నా పరిచయం

నా పేరు మాణిక్యాంబ. నేను సదరు చక్రవర్తికి అమ్మను. కష్టపడి, ఇష్టపడి, ఇవాళ, ఇక్కడ.. ఇలా బ్లాగులొ టపాలు ఎలా వ్రాయాలో నేర్చుకున్నాను. బలే బాగుంది. ఇవాల్టికి చాలు.
టాటా.. బైబై..
వెనకనించి కొడలుపిల్ల నవ్వుతోంది,
చూస్తా.. చూపిస్తా..


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

6 స్పందనలు:

Rajendra Devarapalli said...

మాణిక్యాంబ గారూ స్వాగతం.మీ కోడలు పిల్ల నవ్వినా,మీ అబ్బాయి నవ్వకపోయినా :) మీరూ స్వంతంగా ఒక బ్లాగు ప్రారంభించండి .

జ్యోతి said...

మాణీక్యాంబగారు,

ఎవ్వరు నవ్వితే ఏంటండి. మీరు మీ కోడలు పిల్ల కలిసి బ్లాగు మొదలెట్టి రాయండీ. అత్తా కోడల్ళూ కలిస్తే ఇంకేముంది పండగే..

ఓ బ్రమ్మీ said...

దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారు.. మీ స్పందన మా అమ్మకు చాలా ప్రోత్సానిచ్చింది. ప్రోత్సాహాన్ని మించిన ఆనందాని ఇచ్చింది. మీలా ప్రోత్సాహించే వాళుంటే ఈ నారీలోకం ఎక్కడికో వెళిపోతుంది.

ధన్యవాదములు. ఇవాళ మీరు నాకు చాలా గొప్ప సహాయం చేసారు. i have no words to express my feelings and with a ton of thanks.

Keep reading and encouraging.

ఓ బ్రమ్మీ said...

జ్యోతిగారు .. మీఆలోచనేదో కొత్తగా ఉందండి.. చూద్దాం అత్త కోడళ్ళు ఈ విషయాన్ని ఎలా స్వీకరిస్తారో..

మా అమ్మకు i-net కొంచం కొత్త.. మీ అందరికి ఈ విషయం ఎలా తెలిసిందని కొంచం ఆశ్చర్య పోయింది .. ఎంత ఆశ్చర్య పోయిందో అంతకు అంత ఆనందించింది ..

మీ ప్రోత్సాహానికి సత సహస్ర ధన్యవాదములు.. మీరు ఇలాగే ప్రోత్సాహిస్తూ ఉండండి.

శుభరాత్రి ఆశ్శిస్సులతో,
చిత్తగించగలరు

Unknown said...

ఆహా... అద్భుతం.
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.

మీ అమ్మగారిని తప్పకుండా ప్రోత్సాహించండి.

ఓ బ్రమ్మీ said...

దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారు, జ్యోతిగారు, గార్లపాటి ప్రవీణ్ గారు ..

మా అమ్మ ఇవాళ్టి నుంచి బ్లాగు చెయ్యడం మొదలు పెట్టింది.. మీకు వీలున్నప్పుడల్లా తన పుటలు చదివి, మీ మీ స్పందనలు, అభిప్రాయాలు తెలియజేయగలరు..

మా అమ్మ బ్లాగుకై, http://ratnahamsa.blogspot.com, ని దర్శించగలరు.

ధన్యవాదములతో

 
Clicky Web Analytics