ఆడపిల్లగా పుట్టడం వెనుక ఉన్న లాభాలు

ఎప్పుడైనా ఆలోచించారా!! ఆడ పిల్లగా పుట్టడం వెనకాల ఎన్ని లాభాలున్నాయో!! నాకు తోచిన కొన్ని

 

  1. టైటానిక్ ఓడ మునిగి పోయే ముందు చక్కగా తప్పించు కోవచ్చు
  2. రోజూ గెడ్డం చేసుకోవాల్సిన పని లేదు
  3. ఏవైనా వస్తువులు మరిచి పోయినా ఫరవాలేదు .. అందరూ మనకు సహాయపడే వాళ్ళే.. (ఎదవలు, అంతా చొంగ కార్చుకునేటోళ్ళే!!)
  4. ఎవ్వరితో నైనా నిరభ్యంతరంగా మాట్లాడేయొచ్చు..
  5. సినిమాకి వెళ్ళాలంటే కష్ట పడనక్కర్లేదు .. బాయ్ ఫ్రండ్ ఉన్నాడుగా .. ఆ కష్టమేదో ఆడే పడతాడు..
  6. మేకప్ చెరిగి పోకుండా టింగు రంగా అంటూ తిరిగేయ్యొచ్చు ..
  7. ఒక్క స్మైల్ పడేశామంటే చాలు ఇంటి ముందు వాచ్ మెన్ సిద్ధం..
  8. ఉద్యోగంలో ఎవ్వడైనా ఏమైనా అంటే ఆ అధికారిపై చక్కగా sexual herassment కేసు పెట్టేయ్యొచ్చు
  9. ఈ పురుషాధీక్య సమాజంలో మనమే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
  10. కంట తడి పెట్టామా .. అంతే .. వందం మంది వీరేశలింగాలు సిద్ధం..

ఇంకా, ఎన్నో ఎన్నెన్నెన్నో.. మీరే ఏమంటారు..

12 స్పందనలు:

ramya said...

హ హ హ :)
వచ్చే జన్మలో ఆడపిల్లగా డిసైడవ్వండి :)

ముందసలు నాకు నచ్చేది డబ్బుకోసం ఒకరి కింద ఉద్యోగాలు చేయాల్సిన పనిలేదు అమ్మా నాన్నలు ఇస్తారు, పెళ్ళయ్యాక సర్వం శ్రీవారు అమర్చి పెడతారు :p

జ్యోతి said...

ఆహా !!అలాగా?? ఇప్పుడు నీకేం కష్టమొచ్చింది..

చక్రవర్తి said...

రమ్య గారూ,

మీ పాయింట్ నాకు నచ్చింది. మరోసారి అలా కానిస్తాను. అలా మన భారత దేశంలో ఆడోళ్ళకి ఆధారపడి బ్రతకడం అలవాటు చేసేసారు. కానీ ఈ తరం మహిళలు ఈ పద్దని మార్చాలని నా అభిప్రాయం. చూద్దాం .. ఏమి జరుగుతుందో..

ఇంకొక దౌర్భాగ్యమైన విషయమేమిటంటే, ఉద్యోగం చేసే మహిళలు కూడా తమ తమ జీతాలపై వారి భర్తలకు అధికారం అంటగట్టడం. జీతం రాగానే తీసుకెళ్ళి వారి మొగుళ్ళ చేతిలో పెడతారు. (Ofcourse, దానిలో ఓ విధమైన జిమ్మిక్కు ఉందనుకోండి .. ఇచ్చేది చిటికెడు .. షాపింగ్ చేసేసి మూరెడు.. బిల్లు కట్టేది మొగుడు..)

జ్యోతిగారు,

అన్నీ మన జీవితాలతో ముడి పడి ఉండవండి .. ఏదో అలా అనిపించింది, ఇలా ప్రచురించాను.

తప్పుగా అనుకోకండి.

చైతన్య said...

బాగున్నాయి... మీరు చెప్పిన లాభాలు...

నేను ఇంకొకటి చెప్పనా...
పొరపాటున రోడ్ మీద ఆక్సిడెంట్ చేసినా... ఏదో నవ్వు నవ్వి సారీ అంటే చాలు... ఎవరు ఏమి అనరు :P
(ఇది నా సొంత అనుభవం :D)

చక్రవర్తి said...

చైతన్య గారూ..

సీరియస్ గా తీసుకోకుండా లైటుగా తీసుకున్నందుకు నెనరులు.. అలాగే స్పందించి నిజం ఒప్పుకున్నందుకు మరీ మరీ నెనరులు

నీహారిక said...

ఉబుసుపోక ఎంత చక్కటి విషయాలు కనిపెట్టారండీ!ఇలాగే అందరినీ ప్రోత్సహిస్తూఉండండి.

చక్రవర్తి said...

నిహారిక గారూ..

స్పందించినందులకు నెనరులు .. ఇంతకీ మీకు నచ్చిందా .. లేదా ..

మీకు తెలిసిన విషయాలేమైనా ఉన్నాయా!! లేవా!!

నీహారిక said...

చాలా బాగుంది మీ పోస్ట్.
ఇంకో లాభం ఏమిటో తెలుసా ఇపుడు కాస్త అందంగా పుడితే చాలు కట్నం ఇవ్వక్కర్లేదు.

పరిమళం said...

మీకు జెలసీ ..అందుకే ఇలా ... :) :)

Anonymous said...

ఎవ్వరితో నైనా నిరభ్యంతరంగా మాట్లాడేయొచ్చు..??????

Anonymous said...

అన్నిటికన్నా పెద్ద బాధ మాకూ ఉందండి.పెళ్లి అయిన వెంటనే ఈడ్చుకొని వెళ్ళిపోతారు మా ఆడవాళ్ళని.

Anonymous said...

అన్నిటికన్నా పెద్ద బాధ మాకూ ఉందండి.పెళ్లి అయిన వెంటనే ఈడ్చుకొని వెళ్ళిపోతారు మా ఆడవాళ్ళని.

 
Clicky Web Analytics