ఎక్కువ పరుగులు చేసిన సంఘటనలపై ఓ చిన్న రివ్యూ

ఇవ్వాళ సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్ డే ఆట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించకపోయినా చిరకాలం మిగిలిపోతుంది. ఈ వేళలో నేను చేసిన పరిశోధనలో ఓ చిన్న గుళిక నన్ను ఆశ్చర్యపరచింది. అది ఏమిటంటే, వన్ డే ఆటలో 150 పరుగులకన్నా ఎక్కువ 58 ఘటనలలో జరిగితే భారత దేశ ఆటగాళ్ళు అన్ని దేశాల ఆటగాళ్ళకన్నా అధికంగా 14 సార్లు ఈ అద్బుతాన్ని సాధిస్తే, బాంగ్లదేశ్ మరియు పాకిస్తాన్ దేశాల ఆటగాళ్ళు అత్యల్పంగా ఆఖరి మరియు ఆఖరి-౧ స్థానాలలో ఉన్నారంటే, బాంగ్లాదేశ్ ఆటగాళ్ళను పరిధిలోకి తీసుకు పోయినా పాకిస్తాన్ ఆటగాళ్ళు రెండు సార్లే సాధించారు అన్న విషయం విస్మయాన్ని కలిగించింది. సూక్ష్మంగా ఆ స్థానాలు ఈ క్రింది విధంగా

India 14
West Indies 12
Australia 8
Sri Lanka 5
South Africa 5
Zimbabwe 4
New Zealand 4
England 3
Pakistan 2
Bangladesh 1
మొత్తంగా 58

ఈ సంఘటనలలో సచిన్ టెండూల్కర్ ఐదు సార్లు పాలు పంచుకుంటే, సనత్ జయసూర్య నాలుగు సార్లు సాధించగా, బ్రైన్ లారాకు తోడుగా క్రిస్ గైల్ మరియు రిచర్డ్ మూడుసార్లు సాధించి మూడొవ స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్ ఆటగాడైన మార్షల్ పదకొండు బౌండరీలు మరియు పన్నెండు సిక్సులు కొట్టి అందరికన్నాపెద్ద బాదుడు బాబుగా ముందున్నారు

నాగురించి ౫ విషయాలు

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నాట్లుగా అని అనుకోకుండా.. వీలయితే మీ గురించి ఎవ్వరికీ తెలియని ఓ అయిదు విషయాలను నిర్బయంగా తెలియ జేయ ప్రయత్నించండి. ముందుగా నా గురించి మీ అందరికీ తెలియని ఓ అయిదు విషయాలు

౧) నాకు సంగీతం మరియు నాట్యం అంటే ప్రాణం. వీటికి తోడు భరత నాట్యంలో డిప్లమో కూడా ఉంది నేను పుట్టింది 1972లో అయితే ఊహ తెలిసిన తరువాత అంటే ఓ పదేళ్ళ వయస్సులో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన తరువాత నుంచి 1996 వరకూ నాట్యాన్ని అభ్యసించడమే కాకుండా పలు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.. అంతే కాకుండా, కూచపూడి, కధక్, కధకళి మరియు చౌ అనేటటు వంటి విభిన్న నృత్య రీతులలో ప్రవేశం కూడా ఉందని వేళ్ళపై లెక్కపెట్టేంత మందికి మాత్రమే తెలుసని నా అభిప్రాయం

౨) నేను డిగ్రీని తొమ్మిది సంవత్సరాలు చదివాను. మూడేళ్ళలో ముగించాల్సిన B.Sc., ని తొమ్మిదేళ్ళలో అతి కష్టంపై కంప్లీట్ చేసాను అని చాలా మందికి తెలియదు.

౩) నేను నిత్య విద్యార్ధి అని చెప్పడానికి మరో ఉదాహరణ, నా MCA. రెండేళ్ళలో ముగించాల్సిన దానిని ఆరేళ్ళైనా ఇంకా ఇప్పటికీ వ్రాస్తునే ఉన్నాను అంటే మీరు నమ్ముతారా..

౪) మైక్రో సాఫ్ట్ వారిచే అత్యంత ఉన్నతమైన పురస్కారాన్ని నేను 2005వ సంవత్సరంలో పొందాను. ఆ సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో పదిహేడు మందికి మాత్రమే Most Valued Professional, MVP అనేటటువంటి సత్కారాన్నిచ్చారు. అటువంటి పదిహేడు మందిలో నన్ను చేర్చి గౌరవించారు. ఇందు మూలముగా తెలియ జేయునదేమనగా, మనకు చదువు అబ్బలేదు కానీ.. ఇలాంటి టెక్నికల్ విద్యలు మాత్రం అమోఘం

౫) మొట్ట మొదటి సారిగా 1999 వ సంవత్సరంలో నేను మైక్రోసాఫ్ట్ వారిచే ప్రొఫెషనల్ గా సర్టిఫై చేయబడ్డాను. అంటే నేను అప్పుడే MCP – Microsoft Certified Professional పరిక్ష వ్రాసి ఉత్తీర్ణుడైయ్యాను. ఇప్పుడు పదకొండు సంవత్సరాల తరువాత మరొక మైలు రాయి చేరాను. ఇప్పుడు నేను MCTS – Microsoft Certified Technology Specialist మాత్రమే కాకుండా MCPD – Microsoft Certified Professional Developer అనేటటువంటి గుర్తింపు పొందానన్న విషయం నా భార్యకు కూడా తెలియదు అంటే మీరు నమ్ముతారా!! కానీ ఇది నిజము

తెలుగు బ్లాగర్లకు - మరో నిజం


"తెలుగు బ్లాగర్లందరికీ ఓ శుభవార్త" అంటూ నేను ప్రచురించిన పుటకు ఓ నలభై మంది తెలుగు బ్లాగర్లు దేశం లోని పలు ప్రాంతాలనుంచి వారి వారి చిరునామాలు ఇచ్చి ఉచితంగా కంప్యూటర్ విజ్ఞానం వారి జనవరి నెల పుస్తకాన్ని పొందారు. అందరూ పొందారు అని తెలియ జేయకపోయినా ఒకరిద్దరు తెలియజేసారు. అందరికీ ఒకే రోజు డిటిడిసి ద్వారా పంపబడ్డాయి కాబట్టి ఒకరిద్దరికి అందినా అందరికీ అందే ఉంటుందని నా అభిప్రాయం. ఇక అసలు విషయానికి వస్తే, నేను ఈ పుట ద్వారా ఒక నిజాన్ని మరియు ఒక విన్నపాన్ని చేయదలుచుకున్నాను.

నిజం ఏమిటంటే..

ఉచితంగా పుస్తకం ఇస్తాము అంటే, ఎందుకు ఇస్తున్నారు? దీని వెనుక చక్రవర్తికి వచ్చే లాభమేమిటి? అది ఇది కాకుండా, సదురు కంప్యూటర్ విజ్ఞానం వారికి లాభమేమిటి? ఇదంతా హంబక్కేనా లేక మరో రకమైన కుటిల మార్కెటింగ్ ప్రయత్నమా? ఇలా పలు పలు ప్రశ్నలు వేసి కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేసిన వారు చాలామంది. ఇక్కడ వారి ప్రస్తావన అనవసరం అలాగే ఎవ్వరినీ నేను కించ పరచే ప్రయత్నమూ చెయ్యటం లేదు. కానీ ఒక్క విషయమేమిటంటే, ఈ ప్రయత్నం లాభాపేక్షలేనిది. ఈ ప్రయత్నం ఎందుకు జరిగిందంటే.. సదురు కంప్యూటర్ విజ్ఞానం యాజమాన్యం మమ్ములను హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో కలిసింది. తెలుగు భాష పట్ల eతెలుగు సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించి, ఇలా తెలుగులో వ్రాసుకునే వారికి గౌరవ పూర్వకంగా ఓక నెల పత్రిక ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ప్రతి నెల ఓ ఇద్దరు తెలుగు బ్లాగర్ల గురించి మరియు వారు చేస్తున్నటువంటి బ్లాగు గురించి ప్రచురిస్తే బాగుంటుందని మాతో సంప్రదించారు. అందులోని మొదటి ప్రయత్నంగా నేను చేసిన విన్నపానికి లభించిన స్పందనను గమనించిన కంప్యూటర్ విజ్ఞానం యాజమాన్యం విస్తుపోయి తెలుగు బ్లాగర్ల గురించి ప్రచురించే విషయాన్ని మానుకున్నారు.

విన్నపమేమిటంటే..

ఉచితంగా అందుకున్న వారు, దయచేసి మొదటిగా మీ బ్లాగులో ఈ అవకాశం మీకు నిజ్జంగా ఉచితంగానే లభ్యమైందనిన్నీ.. అందుకు మీరు సంతోషంగా ఉన్నట్లైతే సంతశించినట్లుగా లేకపోతే లేనట్లుగా తెలియ జేయమనవి. అంతే కాకుండా, ఈ పుస్తకాన్ని చదివిన తరువాత ఈ పుస్తకానికి మరింత సోభ చేకూరాలంటే ఏమి చేస్తే బాగుంటుందో అనేటటువంటి మీ అమూల్యమైన సలహాలు లేదా సూచనలు లేదా ఫిర్యాదులు లేదా మరేదైనా మీ బ్లాగులో ఓ పుట ప్రచురించమనవి.

నా ఈ మనవి మన్నించి సలహాలు సూచనలు తెలియజేయడం మరువకండి

సెహ్వాగ్ సెంచరి చెయ్యలేడు

 

VS

భారత మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య నాగపూర్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మాచ్ మూడవరోజు ఓపెనర్ సెహ్వాగ్ సెంచరీ చేశాడు. బాగుంది. కానీ నా ఈ శీర్షిక ఏమి చెబుతోందంటే, మన సదురు దుడుకు బ్యాట్స్ మెన్ బాగా బౌలింగ్ వేశే దేశాలన్నింటినీ ఉతికి ఆరేశాడు కానీ, పసికూనలైన బంగ్లాదేశ్ మరియు జింబాబ్వేలపై మాత్రం ఒక్క సెంచరీ చెయ్యలేక పోయ్యాడు. ఎందుకంటారు?

నా ఉద్దేశ్యంలో అతనొక అద్బుత ఆటగాడు. ఆటలోని మెళుకువలు తెలిసిన వాడు. తెలివైన బౌలర్లు వారి అనుభవమంతా వారి బౌలింగ్ లో చూపిస్తారు. అలా వారి నైపుణ్యాన్ని వైవిధ్యమైనటువంటి బంతుల ద్వారా వారు విసురుతూ ఉంటారు. అలాంటి బంతులు విసరడంలో చేయి తిరిగిన మహా మహాలును అవలీలగా ఎదుర్కొన్న మన హీరో గారు అనుభవరాహిత్యంతో ఉన్న బంగ్లాదేశ్ లేదా జింబాబ్వే ఆటగాళ్ళపై ఎందుకని చేయ్యలేకపోయ్యాడంటే, బౌలర్లు తెలివిగా బంతులు విసరకపోవడమే..

మీరేమంటారు .. ??

 
Clicky Web Analytics