ఎల్‍వీ ప్రసాద్ గారిపై నా అభిప్రాయం

మెదటి విషయం.. ముఖ్యంగా.. నేను తెలుగు సినిమాలు చాలా తక్కువగా చూస్తాను.. తక్కువగా అనేకన్నా, అరుదుగా అంటే బాగుంటుందేమో.. ఏది ఏమైనా.. ఇక్కడ నేను ప్రస్తావించే విషయాలు పూర్తిగా నాస్వగతం.

రెండవది.. ఇన్నాళ్ళు, ఎల్‍వీ ప్రసాద్ గారంటే.. ఒక నేత్ర చికిత్సాలయం యొక్క స్వంతదారుడిగానో లెక హక్కుదారుడుగా మాత్రమే అనుకునేవాణ్ణి.. నేనింత వరకూ ఈ మహానుభావుడు ఎదో పెద్ద వైద్యుడై ఉండి ఉంటాడు.. అనుభవంతో వచ్చిన ఙ్ఞానాన్ని, తనకు వీలున్నంతలో సాధారణ ప్రజానీకానికి తనవంతు కర్తవ్యంగా తనకు కలిగినంత సేవ చేస్తున్నాడు అనుక్కున్నా.. తీరా ఈరోజు, నవతరంగంలో ఈయన మీద ప్రచురితమయిన వ్యాసాన్ని ఆసాంతం చదివిన తరువాత అస్సలు కధ ఏమిటో తెలిసింది.

ఇక ఆ వ్యాసాన్ని చదివిన తరువాత, ఎల్‍వి ప్రసాద్ గారిపై ఉన్న గౌరవం కాస్తా మంటలో కలిసింది. పాతరోజుల్లో చెప్పినట్లు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు.. తన కుటుంబం అప్పుల పాలై.. తండ్రి మరణించి.. అభం శుభం తెలియని మేనమామ కూతురు, ఊహ తెలియని వయస్సులో .. వచ్చీ రానీ వయస్సులో .. తెలిసీ తెలియని పెళ్ళి చేసుకుని .. త్వరలోనే పిల్లకి తల్లై .. పరిపక్వతలేని స్తితిలో ఉన్నపుడు.. ఈయనగారు, తల్లిని.. కట్టుకున్న ఆలిని.. కడుపున పుట్టిన పిల్లనూ వదిలి .. ఏదో సాధిద్దామని, ఇంట్లో ఎవ్వరికి చెప్పాపెట్ట కుండా బొంబాయి చెక్కేస్తారా.. కనీసం చుట్టూ ఉన్న సమాజం తల్లిని గానీ, కట్టుకున ఆలిని గానీ.. "ఏమ్మా మీ అబ్బయి కనబడటం లేదు.. మీ ఆయన ఊళ్ళో ఉన్నాడా!! " వంటి ప్రశ్నలు వేస్తే, ఏమి సమాధానం చెబుతారో అన్న ఆలోచన లేకుండా.. అందరిని గాలికొదిలేసి.. భాధ్యతలకు దూరంగా "బొంబాయి పారిపోయాడు..", అని చదివిన తరువాత, మనసుకి చాలా కష్టం కలిగింది. ఇంతే కాకుండా.. ఈయనగారికి చదువుమీద ఏమాత్రం శ్రద్ద లేదంట. మన పిల్లలు చదువు విషయంలో శ్రద్ద వహించక పోతేనే మనం సహించమే.. అట్లాంటిది, ఇంత పెద్దాయనకి మాత్రం "శ్రద్ద లేదు" అని తెలుసుకున్నా మనమేం పట్టించుకోం. పైగా, ఈయన ఇంత పోడిచాడు.. అంత పీకాడు.. అంటూ ప్రసంగాలిస్తూంటాం.. చ చ.. తల్లిని, పెళ్ళాన్ని అంతేకాక కన్న కూతురిని కష్టాలో ఉన్నప్పుడు గాలికొదిలేసి, తన స్వంత ప్రయొజనాలకే విలువనిచ్చే వ్యక్తీ ఒక వ్వక్తేనా.. ఇదేమయినా స్వాతంత్ర్య పోరాటమా.. దేశం కోశం, త్యాగం చేసాను అని సర్ది చెప్పు కోవడానికి .. పూర్తిగా వ్యక్తిగత అభిరుచి..

నిజ్జంగా చెప్పాలంటే.. ఆ ఇద్దరు స్త్రీ మూర్తులకు చేయెత్తి నమస్కరించవచ్చు. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయినప్పుడు, తల్లి పడే భాధ వర్ణనాతీతం.. అటువంటి సమయంలో ప్రతీ స్త్రీ, కట్టుకున్న భర్త దగ్గర ఉండాలని కోరుకుంటుంది. అటువంటి సమయంలో ముఖం చాటువేసినా, తిరిగి వస్తున్నానని టెలిగ్రాం వచ్చినప్పుడు, కూతురు చనిపోయిందనే విషయాన్ని ఈయనకు ఎలా తెలియ జేయాలా అని వారిద్దరు పడ్డ భాధ గురించి చదివినప్పుడు.. ఆ పుణ్య మూర్తులకు సాష్టాంగ పడాలనిపించింది. బ్రతికి ఉన్నాడో లేడో అనేటి సంసయావస్తలో ఉన్న తల్లికి కొడుకు వస్తున్నాడు అన్న విషయం పోయే ప్రాణం లేచొచ్చేటటు వంటి వార్తే.. కానీ, సుమారు రెండు సంవత్సరాలు ఆమె అనుభవించిన సందిగ్దావస్త ఏ తల్లికీ రాకూడదు అని నేను భావిస్తున్నాను. ఇంత మందిని ఇబ్బంది పెట్టి సాధించింది ఏమిటి..

ఒప్పుకుంటాను.. అటువంటి మహానుభావుడే లేకపోతే.. ఎన్నో మంచి మనోరంజక మయిన చిత్రాలు రాకపోయేవి అంటారు.. ఎవ్వరికి కావాలండీ ఇవన్నీ.. మేమేమయినా అడిగామా.. తన స్వంత ప్రయోజనాలకు, ధన సంపాదనకు మాత్రమే చేసారా లేదా?? ఫలాపేక్షణ కోసంచేసి, పెద్ద.. ఎదో.. సమాజాన్ని ఉద్దరించామంటారేమిటి?? ఒక వ్యక్తిత్వం అంటూ లేని వ్యక్తి.. దానికి తోడు లాభాపేక్షణ .. వీటన్నింటినీ మించి.. పులితోలు కప్పి.. మహానుభావుడు అనేటటువంటి పెద్ద పదాలు .. ఏమిచేస్తాం .. సమస్య మనలోనే ఉంది.. మనం ఇంకొకళ్ళను అనుకునేం లాభం.. ఈ సినిమా వాళ్ళంతా ఇంతే..

అదేదో సినిమాలో హీరోయిన్, నటించే చాన్సు కోసం పడుపు వృత్తికి కూడా వెనుకాడదు .. మళ్ళీ తను చేసేది తప్పుకాదన్నట్లు / సరైనట్లు డైలాగు .. "ఒక్క ఛాన్సు.. ఒకే ఒక్క ఛాన్సు ..", వీళందరినీ పెద్ద స్టార్‍లుగా మనం గుర్తించేయ్యడం. మనం గుర్తింస్తున్నాం కదా అని వాళ్ళు కనీస విలువలను గంగలో తుక్కి, మానవతా విలువలకు తిలోదకాలిచ్చి ఇదిగో ఇలా గొప్ప వాళై పోతారు. మన నవతరం ఇలాంటి వాళని తమ తమ గాడ్ ఫాదర్‍గా అనేసుకుని, ఇంకే .. ఇంకేముంది, నేను కూడా అంత వాడినై పోతాను అని ఒక తాడు బొంగరం లాగా తిరిగేస్తూ ఉంటారు.

ఇక్కడ, ఇప్పుడు మరొక ప్రస్తుత పెద్ద నటుడు విషయం తలవని తలంపుగా మదిలోకొచ్చింది. పేరు అప్రస్తుతం.. కానీ విషయం చాలా సున్నితం. ఈ పెద్ద హీరో గారికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బయి. పెద్ద పిల్ల వివాహం ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఒకరితో నిత్సయ తాంబూలాలు తెగతెంపులు.. వేరొకరితో వివాహం. చిన్నకూతురు, అస్సలు చెప్పాపెట్టాకుండా పారిపోయి వివాహం. ఆరోజుల్లో.. చిన్న కూతురు వివాహం పెద్ద వార్తా విషయం. అట్టి మన ప్రభుద్దుడు, ప్రస్తుతం మన రాజకీయాల్లోకి అడుగుడతాడు అనే ఊహాగానాలకు చిలువలు పలువలుగా ఎవ్వరికిష్టమొచ్చినట్లు వారు తమ తమ స్టేట్‍మెంట్ల్.. ఇంట్లో పిల్లలు ఏమి చేస్తున్నారో .. వాళ్ళ అభిరుచులేమిటో .. వాళ్ళను అదుపులో పెట్టలేక విఫలమయినటు వంటి వ్యక్తి.. రాజకీయాల్లోకి రావడమేమిటో.. మనమందరం కలసి, ఆయనకు ఓట్లు వేసి ఆయన్ను మనల్ని పాలించే అధికారం కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనేమిటో.. వీటన్నింటికి మనం గొర్రెల్లాగా .. తానా అంటే తానె తందానా అనడం ఏమిటో.. నాకయితే అర్దం కావటం లేదు ..

ఇక ముగించేముందు, తేలిందేమిటంటే.. సినిమావాళందరూ ఇంతే.. స్వప్రయోజనలే తప్ప పరోపకారం ఏమాత్రం లేనివారు అని... వీళందరినీ చూస్తుంటే.. పర భాష వాడైనా .. షారుక్ ఖాన్ .. అదేదో కార్యక్రమంలో నిఖచ్చితంగా అన్నాడట.. నేను చేసేది అచ్చంగా వ్యాపారం .. నేను రాజకీయాలలోకి పనికిరాను అని. తెలివయిన వాడు అనిపించింది. నిజాన్ని నిజంగా ఒప్పుకోవడానికి ధైర్యంకావాలి.

6 స్పందనలు:

Anonymous said...

అంటే బుద్ధుడు , వేమన తదితరులు ఇల్లు వదిలి వెళ్లి పోలేదా వాళ్ల వాళ్ల అభిరుచులో ఇంకేదో సాధన కోసమో, సంసార చట్రం లో తిరిగే వాడే పరిపూర్ణ వ్యక్తీ అనుకోడం నాకు అంట కరెక్ట్ గా అనిపించడం లేదు
అలాగే పేరెంట్స్ ఎంత బాగా పెంచినా పిల్లలు ఆదర్సవంతం గా తయారవ్వాలని రూల్ కూడా ఏమీ లేదు
మీ అభిప్రయాల్లో బొక్కలు ఉన్నవి

ఓ బ్రమ్మీ said...

అయ్యా.. పేరూ, ఊరు లేని, ఆకాశరామన్నా..

ఏందుకండి అంత మహానుభావులను, ఇంత కుస్చిత మనస్కులతో పోలుస్తారు.. బుద్దుడు తత్వఙ్ఞానానికై, వేమన వైరాగ్యానికై వారి వారి జీవితాలను త్యజించారు.. మరి ఈ మహానుభావులుంగారు ఏమి త్యజించారంట??? స్వలాభాపేక్ష లేకుండా చేసిన వాళని ఇలాంటి వ్యాపరవేత్తలతో పోల్చకండి. ఆంగ్లంలో చెప్పినట్లు, compare apples to apples but not with oranges.

అందునా, అటు బుద్దుని కుటుంబంగానీ, ఇటు వేమన గారి కుటుంబం కానీ కష్టాల కడలిలో లేరనే విషయం తమరు గుర్తించాలి. వాళిద్దరూ చక్కటి ధనిక కుటుంబీకులు, వాళిద్దరూ వాళ వాళ మీద ఆధార పడ వాళని ఏదిక్కూ లేని అనాధల్లా.. ఏ ఆధరవూలేని స్తితిలో వదిలేయ లేదు. కనుక మంచి వాళని మంచి వాళతోనూ.. వ్యాపార వేత్తలను వ్యాపరవేత్తలతోనూ పోల్చగలరని మనవి.

Anonymous said...

ikkada abhiruchi taapatryam mukhyam gaani vaallu vyaaparam chesara leka tapassulu chesaara ani kaadu, aa maatakoste vaallu emaina saadhincheraa ledaa kooda mukhyam kaadu.
they pursued their passions, that is the most lovable thing,
evo kunti saakulu cheppukoni intlo gollu gillukuntoo koorchokundaa

Anonymous said...

చక్రవర్తీ,
ఈ కామెంటు, ఎల్.వి.ప్రసాద్ పై మీ అభిప్రాయం పైన కాదు. ఆకాశరామన్న 1 కి మీరు ఇచ్చిన కామెంటు పై. అంతా బాగనే వుంది, చివరి పేరా తప్పించి. వాళ్ళ వాళ్ళు ఆర్ధికంగా ఉన్నత స్థితి లో వున్నారు కాబట్టి, వేమన, బుధ్ధుడు, వాళ్ళని వదిలేసినా తప్పులేదు అనటం సరి కాదు. కష్టాలకడలికి ధనం లెకపొవటం మాత్రమే కారణం కాదు.

ఇట్లు,
ఆకాశరామన్న 2.

ఓ బ్రమ్మీ said...

అయ్యా ఊరూ పేరూ లేని రెండవ ఆకాశరామన్న గారు..

మీరన్నట్లు.. వాళు ఏమైనా సాధించార లేదా అన్నదీ ముఖ్యం కాదు .. కానీ వాళ అభిరుచులకై (passion) వారు పాటు (pursue) పడ్డారా అన్నదే ముఖ్యం.. కాదనను...

ఆ విషయంలో పడి వారి వారి జీవితాలలో వారి వారి ప్రాముఖ్యతల ఏమిటో చెప్పకనే చెబుతున్నారు. ఈ మహానుభావుని జీవిత చరిత్ర వల్ల మనకి అర్దమయ్యిందేమిటంటే.. తన జీవితం కన్నా.. తనపై ఆధార పడ్డ వాళ జీవితానికన్నా.. తన ఊహాలోకానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు అన్న నిజం తేట తెల్లమవుతుంది.

ఎవ్వరైనా వచ్చి, నీకు తల్లి కావాలా.. లేక భవిష్యత్తెమిటో తెలియని career కావాలా అన్నారనుకోండి.. నేను ఈ మహానుభావుడిలా తల్లిని కాదనుకోను. ఆందుకనే ఆయన ఎల్‍వి ప్రసాద్ గారయ్యారు, నేను ఉత్త చక్రవర్తిగా మిగిలి పోయ్యాను. మా ఇద్దరి ప్రాముఖ్యతల కనుక బేరీజు వేస్తే.. ఆయనకు అది ముఖ్యం .. నాకు నా కుటుంబం ముఖ్యం. అందుకే ఆయనకు ఒక పెద్ద ఆసుపత్రి, కోట్లకొలది ఆస్తి, వగైరా వగైరా ఉన్నాయి .. నాకు మాత్రం నా స్వాభిమానం మాత్రమే ఉంది.

ఎవ్వరో ఒక మహానుభావుడన్నట్లు.. జివ్హ కొక రుచి, పుర్రెకొక బుద్ది.. నాపుర్రెకీ బుద్ది.. ఆయన పుర్రెకి ఆయన బుద్ది

ఓ బ్రమ్మీ said...

అయ్యా ఆకాశరామన్న 2 గారు..

మీరిక్కడ ఒక విషయం గమనించాలి. బుద్దుడు త్యజించిన వాళ్ళు ఆర్దికంగా పూర్తిగా స్తిర పడినవాళ్ళు, and they are secured by all means. కానీ వేమన గారు త్యజించడానికి ఎవ్వరూ లేరు. ఆయన ఒక విలాస పురుషుడు. వేశ్యా గృహాలలో కాలం గడిపే వ్యక్తి. ఆయనకు వైరగ్యం రావడానికి గల ఒకే కారణం.. తాను తల్లిగా భావించే ఒదినగారిని, అనుకోని ఒక వింత ఘటనలో నగ్నంగా చూసి తట్టుకోలేక అలా తయారయ్యారు. వీలైతే వేమనగారి చరిత్ర చదవగలరు.
ఇంక అస్సలు విషయానికొస్తే.. "ఆర్ధికంగా ఉన్నత స్థితి లో వున్నారు కాబట్టి.. వాళ్ళని వదిలేసినా తప్పులేదు .. " అన్నది నా భావన కాదని గమనించ గలరు. నా అభిమతమేమిటంటే.. ఆర్ధికంగా ఉన్నత స్థితి లో వున్నారు కాబట్టి.. బుద్దుడు వారిని త్యజించినా తట్టుకోవడానికి ఒక రకమయిన security బుద్దుని కుటుంబానికి ఉంది అని మాత్రమే..

కష్టాల కడలిని ధనం ఒక్కటే దాటవేస్తుందని నేను చెప్పటం లేదండి. కానీ ధనం ఎక్కువ పాళ్ళు సహాయం చేస్తుంది. ఉదాహరణకి, గాలీ వాన లో చిక్కుకున్న నావకి .. నావలోని ప్రయాణికులకు ధనం ఎంత ఉన్నా బ్రతికి బట్ట కట్టలేరు.. కానీ ఈత కొట్టడం తెలిస్తే మాత్రం అట్టి ప్రమాదం నుంచి తేరుకోగలరు. భవసాగరంలో మాత్రం ఎక్కువ సాతం, ధనమూలం మిదం జగత్.

 
Clicky Web Analytics