ప్రేమ మరియు వయస్సు

ఓ రోజు షేక్‍స్పియర్‍ని ఓ చమత్కారి ఇలా అడిగాడు..

మీరు మీకన్నా పెద్ద వయస్సులో ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు కదా, ఎందుకలా?

అందుకు మన వీర ప్రేమికుడు కాలెండర్ చూపిస్తూ ఇలా తిరిగి ప్రశ్నించాడంట

అదిగో అక్కడ కనబడుతున్న కాలెండర్లో ఏడు రోజులున్నాయి కదా, వాటిలో వయస్సులో ఏది పెద్దది ఏది చిన్నది? ఆది వారమా లేక శనివారమా? ఇది నిర్ణయించడం ఎంత కష్టమో అలాగే ప్రేమని వయస్సుని జత చేయడం కూడా అంతే కష్టం. ప్రేమ అనేది గుండె లోతుల్లోంచి ఉదయిస్తుంది అంతే కాని వయస్సు నుంచి కాదు. కాబట్టి ప్రేమకి వయస్సుతో సంబందం లేదు

దీనిని బట్టి మనకు అర్దం అయిన నీతి ఏమిటి, వయస్సులో మన కన్నా పెద్ద అయిన సీనియర్ గర్ల్ అందరూ జూనియర్ బాయ్స్ కి అందుబాటులో ఉన్నట్టే. కాబట్టి జూనియర్స్, మీరు ఒక్క్ మీ క్లాస్ లోని అమ్మాయిలకే కాక సీనియర్స్ అందరికీ లైన్ వెయ్యొచ్చు.


ఇంతకీ అసలు సంగతి చెప్పలేదు కదా, పైన చెప్పిన కధంతా నాకు మరో ఎస్ ఎమ్ ఎస్ ద్వారా వచ్చింది. దాని ఆంగ్ల పాఠ్యం యధావిధిగా ఇక్కడ ఉంచుతాను. నా అనువాదం ఎంతవరకూ బాగుందో చెప్పండి.


Some1 asked Shakespeare “U married a girl elder to u, y?”, he showed a calendar and said “A week has 7 days, can u say which one is younger, either sunday or saturday ..? So love comes 4m heart not in age Love has no age ..”

Morel : Senior girls r also available 4f junior boys..

7 స్పందనలు:

Praveen Sarma said...

నేను వయసులో నా కంటే నాలుగేళ్లు పెద్దైన అమ్మాయిని ప్రేమించాను. నేను ఆమెని మరచిపోయేలా చెయ్యడానికి మా బంధువులు చీప్ ప్రయోగాలు చేశారు. ఒకరేమో ఆ అమ్మాయికి రెండు సార్లు అబార్షన్లు అయ్యాయని, ఇంకొకరేమో ఆ అమ్మాయికి కాన్సర్ అని చెప్పారు. నేను నమ్మలేదు.

చక్రవర్తి said...

ప్రవీణ్ శర్మ గారు,

మీ అనుభవాన్ని మాతో పంచుకున్న మీధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను. మీకు జేజేలు. అలాగే స్పందించినందులకు నెనరులు

Anonymous said...

వర్తి గారు ఏంటండీ సడెన్ గా ఇలా సిల్లీ సిల్లీ టపాలు వేస్తున్నరు?

:-)

Anonymous said...

నేను నమ్మలేదు.

Your belief doesn't matter, you married her or not that matter.
he haa haa

hanu said...

msg bagumdi anDi,... nd aa polika chala bagumdi

చక్రవర్తి said...

మొదటి అజ్ఞాత గారు,

ఏదో ఉబుసు పోక అంటూ మొదలు పెట్టిన బ్లాగు ఇలా కాక ఎలా ఉంటుందండి, మడిసై పుట్టాక కూతంత కలాపోసన ఉండాలన్నారు మన రావుగోపాలరావు గారు. ఏదో అలా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సద్దుకోండి. స్పందించినందులకు నెనరులు

రెండవ అజ్ఞాత గారు,
మీ స్పందనలో నాకు ఏదో డిఫరంట్ మీనింగ్ కనబడుతోంది. అపహాస్యం కాకపోతే పరవాలేదు, ప్రవీణ్ గారు నొచ్చుకుంటే మాత్రం మీ స్పందన తొలగించ వలసి ఉంటుంది. కాబట్టి ఇకపై కొంచం మర్యాదగా స్పందించమనవి.

హనుమంత్ గారు,
బాగుండటం మీ మనసుపై ఆధారపడి ఉంటుంది. మీకు నచ్చింది అందుకు సంతోషం. ఇలాగే స్పందిస్తూ ఉండమని మనవి. మీ స్పందనకు నెనరులు

poornachandar said...

SUPER GA UNDI

 
Clicky Web Analytics