరంటారా!! బ్రాహ్మణవాడ. ఇది నాలుగు వైపులా మూసేసి ఉన్న ఒక ప్రదేశం. ఎక్కడ ఉందంటారా!! అదేనండి, బాగ్యనగరంలో బేగం పేటలో ఉంది. మా వాడకి ఒక వైపు ఎప్పుడూ పారే మురికి కాలువ మరోవైపు లోకల్ రైళ్ళు వెళ్ళడానికి అనువుగా ఏర్పరచిన రైల్వే లైన్. కనబడుతోంది కదా. మరి మేము బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే మాకు ఉన్నవి రెండే రెండు దార్లు. అవే మీకు చిత్రంలో ఎర్ర రంగులో వేసిన బాణం గుర్తుతో సూచించ బడ్డాయి. మీరెప్పుడైనా లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళారా.. అయితే మీకు ఓ ప్రక్కగా వరుణ్ మోటర్స్ వారి బోర్డు తపని సరిగా కనబడి ఉంటుంది అలాగే మరోప్రక్కగా అమ్మవారి గుడి కూడా చూసే ఉంటారు. వీటిల్లో రెండు వన్ వే దార్లే.

ఇంత సోదెందుకు అంటారా!! అదిగో అక్కడికే వస్తున్నా. మన ముఖ్యమంత్రి పార్దివ శరీరం ప్రస్తుతం వారి ఇంటి దగ్గర ఉంది. అలాగే వీరికి శ్రధ్ధాంజలి ఇవ్వడానికి వచ్చే మంత్రులు, ప్రముఖులు అందరూ చక్కగా బేగం పేట విమానశ్రయంలో దిగి వీరింటికి వెళుతున్నారు. ఇలా వచ్చిన వాళ్ళలో ప్రధాని మన్ మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గార్లు ఉన్నారు. వీరందరికీ ఉన్న ఒకే ఒక దారి సదురు లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్. అందువల్ల చాలా టైట్ సెక్యూరిటి. అంతే కాకుండా మా దార్లు రెండూ పోలీసోళ్ళ కభ్జా. మేము బాహ్య ప్రపంచాన్ని చేరుకోవాలంటే ఈ పోలీసోళ్ళను దాటుకుని వెళ్ళాలి. ఏమైనా అంటే లాఠీ ఛార్జీ చెయ్యడమే కాకుండా కాల్పులు కూడా చేస్తామంటున్నారు. వాళ్ళ చేతుల్లోని రివాల్వర్లను చూసిన జనాలకి మాట పడిపోయి మూగోళ్ళై పోయారు. ఏమైనా అంటే టప్పుక్కున కాల్చేసి విధ్వంసానికి కారణమౌతున్నాడు అందుకే కాల్చేసాం అంటే, అడిగే వాడెవ్వడూ ఉండడు.

పైగా అందరూ z కాటగిరీ ప్రముఖులే. అన్నంత మాత్రాన మా రోజువారి కార్యక్రమాల పరిస్థితేమిటి? మేము బాహ్య ప్రపంచానికి అకర్లేదా .. మాకు బయటి ప్రపంచంతో సంబందాలు అక్కర్లేదా.. మేము ఎక్కడికీ వెళ్ళకూడదా.. మాయింటికి ఎవ్వరు రావాలన్నా వారి పరిస్థితేమిటి? సామాన్య జనం ఈ దారిన వెళ్ళకూడదా?? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా?? చెప్పే నాధుడెవ్వడు?

 

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

20 స్పందనలు:

శ్రీనివాస్ పప్పు said...

మనలాంటి గొట్టం గాళ్ళు ఎక్కడయినా దొరుకుతారు.పాపం జెడ్ కేటగిరి భక్తులు కదా వారే ముఖ్యం కదా మరి.

ఓ బ్రమ్మీ said...

ఓ!! అంటే మేం కూడా అదేదో సినిమాలో చెప్పినట్లు .. వీరేం పీకారో తెలియకపోయినా, నువ్వది పీకావో, నువ్విది పీకావో.. అంటూ భజన పెట్టాలంటారా!!

ఏది ఏమైనా.. స్పందించినందులకు నెనర్లు

mv said...

కొన్నిసార్లు అలాంటి ఇబ్బందిలు తప్పవు మరి .
సామాన్యులు సర్దుకుపోవలసిందే - ఎదురు తిరిగితే ??

అనువుగాని చోట , అనువుగాని సమయమున
తలవంచక తప్పదు కదా - సర్దుకుపోదాం అంతే

Anonymous said...

ఇప్పుడు నీ సోది ఏమిటి???
కొంతసేపు ఓపిక పట్టలేవా??
నీలంటివీడ్ని నిజంగా కాల్చి చంపాలి...

ఓ బ్రమ్మీ said...

mv గారూ..

స్పందించినందులకు నెనరులు. అందుకనే ము* నోరూ మూసుకుని వెనుదిరిగి ఇక్కడికొచ్చి వేడుకునేది. ఏది ఏమైనా సామాన్యులు కూడా మనుష్యులే కదా.. వారికి రెక్కాడితే గానీ డొక్కాడదు కదా.. ఈ విషయాన్ని ఎప్పుడు అర్దం చేసుకుంటారో ఈ సదురు పోలీసులు

అయ్యా అనాముకుడు గారూ,

పేరు చెప్పడానికే మీకు ఇంత ఇదైతే అనుభవించిన మాకెంత కాలుద్దో మీకు వేరే చెప్పనక్కర్లేదు. కొంత సేపు 24 గంటలైతే అప్పుడు పరిస్థితేంటి. అయినా దిగితే గానీ తెలియదంట చలి అంటే ఏమిటో. ఒక్క సారి నువ్వు దిగి చూడు అప్పుడు తెలుస్తుంది. ఏది ఏమైనా నా బ్లాగుకి వచ్చి సహనాన్ని కోల్పోయినందులకు నెనరులు.

ముందు పిరికితనాన్ని వదిలి ధైర్యాన్ని అలవరుచుకో .. ఇది నీకొక్కడికే కాదు అనాముకులందరికీ నా సలహా. లేని యడల మీరంత మీరే మీ కుంచిత స్వభావాన్ని తెలియకనే తెలియజేస్తున్నారు అని మర్చి పోకండి.

Sreenu said...

అయ్యోపాపమ్...
మిమ్మల్ని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ హెలికాప్టర్ లో దింపుతారేమో...!! అడగక పోయారా??

Anonymous said...

అందుకే మీకు ఈ రోజు సెలవు ఇచ్చింది.

durgeswara said...

పేదవానికోపం పెదవికి చేటు . ఇదంతే ..లోకంతీరింతే .

ఓ బ్రమ్మీ said...

శ్రీను గారు,

హెలికాఫ్టరా .. వద్దు బాబో వద్దు .. నేను నా పెళ్ళానికి ఒక్కడినే మొగుడ్ని. పాపం నా శ్రీమతి ఈ వయ్యస్సులో వేరే మొగుడ్ని వెతుక్కోలేదు.

స్పందించినందులకు నెనరులు

అప్పారావు గారూ,

స్పందించినందులకు నెనరులు. కానీ ఇక్కడ మీరొక్క విషయం గమనించాలి. నేను పని చేస్తున్నది ఓ బహుళ జాతి సంస్థ యందు. మా తల కార్యాలయం(అదే నండీ హెడాఫీసు) అమెరికాలో మా క్లైంట్ జెపాన్ లో ఉంటారు. మా బాస్ కి ఈ విషయం తెలిసి సంతాప సూచకంగా సెలవు ప్రకటించినా, జెపాన్ వాడికి ఈ విషయాలు పట్టినట్టు లేవు. అందుకని ఇవ్వాళ సాయంత్రంలోగా ఓ పని చేస్తామని మా ప్రోజెక్టు ప్లానులో ఉన్నందున ఆ పని కనుక చెయ్యక పోతే పెనాల్టీ వేస్తానంటున్నాడు. వాడి పెనాల్టీ చాలా భయంకరంగా ఉంటుంది. కావున మేము పని చెయ్యాలి? కానీ ఎలా? ఈ పోలీసులను దాటి ముందుకి ఎలా వెళ్ళాలి? సెలవులు ఎవ్వడికి కావాలండీ ఇక్కడ ఉద్యోగాలే పోతుంటే!!

దుర్గేశ్వర రావు గారు,

నిజమే నండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిందంట. అలా పేదవాడు ఏది అన్నా శాపమే!! ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు

Unknown said...

పార్ధ! ఈ లోకమునందున బుర్ర ఉన్నవ్వాడు రాజ్యాన్ని పాలించటం కాని, పాలించే వాడి కింద పని కాని చేయడు. అందుచేత తెలిజేయునది ఏమనగా మన దగ్గర వ్యవస్థ మారే వారకి మనం దేవుడినే ఆదర్శంగా తీసుకోవాలి ( ఆయనలాగా నోరు మూసుకొని కూర్చోవాలి ). ఇంటి వాడే మనని సరిగా చూడనప్పుడు పక్క ఇంటివాడికి మనము ముద్దా? వాడికి కూడా లోకువే. అందుకే మన వారిని మార్చాలి, మనమూ మారాలి! ఇతరులని ప్రేమగా చూడాలి. మనమోక్కరమే మ్మరితే సరిపోతుందా అనుకోకుండా మన నుoచే మార్పు మొదలు పెట్టాలి, పక్కవాడిని మార్చే ప్రయత్నం చేయాలి. మారకపోతే మర్చేవాడికి చెప్పాలి, మీకు ఏ ప్రభుత్వ వ్యవస్థ నచ్చకపోయినా, అన్యాయం కనిపించినా. మన దగ్గర ఏది నచ్చకపోయినా info@loksattaparty.com కి కాని లేదా 91-40-2323 1818 / 2323 2829/ 2323 3637 మీ బాధని చెప్పుకోవచు. వారు మీ సమస్యని తీర్చే ప్రయత్నం చేస్తారు లేదా కనీసం ఇక ముందు కాకుండా చూసే ప్రయత్నం చేస్తారు.

మరిన్ని వివరాలకు ఈ లంకె చూడండి
http://www.loksatta.org/cms/index.php?option=com_contact&view=contact&id=2&Itemid=67

thank you.

భావన said...

మన వంటి సామాన్య జనం కోసమే కదా రాజశేఖరుడు హెలికాప్టెర్ ఎక్కి తిరిగింది. ఆయన కోసం వుద్యోగం వదులుకోలేరా ఏమిటి... Just kidding
ఇంటి నుంచి లాగ్ ఇన్ అవ్వలేరా?

సుజాత వేల్పూరి said...

మీ బాధ నిజంగా అర్థం చేసుకోదగింది. ఇలా చదివి తోచిన సలహా చెప్పడం ఈజీయే గానీ అత్యవసర పరిస్థితిలో ఉండి బయటికి రాలేని స్థితి ఎదురైతే అక్కడి వారు ఏం చేయాలి? వృద్ధులు, పిల్లలు, గర్భిణులు ఆస్పత్రికి వెళ్ళాల్సి వస్తే ఎలా?

మంత్రులెవరన్నా వస్తుంటేనే రోడ్ మీద ట్రాఫిక్ ఆపేసినందుకు ఎంతో కోపంగా, చిరాగ్గా ఉంటుంది, వాళ్ళు వెళ్ళేదాకా!

వీలైతే ఇల్లు మారడం తప్ప వేరే మార్గం లేదు.అప్పుడు సమస్య జోన్ లో మీరుండరు కానీ మిగతా వారుంటారు. ఎలా మరి?

అదిసరే, మీరు వ్యాఖ్యాతలకు ఇచ్చే సమాధానాలు స్వాతి చూస్తుందా?

వీరుభొట్ల వెంకట గణేష్ said...

చక్రవర్తి-san,
జపాన్ వాళ్ళ గురించి ఎంత చెప్పిన తక్కువే. వేళా పాళా లేకుండా కస్టమర్ సెంటిమెంట్ అంటూ విసిగిస్తారు.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

చక్రవర్తి-san,
జపాన్ వాళ్ళ గురించి ఎంత చెప్పిన తక్కువే. వేళా పాళా లేకుండా కస్టమర్ సెంటిమెంట్ అంటూ విసిగిస్తారు.

తెలుగుకళ said...

తప్పుదు మరి. అప్పుడప్పుడు అనుకోని సంఘటనలకు తలవంచాల్సిందే.ఓ రెండు రోజులు సర్దుకుంటే ఇక మనదే రాజ్యం.

ఓ బ్రమ్మీ said...

విమల్ గారు,

స్పందించడమే కాకుండా విలువైన సమాచారం మరియు సలహా ఇచ్చినందులకు నెనరులు.

భావన గారు,

అదే చేసాను. స్పందించినందులకు నెనరులు.

సుజాత గారు,

నా భాధని అర్దం చేసుకున్నందులకు ధన్యవాదములు. అదే కదండి నా భాధ. మేమంటే ముందుగానే కూర గాయలు తెచ్చుకున్నాం కాబట్టి సరి పోయింది. లేని వాళ్ళ పరిస్థితేమిటి. ఇవ్వాళ ఉదయం నేను ఆఫీస్ కి వెళదామని అటువైపుగా వెళ్ళి పరిస్థితి చూసి తిరిగి వచ్చేసా. అక్కడ ఉన్న కొద్ది సేపట్లో ఎన్ని కుటుంబాలు అక్కడిదాకా వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళారో అక్కడ ఉన్న నాకు తెలుసు అలాగే అక్కడ ఉన్న పోలీసులకు తెలుసు.

నాకు పెళైన తరువాత నా భార్యని ఈ ఊరుకి తెచ్చిన తరువాత కాపురం మొదలు పెట్టిన మొదటి గడప అన్న సెంటిమెంటు తప్పితే, ఈ ఏరియాలో అద్దెలు కూడా విపరీతంగా ఉన్నాయండి. తరువాత వీలు చూసుకుని మారుతాను. ఇక స్వాతి విషయానికి వస్తే, తనకు ఈ మధ్య అస్సలు తీరిక ఉండటం లేదు అందువల్ల చూడటం లేదు. ఆ ధీమా తోనే ఈ విధంగా స్పందించాను. లేకపోతేనా, అమ్మో తాట తీసెయ్యదూ. మీరూ చెప్పకండే.

గణేశ్ గారు,
మీకూ వాళ్ళతో అనుభవం ఉన్నట్లుందే.. స్పందించినందులకు నెనరులు

ఓ బ్రమ్మీ said...

కళగారు,

అదే చేసాం. ఇక్కడ సంతాపం చెయ్యవద్దని కాదు నా అభిప్రాయం. కానీ పోలీసుల జులుం మాత్రమే అని గమనించ గలరు. స్పందించినందులకు నెనరులు

భాస్కర రామిరెడ్డి said...

చక్రవర్తి గారూ, దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే.. ఈ బూచి చూపించి work from home option అడగండి. ఏంచక్కా చిరు సినిమాలు చూస్తూ పని చెయ్యొచ్చు.

ఓ బ్రమ్మీ said...

రామిరెడ్డి గారు,

రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటే ఇదేనండి. నేను అడగకుండా, ఆ వెసులు బాటూ అయ్యింది. నాకు లాప్ టాప్ ఇచ్చారు. కానీ మనం ఇంటికి తీసుకు రాం కదా!! ఈ సారికి ఇలా కానిచ్చేసా.. స్పందించినందులకు నెనరులు

కొత్త పాళీ said...

I know this Brahman Wadi - it is a dangerous situation.

 
Clicky Web Analytics