ఈ మధ్యనే వచ్చిన కొన్ని IPOలలో చాలా తక్కువకు లిస్ట్ అయిన స్క్రిప్ట్ ఇది. పబ్లిక్ ఆఫర్ క్రింద ఈ స్క్రిప్ట్ విలువను 36/- రూపాయలుగా నిర్ణయించి ఇష్యూ చేసారు. ఆ తరువాత దీని విలువ 39/- రూపాయలు దాకా వెళి ఆ తరువాత క్షీణించ సాగింది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం మఱో ఉత్తర్వుని కూడా జారీ చేసింది. ఏమిటంటారా.. ఈ షేర్ నందు పెట్టుబడి పెట్టే వంతు శాతంలో పబ్లిక్ వాటాని మఱో పది శాతం పెంచుకునే హక్కుని ఈ యాజమాన్యానికి ఇచ్చింది. ఇదిగో అప్పుడు మొదలైంది అస్సలైన కధ.
ఎప్పుడైతే కొనుగోలు మొదలైందో అమ్మకాలు జోరుగా సాగడం, ఆ తరువాత హెచ్చు తగ్గులౌతూ ఇప్పుడు అతి తక్కువలో వ్యాపార లావాదేవీలు నడుపుతోంది. ఈ పుట వ్రాసే నాటికి ఈ షేర్ ధర 30.10/- వద్ద ట్రేడ్ అవుతోంది. ఎందుకని నేను ఈ షేరుని రికమెండ్ చేస్తున్నానంటే, ముఖ్యంగా ఇది గవర్నమెంట్ యాజమాన్యం సహాయ సహకారాలతో నడుస్తున్న సంస్థ. రెండొవది, వీరు ఎన్నుకున్న ప్రోజక్టుల లొకేషన్స్. ఈ లొకేషన్స్ లలో నీరు చాలా బాగా ప్రవహిస్తోంది. ఈ షేర్ ఎక్కటికైనా సేఫే. కానీ ఇది దీర్ఘ కాలిక పెట్టుబడిగా మాత్రమే తలచుకోవాలి. ఏదో కొద్దిపాటి లాభాలకోసం అయితే మాత్రం ఓ ఆరు నెలలు ఆగితే సరిపోతుంది. దీర్ఘ కాలం ఉంచగలిగిన వాళ్ళకు ఇది కల్ప వృక్షమే. నేనైతే ఈ సంవత్సరానికి ఎంత సొమ్మైతే ఫిక్స్ డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ సొమ్మునంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసాను. కాబట్టి నేను దీర్ఘకాలిక లాభాలవాడిని అని అనుకోండి. బొంబాయి స్టాక్ ఎక్సేంజీ వాళ్ళు క్రొత్తగా మఱో ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేసారు. NHPC వివరాలు క్రొత్తగా ఈ లంకెలో చూడండి.
ఏది ఏమైనా.. ముందే చెప్పినట్లు, ఇది నా అనుభవం మాత్రమే. నేను ఏ విధమైన పరిశోధనలు జరపలేదు, అలాగే నాకు అనుభవఙ్ఞులెవ్వరు సాయ పడలేదు. ఈ కంపెనీ యొక్క సాంకేతిక విషయాలు నాకు ఏమాత్రం తెలియదు, కావున మీరు ఇన్వెస్ట్ చెయ్యదలచుకుంటే అందుకు పూర్తిగా మీరే భాద్యులు. ఒక వేళ నేనాశించినట్లుగా ఆరు నెలల తరువాత కూడా ఈ షేరులో మార్పు రాని యడల అందుకు నన్ను భాధ్యుడను చెయ్యవద్దని ముందుగా హెచ్చరిస్తున్నాను
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
0 స్పందనలు:
Post a Comment