కొమరం పులి పాటలు - రివ్యూ

ఈ మధ్య నేను చూద్దాం అనుకున్న సినిమాలలో మరొకటి ఈ సినిమా. పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకున్నాడో సేవ్ అవుతాడు లేదా షేవే.. ఎందుకంటే నేను చూద్దాం అనుకున్న సినిమాలు దాదాపు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ స్నేహితుడితో జరిగిన చర్చలో నాకు అర్దం అయ్యిందేమిటంటే.. ఏదైనా సినిమాని చూడాలనుకున్నప్పుడు ముందుగా ఆ హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎక్సుపెక్టేషన్స్ పెట్టుకోవాలని ఆ తరువాత ఆ సినిమాని చూసి టాక్ ఇవ్వాలని. ఈ సినిమా నేను చూడడం వెనకాల ఉన్న ఎక్సుపెక్టేషన్స్ ఏమిటంటే..

పులి

ఒకటి ) కొమరం భీం అనే ఓ చరిత్రకారుడి పేరు వాడుకున్నందువల్ల

రెండు) రెహమాన్

మూడు) సూర్య

కానీ ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కోసం అయితే మాత్రం అస్సలు చూడటం లేదు. పవన్ కాక మరేవ్వరైనా చూస్తాను. అందువల్ల పవన్ నుంచి నాకు ఎటువంటి ఎక్సుపెక్టేషన్స్ లేవు. ఇక రెహమాన్ పాటల విషయానికి వస్తే..

  • ఒక పాట చాలా మంద్రంగా సున్నితంగా తీర్చిదిద్దాడు.. అదే నమ్మకమీయ్యరా స్వామి అంటూ సాగుతుంది.. అదేదో సినిమాలో, నాగార్జున హీరోగా .. హీరోయిన్ ఎంట్రన్స్ గుడిలో ఇలాంటి పాటతోనే జరుగుతుంది.. ఇంతటి ప్రశాంత మైన పాటను ఎలా చిత్రీకరించారో చూడాలి

+౧

  • ఒక పాట అస్సలు నచ్చలేదు .. అదే పవర్ స్టార్ అంటూ ఉంటుంది .. చెత్తగా ఉంది.. ముమ్మయిత్ ఖాన్ లాంటి అమ్మాయి అయితే బాగా చేస్తుంది .. మరి ఈ పాటకి ఎలాంటి అమ్మాయిని సెలక్ట్ చేసారో..

-౧

  • మారాలంటే అనే పాట కూడా నచ్చింది ..

+౧

  • చిత్ర పాడినట్టు ఉన్న పాట మరొకటి .. దోచేయ్ దొరికింది .. అంటూ సాగే పాట. ఓ ప్రక్కన నచ్చినట్టు అనిపించేటంతో ఆంగ్ల బ్యాక్ డ్రాప్ తో చెడకొట్టాడు.. ఈ పాటలో పాడిన అమ్మాయి గొంతులో హస్క్ బాగుంది, ఈ పాట నాకు నచ్చి నచ్చనట్టుంది

+-౧

  • మహమ్మహ మాయే .. అంటూ మొదలైన పాట ముందుగా ఇంప్రస్ చెయ్యలేదు కానీ, ఈ పాట లిరిక్స్ వ్రాసిన వారెవ్వరో గాని కొంచం కళాత్మకంగా రశికంగా వ్రాయాలని తపన పడ్డట్టు కనబడింది. ఈ పాట చివర్లో వచ్చే ట్యూన్ దాన్ని కూర్చిన విధానం నచ్చింది. రెహమాన్ సిగ్నేచర్ కనబడింది

+౧

  • అమ్మతల్లే అనే పాటపై రివ్యూ వ్రాయాలంటే కొంచం వళ్ళు దగ్గర పెట్టుకోవాలనిపిస్తోంది. ఇందులో చాలా గమకాలు కనబడుతున్నాయి. సంగీత ప్రావీణ్యం ఉన్నవాళ్ళు దీనిగురించి విశ్లేషిస్తే బాగుంటుంది. అంతే కానీ నాలాంటి వాడు కాదు .. కావున బాగుందనే అనుకుంటున్నాను

+౧

మొత్తం మీద అయిదు ప్లస్లు రెండు మైనస్లు కలిపితే రెండు పాటలు మినహ మిగిలినవన్నీ బాగున్నాయి. ఇక సినిమా ఎలా తీస్తారో.. ఈ సినిమా చాలా కాంట్రవర్సీస్ మధ్య చిత్రీకరిస్తున్నారు..

నేను చూద్దాం అనుకున్నాగా.. ఇంకే హాయిగా ఫ్లాప్ అవుతుంది .. నేను చక్కగా ప్రశాంతంగా ఊరి చివ్వర సినిమా హాల్లో హాయిగా చూడోచ్చు..

7 స్పందనలు:

Anonymous said...

1) నమ్మకమీయ్యరా స్వామి
2) మారాలంటే

A) పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ లో ఆ రెండు పాటలు నాకు బాగా నచ్చాయి అన్నాడు. అతనితో మీ టేస్ట్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.
B) పవర్ స్టార్ అని అతనిని ఎవరైనా పిలిస్తే సిగ్గుతో తలదించుకుంటాను అన్నాడు. ఆ పాట అతనికి కుడా నచ్చలేదు. మీకు కూడా నచ్చలేదు.

మీ చేత ఆడియో రివ్యూ వ్రాయించిన ఘనత నాదే.

టాక్ రాకుండానే సినిమా ప్రివ్యూ షో కలిసి చూద్దాం. మీ సెంటిమెంట్ ను బ్రేక్ చేద్దాం. పులి మరో సింహా గ్యారంటీ.

Anonymous said...

meeku theluso theliyadho kaani, state antha pawan mania nadusthondhi :)puli ante pawan kalyan ani antunnaaru kaani komaram ano, sj surya ano anatledhu. Assalu audio rights 2 crores ki ammudupoyindhi ante kaaranam kevalam pawan valle. Pawan always rocks. Pawan, the name spells magic :)

ఓ బ్రమ్మీ said...

హరనాద్ గారు,

ఏదో అప్పుడప్పుడు సినిమా రివ్యూలు వ్రాసుకునే నా చేత.. ఆడియో రివ్యూ వ్రాయించిన ఘనత మీదేనండి. నాకు అంత టాలెంట్ లేకపోయినా ఏదో నా వంతు నేను చేసాను.

ఏంటీ!!! అదేదో ప్రివ్యూ కలిసి చూద్దాం అంటున్నారు .. అసలు ఈ సినిమా రిలీజ్ డేట్ రాలేదు .. ఒక వేళ వచ్చినా అది మీకు దగ్గర్లో ఆడుతుందో లేదో తెలియదు .. ఒక వేళ ఆడినా దానికి మనం కలసి వెళ్ళాలి అంటే.. హామ్మో !! ఆలోచించుకుంటేనే కష్టంగా ఉంది .. అవన్నీ ఆలోచించుకోకుండా టాక్ రాకముందే మనం చూద్దాం అంటున్నారు .. ఎలాగబ్బా!!

ఏది ఏమైనా మాటిచ్చారు అదే సంతోషం.. ఒక వేళ గనుక అలా జరిగితే, నా జన్మలో మరో కోరిక తీరినట్టే.. అదేనండి .. ఏదైనా పెద్ద హీరో సినిమా మొదటిరోకు మొదటి ఆట చూడాలి..

మీ స్పందనలకు నెనరులు

అయ్యా అజ్ఞాత గారు,
నాకు పవన్ అంటే అంత క్రేజ్ లేదండి.. మనదంతా నాన్ క్రేజీ ఫాన్ బాచ్.. అయినా నేను ప్రస్తుతం అక్కడ లేను కదండి కాబట్టి నాకంతగా తెలియదు.. ఏది ఏమైనా .. ఐ విష్ పవన్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఎ వెరీ ప్రాఫిటబుల్ ఒపెనింగ్ కలక్షన్ ఫర్ పులి. ఏది ఏమినా మీ స్పందనలకు నెనరులు.

కమల్ said...

పవన్ మానియా ఏమో గాని..ప్రస్తుతం.." బాబ్లి - బాబు " మానియా నడుస్తున్నది.

Anonymous said...

దోచేయ్ దొరికింది అనే పాట పాడింది శ్రియా ఘోషల్. ఆల్బం లో ఉన్న ది బెస్ట్ పాట అదే అని నా ఉద్దేశం. చూస్తూ ఉండండి అదే నిజం కావచ్చు

sweeyapraneetham said...

hai naa peru madhuri. mi andariki urgent ga oka vishayam cheppaali, komrampuli lo anni patalu chandrabose gare rasaru. kani inlay card mida aayana peru ekkada rayakanda avamaanincharu.. ammathalle song rayadaniki 4days pattindita. takkuve kada...kani tune ardham chesukodaniki 15 days pattindita papam.

koresh said...

choodakundane itharulanu chedipovaalanu kune iron legs ni choosi aanandam vesindi.

 
Clicky Web Analytics