తెలుగు బ్లాగర్లకు - మరో నిజం


"తెలుగు బ్లాగర్లందరికీ ఓ శుభవార్త" అంటూ నేను ప్రచురించిన పుటకు ఓ నలభై మంది తెలుగు బ్లాగర్లు దేశం లోని పలు ప్రాంతాలనుంచి వారి వారి చిరునామాలు ఇచ్చి ఉచితంగా కంప్యూటర్ విజ్ఞానం వారి జనవరి నెల పుస్తకాన్ని పొందారు. అందరూ పొందారు అని తెలియ జేయకపోయినా ఒకరిద్దరు తెలియజేసారు. అందరికీ ఒకే రోజు డిటిడిసి ద్వారా పంపబడ్డాయి కాబట్టి ఒకరిద్దరికి అందినా అందరికీ అందే ఉంటుందని నా అభిప్రాయం. ఇక అసలు విషయానికి వస్తే, నేను ఈ పుట ద్వారా ఒక నిజాన్ని మరియు ఒక విన్నపాన్ని చేయదలుచుకున్నాను.

నిజం ఏమిటంటే..

ఉచితంగా పుస్తకం ఇస్తాము అంటే, ఎందుకు ఇస్తున్నారు? దీని వెనుక చక్రవర్తికి వచ్చే లాభమేమిటి? అది ఇది కాకుండా, సదురు కంప్యూటర్ విజ్ఞానం వారికి లాభమేమిటి? ఇదంతా హంబక్కేనా లేక మరో రకమైన కుటిల మార్కెటింగ్ ప్రయత్నమా? ఇలా పలు పలు ప్రశ్నలు వేసి కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేసిన వారు చాలామంది. ఇక్కడ వారి ప్రస్తావన అనవసరం అలాగే ఎవ్వరినీ నేను కించ పరచే ప్రయత్నమూ చెయ్యటం లేదు. కానీ ఒక్క విషయమేమిటంటే, ఈ ప్రయత్నం లాభాపేక్షలేనిది. ఈ ప్రయత్నం ఎందుకు జరిగిందంటే.. సదురు కంప్యూటర్ విజ్ఞానం యాజమాన్యం మమ్ములను హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో కలిసింది. తెలుగు భాష పట్ల eతెలుగు సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించి, ఇలా తెలుగులో వ్రాసుకునే వారికి గౌరవ పూర్వకంగా ఓక నెల పత్రిక ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ప్రతి నెల ఓ ఇద్దరు తెలుగు బ్లాగర్ల గురించి మరియు వారు చేస్తున్నటువంటి బ్లాగు గురించి ప్రచురిస్తే బాగుంటుందని మాతో సంప్రదించారు. అందులోని మొదటి ప్రయత్నంగా నేను చేసిన విన్నపానికి లభించిన స్పందనను గమనించిన కంప్యూటర్ విజ్ఞానం యాజమాన్యం విస్తుపోయి తెలుగు బ్లాగర్ల గురించి ప్రచురించే విషయాన్ని మానుకున్నారు.

విన్నపమేమిటంటే..

ఉచితంగా అందుకున్న వారు, దయచేసి మొదటిగా మీ బ్లాగులో ఈ అవకాశం మీకు నిజ్జంగా ఉచితంగానే లభ్యమైందనిన్నీ.. అందుకు మీరు సంతోషంగా ఉన్నట్లైతే సంతశించినట్లుగా లేకపోతే లేనట్లుగా తెలియ జేయమనవి. అంతే కాకుండా, ఈ పుస్తకాన్ని చదివిన తరువాత ఈ పుస్తకానికి మరింత సోభ చేకూరాలంటే ఏమి చేస్తే బాగుంటుందో అనేటటువంటి మీ అమూల్యమైన సలహాలు లేదా సూచనలు లేదా ఫిర్యాదులు లేదా మరేదైనా మీ బ్లాగులో ఓ పుట ప్రచురించమనవి.

నా ఈ మనవి మన్నించి సలహాలు సూచనలు తెలియజేయడం మరువకండి

5 స్పందనలు:

rays said...

Thanks Chakri..i got that...

Anonymous said...

గర్హించడం అంటే వ్యతిరేకించడమనుకుంటానండి. ఒకసారి ఎవరినైనా తెలుసుకోండి. మీరు చాలా మంచి ప్రయత్నం చేశారు. అబినందనలు.

cbrao said...

నాకు ఇంతవరకు పత్రిక ప్రతి అందలేదు.

సుజాత said...

చక్రవర్తి గారూ,
పోస్టు పెట్టేముందు ఒకసారి పదాలు చూసుకోండి సార్!

గర్హించడం అంటే వ్యతిరేకించడం!కంప్యూటర్ విజ్ఞానం వాళ్ళు ఈ తెలుగు చేస్తున్న కార్యక్రమాలను వ్యతిరేకించిందెప్పుడు? పోనే "గర్వించి" అని రాయాలనుకున్నా అక్కడ సందర్భాన్ని బట్టి అదీ సరైన పదం కాదు. "సంతోషించి" అనో, "అభినందిస్తూ" అనో , "గుర్తించి" అనో ఉండాలి కదా!

సోభ- శోభ

తప్పులు దిద్దినందుకు అన్యధా భావించకండి! ఈ తెలుగు సభ్యులే తప్పులు రాస్తే మార్గదర్శకంగా ఉండదని చిన్న భయం! అంతే!

చక్రవర్తి said...

@rays

స్పందించినందులకు నెనరులు. వీలైతే ఒక పుట వ్రాసి లంకె ఇవ్వండి

అనామకులుంగారు,

తప్పును చెప్పినందులకు ధన్యవాదములు.

రావుగారు,

మీరు ఇచ్చిన చిరునామాకు నేను స్వయంగా పంపాను. మరి ఎందుకు అందలేదో తెలియదు, మరోసారి చూస్తాను

సుజాత గారు,

ఒక్క సారి నన్నయ్యపై నా ఆత్మావలోకనం పుట చదవండి. ఇదిగో ఇక్కడ, http://bhavadeeyudu.blogspot.com/2010/02/blog-post.html

eతెలుగు సబ్యులు తప్పు చేయకూడదని ఎక్కడా లేదండి. కాకపోతే తప్పని తెలిసి చెయ్యడం గర్హించడం. బాగానే చెప్పానే..

సరిదిద్దాను, ఒక్క సారి చూడండి. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు.

 
Clicky Web Analytics